అమ్మాయి నచ్చింది | Ammayi Nachindi movie launched in Hyderabad | Sakshi
Sakshi News home page

అమ్మాయి నచ్చింది

Published Fri, May 11 2018 1:10 AM | Last Updated on Fri, May 11 2018 1:10 AM

Ammayi Nachindi movie launched in Hyderabad - Sakshi

రితిక, నిశాంత్, ఇషానియా, సాయిరోనక్‌

‘పెళ్లికాని ప్రసాద్‌’ చిత్రం ఫేమ్‌ సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అమ్మాయి నచ్చింది’. సాయిరోనక్, నిశాంత్, ఇషానియా, రితిక హీరో హీరోయిన్లు. చదలవాడ బ్రదర్స్‌ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అజయ్‌ కుమార్‌ క్లాప్‌ ఇవ్వగా, చంద్ర కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సమర్పకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘బిచ్చగాడు’ వంటి భారీ హిట్‌ చిత్రం తర్వాత ప్రతిభ ఉన్న కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నెలలో ఐదు సినిమాలు మొదలు పెడుతున్నాం.

వాటిలో తొలి చిత్రం ‘అమ్మాయి నచ్చింది’. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘వినోదంతో నిండిన ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రమిది. ఇద్దరు హీరోలు, హీరోయిన్లతో పాటు ‘వెన్నెల’ కిశోర్‌ పాత్ర కీలకం. ఐదుమంది మధ్య సాగే ఈ ప్రేమకథలోని ట్విస్ట్‌ ఏంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 40 రోజులు కాశ్మీర్‌లో, తొమ్మిది రోజులు హైదరాబాద్‌లో చిత్రీకరణ జరపనున్నాం. దీంతో షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది’’ అన్నారు. హీరో, హీరోయిన్లు, చిత్ర సంగీతదర్శకుడు ‘మంత్ర’ ఆనంద్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్‌ మాచినేని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement