Nishant
-
నిశాంత్ దేవ్ 'పంచ్' మిస్.. క్వార్టర్స్‌లో ఓటమి
ప్యారిస్ ఒలింపిక్స్-2024 బాక్సింగ్‌లో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. శనివారం ఆర్ధరాత్రి జరిగిన పురుషుల 71 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ ఘోర పరాజయాన్ని చవిచూశాడు.మెక్సికో బాక్సర్ మార్కో వెర్డే అల్వారెజ్ చేతిలో 1-4 తేడాతో నిశాంత్ దేవ్ ఓటమి పాలయ్యాడు. మొదటి రౌండ్లో నిశాంత్ దూకుడుకనబరచినప్పటకి.. తర్వాతి మూడు రౌండ్లలో ప్రత్యర్ధి పుంజుకుని అద్భుత విజయం సాధించాడు. అంతకముందు మహిళల విభాగంలో భారత స్టార్ బాక్సర్, హైదరాబాదీ నిఖత్ జరీన్ సైతం ఇంటిముఖం పట్టింది.మహిళల 50 కేజీల ప్రి క్వార్టర్స్‌లో వు హు (చైనా) చేతిలో 0-5 తేడాతో జరీన్ ఓటమిపాలైంది. ఇప్పుడు వీరిద్దరి ఓటమితో బాక్సింగ్‌లో పతకంపై భారత్ ఆశలు స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ ప్రదర్శనపై ఆధారపడి ఉన్నాయి. ఆదివారం మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్లో లి కియాన్ (చైనా)తో లవ్లీనా తలపడనుంది. -
నిశాంత్ దేవ్‌కు పారిస్ ‘టికెట్’
బ్యాంకాక్: భారత బాక్సర్ నిశాంత్ దేవ్ పారిస్ విమానం ఎక్కనున్నాడు. ప్రతిష్టాత్మక విశ్వ క్రీడలకు అతను అర్హత సంపాదించాడు. మెగా ఈవెంట్‌కు ఆఖరి అర్హత టోర్నీ అయిన ‘వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్’లో నిశాంత్ పురుషుల 71 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరడం ద్వారా బెర్త్ దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అతను 5–0తో వాసిల్ సె»ొటరి (మాల్దొవా)పై ఏకపక్ష విజయం సాధించాడు. మహిళల 60 కేజీల క్వార్టర్స్‌లో అంకుశిత 2–3తో అగ్నెస్ (స్వీడన్) చేతిలో ఓడి... అరుంధతి 1–4తో జెస్సికా (స్లొవేకియా) చేతిలో ఓడి ఒలింపిక్స్‌కు దూరమయ్యారు. పురుషుల 51 కేజీల ప్రిక్వార్టర్స్‌లో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంఘాల్ 5–0తో కిమ్ ఇంక్యూ (కొరియా)పై గెలిచి ‘పారిస్’కు అడుగు దూరంలో ఉన్నాడు. 57 కేజీల క్వార్టర్స్‌లో సచిన్ సివాచ్ 4–1 తో శామ్యూల్ కిస్తోహరీ (ఫ్రాన్స్)పై గెలిచి సెమీస్ చేరాడు. ఈ వెయిట్ కేటగిరీలో మూడు బెర్త్‌లు మాత్రమే ఉండటంతో సచిన్ ఫైనల్ చేరాలి లేదంటే ‘బాక్స్ ఆఫ్’ బౌట్లో గెలిస్తే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాడు. పురుషుల 92 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ సంజీత్ 0–5తో అల్ఫోన్సో (అజర్బైజాన్) చేతిలో ఓడిపోయాడు. -
పారిస్ ఒలింపిక్స్‌కువిజయం దూరంలో...
బ్యాంకాక్: పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లను ఖరారు చేసుకోవడానికి భారత బాక్సర్లు అంకుశిత బోరో (60 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) విజయం దూరంలో నిలిచారు. వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో వీరిద్దరూ తమ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ యూత్ మాజీ చాంపియన్ అంకుశిత 4–1తో ఆసియా చాంపియన్ రిమా వొలోసెంకో (కజకిస్తాన్)పై నెగ్గగా... నిశాంత్ 5–0తో పీరాపట్ యెసుంగ్నోయెన్ (థాయ్‌లాండ్)ను చిత్తు చేశాడు. మహిళల 66 కేజీల విభాగంలో అరుంధతి 5–0తో స్టెఫానీ పీనీరో (ప్యూర్టోరికో)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. అయితే పురుషుల ప్లస్ 92 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో నరేందర్ 2–3తో గిల్మర్ కాంగో (ఈక్వడోర్) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే పురుషుల 57 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో బతుహాన్ సిఫ్టిసి (టర్కీ)తో సచిన్ సివాచ్... 51 కేజీల రెండో రౌండ్లో రూయిజ్ (మెక్సికో)తో అమిత్.. 92 కేజీల రెండో రౌండ్లో లూయిస్ (వెనిజులా)తో సంజీత్... మహిళల 57 కేజీల రెండో రౌండ్లో మసాతి (అజర్బైజాన్)తో జైస్మిన్ తలపడతారు. -
చాలా సింపుల్‌గా హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి!
విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కూతురు హయవాహిని వివాహం బంధంలోకి అడుగు పెట్టారు. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడు నిషాంత్‌తో కలిసి ఏడడుగులు వేశారు. గతేడాద అక్టోబర్‌లో ఎంతో సింపుల్‌గా వీరి నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు మహేశ్ బాబు, రానా, నాగచైతన్య తదితర హీరోలు హాజరై కాబోయే వధూవరులను ఆశ్వీర్వదించారు. ఇక శుక్రవారం(మార్చి 15) జరిగిన పెళ్లి వేడుకకి బయటి వారెవరెవరిని ఆహ్వానించలేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రామా నాయుడు స్టూడియోలో చాలా సింపుల్‌గా పెళ్లి జరిపించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, వెంకీ, నీరజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు. పెద్దమ్మాయి ఆశ్రితకు 2019లో పెళ్లి జరిగింది. -
నిశాంత్‌కు నిరాశ
బుస్టో అర్సిజియో (ఇటలీ): పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయింగ్ తొలి టోర్నమెంట్ నుంచి తొమ్మిది మంది భారత బాక్సర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. బరిలో మిగిలిన చివరి బాక్సర్ నిశాంత్ దేవ్ (71 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. అమెరికా బాక్సర్ ఒమారి జోన్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిశాంత్ 1–4తో ఓటమి చవిచూశాడు. మహిళల విభాగంలో భారత్ నుంచి ఇప్పటి వరకు నలుగురు బాక్సర్లు (నిఖత్ జరీన్, ప్రీతి పవార్, పర్విన్ హుడా, లవ్లీనా) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. మిగిలిన భారత బాక్సర్లకు ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందు రెండో అవ కాశం ఉంది. మే 23 నుంచి జూన్ 3 వరకు థాయ్‌లాండ్‌లో జరిగే చివరిదైన రెండో క్వాలిఫయింగ్ టోర్నిలో సెమీఫైనల్ చేరితే భారత బాక్సర్లకు ఒలింపిక్ బెర్త్‌లు లభిస్తాయి. -
‘పారిస్’ బెర్త్‌కు విజయం దూరంలో...
బుస్టో అర్సిజియో (ఇటలీ): పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు భారత బాక్సర్ నిశాంత్ దేవ్ విజయం దూరంలో నిలిచాడు. ఒలింపిక్స్ వరల్డ్ క్వాలిఫయింగ్ తొలి టోరీ్నలో 23 ఏళ్ల ఈ హరియాణా బాక్సర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నిశాంత్ 5–0తో క్రిస్టోస్ కరైటిస్ (గ్రీస్)పై గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో అమెరికా బాక్సర్ ఒమారి జోన్స్‌తో నిశాంత్ తలపడతాడు. ఈ బౌట్లో గెలిచి సెమీఫైనల్ చేరుకుంటే నిశాంత్‌కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారవుతుంది. ఈ క్వాలిఫయింగ్ టోరీ్నలో భారత్ నుంచి తొమ్మిది మంది బాక్సర్లు బరిలోకి దిగగా ఎనిమిది మంది తొలి రౌండ్లోనే ఓడిపోవడం గమనార్హం. ఇప్పటి వరకు భారత్ నుంచి కేవలం మహిళల విభాగంలో మాత్రమే నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), పర్వీన్ హుడా (57 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. -
నిశాంత్ ముందుకు... శివ, అంకుశిత ఓటమి
పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల విభాగంలో నిశాంత్ దేవ్ (71 కేజీలు) రెండో రౌండ్‌కు చేరగా... శివ థాపా (63.5 కేజీలు), మహిళల విభాగంలో అంకుశిత (66 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడారు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో నిశాంత్ 3–1తో లూయిస్ రిచర్డ్సన్ (బ్రిటన్)పై గెలిచాడు. ప్రపంచ చాంపియన్ రుస్లాన్ (ఉజ్బెకిస్తాన్) పంచ్‌ల ధాటికి శివ బౌట్ ఆరంభంలోనే చేతులెత్తేశాడు. అంకుశిత 2–3తో సొన్వికో ఎమిలీ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. -
తమ్ముడు జైలుకు వెళ్లాడని.. అవమానభారంతో చివరికి అన్న ఇలా..
నిజామాబాద్: చోరీ కేసులో తమ్ముడు అరైస్టె జైలుకు వెళ్లడంతో అవమానంగా భావించిన అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో గురువారం ఈ సంఘటన జరిగింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జంగంపల్లి గ్రామానికి చెందిన తిప్పని నిషాంత్ (23) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి తమ్ముడు నితిన్ చోరీ కేసులో 15 రోజుల క్రితం అరైస్టె జైలులో ఉన్నాడు. అప్పటి నుంచి నిషాంత్ అవమానభారంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన నిషాంత్ రాత్రి అయినా ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం పొలం వద్దకు వెళ్లగా అక్కడ నిషాంత్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. మృతుడి తండ్రి నర్సింలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
యువ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ: ఎప్పుడూ అవే పాటలా.. పాకెట్ ప్రపంచంలోకి
ప్రయాణంలో, తీరిక వేళల్లో ఎఫ్ఎంలో పాటలు వినడం సహజమే. ‘ఎప్పుడూ అవే పాటలు, అవే మాటలేనా’ అనుకుంటారు కొద్దిమంది. వారిలో రోహన్ నాయక్ ఒకరు. ఈ యువ ఇంజనీర్ తన స్నేహితులతో కలిసి బెంగళూరు కేంద్రంగా ప్రారంభించిన ‘పాకెట్ ఎఫ్ఎం’ వివిధ జానర్స్, వివిధ భాషలలో ఆకట్టుకునే ఆడియో సిరీస్‌లతో దూసుకుపోతుంది... కొన్నిసార్లు ఐడియాల కోసం వెదుక్కుంటూ వెళ్లనక్కర్లేకుండానే... అవే మనల్ని వెదుక్కుంటూ వస్తాయి. రోహన్ నాయక్ విషయంలోనూ అలాగే జరిగింది. ఇంటి నుంచి ఆఫీసుకు చేరుకోవడానికి చాలా టైమ్ పట్టేది. టైమ్‌పాస్ కోసం ఎఫ్‌ఎంలలో మ్యూజిక్ వినేవాడు. అయితే ఆ మ్యూజిక్ అదేపనిగా రిపీట్ కావడంతో బోర్‌గా ఉండేది. ‘భారతీయ భాషల్లో ఆడియో స్టోరీ టెల్లింగ్ ప్లాట్‌ఫామ్ ఉంటే బాగుండేది’ అనుకునేవాడు. ‘మనం కావాలనుకుంటున్నది కాలమే మన చేత చేయిస్తుంది’ అన్నట్లుగా ఆ ప్రయత్నానికి తానే శ్రీకారం చుట్టాడు రోహన్ నాయక్. ఐఐటీ–ఖరగ్‌పూర్ ఫ్రెండ్స్ ప్రతీక్ దీక్షిత్, నిశాంత్ కేఎస్లతో కలిసి ‘పాకెట్ ఎఫ్.ఎం’కు శ్రీకారం చుట్టాడు. మ్యూజిక్ కాకుండా ‘ఆడియో ఎంటర్టైన్మెంట్’ లక్ష్యంగా మొదలైన ఈ ఆడియో సిరీస్ ప్లాట్‌ఫామ్ అన్యూవలైజ్డ్ రెవెన్యూ రన్‌రేట్(ఏఆర్ఆర్)తో దూసుకుపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘ప్రస్తుతం శ్రోతలు సగటున రోజుకు వంద నిమిషాల సమయాన్ని వినడానికి వెచ్చిస్తున్నారు. మా యాప్ టోటల్ మంత్లీ ఆడియో స్ట్రీమింగ్‌లో ఎప్పటికప్పుడు వృద్ధి కనిపిస్తోంది’ అంటున్నాడు పాకెట్ ఎఫ్.ఎం. ఫౌండర్లలో ఒకరైన నిశాంత్. రొమాన్స్, హారర్, థ్రిల్లర్, ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్...అనేవి పాకెట్ ఎఫ్.ఎం.లో టాప్ జానర్లుగా ఉన్నాయి. ఎపిసోడ్లు 10–15 నుంచి 25–30 నిమిషాల వరకు ఉంటాయి. ‘పాకెట్ ఎఫ్.ఎం’ ఆడియో సెగ్మెంట్ సిరీస్‌లో కొన్ని హిట్ టైటిల్స్... యే రిష్తా కైసా హై(400 మిలియన్), లవ్ కాంట్రాక్ట్(200 మిలియన్), యక్షిణీ (195 మిలియన్), షూర్వీర్(129 మిలియన్)...మొదలైనవి. ‘పాకెట్ఎఫ్ఎం’లో 733 ఆడియో సిరీస్‌లతో పాటు ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి. గత అక్టోబర్‌లో ఆన్లైన్ రీడింగ్ ప్లాట్‌ఫామ్ ‘పాకెట్ నావెల్’కు శ్రీకారం చుట్టారు. ఇక శ్రోతల విషయానికి వస్తే 15 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరు, ముంబై, దిల్లీ, పుణె, హైదరాబాద్‌లు టాప్ 5 సిటీస్‌గా ఉన్నాయి. మరోవైపు చిన్న పట్టణాలలో కూడా ‘పాకెట్ఎఫ్ఎం’ పాపులర్ అవుతుంది. లాంగ్ ఫార్మట్ ఆడియో ఎంటర్టైన్మెంట్ సిరీస్ ద్వారా ఒటీటీ స్పేస్‌ను పునర్నిర్వచించే ప్రయత్నం చేస్తున్న ‘పాకెట్ ఎఫ్ఎం’ యాడ్–టెక్ ప్లాట్‌ఫామ్ ‘రియల్ టైమ్ యాడ్స్’ను తీసుకువచ్చింది. ‘పాకెట్ ఎఫ్ఎం విజయవంతం కావడంలో ఎఐ, ఎంఎల్ సాంకేతికత కీలక పాత్ర పోషించింది. శ్రోతల నాడి పసిగట్టడం, సంక్లిష్టమైన విషయాలను సరళం చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం... ఇలా ఎన్నో విషయాల్లో సాంకేతికత ఉపయోగపడింది’ అంటున్నాడు కంపెనీ సీటీవో ప్రతీక్ దీక్షిత్. కంపెనీకి లైట్‌స్పీడ్, టెన్సెంట్, టైమ్స్ ఇంటర్నెట్లాంటి కీ ఇన్వెస్టర్లు ఉన్నారు. ఇప్పుడు పాకెట్ ఎఫ్.ఎం. యూఎస్ మార్కెట్లోకి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ‘టీమ్ మెంబర్స్‌కు అద్భుతమైన శక్తి,సామర్థ్యాలు, అంకితభావం ఉన్నాయి’ అంటున్నాడు టాంగ్లిన్ వెంచర్ పార్ట్నర్స్కు చెందిన సంకల్ప్ గుప్తా. పాకెట్ ఎఫ్.ఎం.ను ‘నెట్‌ఫ్లిక్స్ ఆఫ్ ఆడియో వోటీటీ ప్లాట్‌ఫామ్స్’ గా తీర్చిదిద్దాలనేది ముగ్గురు విజేతల లక్ష్యం. పాకెట్ ఎఫ్.ఎం. విజయవంతం కావడంలో ఎఐ, ఎంఎల్ సాంకేతికత కీలక పాత్ర పోషించింది. శ్రోతల నాడి పసిగట్టడం, సంక్లిష్టమైన విషయాలను సరళం చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం... ఇలా ఎన్నో విషయాల్లో సాంకేతికత ఉపయోగపడింది. – ప్రతీక్ దీక్షిత్ -
502 అడుగుల ఎత్తులో చేజారిన పరిస్థితులు.. ట్రైనీ పైలట్‌ను తప్పించి ప్రాణత్యాగం
2020 నవంబర్ 26.. గోవా సాగరజలాల్లో ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి.. రయ్‌మంటూ గాల్లోకి మిగ్–29కి చెందిన మిగ్ 677 యుద్ధ విమానం దూసుకెళ్లింది. కొత్తగా నౌకాదళంలో చేరిన వారికి యుద్ధ విమానాలు నడిపే అంశంపై శిక్షణలో భాగంగా.. మిగ్ 677 విమానాన్ని అత్యంత అనుభవజ్ఞుడైన కమాండర్ నిశాంత్ సింగ్ నడుపుతూ కోపైలట్‌కు శిక్షణ అందిస్తున్నారు. 1500 గంటలకు పైగా.. మిగ్ విమానాల్ని నడిపిన అనుభవం ఉన్న నిశాంత్.. శిక్షణ అందిస్తున్న సమయంలో సాయంత్రం 4.27 గంటల సమయంలో మిగ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఒక్కసారిగా తలెత్తిన ఈ హఠాత్పరిణామం నుంచి తప్పించుకునేందుకు నిశాంత్ తన శాయశక్తులా ప్రయత్నించారు. 15 వేల అడుగుల ఎత్తు నుంచి అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ.. కిందకి వస్తూ ఉన్నారు. దాదాపు 502 అడుగుల ఎత్తులో పరిస్థితులు చేజారిపోయినట్లు గుర్తించారు. వెంటనే ట్రైనీ పైలట్ ను విమానం నుంచి తప్పించేసిన నిశాంత్.. తన ప్రాణాల్ని మాత్రం కాపాడుకోలేక దేశం కోసం తుదిశ్వాస విడిచారు. అందుకే నిశాంత్‌కు శౌర్య పతకం వరించింది. 2021.. సెప్టెంబర్ 26.. ఉదయం 8 గంటలు.. జమ్మూకాశ్మీర్‌లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న 14 రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్ సెక్టార్–3లోని ఒక ఇంట్లో ఉగ్రవాదులున్నట్లు గుర్తించారు. వెంటనే మార్కోస్ బృందానికి సమాచారం అందించారు. వినీత్‌కుమార్‌తో సహా మార్కోస్ బృందం ఉగ్రవాదులున్న ఇంటి వద్దకు చేరుకుంది. ఖాన్ మొహల్లా, వాట్రినా అనే ఇద్దరు ఉగ్రవాదులున్న ఇంటికి ఎదురుగా ఉన్న ఇల్లుని మార్కోస్ బృందం ఆక్రమించింది. ఉగ్రవాదులు నేరుగా కాల్పులు జరిపేందుకు వీలుగా ఉన్న ఇంటి పైకప్పుపైకి ప్రమాదం అని తెలిసినా.. టెర్రరిస్టుల్ని మట్టుపెట్టడమే లక్ష్యంగా వినీత్‌కుమార్, మనీష్ చౌహాన్ పైకి వెళ్లారు. 9.30 గంటల సమయంలో టెర్రరిస్టులు గ్రానైడ్లతో దాడి చేయడంతో పాటు ఏకకాలంలో ఫైరింగ్ చేశారు. ఈ క్రమంలో రైఫిల్ మ్యాన్ మనీష్ చౌహాన్‌కు గాయాలయ్యాయి. గ్రానైడ్ పేలుడుతో వచ్చిన అగ్ని కీలల నుంచి తప్పించుకున్న వినీత్‌కుమార్.. ఉగ్రవాదుల్ని ట్రాక్ చేస్తూ.. వారున్న ఇంటిపైకి దూసుకెళ్లారు. ఫైరింగ్ తర్వాత రెండు గంటల పాటు మౌనంగా ఉన్న టెర్రరిస్టులు మరోసారి దాడికి ప్రయత్నించారు. ఈలోపునే.. వారిని ట్రాక్ చేసుకున్న వినీత్‌కుమార్.. ప్రాణాలకు తెగించి.. ఉగ్రవాదులపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు. ఉగ్రమూకల నుంచి దేశాన్ని రక్షించేందుకు ధైర్య సాహసాల్ని ప్రదర్శించిన వినీత్కుమార్కు అత్యుత్తమమైన శౌర్య పతకం(గ్యాలంట్రీ మెడల్) వరించింది. ఇలా ఒక్కొక్కరిదీ.. ఒక్కో విజయగాధ.. శత్రుదేశాల నుంచి దేశాన్ని రక్షిస్తూ.. పౌరులు జీవితాలు ప్రశాంతంగా సాగేందుకు శ్రమిస్తున్న నౌకాదళ అధికారులు, సిబ్బంది ధైర్య సాహసాలకు గుర్తింపుగా అత్యుత్తమ సేవా పతకాలతో ఇండియన్ నేవీ సత్కరించింది. 33 మందికి శౌర్య, నవ్‌సేనా, విశిష్ట సేవా, కెప్టెన్ రవిధీర్ మెమొరియల్, లెఫ్టినెంట వీకే జైన్ మెమోరియల్ గోల్డ్ మెడల్స్, జీవన్ రక్షా పదక్ అవార్డులను భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖలో నేవల్ ఇన్వెస్టిచర్ సెరమనీ –2023ని బుధవారం ఘనంగా నిర్వహించారు. నౌకాదళాధికారులు, సెయిలర్స్, యుద్ధ నౌకలు, సబ్మైరెన్ల సారధులు, నేవీ కుటుంబాల సమక్షంలో పతకాల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ హితంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ నౌకల నిర్వహణ సాగిస్తున్న విశాఖలోని నేవల్ డాక్‌యార్డు... బెస్ట్ గ్రీన్ ప్రాక్టీస్–2023 ఇండస్ట్రియల్ విభాగంలో సీఎన్ఎస్ ట్రోఫీని దక్కించుకుంది. – సాక్షి, విశాఖపట్నం -
ఫైనల్లో బెర్త్ కోసం బరిలో భారత బాక్సర్లు
World Boxing Championships 2023: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నేడు ముగ్గురు భారత బాక్సర్లు కీలకపోరుకు సిద్ధమయ్యారు. తెలంగాణకు చెందిన హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణాకు చెందిన దీపక్ భోరియా (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) సెమీఫైనల్ బౌట్లలో పోటీపడనున్నారు. 2022 యూరోపియన్ చాంపియన్ బిలాలా బెనామా (ఫ్రాన్స్)తో దీపక్; సైడెల్ హోర్టా (క్యూబా)తో హుసాముద్దీన్; 2022 ఆసియా చాంపియన్ అస్లాన్‌బెక్ షింబెర్జనోవ్ (కజకిస్తాన్)తో నిశాంత్ దేవ్ తలపడతారు. సెమీఫైనల్లో గెలిస్తే ఫైనల్ చేరి స్వర్ణ–రజత పతకాల బరిలో ఉంటారు. ఓడితే కాంస్య పతకాన్ని గెల్చుకుంటారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం గం. 5:30కు దీపక్ బౌట్ ఉంది. ఆ తర్వాత హుసాముద్దీన్, నిశాంత్ దేవ్ బౌట్లు జరుగుతాయి. ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ఈ బౌట్లను ప్రత్యక్షంగా తిలకించవచ్చు. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ నుంచి ఒక్కరే ఫైనల్‌కు అర్హత సాధించారు. 2019లో అమిత్ పంఘాల్ (52 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకం గెల్చుకున్నాడు. -
బాక్సర్ నిశాంత్ దేవ్ సంచలనం
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ సంచలన విజయంతో శుభారంభం చేశాడు. తాష్కెంట్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో బుధవారం జరిగిన 71 కేజీల తొలి రౌండ్ బౌట్లో నిశాంత్ దేవ్ 5–0తో సర్ఖాన్ అలియెవ్ (అజర్బైజాన్)పై గెలుపొందాడు. 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిశాంత్ దేవ్ క్వార్టర్ ఫైనల్ చేరగా... ఇదే టోర్నీలో అలియెవ్ కాంస్య పతకం సాధించాడు. Madrid Open:: ప్రపంచ నంబర్‌వన్ జోడీకి బోపన్న ద్వయం షాక్ రెండు నెలల వ్యవధిలో రెండోసారి ప్రపంచ నంబర్‌వన్ జోడీని బోల్తా కొట్టిస్తూ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 6–3, 6–2తో ప్రపంచ నంబర్‌వన్ వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) ద్వయంపై గెలిచింది. మార్చిలో ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ ఫైనల్లో కూలాఫ్–స్కప్‌స్కీ జంటను ఓడించి బోపన్న ద్వయం విజేతగా నిలిచింది. -
క్వార్టర్ ఫైనల్లో సంజీత్, నిశాంత్ ఓటమి
World Boxing Championship.. ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సంజీత్ (92 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. బెల్గ్రేడ్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో సంజీత్ 0–5తో అజీజ్ మొహియుద్దీన్ (ఇటలీ) చేతిలో... నిశాంత్ 1–4తో వాదిమ్ ముసయెవ్ (రష్యా) చేతిలో ఓడారు. 54 కేజీల విభాగంలో నేడు జరిగే సెమీఫైనల్లో భారత బాక్సర్ ఆకాశ్ కుమార్ కజకిస్తాన్‌కు చెందిన మక్మూద్ సమీర్‌ఖాన్‌తో తలపడనున్నాడు. -
క్వార్టర్స్‌లో సంజీత్, నిశాంత్
బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఒకవైపు నిశాంత్ దేవ్ (71 కేజీలు), సంజీత్ (92 కేజీలు) అద్భుత విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరగా... మరోవైపు రోహిత్, ఆకాశ్, సుమిత్, దీపక్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్‌ల్లో నిశాంత్ దేవ్ 3–2తో మార్కో అల్వారెజ్ వెర్డె (మెక్సికో)పై, సంజీత్ (92 కేజీలు) 4–1తో జియోర్జి చిగ్లాడ్జె (జార్జియా)పై గెలుపొందారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రోహిత్ (భారత్) 1–4తో సెరిక్ (కజకిస్తాన్) చేతిలో.... ఆకాశ్ సాంగ్వాన్ (67 కేజీలు) 0–5తో కెవిన్ బ్రౌన్ (క్యూబా) చేతిలో ... సుమిత్ (75 కేజీలు) 0–5తో యోన్లిస్ (క్యూబా) చేతిలో... దీపక్ 0–5తో సాకెన్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
నాన్న భుజాలపై బంగారు కొండ
కడుపులో ఉన్న ఆడపిల్ల పుట్టేలోపే ఆ శిశువును కడుపులోనే చంపేయాలన్న ఆలోచన పుడుతున్న సమాజం ఇది. అటువంటిది.. తన కూతురికి ఇరవై ఏళ్ల వయసు వచ్చేవరకు వైద్యం చేయిస్తూనే ఉండాలని తెలిసి కూడా ఆ తండ్రి ఏ మాత్రం తన కన్నబిడ్డను నిర్లక్ష్యం చేయకుండా ఆమెను చదివించడానికి భుజాలపై మోస్తూ కొండ ఎక్కి దిగుతూ ఉన్నాడంటే.. అతడిని ఆదర్శంగా చెప్పుకోవలసిందే. ఆ తండ్రి నిశాంత్. ఆ కూతురు నియా. వారిది కేరళ. నియా ఒకటో తరగతి చదువుతోంది. ఏడేళ్ల వయసు. ఆ వయసు పిల్లలకు ఉదయాన్నే పళ్లు తోముకోవడం, పాలు తాగటం, చొక్కా గుండీలు పెట్టుకోవటం వంటి విషయాలు అతి సులభం. కాని నియాకు ఈ పనులు చేయటానికి ఇతరుల సహాయం కావాలి. కారణం.. నియా సెరిబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతోంది. దాదాపుగా అచేతన స్థితి. అయినప్పటికీ, తన బిడ్డను చదివించాల్సిందేనని నిశాంత్ ప్రతి రోజూ ఆమెను మెడ మీద ఎక్కించుకుని తాము ఉంటున్న వేనాడ్ నుంచి ఒక కిలోమీటరు మేర ‘ట్రెక్కింగ్’ చేసి, ఆమెను పాఠశాలకు చేర్చుతాడు. ఇంటికి వచ్చేటప్పుడూ అంతే. మళ్లీ అంత మేరా కొండలు, గుట్టలు దిగడం. ‘‘ఈ ప్రాంతమంతా రాళ్లగుట్టలతో నిండి ఉన్నప్పటికీ, ఇక్కడ గ్రామ ప్రజలు ఆర్థికంగా పేదవారు కావటం వల్ల, ఎక్కడికైనా నడిచే వెళ్తారు. నాకు వచ్చే చాలీచాలని డబ్బుతో, మేం ముగ్గురం ఏదో తినగలుగుతున్నాం. అలాగే నియాకు కావలసిన మందులు కొనగలుగుతున్నాను’’ అంటాడు నిశాంత్. అతడు ఆటోడ్రైవర్. తాముండే కురవ కాలనీ సమీపంలో ఉన్న చెంగుత్తాయ ప్రాంతానికి ఆటో నడుపుతాడు. కూతురికి ఎప్పుడూ దగ్గరగా ఉండటం కోసం ఎన్నో ఉద్యోగాలను విడిచిపెట్టేశాడు. నియాను ఇంటికి పరిమితం చేయకుండా, స్కూల్‌కి తీసుకువెళ్లటం కోసమే ఆటో నడుపుతున్నాడు. నియాకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడు సెరిబ్రెల్ పాల్సీ బయటపడింది. కొండ ఎక్కి దిగాల్సిందే నియా చదువుతున్న పాఠశాల ఇంటి నుంచి ఐదు కి.మీ. దూరంలో ఉంటుంది. ఉదయం ఎనిమిదిన్నరకు ఇంటి దగ్గర బయలుదేరి, ఒక కిలోమీటరు మేరకు కూతుర్ని భుజాలపై ఎక్కించుకుని ట్రెకింగ్ చేసి, అక్కడ నుంచి ఆటోలో ఆమెను స్కూల్‌కి తీసుకువెళ్తాడు. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా నడుస్తాడు. ఆమెను స్కూల్లో దింపేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఆటో నడిపి మళ్లీ సాయంత్రం నాలుగూ ముప్పైకి స్కూల్ విడిచే సమయానికి నియాను ఎక్కించుకుని వస్తాడు. అక్కడితో ముగిసిపోదు నిశాంత్ ప్రయాణం. అక్కడ నుంచి ఆటోలో తీసుకువచ్చి, మళ్లీ ఒక కిలోమీటరు ట్రెకింగ్ చేయాల్సిందే. ఏదేమైనా ఆరు గంటల లోపు ఇల్లు చేరుకోవాలి. ‘‘ఆలస్యమైతే, ఆ చీకట్లో క్రూర జంతువులు మా మీద పడి చంపేసే అవకాశం ఉంది’’ అంటాడు నిశాంత్. అతను సంపాదించే దానిలో చాలావరకు కూతురు ఫిజియోథెరపీకే ఖర్చు అవుతుంది. ఆమె కోసం ఇప్పటివరకు 1.5 లక్షలు అప్పు చేశాడు. తిరిగి తీర్చటం చాలా కష్టంగా ఉంది. అప్పటికీ బ్యాంకు అధికారులు వడ్డీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అయినా అసలు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాడు నిశాంత్. ‘కష్టపడుతూనే ఉంటా’ నియా పరిస్థితి గమనించిన ఆ స్కూల్ హెడ్మాస్టర్ థామస్ జాకబ్ క్రౌడ్ ఫండింగ్‌కి ఆన్లైన్లో దాతలకు విజ్ఞప్తి చేశారు. కొద్దికొద్దిగా డబ్బు అందుతోంది. రెండు నెలల క్రితం నియా కండరాలకు ఒక ఆపరేషన్ జరిగింది. ఆమెను చూసిన డాక్టర్లు, ‘‘నియాకు క్రమం తప్పకుండా వైద్యం చేయిస్తూంటే, ఆమెకు పద్దెనిమిదీ ఇరవై ఏళ్లు సంవత్సరాలు వచ్చేసరికి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అవుతుంది’’ అంటున్నారు. ‘‘నా బిడ్డను ఆరోగ్యవంతురాలిని, విద్యావంతురాలిని చేయడానికి నేను నిరంతర పోరాటం చేస్తూనే ఉంటాను. ఆమె తనకై తను స్వేచ్ఛగా తిరిగేంత వరకు కష్టపడుతూనే ఉంటాను’’ అన్నాడు నిశాంత్. నియా తల్లి గృహిణి. బిడ్డ కోసం బయట తండ్రి ఎంత చేస్తున్నాడో.. ఇంట్లో ఆమె అంతా చేస్తోంది. – జయంతి -
‘బ్రహ్మోస్’ గూఢచారికి రిమాండ్
నాగ్‌పూర్: గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంజినీర్ నిశాంత్ అగ్రవాల్‌కు కోర్టు 3 రోజుల రిమాండ్ విధించింది. బ్రహ్మోస్ క్షిపణికి చెందిన రహస్యాలను పాకిస్తాన్‌కు అందజేస్తున్నాడని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీసీ) సోమవారం నిశాంత్‌ను అదుపులోకి తీసుకుంది. అతడిని మంగళవారం ఫస్ట్‌క్లాస్ జూనియర్ మెజిస్ట్రేట్ జోషి ఎదుట హాజరు పరిచింది. ఇస్లామాబాద్‌కు చెందిన నేహా శర్మ, పూజా రంజన్ అనే పేర్లతో ఉన్న ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా నితీశ్ పాక్ నిఘా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కోర్టుకు తెలిపింది. లక్నోకు తరలించి విచారణ చేపట్టేందుకు అనుమతివ్వాలని కోరింది. దీంతో మెజిస్ట్రేట్ మూడు రోజుల రిమాండ్‌కు అనుమతించారు. -
అమ్మాయి నచ్చింది
‘పెళ్లికాని ప్రసాద్’ చిత్రం ఫేమ్ సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అమ్మాయి నచ్చింది’. సాయిరోనక్, నిశాంత్, ఇషానియా, రితిక హీరో హీరోయిన్లు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అజయ్ కుమార్ క్లాప్ ఇవ్వగా, చంద్ర కెమెరా స్విచ్చాన్ చేశారు. సమర్పకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘బిచ్చగాడు’ వంటి భారీ హిట్ చిత్రం తర్వాత ప్రతిభ ఉన్న కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నెలలో ఐదు సినిమాలు మొదలు పెడుతున్నాం. వాటిలో తొలి చిత్రం ‘అమ్మాయి నచ్చింది’. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘వినోదంతో నిండిన ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రమిది. ఇద్దరు హీరోలు, హీరోయిన్లతో పాటు ‘వెన్నెల’ కిశోర్ పాత్ర కీలకం. ఐదుమంది మధ్య సాగే ఈ ప్రేమకథలోని ట్విస్ట్ ఏంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 40 రోజులు కాశ్మీర్లో, తొమ్మిది రోజులు హైదరాబాద్‌లో చిత్రీకరణ జరపనున్నాం. దీంతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది’’ అన్నారు. హీరో, హీరోయిన్లు, చిత్ర సంగీతదర్శకుడు ‘మంత్ర’ ఆనంద్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ మాచినేని. -
పురుషోత్తంరెడ్డి కేసులో నిశాంత్‌రెడ్డికి ఊరట
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు లో నిందితునిగా ఉన్న గడ్డం నిశాంత్‌రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. చార్జిషీట్ దాఖలు చేసేంత వరకు ఏసీబీ అధికారుల ముందు ప్రతీ సోమ, బుధ వారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5లోపు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పురుషోత్తంరెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అతని సమీప బంధువైన నిశాంత్‌రెడ్డి (పురుషోత్తంరెడ్డి అల్లుడు నిపుణ్‌రెడ్డి సోదరుడు)ని నిందితునిగా చేర్చారు. పురుషోత్తంరెడ్డితో ఓ ఆస్తి అభివృద్ధికి సంబంధించి ఒప్పందం చేసుకున్నారని, పురుషోత్తంరెడ్డి డబ్బును దాచేందుకే ఇలా చేశారంటూ గత నెల 9న నిశాంత్‌రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. పురుషోత్తంరెడ్డి ఆస్తులకు సంబంధించి నిశాంత్‌రెడ్డిని పలు రకాలుగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నిశాంత్‌రెడ్డి హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనను ఏసీబీ అధికారులు ప్రశ్నించడం పూర్తయిన దరమిలా బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును కోరగా షరతులతో బెయిల్ మంజూరు చేసింది. -
ఉప్మా హాట్‌బాక్సుల్లో రూ.1.29 కోట్లు
న్యూఢిల్లీ: ఉప్మా ముసుగులో దుబాయ్‌కు రూ.1.29 కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను పుణే విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పుణే నుంచి దుబాయ్ వెళ్తున్న నిషాంత్ అనే వ్యక్తి డాక్యుమెంట్లు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు అతని లగేజ్‌ను తనిఖీ చేశారు. లగేజ్‌లో హాట్‌బాక్సు ఉండాల్సిన బరువుకంటే అధికంగా ఉండడంతో పరిశీలించగా..ఉప్మా కింద 86,600 అమెరికా డాలర్లు, 15,000 యూరోలు బయటపడ్డాయి. దుబాయ్‌కి అదే విమానంలో వెళ్తున్న ఓ మహిళ లగేజ్ నుంచి ఉప్మా హాట్బాక్సులో దాచిన 86,200 డాలర్లు, 15,000 యూరోలను స్వాధీనం చేసుకున్నారు. -
అమ్మాయిల గదిలోకి వెళ్లి హంగామా...
అంబర్‌పేట: తప్పతాగి ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి రాత్రి వేళ అమ్మాయిల గదిలోకి వెళ్లి హంగామా సృష్టించాడు. సోమవారం అంబర్‌పేట ఎస్ఐ మహిపాల్ తెలిపిన వివరాల ప్రకారం... గోల్నాక శంకర్‌నగర్‌కు చెందిన ధృవకుమార్ ఇంట్లో నలుగురు అమ్మాయిలు గది అద్దెకు తీసుకొని ఉంటూ చదువుకుంటున్నారు. ధృవకుమార్ కుమారుడు నిషాంత్(25) సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆదివారం రాత్రి 11.30 ప్రాంతంలో తప్పతాగి ఉన్న నిషాంత్ అమ్మాయిల గదిలోకి చొరబడి అనుచితంగా ప్రవర్తించాడు. అమ్మాయిలు పెద్దగా కేకలు వేస్తూ ఇరుగుపొరుగు వారిని పిలించారు. వారు నిషాంత్‌ను మందలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిషాంత్‌పై నిర్భయ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
బాబాయే... కాలయముడు
ఖమ్మం క్రైం/ గూడూరు : వరుసకు బాబాయి అయిన వ్యక్తే ఆ బాలుడి పాలిట కాలయముడయ్యాడు. ముక్కు పచ్చలారని బాలుడిని అతి కిరాతకంగా మెడకు బెల్టు బిగించి చనిపోయేంతవరకు అదిమిపట్టి..కొట్టి దారుణంగా హత్య చేశాడు. గూడూరు మండలం గంటలమ్మపాలెంకు చెందిన చండిక కిషోర్‌కుమార్, కోమలాదేవి దంపతులు హైదరాబాద్‌లోని చింతల్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కోమలాదేవి చెల్లెలు దేవిసాయి ఖమ్మంలో నివసిస్తోంది. ఆమెకు 15వ తేదీన శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉండటంతో పరిచర్యల కోసం కోమలాదేవి తన నాలుగేళ్ల కుమారుడు నిషాంత్‌తో కలిసి ఖమ్మంలోని ఆస్పత్రికి వెళ్లింది. అయితే నిషాంత్ సాయివర్మ(4) అలియాస్ వడ్డీ ఈనెల 11న కిడ్నాప్‌నకు, అదే రోజు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ మృతదేహం 14వ తేదీన నగర శివార్లలో లభించింది. నగరం నడిబొడ్డున జరిగిన ఈ సంఘటన రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుటుంబ కలహాలతో బాలుడి బాబాయే హత్య చేశాడని ఎస్పీ ఏవీ.రంగనాథ్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నిషాంత్ తల్లి కోమలాదేవి ఆస్పత్రిలో ఉన్న తన చెల్లి దేవిసాయిని పలకరించేందుకు బాలుడిని తీసుకుని ఖమ్మం వచ్చింది. అయితే అప్పటికే దేవిసాయికి, ఆమె భర్త మధుకు మధ్య కుటుంబ పరంగా తగాదాలున్నాయి. తన భార్య తనతో సఖ్యతగా ఉండడం లేదని.. దీనికి ఆమె అక్కే కారణమని భావించాడు. భార్యపై ఉన్న కోపంతో నిషాంత్సాయివర్మను హత్య చేయాలన్న ఉద్దేశంతో ఉన్న మధు.. తన కారులో ఆస్పత్రి నుంచి అతని తల్లికి తెలియకుండా బయటకు తీసుకెళ్లాడు. టూటౌన్ పోలీసు స్టేషన్ సమీపం నుంచి బాలపేట బైపాస్ రోడ్డు పొదల్లోకి తీసుకెళ్లాడు. బాలుడిని కారులోనే బెల్టుతో మెడకు బిగించి గట్టిగా లాగడంతో పాటు బాగా కొట్టి గొంతు నులిమాడు. దీంతో బాలుడు చనిపోయాడు. మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడేసి వెళ్లిన మధు.. ఆ తర్వాత తన మీదకు అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో అతని మిత్రుడు కిషోర్, బాలాజీ అనే డ్రైవర్ సహకారంతో బాలుడి మృతదేహాన్ని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించి పాతిపెట్టాలని ప్రయత్నించాడు. ఇందుకోసం వారికి రూ.1.50 లక్షలు ముట్ట జెప్పాడు. బాలుడి కిడ్నాప్ వ్యవహారంలో పోలీసుల నిఘా ఎక్కువ ఉండడంతో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 14న బాలపేట ముళ్ల పొదల్లో బాలుడి మృతదేహం బయట పడింది. ఈ సందర్భంగా వారం రోజుల్లో ఈ కేసును చేధిస్తామని చెప్పిన పోలీసులకు అస్పత్రి వద్ద ఉన్న సీసీ కెమెరా, వైరా రోడ్డులో ఉన్న మరో సీసీ కెమెరా నిందితుడిని పట్టించాయి. మధు.. నిషాంత్‌ను కారులో తీసుకెళ్తుండగా ఆస్పత్రి సీసీ కెమెరాలో నిక్షిప్తం కావడంతో పాటు వైరా రోడ్డులోని కెమెరాలో అతని కారు వెళ్తుండడం నిక్షిప్తమైంది. దీని ఆధారంగా పోలీసులు అతన్ని విచారించడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మధుతో పాటు అతని మిత్రుడు కిషోర్‌ను అరెస్టు చేశామని, మరో నిందితుడు డ్రైవర్ పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసును చేధించిన ఖమ్మం డీఎస్పీ బాలకిషన్, టూటౌన్ సీఐ సారంగపాణి, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.