ఈ సువర్ణసుందరి ఎవర్నీ వదలదు | "Suvarna Sundari" Teaser Release | Sakshi
Sakshi News home page

ఈ సువర్ణసుందరి ఎవర్నీ వదలదు

Published Fri, Nov 10 2017 12:57 AM | Last Updated on Fri, Nov 10 2017 3:40 AM

"Suvarna Sundari" Teaser Release - Sakshi

సీనియర్‌ నటి జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘సువర్ణ సుందరి’. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది. అన్నది ఉపశీర్షిక. సూర్య ఎమ్‌.ఎస్‌.ఎన్‌. దర్శకత్వంలో ఎస్‌.టీమ్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌.లక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు. ‘ఈ సువర్ణ సుందరి ఎవర్నీ వదలదు’ అంటూ సాగే టీజర్‌  సినిమాపై ఆసక్తి పెంచుతోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సువర్ణ సుందరి’ టీజర్‌ రిలీజైన కొద్ది సమయంలోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

హిస్టారికల్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందనడానికి టీజర్‌ చక్కటి ఉదాహరణ. భారీ బడ్జెట్‌ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్రాండ్‌ లుక్‌తో హై టెక్నికల్‌గా రూపొందిస్తున్నాం. త్వరలో పాటలు రిలీజ్‌ చేయనున్నాం. డిసెంబరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్, అవినాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తీక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement