కడుపుబ్బ నవ్విస్తుంది : హీరో, హీరోయిన్లు నరేష్, సాక్షిచౌదరి
కంబాలచెరువు (రాజమండ్రి) :‘జేమ్స్‌బాండ్’ నేను కాదు నా పెళ్లాం.. చిత్రం అందరినీ కడుపుబ్బ నవ్వించి, ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుటుందని చిత్ర హీరో అల్లరి నరేష్ అన్నారు. మంగళవారం రాజమండ్రిలో ఈ చిత్రయూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా స్థానిక షెల్టాన్ హోటల్‌లో జరిగినవిలేకరుల సమావేశంలో హీరో నరేష్ మాట్లాడుతూ ‘సుడిగాడు’ చిత్రం తర్వాత అంతపెద్ద హిట్ ఇచ్చిన సినిమా జేమ్స్‌బాండ్ అన్నారు. దీని తర్వాత తాను మోహన్‌బాబుతో కలిసి మామా మంచిఅల్లుడుతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నానన్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌లో తాను అహానా పెళ్లంట, యాక్షన్ త్రీడీ చిత్రాలు చేశానన్నారు. అనంతరం హీరోయిన్ సాక్షిచౌదరి మాట్లాడుతూ తాను నటించిన తొలిసినిమా పోటుగాడు అయినా, జేమ్స్‌బాండ్‌తో మంచి పేరు వచ్చిందన్నారు. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. పాటలు బాగా వచ్చాయని, పేక్షకులు సినిమాని బాగా ఆదరిస్తున్నారన్నారు.
415 థియేటర్లలో విడుదల
దర్శకుడు సాయికిశోర్ మచ్చా మాట్లాడుతూ సినిమా జైత్రయాత్రను శ్రీకాకుళంలో ప్రారంభించామని, మరిన్ని రోజులు రాష్ర్టంలో కొనసాగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 415 థియేటర్లలో చిత్రం విడుదల చేశామని చెప్పారు. సినిమా
నిర్మాణానికి 68 రోజులు పనిచేశామన్నారు. టీవీ రైట్స్ రూ.3.50 కోట్లకు అమ్ముడైందన్నారు. సంగీత దర్శకుడు సాయికార్తీక్ మాట్లాడుతూ ఇందులో పాటలన్నీ హిట్ అయ్యాయని, వీటిలో వజ్రాయుధం సినిమాలోని సన్నజాజి.. రీమిక్స్ పాట పేక్షకులను అలరిస్తుందన్నారు.
లౌక్యం తర్వాత ఇదే..
నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ లౌక్యం సినిమా తర్వాత జేమ్స్‌బాండ్ చిత్రం తనకు మరింత పేరు తెచ్చిందన్నారు. తొలుత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చిత్రపటానికి యూనిట్ పూలమాలలు వేసి, నివాళులర్పించింది. అనంతరం జేమ్స్‌బాండ్ చిత్రం ప్రదర్శిస్తున్న కుమారి థియేటర్‌కు యూనిట్ వెళ్లి సందడి చేసింది. సినిమాలో కొన్ని డైలాగులు చెప్పి అల్లరి నరేష్ ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో యూనిట్‌లో సినీనటి హేమ ఉన్నారు.
రాజమండ్రిలో ’జేమ్స్‌బాండ్’ సందడి
Published Wed, Jul 29 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM
Advertisement
Advertisement