నిషాంత్(ఫైల్)
నిజామాబాద్: చోరీ కేసులో తమ్ముడు అరైస్టె జైలుకు వెళ్లడంతో అవమానంగా భావించిన అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో గురువారం ఈ సంఘటన జరిగింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జంగంపల్లి గ్రామానికి చెందిన తిప్పని నిషాంత్ (23) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
అతడి తమ్ముడు నితిన్ చోరీ కేసులో 15 రోజుల క్రితం అరైస్టె జైలులో ఉన్నాడు. అప్పటి నుంచి నిషాంత్ అవమానభారంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన నిషాంత్ రాత్రి అయినా ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం పొలం వద్దకు వెళ్లగా అక్కడ నిషాంత్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. మృతుడి తండ్రి నర్సింలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment