
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం మార్చి రెండో వారంలో విడుదల కానుంది. సూర్య మాట్లాడుతూ– ‘‘మూడు జన్మల కాన్సెప్ట్‌తో హిస్టారికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్‌కే ఏడాది పట్టింది.
భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తెరకెక్కిన మా సినిమా ట్రైలర్‌కు పదిలక్షలు వ్యూస్‌కి పైగా లభించాయి. మార్చి తొలివారంలో పాటలను, రెండోవారంలో సినిమాను తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు’’ అన్నారు. ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లు మహంతి.
Comments
Please login to add a commentAdd a comment