క్వార్టర్ ఫైనల్లో నిశాంత్ దేవ్
బుస్టో అర్సిజియో (ఇటలీ): పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు భారత బాక్సర్ నిశాంత్ దేవ్ విజయం దూరంలో నిలిచాడు. ఒలింపిక్స్ వరల్డ్ క్వాలిఫయింగ్ తొలి టోరీ్నలో 23 ఏళ్ల ఈ హరియాణా బాక్సర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నిశాంత్ 5–0తో క్రిస్టోస్ కరైటిస్ (గ్రీస్)పై గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో అమెరికా బాక్సర్ ఒమారి జోన్స్‌తో నిశాంత్ తలపడతాడు.
ఈ బౌట్‌లో గెలిచి సెమీఫైనల్ చేరుకుంటే నిశాంత్‌కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారవుతుంది. ఈ క్వాలిఫయింగ్ టోరీ్నలో భారత్ నుంచి తొమ్మిది మంది బాక్సర్లు బరిలోకి దిగగా ఎనిమిది మంది తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం గమనార్హం. ఇప్పటి వరకు భారత్ నుంచి కేవలం మహిళల విభాగంలో మాత్రమే నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), పర్వీన్ హుడా (57 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు.
Comments
Please login to add a commentAdd a comment