నిశాంత్‌ ముందుకు... శివ, అంకుశిత ఓటమి | Mixed results for Indian boxers | Sakshi

నిశాంత్‌ ముందుకు... శివ, అంకుశిత ఓటమి

Mar 7 2024 12:27 AM | Updated on Mar 7 2024 12:27 AM

Mixed results for Indian boxers - Sakshi

పారిస్‌ ఒలింపిక్స్‌ బాక్సింగ్‌ వరల్డ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల విభాగంలో నిశాంత్‌ దేవ్‌ (71 కేజీలు) రెండో రౌండ్‌కు చేరగా... శివ థాపా (63.5 కేజీలు), మహిళల విభాగంలో అంకుశిత (66 కేజీలు) తొలి రౌండ్‌లోనే ఓడారు.

ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో నిశాంత్‌ 3–1తో లూయిస్‌ రిచర్డ్‌సన్‌ (బ్రిటన్‌)పై గెలిచాడు. ప్రపంచ చాంపియన్‌ రుస్లాన్‌ (ఉజ్బెకిస్తాన్‌) పంచ్‌ల ధాటికి శివ బౌట్‌ ఆరంభంలోనే చేతులెత్తేశాడు. అంకుశిత 2–3తో సొన్‌వికో ఎమిలీ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement