boxing championship
-
భారత బాక్సర్లకు 17 పతకాలు
న్యూఢిల్లీ: అండర్–19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఏకంగా 17 పతకాలు కొల్లగొట్టారు. ముఖ్యంగా టీనేజ్ మహిళా బాక్సర్లు పార్థవి, వన్షిక స్వర్ణాలు సాధించారు. మహిళల 65 కేజీల ఫైనల్లో పార్థవి 5–0తో ఆలియా హోపెమా (నెదర్లాండ్స్)ను కంగుతినిపించింది. ప్లస్ 80 కేజీల కేటగిరీలో వన్షిక గోస్వామి ముష్టిఘాతాలకు జర్మనీ బాక్సర్ విక్టోరియా గాట్ విలవిల్లాడింది. దీంతో రిఫరీ నిమిషం 37 సెకన్లకు ముందే బౌట్‌ను నిలిపేసి వన్షికను విజేతగా ప్రకటించాడు. మిగతా మహిళల్లో క్రిషా వర్మ (75 కేజీలు) బంగారు పతకం నెగ్గగా, నిషా (51 కేజీలు), సుప్రియా (54 కేజీలు), కృతిక (80 కేజీలు), చంచల్ (48 కేజీలు), అంజలి (57 కేజీలు), వినీ (60 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) రజతాలతో సంతృప్తి చెందారు. పురుషుల్లో ఏకైక పసిడి పతకాన్ని హేమంత్ తెచ్చి పెట్టాడు. రాహుల్ కుందు (75 కేజీలు) రజతం నెగ్గగా, రిషి సింగ్ (50 కేజీలు), క్రిష్ పాల్ (55 కేజీలు), సుమిత్ (70 కేజీలు), ఆర్యన్ (85 కేజీలు), లక్షయ్ రాఠి (ప్లస్ 90 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. -
క్రిష వర్మ పసిడి పంచ్
న్యూఢిల్లీ: అండర్–19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ క్రిష వర్మ పసిడి పతకంతో సత్తా చాటింది. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ఆధ్వర్యంలో కొలరాడో వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్‌కు ఒక స్వర్ణంతో పాటు ఐదు రజత పతకాలు దక్కాయి. తొలి సారి నిర్వహించిన ఈ చాంపియన్‌షిప్ మహిళల 75 కేజీల విభాగంలో క్రిష వర్మ విజేతగా నిలిచింది. తుది పోరులో క్రిష 5–0 పాయింట్ల తేడాతో సిమోన్ లెరికా (జర్మనీ)పై గెలుపొందింది. మహిళల విభాగంలో చంచల్ చౌదరీ (48 కేజీలు), అంజలీ కుమారి సింగ్ (57 కేజీలు), విని (60 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) ఫైనల్స్‌లో ఓడి రజత పతకాలు దక్కించుకోగా... పురుషుల విభాగంలో రాహుల్ కుందు (75 కేజీలు) తుదిపోరులో తడబడి రజతానికి పరిమితమయ్యాడు. మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో చంచల్ చౌధరీ 0–5తో మియా టియా ఆటోన్ (ఇంగ్లండ్) చేతిలో... 70 కేజీల ఈవెంట్లో ఆకాంక్ష 1–4తో లిలల్లీ డెకాన్ (ఇంగ్లండ్) చేతిలో ఓడగా... 60 కేజీల విభాగంలో విని 2–3తో ఎల్లా లాన్స్‌డలె (ఇంగ్లండ్) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల 75 కేజీల విభాగంలో రాహుల్ కుందు 1–4తో అవినోంగ్య జోసెఫ్ (అమెరికా) చేతిలో ఓడాడు.శనివారం పోటీల్లో మొత్తం ఆరుగురు భారత బాక్సర్లు పాల్గొనగా అందులో ఒకరు గెలిచి ఐదుగురు ఓటమి పాలయ్యారు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఏ) స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్న వరల్డ్ బాక్సింగ్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరుగుతోంది. -
భారత బాక్సర్ల పసిడి పంచ్
అస్తానా (కజకిస్తాన్): ఆసియా అండర్–22 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఏడు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల విభాగంలో ప్రీతి (54 కేజీలు), పూనమ్ పూనియా (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు)... విశ్వనాథ్ సురేశ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్ఖా (60 కేజీలు) పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు.ఫైనల్స్‌లో ప్రీతి 3–0తో బజరోవా ఎలీనా (కజకిస్తాన్)పై, పూనమ్ 4–1తో సకిష్ అనెల్ (కజకిస్తాన్)పై, ప్రాచి 4–1తో అనర్ తుసిన్బెక్ (కజకిస్తాన్)పై, ముస్కాన్ 3–2తో జకిరోవా అజీజియా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచారు.విశ్వనాథ్ సురేశ్ 5–0తో కరాప్ యెర్నర్ (కజకిస్తాన్)పై, సబీర్ యెర్బోలత్ (కజకిస్తాన్)పై నిఖిల్, ఆకాశ్ 4–1తో రుస్లాన్ (కజకిస్తాన్)పై విజయం సాధించారు. ఓవరాల్‌గా ఆసియా అండర్–22, యూత్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు 12 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలతో కలిపి మొత్తం 43 పతకాలు సంపాదించారు. -
Strandja Memorial Boxing: నిఖత్‌కు రజతం
సోఫియా- Amit Panghal and Sachin win Gold: బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు లభించాయి. మహిళల 50 కేజీల ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 2–3తో సబీనా (ఉజ్బెకిస్తాన్) చేతిలో, 66 కేజీల ఫైనల్లో అరుంధతి 1–4తో లి యంగ్ (చైనా) చేతిలో ఓడి రజత పతకాలను దక్కించుకున్నారు. పురుషుల 51 కేజీల ఫైనల్లో అమిత్ 5–0తో తష్కెంబే (కజకిస్తాన్)పై, 57 కేజీల ఫైనల్లో సచిన్ 5–0తో షఖ్జోద్ (ఉజ్బెకిస్తాన్)పై నెగ్గి స్వర్ణాలు సాధించారు. ఫైనల్స్‌లో బరున్ సింగ్ (48 కేజీలు), రజత్ (67 కేజీలు) ఓడి రజత పతకాలు గెలిచారు. Take a look at 🇮🇳's #Silver🥈& #Bronze🥉medalists of the 7⃣5⃣th Strandja Cup, 🇧🇬 *Nikhat: 🥈in 51kg weight category * Arundhati:🥈in 66kg weight category * Barun:🥈in 48kg weight category * Rajat: 🥈in 67kg weight category * Akash:🥉in 67kg weight category * Naveen:🥉in… pic.twitter.com/K0LqKHM8FT — SAI Media (@Media_SAI) February 11, 2024 -
సెమీఫైనల్లో నిఖత్ జరీన్
సోఫియా (బల్గేరియా): రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల 50 కేజీల క్వార్టర్ ఫైనల్లో ఆమె 5–0తో ఖదిరి వాసిల (ఫ్రాన్స్)పై గెలిచి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 66 కేజీల క్వార్టర్స్‌లో అరుంధతి 5–0తో సెర్బియాకు చెందిన మిలెనాపై గెలుపొందింది. 57 కేజీల క్వార్టర్స్‌లో సాక్షి 2–3 తో మమజొనొవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయింది. పురుషుల కేటగిరీలో దీపక్ (75 కేజీలు), నవీన్ (92 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. దీపక్ 5–0తో సుల్తాన్ (కిర్గిజిస్తాన్)పై, నవీన్ 5–0తో వొయిస్నరొవిక్ (లిథువేనియా)పై గెలుపొందారు. చదవండి: ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? -
భారత్ ‘పంచ్’ పవర్
యెరెవాన్ (అర్మేనియా): అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత బాక్సర్లు తమ పంచ్ పవర్‌ను చాటుకున్నారు. అర్మేనియాలో ముగిసిన ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ లో మహిళల, పురుషుల విభాగాల్లో కలిసి భారత్ ఖాతాలో మొత్తం 17 పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. చివరిరోజు భారత్‌కు మూడు పసిడి పతకాలు, ఆరు రజత పతకాలు లభించాయి. మూడు స్వర్ణాలూ మహిళా బాక్సర్లే నెగ్గడం విశేషం. పాయల్ (48 కేజీలు), నిషా (52 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో పాయల్ 5–0తో హెజినె పెట్రోసియాన్ (అర్మేనియా)పై, నిషా 5–0తో ఫరినోజ్ అబ్దుల్లాఇవా (తజికిస్తాన్)పై, ఆకాంక్ష 5–0తో తైమజోవా ఎలిజవెటా (రష్యా)పై విజయం సాధించారు. ఇతర ఫైనల్స్‌లో వినీ (57 కేజీలు) 0–5తో మమతోవా సెవర (ఉజ్బెకిస్తాన్) చేతిలో... సృష్టి (63 కేజీలు) 0–5తో సియోఫ్రా లాలెస్ (ఐర్లాండ్) చేతిలో... అనా బుజులెవా (రష్యా) చేతిలో నాకౌట్ అయిన మేఘ (80 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలు దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో సాహిల్ (75 కేజీలు), హేమంత్ సాంగ్వాన్ (ప్లస్ 80 కేజీలు), జతిన్ (54 కేజీలు) ఫైనల్లో పరాజయం చవిచూసి రజత పతకాలు గెల్చుకున్నారు. సాహిల్ 0–5తో అల్బెర్ట్ హరుతిన్యాన్ (అర్మేనియా) చేతిలో... హేమంత్ 0–5తో సలిఖోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... జతిన్ 1–4తో తులెబెక్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
Mahindra Thar Gifted To Nikhat Zareen: వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు మహీంద్రా ‘థార్’ గిఫ్టు (ఫొటోలు)
-
నిఖత్ పంచ్ అదిరె...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు తమ పంచ్ పవర్‌ను ప్రదర్శించారు. ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షి ప్లో ఏకంగా నలుగురు భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (50 కేజీలు), నీతూ (48 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు) తుది పోరుకు అర్హత సాధించి స్వర్ణ పతకాలకు విజయం దూరంలో నిలిచారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో నిఖత్ జరీన్ 5–0తో 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇన్‌గ్రిత్ వలెన్సియా (కొలంబియా)ను చిత్తుగా ఓడించగా... నీతూ 5–2తో ఆసియా చాంపియన్ అలువా బల్కిబెకోవా (కజకిస్తాన్)పై, లవ్లీనా 4–1తో లీ కియాన్ (చైనా)పై, స్వీటీ 4–3తో స్యు ఎమ్మా గ్రీన్‌ట్రీ (ఆ్రస్టేలియా)పై గెలుపొందారు. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పోటీపడి స్వర్ణం సాధించిన నిఖత్ ఈసారి 50 కేజీల విభాగంలో బరిలోకి దిగింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌ను ఓడించిన వలెన్సియాను నిఖత్ తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుంచే పక్కా ప్రణాళికతో ఆడింది. రింగ్‌లో వేగంగా కదులుతూనే అవకాశం దొరికినపుడల్లా వలెన్సియాపై పంచ్‌లు విసిరింది. ప్రత్యర్థి తనపై ఆధిపత్యం చలాయించకుండా కూడా నిఖత్ జాగ్రత్త పడింది. ముందుగా తొలి రెండు రౌండ్లలో ఎదురుదాడి చేసి స్పష్టమైన ఆధిక్యం సంపాదించిన నిఖత్ మూడో రౌండ్లో మాత్రం ప్రత్యర్థి కి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా రక్షణాత్మకంగా ఆడి కట్టడి చేసింది. 2 ఒకే ప్రపంచ చాంపియన్‌షి ప్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది భారత బాక్సర్లు ఫైనల్ చేరడం ఇది రెండోసారి. 2006లో న్యూఢిల్లీయే ఆతిథ్యమిచి్చన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదుగురు భారత బాక్సర్లు (మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ, లేఖ, నగిశెట్టి ఉష) ఫైనల్ చేరారు. ఉష రజతం నెగ్గగా, మేరీకోమ్, సరిత, జెన్నీ, లేఖ స్వర్ణ పతకాలు గెలిచారు. 3 మేరీకోమ్ తర్వాత ప్రపంచ చాంపియన్‌షి ప్లో కనీసం రెండుసార్లు ఫైనల్‌కు చేరిన భారత బాక్సర్లుగా నిఖత్ జరీన్, స్వీటీ గుర్తింపు పొందారు. మేరీకోమ్ ఏకంగా ఏడుసార్లు ఫైనల్‌కు చేరి ఆరుసార్లు స్వర్ణం, ఒకసారి రజతం సాధించింది. నిఖత్ గత ఏడాది, స్వీటీ 2014లో ఫైనల్‌కు చేరారు. నేడు విశ్రాంతి దినం. శనివారం, ఆదివారం ఫైనల్స్ జరుగుతాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్స్‌లో లుత్సయిఖాన్ అల్టాంట్సెట్సెగ్ (మంగోలియా)తో నీతూ... లీనా వాంగ్ (చైనా)తో స్వీటీ తలపడతారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్స్‌లో ఎన్గుయెన్ థి టామ్ (వియత్నాం)తో నిఖత్ జరీన్... కైట్లిన్ పార్కర్ (ఆ్రస్టేలియా)తో లవ్లీనా పోటీపడతారు. -
Hussamuddin: అదరగొట్టిన తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్
National Boxing Championship: జాతీయ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. హిసార్‌లో బుధవారంఏకపక్షంగా జరిగిన క్వార్టర్ఫైనల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ 5–0తో మనీశ్ రాథోడ్ (ఉత్తరప్రదేశ్)పై గెలిచాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ఆశిష్ (హిమాచల్‌ప్రదేశ్)తో హుసాముద్దీన్ తలపడతాడు. ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా 147/2 సిడ్నీ: దక్షిణాఫ్రికాతో చివరిదైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా టాపార్డర్ బ్యాటర్స్ ఉస్మాన్ ఖాజా (54 బ్యాటింగ్; 6 ఫోర్లు), లబ్‌షేన్ (79; 13 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. వర్షం అంతరాయం కలిగించడంతో తొలిరోజు 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఖాజా, లబ్‌షేన్ రెండో వికెట్‌కు 135 పరుగులు జోడించారు. చదవండి: Ind Vs SL: సంజూ స్థానంలో జితేశ్ శర్మ.. ఉమ్రాన్‌కు బదులు అర్ష్‌దీప్! అక్కడ చెరో విజయం SA W Vs Ind W: అదరగొట్టిన భారత బౌలర్లు.. సౌతాఫ్రికా 54 పరుగులకే ఆలౌట్.. పరిపూర్ణ విజయం -
నిఖత్ పంచ్‌ల ధాటిని తట్టుకోలేని ప్రత్యర్థి.. బౌట్ నిలిపివేసి మరీ!
National Boxing Championships 2022: భోపాల్‌లో జరుగుతున్న జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు) శుభారంభం చేసింది. తమిళనాడు బాక్సర్ అభినయతో జరిగిన తొలి రౌండ్ బౌట్లో నిఖత్ పంచ్‌ల ధాటికి అభినయ తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను తొలి రౌండ్లోనే నిలిపి వేశారు. ఈ క్రమంలో ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించిన నిఖత్.. గురువారం నాటి బౌట్లో మేఘాలయకు చెందిన ఇవా మార్బనియంగ్తో తలపడనుంది. మరోవైపు.. పంజాబ్ బాక్సర్, వరల్డ్ చాంపియన్‌షిప్స్ కాంస్య పతక విజేత సిమ్రన్‌జీత్ కౌర్ సైతం ముందడుగు వేసింది. రౌండ్ ఆఫ్ 32లో లఢక్ బాక్సర్ నిల్జయా ఆంగ్మోతో జరిగిన హోరాహోరీ పోరులో ప్రత్యర్థిని ఓడించింది. ఇక సిమ్రన్ ప్రిక్వార్టర్స్‌లో జార్ఖండ్‌కు చెందిన పూజా బెహ్రాతో పోటీ పడనుంది. ఇది కూడా చదవండి: టాటా ఓపెన్ బరిలో సాకేత్ భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ టాటా ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీతో కలిసి బరిలోకి దిగనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 7 వరకు పుణేలో ఈ టోర్నీ జరుగుతుంది. ఈ ఏడాది సాకేత్–యూకీ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఆరు డబుల్స్ టైటిల్స్ సాధించారు. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం సాకేత్ 84వ స్థానంలో ఉన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ జోడీ బోపన్న, రామ్‌కుమార్ ఈసారి వేర్వేరు భాగస్వాములతో కలసి ఆడనున్నారు. చదవండి: వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు India Players- Ranji Trophy: ఇంట్లో కూర్చోవద్దు.. బీసీసీఐ ఆదేశాలు! మొన్న సంజూ, ఇషాన్.. ఇప్పుడు సూర్య, చహల్ -
Asian Boxing Championships 2022: క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా ఎలైట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన 57 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 3–2తో మునార్బెక్ (కిర్గిస్తాన్)పై గెలుపొందాడు. ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన హుసాముద్దీన్ క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్ బాక్సర్ ఇలియాస్ హుస్సేన్‌తో తలపడతాడు. క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ గెలిస్తే కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటాడు. మరోవైపు 80 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన లక్ష్య చహర్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య చహర్ 5–0తో షబ్బోస్ నెగ్మత్ (తజికిస్తాన్)పై గెలుపొందాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో స్పర్శ్ కుమార్ (51 కేజీలు) 1–4తో ప్రపంచ చాంపియన్ సాకెన్ బిబోసినోవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఈ మెగా టోర్నీలో 27 దేశాల నుంచి 267 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు. చదవండి: Hylo Open Badminton: తొలి రౌండ్లోనే లక్ష్య సేన్ ఓటమి -
సిమ్రన్‌జిత్ శుభారంభం..!
ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత మహిళా బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్ శుభారంభం చేసింది. కజకిస్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన 60 కేజీల విభాగం తొలి రౌండ్లో సిమ్రన్‌జిత్ 5–0తో ఇస్చనోవా (కజకిస్తాన్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల 54 కేజీల విభాగం తొలి రౌండ్లో అనంత చొపాడె 3–2తో గన్‌బోల్డ్ (మంగోలియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరాడు. చదవండి: Wimbledon 2022: పోరాడి ఓడిన సెరెనా విలియమ్స్..! -
ప్రత్యర్థి పంచ్‌కు ఊహించని అనుభవం; ఆపై కోమాలోకి
బాక్సింగ్ రింగ్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. ప్రత్యర్థి పంచ్‌లకు బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవడంతో మరొక బాక్సర్ కోమాలోకి వెళ్లిపోయాడు. కోమాలోకి వెళ్లే కొద్ది క్షణాల ముందు.. అతను ప్రవర్తించిన తీరు ఉద్వేగానికి గురి చేసింది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినప్పటికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే.. లైట్ వెయిట్ బాక్సర్లు సిమిసో బుటెలేజీ, సిప్సిలే నుంటుగ్వాల మధ్య జూన్ 5న(ఆదివారం) వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆల్ ఆఫ్రికా లైట్ వెయిట్ బాక్సింగ్ టైటిల్ పోరు జరిగింది. ఇద్దరు మంచి టఫ్ ఫైట్ కనబరచడంతో పోరు ఆసక్తికరంగా సాగింది. 10వ రౌండ్ బౌట్ మొదలయ్యే వరకు సిమిసో, నుంగుట్వాలు ఒకరిపై ఒకరు పంచ్‌ల వర్షం కురిపించుకున్నారు. పదో బౌట్ మొదలవడానికి కొద్ది నిమిషాల ముందు నుంటుగ్వా ఇచ్చిన పంచ్ సిమిసో బుటెలేజీ తలలో బలంగా తగిలింది. దీంతో కళ్లు బైర్లు కమ్మిన సిమిసోకు ఏం చేస్తున్నాడో ఒక్క క్షణం ఎవరికి అర్థం కాలేదు. రిఫరీ ఉన్న వైపు దూసుకొచ్చిన సిమిసో బుటెలేజీ అతనికి పంచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తన ప్రత్యర్థి వెనకాల ఉంటే.. అది గమనించకుండా తన ముందువైపు ఎవరు లేనప్పటికి గాలిలో పంచ్‌లు కొట్టే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన రిఫరీ సిమిసో పరిస్థితిని అర్థం చేసుకొని బౌట్‌ను నిలిపేసి మెడికోను పిలిచాడు. దీంతో సిప్సిలే నుంటుగ్వా లైట్‌వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌గా అవతరించాడు. వైద్య సిబ్బంది సిమిసోను పరిశీలించి వెంటనే డర్బన్‌లో కింగ్ ఎడ్వర్డ్-8 ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిపోయిన సిమిసో బెటెలేజీ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవడంతో కోమాలో ఉన్నాడని.. రెండురోజులు గడిస్తే కానీ పరిస్థితి ఏంటి అనేది ఒక అంచనాకు వస్తుందని వైద్యులు తెలిపారు. అయితే కొద్దిరోజుల్లోనే అతను మాములు పరిస్థితికి వచ్చేస్తాడని.. ప్రాణాలకు ఏం భయం లేదని తెలిపారు.. కాగా సిమిసో బాక్సింగ్ రింగ్‌లో ఫైట్ చేసిన ఆఖరి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: జిడ్డు ఇన్నింగ్స్‌కు 47 ఏళ్లు.. కోపంతో లంచ్ బాక్స్ విసిరేసిన క్రికెట్ అభిమాని Rabat Diamond League 2022: అవినాశ్ అద్భుతం.. ఎనిమిదోసారి జాతీయ రికార్డు Very scary in South Africa please 🙏🏼 for Simiso Buthelezi (4-1). At 2:43 of the 10th & final round, Siphesihle Mntungwa (7-1-2) falls through the ropes but then Buthelezi appears to lose his understanding of the present situation. Mntungwa takes the WBF African lightweight title pic.twitter.com/YhfCI623LB — Tim Boxeo (@TimBoxeo) June 5, 2022 I was at the #boxing in KZN yesterday and this is one of the strangest and saddest things I've seen in the sport. Thoughts and prayers with Simiso Buthelezi who is now in an induced coma in hospital 🙏🏿🙏🏿 @SABC_Sport #SizenzaZonke pic.twitter.com/1097yFtKmY — Tracksuit (@ThabisoMosia) June 6, 2022 -
హిజాబ్‌పై స్పందించిన ‘నిఖత్ జరీన్’.. ఆమె ఏమన్నారంటే..?
Boxing world champion Nikhat Zareen.. ఇటీవల హిజాబ్ ధరించడంపై దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కర్నాటకలో హిజాబ్ కారణంగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో అక్కడ కర్ఫ్యూ సైతం విధించారు. హిజాబ్ వివాదం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా హిజాబ్ వ్యవహారంపై మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ స్పందించారు. సోమవారం నేషనల్ మీడియాతో ఇంటర్ప్యూలో నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. ‘‘హిజాబ్ ధరించడం అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. హిజాబ్ ధరించడంపై కామెంట్స్ చేయడం నాకు ఇష్టం లేదు. హిజాబ్ ధరించడాన్ని నేను ఇష్టపడతాను. హిజాబ్ విషయంలో తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. దుస్తుల విషయంలో నాకు నా కుటుంబ సభ్యులు స్వేచ్ఛనిచ్చారు. నా గురించి ఎవరు ఏమనుకుంటారో అనే విషయాన్ని నేను అస్సలు పట్టించుకోను’’ అని స్పష్టం చేశారు. మరోవైపు.. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన నిఖత్ జరీన్‌కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించడమే తన అంతిమ లక్ష్యమని తెలిపారు. ఒలింపిక్స్ పతకం కోసం సాధన కొనసాగిస్తానని చెప్పారు. ఇది కూడా చదవండి: ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన తెలుగమ్మాయి -
క్వార్టర్స్‌లో సంజీత్, నిశాంత్
బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఒకవైపు నిశాంత్ దేవ్ (71 కేజీలు), సంజీత్ (92 కేజీలు) అద్భుత విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరగా... మరోవైపు రోహిత్, ఆకాశ్, సుమిత్, దీపక్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్‌ల్లో నిశాంత్ దేవ్ 3–2తో మార్కో అల్వారెజ్ వెర్డె (మెక్సికో)పై, సంజీత్ (92 కేజీలు) 4–1తో జియోర్జి చిగ్లాడ్జె (జార్జియా)పై గెలుపొందారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రోహిత్ (భారత్) 1–4తో సెరిక్ (కజకిస్తాన్) చేతిలో.... ఆకాశ్ సాంగ్వాన్ (67 కేజీలు) 0–5తో కెవిన్ బ్రౌన్ (క్యూబా) చేతిలో ... సుమిత్ (75 కేజీలు) 0–5తో యోన్లిస్ (క్యూబా) చేతిలో... దీపక్ 0–5తో సాకెన్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
సెమీఫైనల్లో నిఖత్ జరీన్
జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. హిస్సార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ 52 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5–0తో మంజు బసుమతిరి (అస్సాం)పై నెగ్గింది. 48 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్ బౌట్లో ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత మంజు రాణి 5–0తో మీనాక్షి (పంజాబ్)పై గెలిచింది. -
Niharika Gonella: తెలంగాణ బాక్సర్ నిహారిక శుభారంభం
National Boxing Championship: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళా బాక్సర్ గోనెళ్ల నిహారిక శుభారంభం చేసింది. హిస్సార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో 63–66 కేజీల విభాగం తొలి రౌండ్లో నిహారిక 5–0తో డాలీ సింగ్ (బిహార్)పై నెగ్గింది. 2015లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో నిహారిక భారత్‌కు రజత పతకం అందించింది. నిహారిక సోదరి నాగనిక ప్లస్ 81 కేజీల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. చదవండి: క్వార్టర్ ఫైనల్లో సింధుకు చుక్కెదురు -
Boxing Championship: కోచ్‌లుగా దేవేంద్రో సింగ్, సురంజయ్ సింగ్
Boxing Championship: భారత మాజీ బాక్సర్లు దేవేంద్రో సింగ్, సురంజయ్ సింగ్ కోచ్‌లుగా మారారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బాక్సర్లకు నిర్వహించే శిక్షణ శిబిరం కోసం ఎంపిక చేసిన 14 మంది కోచ్‌లలో దేవేంద్రో, సురంజయ్లకు స్థానం లభించింది. 35 ఏళ్ల సురంజయ్ 2009 ఆసియా చాంపియన్షిష్, 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు నెగ్గాడు. 29 ఏళ్ల దేవేంద్రో 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచాడు. టీమిండియా కోచ్ రేసులో టామ్ మూడీ! భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించేందుకు ఆ్రస్టేలియా మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ ఆసక్తి కనబరుస్తున్నాడు. . ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు డైరెక్టర్‌గా మూడీ ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి పదవీ కాలం వచ్చే నెలలో ముగిసే టి20 ప్రపంచకప్ అనంతరం ముగుస్తుంది. దాంతో కోచ్ పదవి కోసం మూడీ దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం. చదవండి: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా ముగిసిన కథ -
విజేందర్ 12 నాటౌట్..ఈసారి రష్యా బాక్సర్!
పనాజీ: తన ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో 12–0తో అజేయంగా దూసుకెళ్తున భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ మరో బౌట్‌కు సిద్ధమయ్యాడు. ఏడాది తర్వాత అతను మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఈనెల 19న గోవాలో జరిగే బౌట్లో రష్యా బాక్సర్ ఆర్తిస్ లాప్సన్తో విజేందర్ తలపడనున్నాడు. సూపర్ మిడిల్ వెయిట్ విభాగంలో జరిగే ఈ బౌట్ పనాజీలోని మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో షిప్లో జరగనుంది. విజేందర్ ప్రత్యర్థి లాప్సన్ ఇప్పటివరకు ఆరు ప్రొఫెషనల్ బౌట్లలో పాల్గొనగా... నాలుగింటిలో విజయం సాధించాడు. కాగా, 2019, నవంబర్‌లో చివరిసారి తలపడిన విజేందర్..కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ చార్లెస్ అడామూ (ఘనా)ను ఓడించాడు. దాంతో తన విజయాల సంఖ్యను 12కు పెంచుకున్నాడు. -
ఏడాది తర్వాత ‘రింగ్’లోకి మేరీకోమ్
న్యూఢిల్లీ: ఆరుసార్లు వరల్డ్ చాంపియన్, భారత మహిళా మేటి బాక్సర్ మేరీకోమ్ ఏడాది విరామం తర్వాత మళ్లీ ‘రింగ్’లోకి అడుగు పెట్టనుంది. స్పెయిన్‌లో నేటి నుంచి జరిగే బాక్సమ్ అంతర్జాతీయ టోర్నీలో ఆమె 51 కేజీల విభాగంలో పోటీపడనుంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన 37 ఏళ్ల మేరీకోమ్‌తోపాటు సిమ్రన్‌జిత్ (60 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) కూడా ఈ టోరీ్నలో ఆడనున్నారు. -
టోక్యో బెర్త్‌కు రెండు విజయాలే...
న్యూఢిల్లీ: భారత దిగ్గజ బాక్సర్, మణిపూర్‌కు చెందిన మేరీకోమ్ (51 కేజీలు) రెండోసారి ఒలింపిక్స్ బెర్త్ ఒడిసి పట్టేందుకు సన్నద్ధమైంది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన మేరీ ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనే ధ్యేయంగా కఠిన ప్రాక్టీస్‌తో సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జోర్డాన్ రాజధాని అమ్మాన్లో జరుగుతోన్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ ఈవెంట్లో రాణించి టోక్యో బెర్తును సాధించాలనే పట్టుదలతో మేరీ బరిలో దిగనుంది. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్ (52 కేజీలు) కూడా ఈ క్వాలిఫయర్స్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన 37 ఏళ్ల మేరీకోమ్ ఈ క్వాలిఫయింగ్ ఈవెంట్లో రెండో సీడ్‌గా బరిలో నిలిచింది. తొలి రౌండ్లో న్యూజిలాండ్‌కు చెందిన తస్మిన్ బెన్నీతో తలపడుతుంది. ఈ టోర్నీలో రెండు విజయాలు సాధిస్తే ఆమెకు ఒలింపిక్స్ బెర్తు ఖరారు అవుతుంది. ఆమె కచ్చితంగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుందని భారత మహిళల బాక్సింగ్ కోచ్ రాఫెలె బెర్గామస్కో అన్నారు. ‘ఇవే తనకు చివరి ఒలింపిక్స్ అని మేరీకి తెలుసు. అందుకే ఈ మెగా ఈవెంట్లో స్వర్ణం సాధించి తన కలను నిజం చేసుకోవాలని ఆమె శ్రమిస్తోంది. కఠిన ప్రాక్టీస్ చేస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చరిత్రాత్మక రజతం సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్న అమిత్ పంఘాల్కు తొలిరౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో మంగోలియా బాక్సర్ ఎన్‌ఖ్‌మనదక్ ఖర్‌ఖుతో తలపడతాడు. -
‘టోక్యో’ బెర్త్‌కు విజయం దూరంలో...
అమ్మాన్ (జోర్డాన్): మరో విజయం సాధిస్తే భారత మహిళా బాక్సర్లు సాక్షి చౌధరీ, సిమ్రన్‌జిత్ కౌర్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో సాక్షి (57 కేజీలు), సిమ్రన్‌జిత్ (60 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సాక్షి 3–2తో నాలుగో సీడ్, ఆసియా క్రీడల కాంస్య పతక విజేత నిలావన్ టెచాసుయెప్ (థాయ్‌లాండ్)పై సంచలన విజయం సాధించగా... సిమ్రన్‌జిత్ 5–0తో రిమ్మా వొలోసెంకో (కజకిస్తాన్)ను ఓడించింది. -
నువ్వు మనిషి కాదు.. రాక్షసుడివి..!
లాస్ వేగాస్: ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్(డబ్యూబీసీ) హెవీ వెయిట్ ఛాంపియన్‌షిష్‌లో విజేతగా నిలిచిన తర్వాత బ్రిటన్ బాక్సర్ టైసన్ ఫ్యూరీ చేసిన ఓ పనికి ఎంజీఎం గ్రాండ్ గార్డెన్ ఎరీనాలో ఉన్నవారు ఆశ్చర్యపోయారు. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో అమెరికా చాంపియన్ బాక్సర్ డియోంటి వైల్డర్‌పై విజయం సాధించిన ఫ్యూరీ ప్రత్యర్థిని కౌగిలించుకొని అతని నుంచి కారుతున్న రక్తాన్ని నాకడం ఒళ్లు జలదరించేలా చేసింది. ఇరువురి మధ్య ఏడో రౌండ్ వరకూ హోరీ హోరీ పోరు జరగ్గా, ఫ్యూరీ పైచేయి సాధించాడు. వైల్డర్‌కు తన పంచ్‌ల పవర్‌తో చుక్కలు చూపించాడు. తన ప్రొఫెషనల్ కెరీర్లోనే ఓటమి లేని వైల్డర్‌పై కసిదీరా పంచ్‌లు విసిరాడు. ఎలాగైనా చాంపియన్‌గా నిలవాలనే కసితో రింగ్‌లో పదునైన పంచ్‌లను రుచి చూపించాడు. ఈ క్రమంలోనే వైల్డర్ చెవికి, నోటికి గాయం కావడంతో రక్తం వచ్చింది. బౌట్ జరిగిన తీరు కొందర్నీ ఆశ్చర్య పరిస్తే, ‘జిప్సీకింగ్’గా పలువబడే అతను తన ప్రత్యర్థి రక్తాన్ని నాకడాన్నే అందరూ ఆశ్చర్యంగా గమనించారు. అయితే ఫ్యూరీ రక్తాన్ని నాకుతున్న ఫుటేజీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘ఇతను మనిషి కాదు రాక్షసుడు’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
పసిడి పోరుకు ప్రసాద్
బుడాపెస్ట్ (హంగేరి): బోక్స్కాయ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ పీఎల్ ప్రసాద్ పురుషుల 52 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. విశాఖపట్నం జిల్లాకు చెందిన 24 ఏళ్ల ప్రసాద్ సెమీఫైనల్లో 4–1తో దివాలి దిమిత్రి (రష్యా)పై విజయం సాధించాడు. 91 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్ గౌరవ్‌కు తన ప్రత్యర్థి నుంచి వాకోవర్ లభించడంతో అతను ఫైనల్‌కు చేరాడు. మహిళల విభాగంలో జ్యోతి గులియా (51 కేజీలు), మనీషా (57 కేజీలు) కూడా స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. సెమీఫైనల్స్‌లో మనీషా 4–1తో బాసానెట్స్ మెరియానా (ఉక్రెయిన్)పై, జ్యోతి 5–0తో మాండీ మేరీ (కెనడా)పై గెలుపొందారు. ఇంతింతై... విశాఖ స్పోర్ట్స్: 13 ఏళ్ల క్రితం మొదలైన ప్రసాద్ బాక్సింగ్ ప్రస్థానం నేడు అంతర్జాతీయస్థాయికి చేరుకుంది. కోచ్ వెంకటేశ్వర రావు శిక్షణలో రాటుదేలిన ప్రసాద్ సరీ్వసెస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఎస్‌పీబీ) జట్టు తరఫున జాతీయ చాంపియన్‌షిప్ బరిలోకి దిగి పతకాల వేట మొదలుపెట్టాడు. ఇప్పటికీ దానిని కొనసాగిస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. విశాఖలోని అక్కయ్యపాలెంకు చెందిన ప్రసాద్ కాంబినేషన్ పంచ్‌లు సంధించడంలో దిట్ట. 2008 డిసెంబర్లో జరిగిన జాతీయ సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రసాద్ తొలి స్వర్ణాన్ని సాధించాడు. అటునుంచి వెనుదిరిగి చూడలేదు. వివిధ కేటగిరీల్లో ఏడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన ప్రసాద్ 2012లో ఫిన్లాండ్లో జరిగిన తామెర్ అంతర్జాతీయ టోరీ్నలో స్వర్ణం సాధించాడు. అదే ఏడాది ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2013లో ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచాడు. తల్లిదండ్రులు వేణుగోపాల్, గౌరిల ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగిన ప్రసాద్‌కు ఐదేళ్ల క్రితం భుజం గాయం అయింది. భుజానికి శస్త్ర చికిత్స జరిగాక కొంతకాలం ఆటకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్నాక మళ్లీ రింగ్‌లోకి అడుగు పెట్టాడు. పతకాల వేట మొదలుపెట్టాడు. , , -
భారత బాక్సర్ల పసిడి పంచ్
బోరస్ (స్వీడన్): గోల్డెన్ గర్ల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ మహిళా బాక్సర్లు ఆరు స్వర్ణ పతకాలతో సహా మొత్తం 14 పతకాలను సాధించి అదరగొట్టారు. ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. జూనియర్ విభాగంలో ఐదు పసిడి పతకాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించగా... యూత్ విభాగంలో ఒక స్వర్ణం, నాలుగు కాంస్య పతకాలను గెలుచుకుంది. జూనియర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రాచీ (50 కేజీలు) ‘బెస్ట్ బాక్సర్’ అవార్డును కైవసం చేసుకుంది. ఆమెతో పాటు నివేదిత (48 కేజీలు), ఎథోయ్‌బి చాను వాంజమ్ (54 కేజీలు), లశు యాదవ్ (66 కేజీలు), మహి (80 కేజీలు) బంగారు పతకాలను గెల్చుకోగా... యూత్ విభాగంలో ముస్కాన్ (54 కేజీలు) స్వర్ణాన్ని సాధించింది. సాన్యా (57 కేజీలు), దీపిక (64 కేజీలు), ముస్కాన్ (69 కేజీలు), సాక్షి (75 కేజీలు) కాంస్యాలు గెలిచారు. జూనియర్ విభాగంలో జాన్వీ (46 కేజీలు), రూడీ లాల్‌మింగ్ మువాని (66 కేజీలు), తనిష్కా (80 కేజీలు) రజతాలు... దియా(60 కేజీలు) కాంస్యం సాధించింది. -
బాక్సర్ సుమీత్‌పై ఏడాది నిషేదం
న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ మాజీ రజత పతక విజేత, భారత బాక్సర్ సుమీత్ సాంగ్వాన్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) గురువారం ఏడాది నిషేధాన్ని విధించింది. గత అక్టోబర్ నెలలో అతని నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా... అందులో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో ఉన్న ‘ఎసిటజొలమైడ్’ ఉన్నట్లు తేలింది. దీంతో అతనిపై నిషేధం విధిస్తున్నట్లు ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ప్రకటించారు. దీంతో 91 కేజీల విభాగంలో ఒలింపిక్స్ అర్హత పోటీలకు నిర్వహించే ట్రయల్స్‌కు సుమీత్ దూరమయ్యాడు. -
‘టాప్స్’ నుంచి నీరజ్‌కు ఉద్వాసన
న్యూఢిల్లీ: ఇటీవల డోపింగ్ పరీక్షలో విఫలం అయిన భారత మహిళా బాక్సర్ నీరజ్ ఫొగాట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఒలింపిక్స్‌లో భారత్ పతకం సాధించడమే లక్ష్యంగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీం’ (టాప్స్) నుంచి ఆమె పేరును తొలగించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకుంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. నీరజ్‌తో పాటు భారత షూటర్లు రవి కుమార్, ఓం ప్రకాశ్‌లు కూడా ‘టాప్స్’ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. -
మరో బౌట్‌కు విజేందర్ రె‘ఢీ’
దుబాయ్: ప్రొఫెషనల్ బాక్సర్‌గా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆసియా పసిఫిక్, ఓరియంటల్ సూపర్ మిడిల్‌వెయిట్ చాంపియన్ విజేందర్ సింగ్ మరో బౌట్‌కు సిద్ధమయ్యాడు. నవంబర్ 22న జరిగే ఫైట్‌లో అతను కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ చార్లెస్ అడామూ (ఘనా)తో పోటీపడతాడు. 10 రౌండ్ల పాటు జరిగే ఈ బౌట్లోనూ గెలిచి తన విజయాల సంఖ్యను 12కు పెంచుకోవాలని విజేందర్ పట్టుదలతో ఉన్నాడు. 2020లో ప్రపంచ బాక్సింగ్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ 34 ఏళ్ల బాక్సర్ ఈ మ్యాచ్‌ను సన్నాహకంగా భావిస్తున్నట్లు తెలిపాడు. మరోవైపు తాను ఆడిన బౌట్లలో 33 గెలిచి, 14లో ఓడిన అడామూ... విజేందర్ విజయాల రికార్డుకు బ్రేక్ వేస్తానంటున్నాడు. -
మన బాక్సర్ల పసిడి పంచ్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 12 పతకాలు సాధించి తమ సత్తా చాటుకుంది. ఆదివారం మహిళల విభాగంలో బరిలో నిలిచిన ఐదుగురు బాక్సర్లు పసిడి పంచ్‌లతో సత్తా చాటగా... పురుషుల విభాగంలో ఇద్దరు బాక్సర్లు తుది పోరులో ఓడి రజతాలతో సంతృప్తి చెందారు. మహిళల ఫైనల్స్‌లో పూనమ్ (54 కేజీలు) వికి కాయ్ (చైనా)పై, సుష్మా (81 కేజీలు) కజకిస్తాన్ బాక్సర్ బకీత్జాన్‌కిజీపై, నోరెమ్ చాను (51 కేజీలు) అనెల్ బార్కీపై (కజకిస్తాన్)పై, వింకా (64 కేజీలు) హైని నులాతైయాలి (చైనా)పై, సనమచ చాను (75 కేజీలు) నవ్బఖోర్ ఖమిదోవ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచారు. పురుషుల ఫైనల్స్‌లో సెలాయ్ సోయ్ (49 కేజీలు) కజకిస్తాన్ బాక్సర్ బజార్‌బే ఉల్లూ ముఖమెద్‌సైఫీ చేతిలో, అంకిత్ నర్వాల్ (60 కేజీలు) జపాన్ బాక్సర్ రెటో త్సుత్సుమె చేతిలో ఓడి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. వీరితో పాటు అరుంధతీ చౌదరి (69 కేజీలు), కోమల్‌ప్రీత్ కౌర్ ( ప్లస్ 81 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు), సతేందర్ సింగ్ (91 కేజీలు), అమన్ (91+ కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. -
వచ్చే నెలలో ఇండియన్ బాక్సింగ్ లీగ్
న్యూఢిల్లీ: క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ క్రీడాంశాల్లో భారత్‌లో లీగ్‌లు జరుగుతుండగా... వీటి సరసన బాక్సింగ్ కూడా చేరనుంది. తొలిసారి ఒలింపిక్ స్టయిల్ ఇండియన్ బాక్సింగ్ లీగ్‌కు వచ్చే నెలలో తెర లేవనుంది. డిసెంబర్ 2 నుంచి 21 వరకు జరిగే ఈ లీగ్‌లో ఆరు ఫ్రాంచైజీలు పాల్గొంటాయి. మూడు నగరాల్లో ఈ లీగ్‌ను నిర్వహిస్తామని లీగ్ నిర్వాహక సంస్థలు ప్రొ స్పోర్టీఫై–స్పోర్ట్జ్ లైవ్ తెలిపాయి. లీగ్‌ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. భారత మేటి బాక్సర్లు మేరీకోమ్, అమిత్ పంఘాల్, మనోజ్‌కుమార్, సోనియా లాథెర్ తదితరులు ఈ లీగ్‌లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. -
మరో ప్రాణం తీసిన బాక్సింగ్ రింగ్
చికాగో: గత జూలై నెలలో ఇద్దరు బాక్సర్లు రోజుల వ్యవధిలో బాక్సింగ్ రింగ్‌లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన మరువకముందే మరొక బాక్సర్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రత్యర్థి నుంచి వచ్చిన ముష్టిఘాతాలకు తాళలేకపోయిన అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్ పాట్రిక్ డే ప్రాణాలు కోల్పోయాడు. బాక్సింగ్ బౌట్లో తలకు తీవ్ర గాయాలు కావడంతో నాలుగు రోజుల పాటు కోమాలోకి వెళ్లిన పోయిన పాట్రిక్.. చివరకు తుది శ్వాస విడిచాడు. శనివారం చికాగలో జూనియర్ మిడిల్‌వెయిట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా చార్లస్ కాన్వెల్తో జరిగిన మ్యాచ్‌లో పాట్రిక్ నాకౌట్ అయ్యాడు. చార్లస్ కాన్వెల్ నుంచి వచ్చిన బలమైన పంచ్‌లకు రింగ్‌లో నిలబడలేకపోయిన పాట్రిక్ అక్కడే కులబడిపోయాడు. దాంతో అతన్ని స్ట్రెచర్ సాయంతో ఆస్పతికి తరలించి చికిత్స అందించారు. కాగా, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో పాట్రిక్‌ను బతికించడం కోసం చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. నాలుగు రోజు పాటు మృత్యువుతో పోరాడిన పాట్రిక్ దాన్ని జయించలేకపోయాడు. బుధవారం ప్రాణం విడిచినట్లు అతని ప్రమోటర్ డిబెల్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల రష్యా చెందిన బాక్సర్ మాక్సిమ్ డడ్‌షెవ్, అర్జెంటీనాకు చెందిన హుగో సాంతిల్లాన్లకు ఇదే తరహాలో మృత్యువాత పడ్డారు. -
క్వార్టర్ ఫైనల్లో మంజు రాణి
ఉలన్ ఉడె (రష్యా): ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మంజురాణి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 48 కేజీల విభాగంలో పోటీపడిన ఆమె ప్రిక్వార్టర్స్‌లో 5–0తో వెనిజులాకు చెందిన రోజస్ టేవోనిస్‌ను చిత్తుచేసింది. మంజు తన పిడిగుద్దులతో ప్రత్యర్థిని చేష్టలుడిగేలా దెబ్బతీసింది. స్పష్టమైన పంచ్‌లు ఆమెకు పాయింట్లను తెచ్చిపెట్టగా... చతికిలబడిన టేవోనిస్ ఖాతా తెరువకుండానే ఓడిపోయింది. ఇప్పుడు ఆమె మరో ‘ప్రపంచ’ పతకానికి కేవలం అడుగు దూరంలో ఉంది. సెమీస్ చేరితే మంజుకు కనీసం కాంస్యం లభిస్తుంది. గత ప్రపంచ బాక్సింగ్‌లో కాంస్యం నెగ్గిన ఆమెకు క్వార్టర్స్‌లో క్లిష్టమైన ప్రత్యర్థే ఎదురైంది. ఈ నెల 10న జరిగే మ్యాచ్‌లో ఆమె దక్షిణ కొరియాకు చెందిన టాప్‌సీడ్ కిమ్ హ్యాంగ్ మితో తలపడుతుంది. 64 కేజీల బౌట్లో మంజు బాంబొరియా 1–4తో అంజెలా కారిని (ఇటలీ) చేతిలో పరాజయం చవిచూసింది. మంగళవారం జరిగే రెండో రౌండ్లో భారత అగ్రశ్రేణి బాక్సర్, ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకోమ్ (51 కేజీలు)... జుటమస్ జిట్పాంగ్ (థాయ్‌లాండ్)తో పోటీపడుతుంది. తొలిబౌట్‌లో మేరీకి ‘బై’ లభించింది. 75 కేజీల విభాగంలో సవీటి ... రెండో సీడ్ లారెన్ ప్రైస్ (వేల్స్)తో తలపడనుంది. -
జమున బోరో శుభారంభం
ఉలాన్–ఉదే (రష్యా): ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. జమున బోరో... తన పవర్ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థిని చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన 54 కేజీల తొలి రౌండ్ బౌట్లో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగి అయిన జమున 5–0తో మిచిద్మా ఎర్దెనెదలై (మంగోలియా)ను ఓడించింది. నేడు జరిగే 57 కేజీల విభాగంలో క్వైయో జైరు (చైనా)తో నీరజ్ (భారత్); 75 కేజీల విభాగంలో ముంఖ్బాట్ (మంగోలియా)తో సవీటి బూరా తలపడతారు. -
అమిత్ నయా చరిత్ర
ఎకతెరీన్‌బర్గ్(రష్యా): ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ కొత్త అధ్యాయానికి తెర లేపింది. భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగాల్ ఫైనల్‌కు చేరి కొత్త చరిత్ర సృష్టించాడు. మూడున్నర దశాబ్దాల చరిత్రగల ఈ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో ఒక భారత బాక్సర్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ బౌట్లో భాగంగా 52 కేజీల ఫ్లైవెయిట్ కేటగిరిలో అమిత్ 3-2 తేడాతో సాకన్ బిబోస్సినోవ్(కజికిస్తాన్)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించాడు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన బౌట్లో కడవరకూ నిలబడ్డ అమిత్ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఇక మరో భారత బాక్సర్ మనీష్ కౌశిక్ తన పోరును సెమీస్‌లోనే ముగించడంతో కాంస్యతోనే సరిపెట్టుకున్నాడు. ఆండ్రీ క్యూజ్‌తో జరిగిన పోరులో మనీశ్ ఓటమి పాలయ్యాడు. శనివారం జరుగనున్న ఫైనల్ పోరులో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ షాకోబిదిన్ జైరోవ్‌తో అమిత్ స్వర్ఱ పతకం కోసం తలపడనున్నాడు. గతంలో ఏ ఒక్క ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లోనూ భారత్ కాంస్యాన్ని మించి గెలవలేకపోయింది. విజేందర్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధురి (2017) కాంస్యం నెగ్గారు. ఇప్పుడు అమిత్ ఫైనల్‌కు చేరడంతో రజతం ఖాయం చేసుకుని కొత్త చరిత్రకు నాంది పలికాడు. -
భారత బాక్సర్ల కొత్త చరిత్ర
ఎకతెరీన్‌బర్గ్ (రష్యా): మూడున్నర దశాబ్దాల చరిత్రగల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. తొలిసారి ఈ మెగా ఈవెంట్లో ఏకకాలంలో రెండు పతకాలను ఖాయం చేసుకుంది. అమిత్ (52 కేజీలు), మనీశ్ కౌశిక్ (62 కేజీలు) సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. మిగతా క్వార్టర్ ఫైనల్స్‌లో సంజీత్ (91 కేజీలు) 1–4తో ఏడో సీడ్ జూలియో టోరెస్ (ఈక్వెడార్) చేతిలో... కవీందర్ సింగ్ బిష్త్ (57 కేజీలు) 0–5తో మెక్‌గ్రెయిల్ (ఇంగ్లండ్) చేతిలో ఓటమి చెందారు. ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్ స్వర్ణ విజేత అమిత్ క్వార్టర్ ఫైనల్లో 4–1తో కార్లో పాలమ్ (ఫిలిప్పీన్స్)పై విజయం సాధించాడు. 63 కేజీల క్వార్టర్ ఫైనల్లో మనీశ్ 5–0తో వాండెర్సన్ డి ఒలివిరా (బ్రెజిల్)పై గెలుపొందాడు. గతంలో ఏ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లోనూ భారత్ ఒక కాంస్యాన్ని మించి గెలవలేకపోయింది. విజేందర్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధురి (2017) కాంస్యం నెగ్గారు. -
ప్రిక్వార్టర్స్‌లో కవీందర్, సంజీత్
ఎకతెరీన్‌బర్గ్ (రష్యా): ప్రపంచ సీనియర్ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం ముగ్గురు బాక్సర్లు బరిలోకి దిగగా... ఇద్దరు విజయాలు నమోదు చేశారు. మరొకరు ఓడిపోయారు. 57 కేజీల విభాగంలో కవీందర్ సింగ్ బిష్త్, 91 కేజీల విభాగంలో సంజీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 81 కేజీల విభాగంలో బ్రిజేశ్ యాదవ్ పోరాటం ముగిసింది. కవీందర్ 3–2తో చెనా జిహావో (చైనా)పై, సంజీత్ 4–1తో స్కాట్ ఫారెస్ట్ (స్కాట్లాండ్)పై విజయం సాధించారు. బ్రిజేశ్ యాదవ్ 1–4తో బేరమ్ మల్కాన్ (టర్కీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఇప్పటికే భారత్ నుంచి అమిత్ పంగల్ (52 కేజీలు), మనీశ్ కౌశిక్ (63 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
నిఖత్, హుసాముద్దీన్‌లకు పతకాలు ఖాయం
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్ (మహిళల 51 కేజీలు), హుసాముద్దీన్ (పురుషుల 56 కేజీలు)లతోపాటు మంజు రాణి (49 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), బ్రిజేశ్ యాదవ్ (81 కేజీలు), దీపక్ సింగ్ (49 కేజీలు) కూడా సెమీస్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో నిఖత్ 5–0తో సిటోరా షాగ్‌దరోవా (ఉజ్బెకిస్తాన్)పై, హుసాముద్దీన్ 5–0తో లీ యెచాన్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించారు. -
భారత బాక్సర్లకు ప్రత్యేక శిక్షణ
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్ లాంటి మెగా ఈవెంట్లు ముందున్న తరుణంలో భారత బాక్సర్లకు సన్నాహకం కోసం ప్రత్యేకంగా విదేశీ పర్యటనలను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు, దిగ్గజ బాక్సర్లపై అవగాహన కోసం ఇటలీ, ఐర్లాండ్, కొరియా దేశాల్లో భారత బాక్సర్లను ప్రాక్టీస్ నిమిత్తం పంపించారు. జూన్ 12 వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం భారత అగ్రశ్రేణి బాక్సర్లు నిఖత్ జరీన్, అమిత్ పంగల్, సిమ్రన్‌జిత్ కౌర్, లవ్లీనా బోర్గోహైన్, శివ థాపా బెల్ఫాస్ట్లో ఇటలీ జట్టుతో ద్వైపాక్షిక ట్రెయినింగ్ క్యాంపులు, ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో తలపడుతున్నారు. వీరితో పాటు ఆరు యూరోపియన్ దేశాలకు చెందిన బాక్సర్లు కూడా ఈ క్యాంపులో పాల్గొన్నారు. అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్, రొమేనియా, ఇటలీ, ఐర్లాండ్ వంటి దేశాలకు చెందిన ఎలైట్ బాక్సర్లతో మ్యాచ్‌లకు ఎలా సన్నద్ధం కావాలో అనుభవపూర్వకంగా భారత క్రీడాకారులకు తెలియజెప్పడమే ఈ పర్యటనల ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఇటలీ పర్యటన తమకు గొప్ప అవకాశమని ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత అమిత్ పంగల్ అన్నాడు. ‘రెండు రోజులుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. దిగ్గజ బాక్సర్లను పరిశీలించడానికి ఇది మాకు మంచి అవకాశం. ఇక్కడికి వచ్చాక మానసికంగా, ఆటపరంగా చాలా మెళుకువలు తెలుసుకున్నాం’ అని తెలిపాడు. -
హుసాముద్దీన్‌కు రజతం
న్యూఢిల్లీ: ఈ సీజన్లో మరో అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బాక్సర్లు మెరిశారు. పోలాండ్‌లో జరిగిన ఫెలిక్స్ స్టామ్ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు, రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలు లభించాయి. గౌరవ్ సోలంకి (52 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు) స్వర్ణాలు సాధించగా... సెమీస్‌లో ఓడిన మన్దీప్ జాంగ్రా (69 కేజీలు), అంకిత్ ఖటానా (64 కేజీలు), సంజీత్ (91 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ 56 కేజీల విభాగంలో రజత పతకం గెలిచాడు. ఫైనల్స్‌లో గౌరవ్ 5–0తో విలియమ్ కాలే (ఇంగ్లండ్)పై, మనీశ్ 4–1తో మొహమ్మద్ హమూత్ (మొరాకో)పై నెగ్గగా... హుసాముద్దీన్ 1–4తో ముఖమ్మద్ షెకోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. ఈ ఏడాది హుసాముద్దీన్కిది రెండో అంతర్జాతీయ రజత పతకం. ఫిన్లాండ్లో జరిగిన గీ బీ టోర్నీలోనూ హుసాముద్దీన్‌కు రజతమే లభించింది. -
అమిత్, పూజ ‘పసిడి’ పంచ్
బ్యాంకాక్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. చివరి రోజు పురుషుల విభాగంలో అమిత్ పంఘల్ (52 కేజీలు)... మహిళల విభాగంలో పూజా రాణి (81 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. ఫైనల్లో ఓడిన దీపక్ సింగ్ (49 కేజీలు), కవిందర్ (56 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సిమ్రన్‌జిత్ (64 కేజీలు)లకు రజత పతకాలు లభించాయి. సెమీస్‌లో ఓడిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు), సోనియా (57 కేజీలు), మనీషా (54 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), శివ థాపా (60 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు)లకు కాంస్యాలు దక్కాయి. ఫైనల్లో అమిత్ 5–0తో కిమ్ ఇంక్యు (కొరియా)పై, పూజా రాణి 4–1తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వాంగ్ లీనా (చైనా)పై గెలుపొందారు. ఇతర ఫైనల్స్‌లో దీపక్ 2–3తో నొదిర్జాన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... కవిందర్ 0–5తో మిరాజిజ్‌బెక్ (ఉజ్బెకి స్తాన్) చేతిలో... ఆశిష్ కుమార్ 0–5తో కులాఖ్‌మెత్ (కజకిస్తాన్) చేతిలో... సిమ్రన్‌జిత్ కౌర్ 1–4తో డాన్ డుయు (చైనా) చేతిలో ఓడిపోయారు. -
నిఖత్ సంచలనం
బ్యాంకాక్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సంచలనం సృష్టించింది. మహిళల 51 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో ఈ నిజామాబాద్ జిల్లా బాక్సర్ గతంలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నాజిమ్ కైజబే (కజకిస్తాన్)ను బోల్తా కొట్టించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్లో తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. మంగళవారం జరిగిన బౌట్లో నిఖత్ 5–0తో నాజిమ్‌ను ఓడించింది. నిఖత్‌తోపాటు సరితా దేవి (60 కేజీలు), మనీషా (54 కేజీలు), సిమ్రన్‌జిత్ (64 కేజీలు) కూడా సెమీఫైనల్లోకి చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో 37 ఏళ్ల సరితా దేవి 3–2తో రిమ్మా వొలసెంకో (కజకిస్తాన్)పై, మనీషా 5–0తో పెటిసియో నైస్ జా (ఫిలిప్పీన్స్)పై, సిమ్రన్4–1తో హా తిన్ లిన్ (వియత్నాం)పై గెలిచారు. శివ థాపా కొత్త చరిత్ర పురుషుల విభాగంలో శివ థాపా (60 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో శివ 5–0తో రుజాక్రన్ జున్త్రోంగ్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. ఈ క్రమంలో ఆసియా చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగోసారి పతకాన్ని ఖాయం చేసుకున్న తొలి భారతీయ బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో శివ 2013లో స్వర్ణం, 2015లో కాంస్యం, 2017లో రజతం సాధించాడు. మిగతా క్వార్టర్ ఫైనల్స్‌లో ఆశిష్ కుమార్ 5–0తో ఒముర్బెక్ (కిర్గిస్తాన్)పై, ఆశిష్ 5–0తో త్రాన్ డుక్ థో (వియత్నాం)పై, సతీశ్ 3–2తో దోయోన్ కిమ్ (కొరియా)పై గెలిచారు. ఓవరాల్‌గా భారత్ నుంచి 13 మంది బాక్సర్లు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. బుధవారం విశ్రాంతి దినం తర్వాత గురువారం సెమీఫైనల్ బౌట్లు జరుగుతాయి. -
భారత్ పంచ్ అదిరింది
బ్యాంకాక్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల పంచ్ పవర్ కొనసాగుతోంది. పురుషుల విభాగంలో అమిత్ పంగల్ (52 కేజీలు), కవిందర్ సింగ్ బిష్త్ (56 కేజీలు), దీపక్ (49 కేజీలు)... మహిళల విభాగంలో సోనియా చహల్ (57 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. అయితే లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు), రోహిత్ టోకస్ (64 కేజీలు) పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. అదే ఫలితం: సోమవారం జరిగిన బౌట్లలో అమిత్, కవిందర్ తమ అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టారు. రియో ఒలింపిక్స్ చాంపియన్ హసన్‌బాయ్ దస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)పై అమిత్... ప్రపం చ చాంపియన్ కైరాట్ యెరాలియెవ్ (కజకిస్తాన్)పై కవిందర్ అద్భుత విజయాలు సాధించారు. గతేడా ది జకార్తా ఆసియా క్రీడల ఫైనల్లో దస్మతోవ్‌ను ఓడించి స్వర్ణం నెగ్గిన అమిత్ ఈసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. తొలి రౌండ్ నుంచే పక్కా ప్రణాళికతో దూకుడుగా ఆడిన అమిత్ 4–1తో దస్మతోవ్‌ను ఓడించాడు. ఇటీవలే ఫిన్లాండ్లో జరిగిన గీబీ అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం సాధించిన కవిందర్ ఫామ్‌ను కనబరుస్తూ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ను బోల్తా కొట్టించాడు. తొలి రౌండ్లో కైరాట్ ఆధిపత్యం చలాయించినా... తదుపరి రెండు రౌండ్లలో కవిందర్ తన ప్రత్యర్థి పంచ్‌లను కాచుకొని అవకాశం దొరికినపుడల్లా ఎదురుదాడి చేశాడు. చివరకు కవిందర్‌ను 3–2తో విజయం వరించింది. దీపక్ సింగ్‌తో క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సిన అఫ్గానిస్తాన్ బాక్సర్ రామిష్ రహ్మాని గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో దీపక్‌ను విజేతగా ప్రకటించారు. మహిళల 57 కేజీల క్వార్టర్ ఫైనల్లో జో సన్ వా (కొరియా)పై సోనియా 3–2తో విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో లవ్లీనా 0–5తో చెన్ నియెన్–చిన్ (చైనీస్ తైపీ) చేతిలో... సీమా పూనియా 0–5తో యాంగ్ జియోలి (చైనా) చేతిలో... రోహిత్ 2–3తో చిన్‌జోరిగ్ బాతర్సుక్ (మంగోలియా) చేతిలో ఓడిపోయారు. -
నిఖత్ శుభారంభం
బ్యాంకాక్: ఆద్యంతం తన ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించిన భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మక ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. స్రె పోవ్ నావో (కంబోడియా)తో ఆదివారం జరిగిన మహిళల 51 కేజీల విభాగం తొలి రౌండ్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ సంధించిన పంచ్‌ల ధాటికి రిఫరీ ఈ బౌట్‌ను రెండో రౌండ్లోనే ముగించాడు. ఈ గెలుపుతో నిఖత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు అమిత్ (52 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), శివ థాపా (60 కేజీలు), మహిళల విభాగంలో సరితా దేవి (60 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అమిత్ 5–0తో తు పో వె (చైనీస్ తైపీ)పై, ఆశిష్ 4–1తో అబ్దుర్‌ఖమనోవ్ (కిర్గిస్తాన్)పై, శివ థాపా 4–1తో సెత్‌బెక్ యులు (కిర్గిస్తాన్)పై గెలుపొందారు. గ్వాన్ సుజిన్ (కొరియా)తో జరిగిన బౌట్లో సరితా దేవి దూకుడుకు రిఫరీ మూడో రౌండ్లో బౌట్‌ను ముగించి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. పురుషుల 81 కేజీల విభాగం బౌట్లో మాత్రం భారత బాక్సర్ బ్రిజేష్ యాదవ్ 0–4తో రుజ్‌మెతోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. -
సొహైల్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: భారత పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్ఐ) జాతీయ బాక్సింగ్ చాంపియన్ షిప్లో హైదరాబాద్ కుర్రాడు మొహమ్మద్ సొహైల్ ఆకట్టుకున్నాడు. అస్సాంలో జరిగిన ఈ టోర్నీ అండర్–17 బాలుర 75–80 వెయిట్ కేటగిరీలో సొహైల్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. మాసబ్‌ట్యాంక్‌లోని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్‌లో సొహైల్ బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నాడు. పెద్దపల్లి వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లోనూ మొహమ్మద్ సొహైల్ రాణించాడు. -
మేరీ‘గోల్డ్’
మేరీ కోమ్... మేరీ కోమ్... మేరీ కోమ్... ప్రేక్షకుల జయజయధ్వానాల మధ్య ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రికార్డు స్థాయిలో ఆరో స్వర్ణం సొంతం చేసుకొని నయా చరిత్ర లిఖించింది. పవర్ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థిని గుక్కతిప్పుకోనివ్వకుండా చేసిన మేరీ... తుదిపోరులో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. 35 ఏళ్ల వయసులో... ముగ్గురు పిల్లల తల్లి అయినా... తన పంచ్‌లో పదును తగ్గలేదని మరోసారి నిరూపించి... ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ చాంపియన్‌గా మెరిసింది. న్యూఢిల్లీ: రికార్డు స్థాయిలో ఇప్పటికే ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన స్టార్ బాక్సర్ మేరీకోమ్ సొంతగడ్డపై జరిగిన మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి సొంతం చేసుకుంది. శనివారం జరిగిన 48 కేజీల ఫైనల్లో మేరీ కోమ్ 5–0తో హనా ఒఖోటా (ఉక్రెయిన్) పై గెలుపొందింది. బరిలో దిగిన అన్ని బౌట్లలో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన ఈ మణిపురి మణిపూస తుదిపోరులోనూ అదే రీతిలో చెలరేగి 30–27, 29–28, 29–28, 30–27, 30–27తో ఏకపక్ష విజయం సాధించింది. ఫైనల్ బౌట్లో మేరీ ఆరంభం నుంచే దూకుడు కనబర్చింది. తొలి రౌండ్లో తన పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. ఇక రెండో రౌండ్ ప్రారంభంలోనే బలమైన హుక్తో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఆ రౌండ్ పూర్తయ్యేసరికే ఆమె విజయం దాదాపుగా ఖాయమైంది. చివరిదైన మూడో రౌండ్లోనూ ఆధిపత్యం కొనసాగిస్తూ... సునాయాస విజయం సొంతం చేసుకుంది. ఈ పతకాన్ని దేశానికి అంకితమిచ్చిన మేరీ భావోద్వేగానికి గురై ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. ‘చాలా ఆనందంగా ఉంది. మీరు చూపే ఆదరాభిమానాలకు స్వర్ణం తప్ప మరేది నెగ్గకూడ దని అనుకున్నా. 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించ లేకపోవడం నన్ను ఇప్పటికీ బాధిస్తోంది. 2020 టోక్యో ఒలింపిక్స్ స్వర్ణం సాధించడమే నా ముందున్న లక్ష్యం. ఒలింపిక్స్‌లో ఈ (48 కేజీల) విభాగం లేదు. టోక్యోలో 51 కేజీల విభాగంలో బరిలో దిగుతా’అని 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మేరీకోమ్ చెప్పింది. సోనియాకు రజతం... బరిలో దిగిన తొలి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే దుమ్మురేపే ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకొచ్చిన యువ బాక్సర్ సోనియా చహల్ తృటిలో స్వర్ణం చేజార్చుకుంది. 57 కేజీల ఫైనల్లో సోనియా 1–4తో ఒర్నెల్లా గాబ్రియల్ (జర్మనీ) చేతిలో ఓడింది. చివరివరకు హోరాహోరీగా పోరాడిన సోనియా 28–29, 28–29, 29–28, 28–29, 28–29తో పరాజయం పాలైంది. ‘నా శాయశక్తులా ప్రయత్నించాను. కానీ అది సరిపోలేదు. అయినా... బాధగా లేదు. రజతం గెలవడం సంతోషాన్నిచ్చింది. 2020 టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతా’అని సోనియా వెల్లడించింది. ప్రధాని మోదీ, జగన్ అభినందనలు... ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మేరీ కోమ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఆమె విజయం ప్రత్యేకమైందని, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. మరిన్ని విజయాలు సాధించాలి... సాక్షి, అమరావతి: ఆరో సారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్కు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు అనేకం అందుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలు (5 స్వర్ణాలు, 1 రజతం) సాధించి ఐర్లాండ్‌కు చెందిన కేటీ టేలర్ (5 స్వర్ణాలు, 1 కాంస్యం)తో సమంగా ఉన్న మేరీ తాజా పసిడితో క్యూబా పురుషుల బాక్సింగ్ దిగ్గజం ఫెలిక్స్ సవాన్ (6 స్వర్ణాలు, 1 రజతం) సరసన నిలిచింది. మేరీ గతంలో 2002, 05, 06, 08, 10లలో స్వర్ణాలు... అరంగేట్ర 2001 చాంపియన్‌షిప్‌లో రజతం సాధించింది. ఆమె చివరిసారిగా 2010 బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన మెగా టోర్నీలో విజేతగా నిలిచింది. -
అహ్మద్, మొహమ్మద్లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాళ్లు అహ్మద్ బిన్ ఉస్మాన్, మొహమ్మద్ బిన్ ఉస్మాన్ సత్తా చాటారు. సుల్తానాబాద్‌లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో చెరో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. అండర్–19 బాలుర 49–52 వెయిట్ కేటగిరీ ఫైనల్లో వరంగల్‌కు చెందిన ఎ. విజయ్‌పై అహ్మద్ బిన్ ఉస్మాన్ (తపస్య జూనియర్ కాలేజి) గెలుపొంది విజేతగా నిలిచాడు. అంతకుముందు సెమీఫైనల్లో జె. రజనీకాంత్ (కరీంనగర్)ను అహ్మద్ ఓడించాడు. అండర్–14 బాలుర 38–40 కేజీల విభాగం ఫైనల్లో వరంగల్‌కు చెందిన అక్షయ్ రాజ్‌పై మొహమ్మద్ బిన్ ఉస్మాన్ విజయం సాధించాడు. అంతకుముందు సెమీఫైనల్లో ఆదిలాబాద్‌కు చెందిన మలిక్‌ను మొహమ్మద్ బిన్ ఉస్మాన్ ఓడించాడు. -
ఔరా... మేరీ!
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ తానేంటో ఇది వరకే చాలాసార్లు నిరూపించుకుంది. అలాంటి చాంపియన్ బాక్సర్ తనకు పతకాలు తెచ్చే కేటగిరీ (48 కేజీలు) కోసం వీరోచిత కసరత్తే చేసి ఔరా అనిపించింది. కేవలం 4 గంటల్లోనే 2 కిలోల బరువు తగ్గింది. పోలాండ్‌లో జరిగిన బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం అక్కడికి వెళ్లేసరికి ఆమె బరువు 50 కేజీలుగా ఉంది. పోటీలకు ముందు నిర్వహించే వేయింగ్ కార్యక్రమానికి మరో 4 గంటలు సమయం మాత్రమే ఉండటంతో బరువు తగ్గించుకోవడంపై దృష్టి సారించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏకబిగిన స్కిప్పింగ్ చేసింది. ఆమె పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది. వేయింగ్ సమయానికి సరిగ్గా 48 కేజీల బరువుతో పోటీకి అర్హత సాధించింది. అనంతరం తన పంచ్ పవర్‌తో షరామాములుగా బంగారు పతకం గెలిచింది. దీనిపై ఆమె మాట్లాడుతూ ‘ఒకవేళ వెయింగ్‌లో 48 కేజీలకు పైబడి ఉంటే నాపై అనర్హత వేటు పడేది. అందుకే 4 గంటలపాటు తీవ్రంగా చెమటోడ్చాను. వేయింగ్ సమయానికి సరైన బరువుతో సిద్ధమయ్యాను’ అని చెప్పింది. -
ఓవరాల్ చాంపియన్ ఏవీ కాలేజి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో దోమలగూడ ఏవీ కాలేజి జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్లో అన్వర్ ఉల్ ఉలూమ్, మల్లేపల్లి జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోగా... సిద్ధార్థ డిగ్రీ కాలేజి జట్టు మూడోస్థానాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగిన సూపర్ హెవీ (91 ప్లస్) వెయిట్ కేటగిరీలో అన్వర్ ఉల్ ఉలూమ్‌కు చెందిన మొహమ్మద్ మోసిన్ విజేతగా నిలిచాడు. ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థి వి. మాన్విత్ రెడ్డి రెండోస్థానాన్ని దక్కించుకోగా, ఎస్వీజీ డిగ్రీ కాలేజికి చెందిన బి. సాయికుమార్ మూడోస్థానంలో నిలిచాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వ్యాయామవిద్య కాలేజి ప్రిన్సిపాల్ రాజేశ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఇతర వెయిట్ కేటగిరీల విజేతల వివరాలు లైట్ ఫ్లయ్ (46–49 కేజీలు): 1. మొహమ్మద్ రయీస్, 2. పి. రాజు, 3. మొహమ్మద్ రోషన్, 3. ఎం. శ్రీనివాస్ నాయక్. ఫ్లయ్ వెయిట్ (49–52 కేజీలు): 1. డి. అనిల్, 2. పి. ఉపేందర్, 3. టి. జీవన్, 3. హస్జీత్. బాంటమ్ (52–56 కేజీలు): 1. కె. రాజు, 2. పి. మహేందర్, 3. హబీబ్ ఉల్ రహమాన్, 3. అల్తాబ్ అహ్మద్. లైట్ వెయిట్ (56–60 కేజీలు): 1. మొహమ్మద్ ముదస్సర్ అహ్మద్, 2. పి. సురేశ్, 3. ఎం. రోహిత్, 3. జి. నీరజ్ కుమార్. లైట్ వెల్టర్ (60–64 కేజీలు): 1. ఆర్. పృథ్వీరాజ్, 2. బి. శ్రావణ్, 3. ఉదయ్ కిశోర్ యాదవ్, 3. ఖాగి మొహమ్మద్ సహబుద్దీన్. వెల్టర్ (64–69 కేజీలు): 1. జి. కైలాశ్ రావు, 2. కె. అక్షయ్, 3. టి. అజయ్, 3. ఎన్. అభిషిత్. మిడిల్ వెయిట్ (69–75 కేజీలు): 1. జి. అనిరుధ్, 2. ఎం. దేవానందం, 3. శ్రీకాంత్, 3. మొహమ్మద్ జకీయుద్దీన్. లైట్ హెవీ (75–81 కేజీలు): 1. ఎం. సాయి కల్యాణ్ గౌడ్, 2. టి. విశాల్ చంద్ర, 3. ఆర్. వరుణ్ రెడ్డి, 3. ఎ. దీపక్ సాయి. హెవీ వెయిట్ (81–91 కేజీలు): 1. డి. ఆకాశ్ రెడ్డి, 2. ముజహీత్ ఖాన్, 3. కె. సన్నీ, 3. మొహమ్మద్ అవాజ్ ఖాన్. -
భారత బాక్సర్ల పతకాల పంట
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సిలేసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. పోలండ్‌లో జరిగిన ఈ టోర్నీలో 6 స్వర్ణాలు, 6 రజతాలు, ఓ కాంస్యంతో ఓవరాల్‌గా 13 పతకాలతో దుమ్మురేపారు. భారత బాక్సర్లు పోటీపడ్డ 13 విభాగాల్లోనూ పతకాలు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. ఫైనల్స్‌లో భారతి (46 కేజీలు) 5–0తో ఇజాబెలా (పోలాండ్)పై; టింగ్‌మిలా డౌన్‌జెల్ (48 కేజీలు) 5–0తో ఎలైన (జర్మనీ)పై; సందీప్ కౌర్ (52 కేజీలు) 5–0తో కరోలినా అమ్‌పుల్‌స్కా (పోలాండ్)పై; నేహా (54 కేజీలు) 3–2తో నికోలినా (లాత్వియా)పై; జైబురా (పోలాండ్)పై కోమల్ (80 కేజీలు); లియోన (స్వీడన్)పై అర్షి (57 కేజీలు) విజయం సాధించి పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. అమీశ (50 కేజీలు) 0–5తో అలెక్సెస్ (పోలాండ్) చేతిలో, సాన్య నేగీ (60 కేజీలు) 2–3తో థెల్మా (స్వీడన్) చేతిలో, ఆశ్రేయ (63 కేజీలు) 1–4తో నైనా (సెర్బియా) చేతిలో, మితిక (66 కేజీలు) 2–3తో నటాలియా (పోలండ్) చేతిలో, రాజ్ సాహిబా (70 కేజీలు) 0–5తో జోఫియా (పోలాండ్) చేతిలో, లేపాక్షి (ప్లస్ 80 కేజీలు) 0–5తో ఓలీవియా (పోలాండ్) చేతిలో ఓడి రజతాలు దక్కించుకున్నారు. 75 కేజీల వెయిట్ కేటగిరీ సెమీఫైనల్లో నేహా 0–5తో పారడా డైరా (పోలాండ్) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. -
మెరిసిన మొహమ్మద్ బ్రదర్స్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ అమెచ్యూర్ చెస్–బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ సోదర త్రయం బిలాల్ మొహమ్మద్, ముస్తఫా మొహమ్మద్, హుస్సేన్ మొహమ్మద్ మెరిసింది. కోల్‌కతాలో ఇటీవల ముగిసిన ఈ టోర్నీలో భారత్ తరఫున బరిలోకి దిగిన బిలాల్ స్వర్ణం సాధించగా... ముస్తఫా కాంస్యం, హుస్సేన్ కాంస్యం దక్కించుకున్నారు. బిలాల్ అండర్–14 విభాగంలో 46 కేజీల కేటగిరీలో విజేతగా నిలిచాడు. ముస్తఫా 66 కేజీల విభాగంలో... హుస్సేన్ 62 కేజీల విభాగంలో మూడో స్థానాన్ని సంపాదించారు. ఈ ముగ్గురు సోదరులు హైదరాబాద్‌లోని హబీబ్ ముస్తఫా బాక్సింగ్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. -
నిహారికకు రజతం
రోహ్తక్: జాతీయ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి గోనెళ్ల నిహారిక రజత పతకం సాధించింది. జూనియర్ ప్రపంచ చాంపియన్ అయిన నిహారిక ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. 69–75 కేజీల వెయిట్ కేటగిరీలో శుక్రవారం జరిగిన మహిళల పసిడి పతక పోరులో నిహారిక (తెలంగాణ) 0–5తో ఆస్థా పహ్వా (ఉత్తరప్రదేశ్) చేతిలో ఓడిపోయింది. 45–48 కేజీల వెయిట్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జి. రమ్యకు కూడా రెండో స్థానం దక్కింది. ఫైనల్లో నీతు (హరియాణా) 5–0తో రమ్య (ఏపీ)పై గెలిచింది. పురుషుల 46–49 కేజీల వెయిట్ కేటగిరీ ఫైనల్లో ఆర్. సాయి కుమార్ (ఏపీ) రజతాన్ని గెలుచుకున్నాడు. -
వరల్డ్ చెస్ బాక్సింగ్ పోటీలకు నాగరాజు
హైదరాబాద్: వరల్డ్ చెస్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు పాతబస్తీ మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ప్రతాప్ నాగరాజు ఎంపికయ్యారు. జూలై 22 నుంచి 29 వరకు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగే అమెచ్యూర్ వరల్డ్ చెస్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నాగరాజు భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 62 కేజీల విభాగంలో అతను పోటీపడతాడు. గత కొన్నేళ్లుగా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన పలు టోర్నీల్లో నాగరాజు నిలకడగా పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా ఆయన ఎంపిక అవ్వడం పట్ల స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్. దేవేందర్, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. -
నిఖత్ ముందంజ
రోహ్తక్: జాతీయ మహిళల ఎలైట్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ముందంజ వేసింది. సోమవారం జరిగిన ఫ్లయ్ వెయిట్ కేటగిరి బౌట్లో నిఖత్ 5–0తో అంజూ సాబు (కేరళ)పై గెలిచింది. వెల్టర్ వెయిట్ విభాగంలో తెలంగాణకే చెందిన షేక్ రూహి తన ప్రత్యర్థి జాస్మీ జోస్ (కేరళ)కు వాకోవర్ ఇచ్చింది. లైట్ వెల్టర్ వెయిట్ బౌట్లో జి. షరా (ఆంధ్రప్రదేశ్) 0–5తో చవోబా దేవి (మణిపూర్) చేతిలో పరాజయం పాలైంది. -
సెమీస్ లో మేరీకోమ్
హో చి మిన్ సిటీ (వియత్నాం): తన పాత వెయిట్ కేటగిరికి మారిపోయాక బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆసియా మహిళల చాంపియన్ షిప్ లో భాగంగా శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 48 కేజీల విభాగంలో చైనీస్ తైపీ బాక్సర్ మెంగ్ చియె పింగ్ పై మేరీకోమ్ విజయం సాధించి సెమీస్ లోకి ప్రవేశించారు. తద్వారా పతకాన్ని ఖాయం చేసుకుంది మేరీకోమ్. ఈ చాంపియన్ షిప్ లో మేరీకోమ్ తో పాటు శిక్షా(54 కేజీలు, ప్రియాంక చౌదరి(60 కేజీలు)లు సైతం సెమీస్ కు చేరారు. అంతకుముందు ఆసియా చాంపియన్ షిప్ లో ఐదుసార్లు తలపడిన 34 ఏళ్ల మేరీకోమ్.. నాలుగుసార్లు స్వర్ణం పతకాలు సాధించగా, ఒకసారి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సెమీఫైనల్లో జపాన్ బాక్సర్ సుబాసా కోమురాతో మేరీకోమ్ తలపడనుంది. -
శ్యామ్ కుమార్‌కు స్వర్ణ పతకం
జాతీయ సీనియర్ ఎలైట్ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకర శ్యామ్ కుమార్ పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. విశాఖపట్నంలో సోమవారం ముగిసిన ఈ పోటీల్లో రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు ప్రాతినిధ్యం వహించిన శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో శ్యామ్ 3–2తో ఎన్టీ లాల్బియాకిమా (మిజోరం)పై విజయం సాధించాడు. -
పసిడి ‘పంచ్’కు చేరువలో శ్యామ్ కుమార్
జాతీయ సీనియర్ పురుషుల ఎలైట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. విశాఖపట్నంలో శనివారం జరిగిన 49 కేజీల విభాగం సెమీఫైనల్లో శ్యామ్ కుమార్ 5–0తో విపిన్ కుమార్ (చండీగఢ్)పై గెలిచాడు. ఫైనల్లో ఎన్టీ లాల్‌బియకిమా (మిజోరం)తో శ్యామ్ తలపడతాడు. ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత స్టార్ బాక్సర్లు మనోజ్ కుమార్ (69 కేజీలు), మన్దీప్ జాంగ్రా (75 కేజీలు), శివ థాపా (60 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించారు. -
క్వార్టర్స్‌లో క్రాంతి, శ్యామ్
సాక్షి, విశాఖపట్నం: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కె.క్రాంతి... రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ శ్యామ్ కుమార్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. 49 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లలో క్రాంతి 5–0తో వీర్ సింగ్ (హిమాచల్‌ప్రదేశ్)పై గెలుపొందగా... శ్యామ్ 4–1తో హిమాంశు శర్మ (పంజాబ్)ను ఓడించాడు. 60 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో వి.దుర్గా రావు (ఆంధ్రప్రదేశ్) 3–2తో సచిన్ (చండీగఢ్)పై నెగ్గగా... వన్‌లాల్‌రియత్‌కిమా (మిజోరం) చేతిలో లలిత్ కిశోర్ (తెలంగాణ) ఓడిపోయాడు. -
శ్యామ్ కుమార్ శుభారంభం
సాక్షి, విశాఖపట్నం: జాతీయ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన 49 కేజీల తొలి రౌండ్లో శ్యామ్ 5–0తో హెచ్‌పీ కుమార్ (మణిపూర్)ను ఓడించాడు. ఇదే విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కె.క్రాంతి 3–2తో శివాజీ మోరే (మహారాష్ట్ర)పై గెలిచాడు. 52 కేజీల విభాగం తొలి రౌండ్లో అప్పలరాజు (ఆంధ్రప్రదేశ్) 0–5తో విజయ్ అరోరా (జార్ఖండ్) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు తెలంగాణ బాక్సర్లు బి.దీపక్ (49 కేజీలు) 3–2తో రిషి కుమార్ (రాజస్తాన్)పై, ఎన్.లలిత్ కిశోర్ (60 కేజీలు) 3–2తో రమణ్ (జార్ఖండ్)పై గెలిచి ముందంజ వేశారు. తెలంగాణకే చెందిన డి.ధర్మరాజు (హెవీవెయిట్), మొహమ్మద్ మోసిన్ (సూపర్ హెవీవెయిట్) కూడా తమ ప్రత్యర్థులపై గెలిచారు. -
రయీస్ పసిడి పంచ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్–జూనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు మొహమ్మద్ రయీస్ స్వర్ణం సాధించాడు. ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన 46–48 కేజీల ఫైనల్ బౌట్లో రయీస్ 5–0తో బికాస్ (త్రిపుర)పై ఏకపక్షంగా విజయం సాధించాడు. మిగతా బౌట్లలో తెలంగాణ కుర్రాళ్లు రజతంతో తృప్తిపడ్డారు. 42–44 కేజీల విభాగంలో కె. ఆంజనేయులు 0–5తో మీసాల రవి (జార్ఖండ్) చేతిలో, 52–54 కేజీల కేటగిరీ ఫైనల్లో మధుసూదన్ యాదవ్ 0–5తో అజయ్ పటేల్ (రాజస్తాన్) చేతిలో పరాజయం చవిచూశారు. ఆంధ్రప్రదేశ్ బాక్సర్లలో జెర్రిపోతుల భానుప్రకాశ్, నెల్లి అభిరామ్ టైటిల్స్ సాధించగా... బాలగణేష్ రన్నరప్‌గా నిలిచాడు. 36–38 కేజీల ఫైనల్లో భానుప్రకాశ్ 5–0తో సాహిల్ సుభా (ఉత్తరప్రదేశ్)పై, 40–42 కేజీల తుదిపోరులో అభిరామ్ 5–0తో రూపేశ్ కుమార్ (రాజస్తాన్)పై విజయం సాధించారు. 32–34 కేటగిరీ టైటిల్ పోరులో బాలగణేష్ 0–5తో మనీశ్ సింగ్ (ఢిల్లీ) చేతిలో కంగుతిన్నాడు. -
ఫైనల్లో వినయ్, రయీస్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్–జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఆటగాళ్లు చేమల వినయ్, మొహమ్మద్ రయీస్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్లో శుక్రవారం జరిగిన 44–46 కేజీల సెమీఫైనల్లో వినయ్ 1–0తో సుమీర్ యాదవ్ (బిహార్)పై గెలుపొందాడు. 46–48 కేజీల సెమీస్‌లో రయీస్ 5–0తో ప్రదీశ్ (తమిళనాడు)ను కంగుతినిపించాడు. మిగతా బౌట్లలో 42–44 కేజీల కేటగిరీలో కె. ఆంజనేయులు 3–0తో శివమ్ కుమార్ (ఉత్తరప్రదేశ్)పై విజయం సాధించగా, 50–52 కేజీల విభాగంలో పిడుగు శ్రీకాంత్ 0–2తో తుశాంత్ టక్రాన్ (ఢిల్లీ) చేతిలో పరాజయం చవిచూశాడు. 32–34 కేజీల కేటగిరీలో బాల గణేష్ రెడ్డి (ఏపీ) 5–0తో సాహిల్ (పశ్చిమ బెంగాల్)పై నెగ్గగా, సత్తారు బలరాం (ఏపీ) 0–2తో ఆకాశ్ పాశ్వాన్ (పశ్చిమ బెంగాల్) చేతిలో కంగుతిన్నాడు. నెల్లి అభిరామ్ (ఏపీ) 1–0తో దుశ్యంత్ (ఛత్తీస్‌గఢ్)పై గెలుపొందగా, భార్గవ్ (ఏపీ) 0–1తో అంకిత్ (ఛత్తీస్‌గఢ్) చేతిలో ఓడిపోయాడు. -
ప్రిక్వార్టర్స్‌లో అమిత్, గౌరవ్
హంబర్గ్ (జర్మనీ): భారత బాక్సర్లు అమిత్ ఫంగల్, గౌరవ్ బిధురి సత్తా చాటారు. ప్రపంచ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వీరిద్దరూ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల 49 కేజీల కేటగిరీ తొలి రౌండ్లో అమిత్ 4–1తో ఫెడెరికొ సెర్రా (ఇటలీ)పై గెలుపొందాడు. 56 కేజీల విభాగంలో గౌరవ్ 5–0తో ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సామ్ గుడ్మాన్ (ఆస్ట్రేలియా)ను కంగుతినిపించాడు. ప్రిక్వార్టర్స్‌లో అమిత్... ఏడో సీడ్ కార్లస్ క్విపో (ఈక్వెడార్)తో, గౌరవ్... ఆఫ్రికా చాంపియన్ జీన్ జోర్డి వాడముటూ (మారిషస్)తో తలపడతారు. ఈ చాంపియన్‌షిప్‌లో 250 మంది అంతర్జాతీయ బాక్సర్లు తలపడుతుండగా... భారత్ తరఫున ఎనిమిది మంది పోటీపడుతున్నారు. -
మరో రెండు పతకాలు ఖాయం
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఫిలిప్పీన్స్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో భారత్‌కు చెందిన అంకిత్ నర్వాల్ (57 కేజీలు), అక్షయ్ సివాచ్ (60 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో అంకిత్ 3–2తో దిమిత్రీ బార్మిన్ (కజకిస్తాన్)పై గెలుపొందగా... లిన్ యు (చైనీస్ తైపీ)ను అక్షయ్ ఓడించాడు. ఇతర బౌట్లలో డేలా కెన్నత్ (ఫిలిప్పీన్స్) చేతిలో సెలే సోయ్ (46 కేజీలు)... యురా కెన్షిన్ (జపాన్) చేతిలో అమన్ గంగాస్ (54 కేజీలు)... దస్తాన్ ఒనల్బెకోవ్ (కిర్గిస్తాన్) చేతిలో ఆకాశ్ సాయ్ (66 కేజీలు) ఓడిపోయారు. -
విజేతలు నవీద్, రయీస్
జూనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన బాక్సర్లు మొహమ్మద్ నవీద్, మొహమ్మద్ రయీస్ సత్తా చాటారు. ఎథిక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. 46 కేజీల వెయిట్ కేటగిరీ ఫైనల్లో మొహమ్మద్ నవీద్, జి. అనీశ్‌పై గెలుపొందగా... 48 కేజీల విభాగంలో మొహమ్మద్ రయీస్, చైతన్యను ఓడించాడు. ఇతర ఫైనల్ మ్యాచ్‌ల్లో 50 కేజీల విభాగంలో మొహమ్మద్ బిన్ ఉస్మాన్ (హైదరాబాద్), అజయ్‌పై, 52 కేజీల విభాగంలో పవన్ కల్యాణ్ (రంగారెడ్డి) బి. శ్రీనివాస్‌పై, 54 కేజీల విభాగంలో త్రిజోత్ సింగ్ (హైదరాబాద్) భరత్‌పై, 57 కేజీల విభాగంలో ఎన్. హరీశ్ (హైదరాబాద్) ఏవీ పవన్‌పై, 60 కేజీల విభాగంలో బి. హర్షిత్ (ఖమ్మం) సాయిపై, 63 కేజీల విభాగంలో ఎం. వేణు (హైదరాబాద్) ఆర్. రాహుల్‌పై, 70 కేజీల విభాగంలో రాకేశ్ యాదవ్ (రంగారెడ్డి) జి. హనుమాన్‌పై, 75 కేజీల విభాగంలో ఆర్యవ్ మిశ్రా (హైదరాబాద్) రంగా రోహిత్‌పై, 80+ కేజీల కేటగిరీలో పి. సాయిరామ్ డి. విశాల్‌పై గెలుపొంది విజేతలుగా నిలిచారు. 80 కేజీల విభాగంలో ఎస్. హర్షవర్ధన్, 66 కేజీల విభాగంలో ఎన్. సౌరభ్లకు ఫైనల్లో బై లభించింది. -
ఫైనల్లో ఆశిష్, రయీస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆశిష్, రయీస్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఎథిక్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్ సహకారంతో జరుగుతున్న ఈ పోటీలను బుధవారం ఎల్బీ స్టేడియంలో సీనియర్ బాక్సర్ వెంకట్రావు ప్రారంభించారు. 46 కేజీల విభాగం సెమీఫైనల్ పోటీల్లో మొహమ్మద్ నవీద్... అబ్దుల్ హకీం మొహమ్మద్‌పై, ఆశిష్.. దినేశ్‌పై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నారు. 48 కేజీల విభాగంలో రయీస్.. నిరాజ్పై, చైతన్య... మురళీకృష్ణపై నెగ్గి ఫైనల్ చేరారు. ఇతర సెమీఫైనల్స్ ఫలితాలు: 50 కేజీల విభాగంలో మొహమ్మద్ ఉస్మాన్.. సయ్యద్ హుస్సేన్‌పై, భరత్ కుమార్.. బి. వంశీపై; 52 కేజీల విభాగంలో పవన్ కల్యాణ్.. సాయి సుమీత్‌పై, శ్రీనివాస్... నవీన్‌పై; 54 కేజీల విభాగంలో త్రిజోత్ సింగ్.. శ్రీకాంత్ గౌడ్‌పై, అజయ్.. భరత్‌పై, 57 కేజీల విభాగంలో హరీశ్.. పవన్‌పై, ఏవీ పవన్.. సుహాస్‌పై; 60 కేజీల విభాగంలో హర్షిత్.. సాయి మనీశ్‌పై; 63 కేజీల విభాగంలో రాహుల్.. నిఖిల్ భద్రాద్రిపై; 75 కేజీల విభాగంలో ఆర్యవ్ మిశ్రా.. సయ్యద్ అహ్మద్‌పై, రంగా రోహిత్.. రాజేశ్‌పై; 80+ విభాగంలో జి. వంశీ.. శామ్సన్‌పై, సాయిరాం.. విశాల్‌పై గెలిచి ఫైనల్స్‌లో ప్రవేశించారు. 63 కేజీల విభాగంలో వేణు.. 70 కేజీల విభాగంలో రాకేశ్, హనుమాన్లకు సెమీఫైనల్లో ‘బై’ లభించింది. -
4, 5 తేదీల్లో బాక్సింగ్ సెలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: జాతీయ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్ల కోసం ఈనెల 4, 5 తేదీల్లో బాక్సింగ్ సెలక్షన్స జరుగనున్నాయి. తెలంగాణ బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలో యూత్ పురుషుల, మహిళల విభాగాల్లో ఈ ఎంపిక పోటీలు జరుగుతారుు. ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్ వేదికగా సెలక్షన్స నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏపీ రెడ్డి (944163038)ని సంప్రదించవచ్చు. జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీలో జనవరి 16 నుంచి 22 వరకు జరుగుతుంది. -
శ్రీనివాస్ పరాజయం
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యారుు. 69 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ మెలిపాక శ్రీనివాస్ తొలి రౌండ్లో మిలాన్ ప్రాట్ (ఫ్రాన్స) చేతిలో ఓడిపోగా... 64 కేజీల విభాగంలో ఆశిష్ అర్మేనియా బాక్సర్ టోనీ గాల్స్టయాన్పై గెలిచాడు. -
నిఖత్ జరీన్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: చెన్నైలో జరిగిన ఆలిండియా మెట్రో కప్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆమె కేరళకు చెందిన అల్ఫాన్సా మరియా థామస్‌ను కంగుతినిపించింది. -
పంచ్ అదిరింది
అస్తానా (కజకిస్తాన్): ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన 54 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ 3-0తో ఎరికా అడ్జెయి (కెనడా)ను ఓడించింది. ఏకపక్షంగా జరిగిన ఈ బౌట్లో నిఖత్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. క్వార్టర్ ఫైనల్లో గెలిస్తే నిఖత్‌కు కనీసం కాంస్యం ఖాయమవుతుంది. మరోవైపు భారత్‌కే చెందిన సోనియా (57 కేజీలు), సవీటి బోరా (81 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో సోనియా 3-0తో నోమిన్ డ్యూష్ (జర్మనీ)పై, సవీటి 2-1తో కెబికవా (బెలారస్)పై నెగ్గారు. అయితే 75 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో పూజా రాణి 0-3తో సవన్నా మార్షల్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయి రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందడంలో విఫలమైంది. రియో ఒలింపిక్స్‌లో మహిళా బాక్సర్లకు 51, 60, 75 కేజీల విభాగాల్లో పోటీలుంటాయి. అయితే ఈసారి భారత్ నుంచి ఎవరూ అర్హత సాధించలేదు. -
ప్రిక్వార్టర్స్‌లో నిఖత్
అస్తానా (కజకిస్తాన్ ): ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన 54 కేజీల విభాగం తొలి రౌండ్లో నిఖత్ 2-1తో బియాంకా ఎల్ మీర్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎరికా అడ్జీ (కెనడా)తో నిఖత్ తలపడుతుంది. 75 కేజీల విభాగంలో పూజా రాణి, 57 కేజీల విభాగంలో సోనియా లాథెర్ కూడా శుభారంభం చేశారు. మరియా బొరుత్సా (ఉక్రెయిన్)పై పూజా రాణి... గెండెగ్మా మ్యాగ్మార్ (మంగోలియా)పై సోనియా గెలుపొందారు. -
భారత్‌కు నాలుగో స్థానం
బ్యాంకాక్ : ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఓ రజతం, మూడు కాంస్యాలతో మొత్తం 16 పాయింట్లు సాధించింది. ఓవరాల్‌గా 28 దేశాలు పాల్గొన్న ఈ టోర్నీలో కజకిస్తాన్ (42 పాయింట్లు) విజేతగా నిలిచింది. వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ఈ ఈవెంట్ ద్వారా భారత్ నుంచి ఆరుగురు బాక్సర్లు అర్హత సాధించారు. -
సెమీస్‌లో దేవేంద్రో, శివ, వికాస్
బ్యాంకాక్ : ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారత బాక్సర్లు దేవేంద్రో సింగ్ (49 కేజీలు), శివ థాపా (56 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. దీంతో కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకోవడంతోపాటు వచ్చే నెలలో దోహాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కూ అర్హత సాధించారు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో దేవేంద్రో 3-0తో కార్నెలిస్ లాంగూ (ఇండోనేసియా)పై, శివ థాపా 2-1తో మాలాబెకోవ్ (కిర్గిజిస్తాన్)పై, వికాస్ 3-0తో దిన్ హోంగ్ త్రువోంగ్ (వియత్నాం)పై గెలిచారు. అయితే కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ మనోజ్ కుమార్ (64 కేజీలు), మన్‌ప్రీత్ సింగ్ (91 కేజీలు) మాత్రం క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. మనోజ్ 0-3తో ఫజ్లిద్దిన్ గైబనజరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో; మన్‌ప్రీత్ 0-3తో తులగనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
నాగనిక ఓటమి
తైపీ : ప్రపంచ జూనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ గొన్నెల నాగనిక పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ప్లస్ 80 కేజీల విభాగంలో నేరుగా క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగిన నాగనిక 0-3 తేడాతో మోర్కా జెస్సికా (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. ఒకవేళ ఈ బౌట్లో నాగనిక గెలిచుంటే ఆమెకు కనీసం కాంస్య పతకం ఖాయమయ్యేది. మరోవైపు భారత్‌కే చెందిన సవిత (50 కేజీలు), మన్దీప్ సంధూ (52 కేజీలు), సాక్షి (54 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. సవిత 3-0తో వాలెరియా రొడియోనోవా (రష్యా)పై, మన్దీప్ 3-0తో నాగీ ఎంజెలా (హంగేరి)పై గెలిచారు. -
బాక్సింగ్ చాంప్ సాయి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా అండర్-19 బాక్సింగ్ టోర్నీలో జాతీయ బాక్సర్ ఎస్.సాయి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్లో సోమవారం జరిగిన 60 కేజీ విభాగం ఫైనల్లో ఎస్.సాయి.. జి.అనంత్ కుమార్(విశాఖపట్నం)పై విజయం సాధించి టైటిల్‌ను గెలిచాడు. విజేతలకు జాతీయ మాజీ బాక్సర్ పి.వెంకటేష్ యాదవ్ పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రా ష్ట్ర పీఈటీల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.సోమేశ్వర్రావు, శ్రీనివాస్‌యాదవ్‌లు పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు 48 కేజీ: 1.కె.క్రాంతి (విశాఖపట్నం), 2.ఎస్.సతీష్, 3.ఎ.తేజ(నల్గొండ), 3.కె.నాగతేజ(రంగారెడ్డి). 51 కేజీ: 1.మహేందర్ (హైదరాబాద్), 2.జి.హరికృష్ణ (విశాఖపట్నం, 3.సి.హెచ్.రాహుల్ (విజయనగరం), 3.ఎస్.శేఖర్ (వరంగల్). 54 కేజీ: 1.ఎం.డి.జునైద్ (నిజామాబాద్), 2.ఎన్.హరికృష్ణ (విశాఖపట్నం), 3.రవిచంద్రా రెడ్డి (కరీంనగర్), 3.ఎస్.నవీన్ కుమార్ (రంగారెడ్డి). 57 కేజీ: 1.ఎన్.తరుణ్ (నల్గొండ ), 2.ఎ.శ్రీకాంత్ (ఆదిలాబాద్), 3.కృష్ణారావు (విజయనగరం), 3.ఎ.శివప్రసాద్ (కరీంనగర్). 64 కేజీ: 1.పి.ప్రభు (హైదరాబాద్), 2.బి.ప్రసాద్ (విజయనగరం), 3.బి.శుభం (రంగారెడ్డి), 3.ఇ.కిరణ్ (విశాఖపట్నం). 69 కేజీ: 1.వి.ప్రసాద్(విశాఖపట్నం), 2.జె.రాజ్ కుమార్ (రంగారెడ్డి), 3.మణిరత్నం (గుంటూరు), 3.ఎస్.కె.షబ్బీర్ (విజయనగరం). 75 కేజీ: 1.శ్రవణ్ థామస్ (రంగారెడ్డి), 2.సయ్యద్ బషీరుద్దీన్ (హైదరాబాద్), 3.మనీష్ (అనంతపురం), 3.వి.అవినాష్ (పశ్చిమ గోదావరి). 81 కేజీ: 1.కె.స్వామి (హైదరాబాద్), 2.కార్తీక్ (గుంటూరు), 3.శివ కుమార్ (నల్గొండ), 3.రవితేజ (కరీంనగర్). 91 కేజీ: 1. మహ్మద్ మోసిన్ (హైదరాబాద్), 2. కె.జగదీష్ (విశాఖపట్నం), 3.పి.శ్రీహరి (విజయనగరం), 3.వి.మన్దీప్ (రంగారెడ్డి). 91+ కేజీలు: 1.పునీత్ కుమార్ (విశాఖపట్నం), 2.ఉమామహేశ్వర్ (హైదరాబాద్). -
‘రింగ్’ నుంచి రిక్తహస్తాలతో...
అల్మాటీ (కజకిస్థాన్): వరుసగా మూడోసారి ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేస్తారనుకున్న భారత బాక్సర్లు నిరాశపరిచారు. బుధవారం ఇక్కడ జరిగిన పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్ బరిలో నిలిచిన ఐదుగురు భారత బాక్సర్లు శివ థాపా, మనోజ్ కుమార్, వికాస్ మలిక్, సుమీత్ సంగ్వాన్, సతీశ్ కుమార్ ఓడిపోయారు. ఫలితంగా ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి భారత బాక్సర్లు రిక్తహస్తాలతో తిరిగి వస్తున్నారు. 2009లో విజేందర్, 2011లో వికాస్ కృషన్ భారత్‌కు కాంస్య పతకాలను అందించారు. తొలిసారి ఈ మెగా ఈవెంట్లో ఒకేసారి భారత్ నుంచి ఐదుగురు భారత బాక్సర్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నా ఒక్కరు కూడా ఈ అడ్డంకిని అధిగమించలేకపోయారు. ఒకవేళ క్వార్టర్ ఫైనల్స్‌లో గెలిచిఉంటే కనీసం కాంస్య పతకం ఖాయవయ్యేది. 56 కేజీల విభాగంలో నాలుగో సీడ్ శివ థాపా 0-3 (27-30, 27-30, 27-30)తో జావిద్ చలాబియేవ్ (అజర్బైజాన్) చేతిలో... 60 కేజీల విభాగంలో వికాస్ మలిక్ 0-3 (28-29, 25-30, 27-30)తో నాలుగో సీడ్ రాబ్సన్ కాన్సికావో (బ్రెజిల్) చేతిలో ఓడిపోయారు. 64 కేజీల విభాగంలో ఆరో సీడ్ మనోజ్ కుమార్ 0-3 (27-30, 28-29, 26-30)తో యాస్నియెర్ లోపెజ్ (క్యూబా) చేతిలో... 81 కేజీల విభాగంలో సుమీత్ సంగ్వాన్ 0-3 (27-30, 28-29, 27-30)తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆదిల్బెక్ నియాజిమ్‌బెతోవ్ (కజకిస్థాన్) చేతిలో ఓటమి చవిచూశారు. ప్లస్ 91 కేజీ విభాగంలో గాయం కారణంగా సతీశ్ కుమార్ బరిలోకి దిగకుండా తన ప్రత్యర్థి ఇవాన్ దిచ్కో (కజకిస్థాన్)కు ‘వాకోవర్’ ఇచ్చాడు. -
మన ‘పంచ్’ అదిరింది
అల్మాటీ (కజకిస్థాన్): తమ పంచ్ పవర్‌ను కొనసాగిస్తూ... భారత బాక్సర్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో దూసుకెళ్తున్నారు. మంగళవారం జరిగిన మూడు బౌట్లలో భారత్‌కు చెందిన ముగ్గురు బాక్సర్లూ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. వికాస్ మలిక్ (60 కేజీలు), సుమీత్ సంగ్వాన్ (81 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) తమ ప్రత్యర్థులపై స్పష్టమైన విజయాలు నమోదు చేశారు. ఇప్పటికే శివ థాపా (56 కేజీలు), మనోజ్ కుమార్ (64 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్న భారత బాక్సర్ల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఒకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి ఐదుగురు బాక్సర్లు క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2011లో నలుగురు భారత బాక్సర్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా వికాస్ కృషన్ కాంస్య పతకాన్ని అందించాడు. భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్)పై సస్పెన్షన్ ఉన్న నేపథ్యంలో ఈ పోటీల్లో భారత బాక్సర్లు అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) పతాకం కింద పోటీపడుతున్నారు. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో వికాస్ మలిక్ 3-0 (30-27, 29-28, 29-28)తో ఐదో సీడ్ మిక్లాస్ వర్గా (హంగేరి)ను బోల్తా కొట్టించగా... సుమీత్ సంగ్వాన్ 3-0 (3-27, 30-27, 30-27)తో ఎనిమిదో సీడ్ సియారి నొవికౌ (బెలారస్)పై సంచలనం విజయం సాధించాడు. మరో బౌట్లో సతీశ్ కుమార్ 3-0 (29-28, 29-28, 29-28)తో యాన్ సుద్జిలౌస్కీ (బెలారస్)ను ఓడించాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఇవాన్ దిచ్కో (కజకిస్థాన్)తో సతీశ్; కాన్సికావో (బ్రెజిల్)తో వికాస్ మలిక్; నియాజిమ్‌బెతోవ్ (కజకిస్థాన్)తో సుమీత్; చలాబియెవ్ (అజర్బైజాన్)తో శివ థాపా; యాస్నియెర్ లోపెజ్ (క్యూబా)తో మనోజ్ కుమార్ తలపడతారు. -
ప్రి క్వార్టర్స్‌లో థాపా, నానో సింగ్
అల్మాటి (కజకిస్థాన్): యువ బాక్సర్ శివ థాపా, థోక్చోమ్ నానో సింగ్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ప్రిక్వార్టర్స్‌కు చేరారు. అయితే 2009 ఈవెంట్లో కాంస్యం నెగ్గిన విజేందర్ ఈసారి మాత్రం రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. విజేందర్ 79 కేజీ విభాగంలో ఐర్లాండ్‌కు చెందిన యూరోపియన్ చాంపియన్ జేసన్ క్విగ్లే చేతిలో ఓడిపోయాడు. తొలి రెండు బౌట్స్‌లో ఒక్కో పాయింట్ వెనుకబడిన విజేందర్ చివరి బౌట్లో హెచ్చరికకు గురయ్యాడు. మరోవైపు తొలి రౌండ్లో బై లభించిన నానో (49 కేజీ విభాగం) 3-0 తేడాతో స్కాట్లాండ్కు చెందిన అకీల్ అహ్మద్‌ను మట్టికరిపించాడు. నాలుగో సీడ్ శివ థాపా 56 కేజీ విభాగంలో ఫిలిపినో మారియో ఫెర్నాండెజ్‌ను ఓడిం చాడు. సోమవారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో నానో సింగ్ ఐదో సీడ్ ఆంటోనీ చకోన్ రివెరా (ప్యూర్టోరికో)తో, శివ థాపా అర్జెంటీనాకు చెందిన ఆల్బర్టో మెలియన్తో తలపడతారు. మన్‌ప్రీత్ (91కేజీ), మనోజ్ కుమార్ (64కేజీ) ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించారు.