న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ మాజీ రజత పతక విజేత, భారత బాక్సర్ సుమీత్ సాంగ్వాన్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) గురువారం ఏడాది నిషేధాన్ని విధించింది. గత అక్టోబర్ నెలలో అతని నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా... అందులో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో ఉన్న ‘ఎసిటజొలమైడ్’ ఉన్నట్లు తేలింది. దీంతో అతనిపై నిషేధం విధిస్తున్నట్లు ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ప్రకటించారు. దీంతో 91 కేజీల విభాగంలో ఒలింపిక్స్ అర్హత పోటీలకు నిర్వహించే ట్రయల్స్‌కు సుమీత్ దూరమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment