PC: INSIDE Sport
ప్యారిస్ ఒలింపిక్స్‌లో పదో రోజు భారత క్రీడాకారుల షెడ్యూల్ ఇదే..
రెజ్లింగ్
మహిళల 68 కేజీల ఫ్రీస్టయిల్ ప్రిక్వార్టర్స్: నిషా దహియా వర్సెస్ సోవా రిజ్కో (ఉక్రెయిన్) (సాయంత్రం గం. 6:30 నుంచి)
టెబుల్ టెన్నిస్
మహిళల జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్: భారత్ వర్సెస్ రొమేనియా (మధ్యాహ్నం గం. 1:30 నుంచి)
సెయిలింగ్
మహిళల డింగీ రేసులు: (మధ్యాహ్నం గం. 3:45 నుంచి). పురుషుల డింగీ రేసులు: (సాయంత్రం గం. 6:10 నుంచి)
అథ్లెటిక్స్
మహిళల 400 మీటర్ల పరుగు తొలి రౌండ్: కిరణ్ పహల్ (హీట్ 5) (మధ్యాహ్నం గం. 3:57 నుంచి).
పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ తొలి రౌండ్: అవినాశ్ సాబ్లే (హీట్ 2) (రాత్రి గం. 10:50 నుంచి)
బ్యాడ్మింటన్
పురుషుల సింగిల్స్ కాంస్య పతక పోరు: లక్ష్యసేన్ వర్సెస్ లీ జీ జియా (మలేసియా) (సాయంత్రం గం. 6:00
షూటింగ్
స్కీట్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్: మహేశ్వరి చౌహాన్ఠ్
అనంత్ జీత్ సింగ్ నరుకా (మధ్యాహ్నం
గం. 12:30 నుంచి). ఫైనల్ (అర్హత సాధిస్తే): సాయంత్రం గం. 6:30 నుంచి.
లవ్లీనా పంచ్ సరిపోలేదు
విశ్వక్రీడల్లో భారత బాక్సర్లకు నిరాశ ఎదురైంది. ఆరుగురు బాక్సర్లతో పారిస్‌లో అడుగు పెట్టిన భారత బృందం.. రిక్త హస్తాలతో తిరిగి రానుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బొర్గోహైన్ ఈసారి ఆకట్టుకోలేకపోయింది.
ఆదివారం జరిగిన మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ లవ్లీనా 1–4తో లీ కియాన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. బౌట్ ప్రారంభం నుంచే చైనా బాక్సర్ లెఫ్ట్ హుక్స్‌తో విరుచుకుపడగా.. వాటిని తప్పించుకుంటూ లవ్లీనా కొన్ని మంచి పంచ్‌లు విసిరింది.
అయినా తొలి రౌండ్ కియాన్‌కు అనుకూలంగా ఫలితం వచి్చంది. ఆ తర్వాత లవ్లీనా పుంజుకునేందుకు ప్రయతి్నంచినా ఫలితం లేకపోయింది. పంచ్‌ల ధాటి నుంచి నేర్పుగా తప్పించుకున్న కియాన్... కీలక సమయాల్లో జాబ్స్, హుక్స్‌తో పైచేయి సాధించింది. భారత్ నుంచి పారిస్ క్రీడలకు ఆరుగురు బాక్సర్లు అర్హత సాధించగా.. అందరూ క్వార్టర్ ఫైనల్లోపే పరాజయం పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment