
అమ్మాన్ (జోర్డాన్): మరో విజయం సాధిస్తే భారత మహిళా బాక్సర్లు సాక్షి చౌధరీ, సిమ్రన్‌జిత్ కౌర్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో సాక్షి (57 కేజీలు), సిమ్రన్‌జిత్ (60 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సాక్షి 3–2తో నాలుగో సీడ్, ఆసియా క్రీడల కాంస్య పతక విజేత నిలావన్ టెచాసుయెప్ (థాయ్‌లాండ్)పై సంచలన విజయం సాధించగా... సిమ్రన్‌జిత్ 5–0తో రిమ్మా వొలోసెంకో (కజకిస్తాన్)ను ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment