
నాగ్‌పూర్: గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంజినీర్ నిశాంత్ అగ్రవాల్‌కు కోర్టు 3 రోజుల రిమాండ్ విధించింది. బ్రహ్మోస్ క్షిపణికి చెందిన రహస్యాలను పాకిస్తాన్‌కు అందజేస్తున్నాడని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీసీ) సోమవారం నిశాంత్‌ను అదుపులోకి తీసుకుంది.
అతడిని మంగళవారం ఫస్ట్‌క్లాస్ జూనియర్ మెజిస్ట్రేట్ జోషి ఎదుట హాజరు పరిచింది. ఇస్లామాబాద్‌కు చెందిన నేహా శర్మ, పూజా రంజన్ అనే పేర్లతో ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్ల ద్వారా నితీశ్ పాక్ నిఘా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కోర్టుకు తెలిపింది. లక్నోకు తరలించి విచారణ చేపట్టేందుకు అనుమతివ్వాలని కోరింది. దీంతో మెజిస్ట్రేట్ మూడు రోజుల రిమాండ్‌కు అనుమతించారు.
Comments
Please login to add a commentAdd a comment