
సాక్షి, నిజామాబాద్: మాక్లూర్ మండలంలోని చిక్లీ శివారులో వ డ్ల లారీ టీవీఎస్ ఎక్స్‌ఎల్‌ను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్సై సుధీర్‌రావు శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట మండలంలోని కంఠం గ్రామానికి చెందిన రేవల్లి భూమన్న (45), గంధం నాగమణి(35) వరుసకు మామా కోడలు అవుతారు. వీరు జన్నెపల్లి పోస్టాఫీస్‌లో పింఛన్ తీసుకునేందుకు వచ్చారు. గుంజ్లి నుంచి వడ్ల లోడ్‌తో జన్నేపల్లి వైపు వెళ్తున్న లారీ చిక్లీ శివారులో జన్నేపల్లి నుండి నందిపేట వైపు వెళ్తున్న వీరిని ఢీ కొన్నది. ఈ ఘటనలో వీరి తలలు పగిలి అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఇవి చదవండి: బాధను భరించలేక.. యువతి విషాద నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment