ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత బాక్సర్
బ్యాంకాక్: భారత బాక్సర్ నిశాంత్ దేవ్ పారిస్ విమానం ఎక్కనున్నాడు. ప్రతిష్టాత్మక విశ్వ క్రీడలకు అతను అర్హత సంపాదించాడు. మెగా ఈవెంట్‌కు ఆఖరి అర్హత టోర్నీ అయిన ‘వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్’లో నిశాంత్ పురుషుల 71 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరడం ద్వారా బెర్త్ దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అతను 5–0తో వాసిల్ సె»ొటరి (మాల్దొవా)పై ఏకపక్ష విజయం సాధించాడు.
మహిళల 60 కేజీల క్వార్టర్స్‌లో అంకుశిత 2–3తో అగ్నెస్ (స్వీడన్) చేతిలో ఓడి... అరుంధతి 1–4తో జెస్సికా (స్లొవేకియా) చేతిలో ఓడి ఒలింపిక్స్‌కు దూరమయ్యారు. పురుషుల 51 కేజీల ప్రిక్వార్టర్స్‌లో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంఘాల్ 5–0తో కిమ్ ఇంక్యూ (కొరియా)పై గెలిచి ‘పారిస్’కు అడుగు దూరంలో ఉన్నాడు.
57 కేజీల క్వార్టర్స్‌లో సచిన్ సివాచ్ 4–1 తో శామ్యూల్ కిస్తోహరీ (ఫ్రాన్స్)పై గెలిచి సెమీస్ చేరాడు. ఈ వెయిట్ కేటగిరీలో మూడు బెర్త్‌లు మాత్రమే ఉండటంతో సచిన్ ఫైనల్ చేరాలి లేదంటే ‘బాక్స్ ఆఫ్’ బౌట్‌లో గెలిస్తే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాడు. పురుషుల 92 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ సంజీత్ 0–5తో అల్ఫోన్సో (అజర్‌బైజాన్) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment