క్వార్టర్ ఫైనల్లో అంకుశిత, నిశాంత్
బ్యాంకాక్: పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లను ఖరారు చేసుకోవడానికి భారత బాక్సర్లు అంకుశిత బోరో (60 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) విజయం దూరంలో నిలిచారు. వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో వీరిద్దరూ తమ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ యూత్ మాజీ చాంపియన్ అంకుశిత 4–1తో ఆసియా చాంపియన్ రిమా వొలోసెంకో (కజకిస్తాన్)పై నెగ్గగా... నిశాంత్ 5–0తో పీరాపట్ యెసుంగ్‌నోయెన్ (థాయ్‌లాండ్)ను చిత్తు చేశాడు. మహిళల 66 కేజీల విభాగంలో అరుంధతి 5–0తో స్టెఫానీ పీనీరో (ప్యూర్టోరికో)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
అయితే పురుషుల ప్లస్ 92 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్‌లో నరేందర్ 2–3తో గిల్మర్ కాంగో (ఈక్వడోర్) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే పురుషుల 57 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో బతుహాన్ సిఫ్టిసి (టర్కీ)తో సచిన్ సివాచ్... 51 కేజీల రెండో రౌండ్‌లో రూయిజ్ (మెక్సికో)తో అమిత్.. 92 కేజీల రెండో రౌండ్‌లో లూయిస్ (వెనిజులా)తో సంజీత్... మహిళల 57 కేజీల రెండో రౌండ్‌లో మసాతి (అజర్‌బైజాన్)తో జైస్మిన్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment