Espionage
-
భారత్, ఖతార్ బంధం సుదృఢం
దోహా: భారత్, ఖతార్ దేశాల బంధం మరింత బలోపేతం అవుతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఖతర్ పర్యటనలో ఉన్న మోదీ గురువారం ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్–థానీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయి శిక్షలు పడిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులకు ఖతార్ ప్రభుత్వం విడిచిపెట్టిన నేపథ్యంలో ఖతార్ పాలకునితో మోదీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘ ఎమీర్‌ను కలవడం అద్భుతం. ఇరుదేశాల మధ్య భిన్నరంగాల్లో విస్తృతస్తాయి సహకారానికి ఈ భేటీ బాటలు పరుస్తోంది. పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చే నూతన రంగాల్లో కలిసి పనిచేసేందుకు భారత్, ఖతార్ సిద్ధంగా ఉన్నాయి’’ అని భేటీ తర్వాత మోదీ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. నేవీ అధికారులను విడిచిపెట్టినందుకు థాంక్యూ ‘ఇరు నేతల చర్చలు ఫలవంతమయ్యాయి. ఖతార్‌లోని భారతీయుల సంక్షేమ బాధ్యతలు తీసుకున్న ఖతార్ ఎమీర్‌కు మోదీ ధన్యవాదాలు చెప్పారు. కఠిన శిక్షలు పడిన 8 మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులను వదిలిపెట్టినందుకు ఖతార్ ఎమీర్‌కు మోదీ థాంక్యూ చెప్పి మెచ్చుకున్నారు. భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆయనను మోదీ ఆహా్వనించారు’’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా వెల్లడించారు. -
జైలు శిక్షపైనా అప్పీలు!
న్యూఢిల్లీ: ఖతర్‌లో గూఢచర్య ఆరోపణలపై జైల్లో ఉన్న 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు మరింత ఊరట. వారికి విధించిన మరణశిక్షను అక్కడి న్యాయస్థానం ఇటీవలే జైలు శిక్షగా మార్చడం తెలిసిందే. దానిపై కూడా ఖతార్ సుప్రీంకోర్టులో అప్పీలుకు వీలు కల్పించడంతో పాటు అందుకు 60 రోజుల గడువిచ్చినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ తెలిపారు. 8 మంది మాజీ అధికారుల్లో ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా జైలు శిక్ష విధించినట్టు చెబుతున్నారు. వాటి వివరాలను ఖతార్, భారత్ గోప్యంగా ఉంచుతున్నాయి. -
ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణ శిక్ష రద్దు
న్యూఢిల్లీ: ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై మరణ శిక్ష పడిన 8 మంది భారత నావికాదళం మాజీ అధికారులకు భారీ ఊరట లభించింది. వారికి విధించిన మరణ శిక్షను ఖతార్ అప్పిలేట్ కోర్టు రద్దు చేసింది. ఈ శిక్షను కేవలం జైలు శిక్షగా మారుస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. అయితే, వారు ఎంతకాలం జైలులో శిక్ష అనుభవించాలన్నది తెలియరాలేదు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అల్–దాహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ కేసులో ఖతార్ కోర్టు 8 మందికి శిక్షను తగ్గించినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. గూఢచర్యం కేసులో 8 మంది నేవీ మాజీ అధికారులు 2022 ఆగస్టులో ఖతార్‌లో అరెస్టయ్యారు. అప్పిలేట్ కోర్టు తాజా తీర్పును భారత దౌత్య విజయంగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాప్–28 సదస్సు సందర్భంగా ఇటీవల దుబాయ్‌లో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్–థానీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖతార్‌లో 8 మంది భారతీయులకు విధించిన మరణ శిక్ష గురించి ఈ భేటీలో మోదీ ప్రస్తావించినట్లు సమాచారం. శిక్ష నుంచి వారికి విముక్తి కలి్పంచాలంటూ మోదీ చేసిన విజ్ఞప్తి పట్ల ఖతార్ పాలకులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఖతార్‌లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమంపై అల్–థానీతో చర్చించినట్లు ఈ భేటీ తర్వాత మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మరణ శిక్షను రద్దు చేసి, జైలు శిక్షగా కుదిస్తూ ఖతార్ కోర్టు తీర్పు ప్రకటించింది. బాధితులకు అండగా ఉంటాం ఖతార్ కోర్టు తాజా తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎదురు చూస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. తదుపరి చర్యల విషయంలో న్యాయ నిపుణులతో, బాధితుల కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని వెల్లడించింది. కోర్టులో గురువారం జరిగిన విచారణకు ఖతార్‌లోని భారత రాయబారి, ఇతర అధికారులు, బాధితుల కుటుంబ సభ్యులు కొందరు హాజరయ్యారని తెలియజేసింది. బాధితులకు అండగా ఉంటామని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టంచేసింది. ఏమిటీ కేసు? 8 మంది భారత మాజీ అధికారులు ఖతార్ రాజధాని దోహాకు చెందిన అల్–దాహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అనే ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఈ సంస్థ ఖతార్ సైనిక దళాలకు, సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ ఇస్తోంది. ఇతర సేవలు అందిస్తోంది. అల్–దాహ్రా సంస్థలో పని చేస్తున్న 8 మంది భారతీయులను గత ఏడాది ఆగస్టులో ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమ దేశ రహస్యాలను చోరీ చేస్తున్నట్లు వారిపై అభియోగాలు మోపారు. ఇతర దేశాలకు సమాచారం చేరవేస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. అయితే, ఈ అభియోగాలను బహిరంగపర్చలేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఖతార్ కోర్టు 8 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచి్చంది. దీంతో భారత ప్రభుత్వం న్యాయ పోరాటం ప్రారంభించింది. శిక్షను వ్యతిరేకిస్తూ ఖతార్‌లోని కోర్టు ఆఫ్ అప్పీల్‌ను ఆశ్రయించింది. ఖతార్‌లో శిక్ష పడిన వారిలో నవతేజ్ గిల్, సౌరభ్ వశి‹Ù్ట, పూర్ణేందు తివారీ, అమిత్ నాగ్‌పాల్, ఎస్.కె.గుప్తా, బి.కె.వర్మ, సుగుణాకర్ పాకాల, సైలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ పాకాల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందినవారు. -
బౌద్ధ సన్యాసి ముసుగులో భారత్‌లో గూఢచర్యం?
దేశ రాజధానిలో గూఢచర్య కలకలం రేగింది. బౌద్ధ సన్యాసి వేషంలో ఉన్న ఓ మహిళను చైనా పౌరురాలిగా నిర్ధారించుకున్న ఢిల్లీ పోలీసులు.. పలు అభియోగాల కింద ఆమెను అరెస్ట్ చేశారు. మూడేళ్లుగా భారత్‌లో ఉంటున్న ఆమె.. కీలక సమాచారం ఏమైనా చైనాకు చేరవేసిందా? ఏదైనా కుట్రకు తెర తీసిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ ఉత్తరంగా ఉన్న టిబెట్ శరణార్థి శిబిరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గూఢచర్యానికి పాల్పడిందనే అనుమానంతో పాటు చోరీలకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే అనుమానంతోనూ ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నేపాల్ రాజధాని ఖాట్మాండుకు చెందిన డోల్మా లామా అనే బౌద్ధ సన్యాసి.. టిబెట్ శరణార్థి కాలనీలోని మంజు కా టిల్లాలో ఉంటున్నాడు. అయితే అతను అతను కాదని.. ఆమె అని పోలీసులు వెల్లడించారు. చైనాకు చెందిన కాయ్ రువో(30).. బౌద్ధ సన్యాసి వేషంలో ఇక్కడికి వచ్చినట్లు తేల్చారు. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి సేకరించిన ఆధారాలతో అతన్ని.. ఆమెగా ప్రకటించారు పోలీసులు. చైనీస్ పాస్‌పోర్ట్‌తో 2019లో భారత్‌లోకి కాయ్ రువో ప్రవేశించిందని ప్రకటించారు. ఇంగ్లీష్‌తో పాటు మాండరిన్, నేపాలీ భాషలను ఆమె మాట్లాడుతోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆమెను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. అయితే.. చైనా కమ్యూనిస్ట్ నేతలు కొందరు తనను చంపే యత్నం చేస్తున్నారని.. తప్పించుకునేందుకు ఇలా వేషం కట్టినట్లు ఆమె ప్రాథమికంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు ఆమెను క్షుణ్ణంగా విచారించాలని నిర్ణయించుకున్నారు. ఇదీ చదవండి: ఎవరూ ఎత్తుకెళ్లలే.. గ్యాంగ్ రేప్ చేయలే!! -
మిలటరీలో మరమనిషి
మనిషిని దేవుడు సృష్టిస్తే, ఆయనకు పోటీగా మరమనిషిని మనిషి సృష్టించుకున్నాడు. అంతటితో ఆగక వాటిని మృత్యురూపాలుగా మారుస్తున్నాడు. వీటి వాడకంతో సంప్రదాయ యుద్ధ రూపురేఖలు మార్చేశాడు. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సృష్టికర్తనే మింగే భస్మాసుర రోబోలు అవతరించడానికి అట్టేకాలం పట్టదంటున్నారు నిపుణులు. మానవ జీవనం మరింత సౌకర్యవంతంగా చేయాలన్న సంకల్పంతో మరమనుషుల రూపకల్పన జరిగింది. కాలక్రమేణా వీటిని మారణహోమం సృష్టించే మిషన్లుగా వాడడం ఆరంభమైంది. సైనిక రంగంలో రోబోల వాడకం నైతికం కాదన్న వాదనలున్నా, వీటి వాడకం మాత్రం పెరిగిపోతూనే ఉంది. యుద్ధరంగంలోకి రోబోటిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ప్రపంచ యుద్ధ నమూనాలను మార్చివేస్తోంది. ప్రస్తుతం మిలటరీలో ఉన్న రోబోలు అటు పోరాటంతో పాటు ఇటు రెస్క్యూ (కాపాడడం) ఆపరేషన్లలో, పేలుడు పదార్థాలను కనిపెట్టి నిర్వీర్యం చేయడంలో, గూఢాచర్యంలో, రవాణాలో ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటి రాక సాంప్రదాయక యుద్ధ విధానాలను ఒక్కపెట్టున మార్చేసింది. ఆధునిక రోబో సాంకేతికత అందుబాటులో ఉన్న మిలటరీ అత్యంత బలంగా మారుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వాలు నైతికతను పక్కనపెట్టి మరీ, తమ తమ మిలటరీకి మరమనిషి సాయం అందించేందుకు కోట్ల డాలర్లు కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో టాప్ 10 మిలటరీ రోబోల వివరాలు ఇలా ఉన్నాయి. మార్స్ (ఎంఏఏఆర్‌ఎస్) ► మాడ్యులార్ అడ్వాన్స్డ్ ఆర్మ్డ్ రోబోటిక్ సిస్టమ్‌కు సంక్షిప్త నామమే మార్స్. ► ఇది మానవ రహిత రోబో. మిలటరీ ఆవసరాల కోసమే తయారు చేశారు. ► దీంట్లో శాటిలైట్ ట్రాకింగ్ వ్యవస్థను, కెమెరాలను, ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను అమర్చారు. ► గ్రెనేడ్ లాంచర్ లాంటి భయంకర జనహనన ఆయుధాలను దీనికి అనుసంధానిస్తారు. ► ఈ ఆయుధాలను రిమోట్‌తో నిర్వహించి విధ్వంసం సృష్టిస్తారు. ► ధర సుమారు 3 లక్షల డాలర్లు. వేగం గంటకు 11 కిలోమీటర్లు. సఫిర్ (ఎస్ఏఎఫ్ఎఫ్ఐఆర్) ► చూడ్డానికి మనిషిలాగా రెండు కాళ్లతో ఉంటుంది. ► డామేజ్ కంట్రోల్లో మనిషి చేయలేని పనులు చేసేందుకు దీన్ని రూపొందించారు. ► ఇది కూడా మానవ రహిత రోబోనే. ► దూరంలో ఉన్న శత్రు నౌకలను పసిగట్టగలదు. నావికాదళంలో వాడుతున్నారు. ► ధర సుమారు 1.5– 2.25 లక్షల డాలర్లు. గ్లాడియేటర్ ► గ్లాడియేటర్ టాక్టికల్ అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్‌ను సంక్షిప్తంగా గ్లాడియేటర్ అంటారు. ► గూఢచర్యం, నిఘా, నిర్దేశిత లక్ష్యాలను గుర్తించడం, అడ్డంకుల ఛేదనలో ఉపయోగిస్తారు. ► దీంతో పాటు అణు, రసాయన ఆయుధాల ప్రయోగాన్ని గుర్తించగలదు. ► అవసరమైతే నేరుగా కాల్పులు జరపగలదు. ► ధర దాదాపు 4 లక్షల డాలర్లు. బిగ్‌డాగ్ ► పేరుకు తగ్గట్లు పెద్ద కుక్క సైజులో ఉంటుంది. ► బోస్టన్ డైనమిక్స్ దీన్ని రూపొందించింది. 100 పౌండ్ల బరువును మోయగలదు. ► ఎలాంటి ఉపరితలాలపైనైనా సులభంగా ప్రయాణం చేస్తుంది. ► దీన్ని మిలటరీ లాజిస్టిక్స్‌లో వాడుతున్నారు. ► సులభమైన కదలికల కోసం పలు రకాల సెన్సార్లు ఇందులో ఉంటాయి. ► ధర దాదాపు 74 వేల డాలర్లు. డోగో ► ఎనిమిది మైక్రో వీడియో కెమెరాలున్న ఈ రోబో 360 డిగ్రీల కోణంలో చూస్తుంది. ► ఇందులో ఉన్న తుపాకీ గురితప్పకుండా పేల్చేందుకు మరో రెండు బోరోసైట్ కెమెరాలుంటాయి. ► రేంజర్ రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రిస్తారు. జనరల్ రోబోటిక్స్ తయారు చేస్తోంది. ► ఈ రోబోను భారతీయ ఎన్ఎస్జీ వాడుతోంది. ► ధర సుమారు లక్ష డాలర్లు. పెట్‌మాన్ ► ప్రొటెక్షన్ ఎన్సెంబుల్ టెస్ట్ మానిక్విన్ సంక్షిప్త నామమే పెట్‌మాన్. ► ఇది చూడ్డానికి మనిషిలాగా ఉండే హ్యూమనాయిడ్ రోబో. ► మానవ సైనికుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి రూపొందించారు. ► ఇది మనిషిలాగా నడవడం, పాకడం, పరిగెత్తడంతో పాటు చెమట కూడా కారుస్తుంది. ► భవిష్యత్‌లో రెస్క్యూ ఆపరేషన్స్‌లో వాడబోతున్నారు. ► దీని రూపకల్పనకు దాదాపు 2.6 కోట్ల డాలర్లు ఖర్చైందని బోస్టన్ డైనమిక్స్ తెలిపింది. అట్లాస్ ► ఎమర్జెన్సీ సేవల కోసం రూపొందించారు. ► ప్రమాదకరమైన వాల్వులను మూసివేయడం, తెరుచుకోని బలమైన తలుపులను తెరవడం, మనిషి వెళ్లలేని వాతావరణ పరిస్థితుల్లోకి వెళ్లి రావడం చేయగలదు. ► చూడటానికి మరుగుజ్జులాగా కనిపిస్తుంది. ► గాల్లోకి దూకడం, వేగంగా పరిగెత్తడం చేయగలదు. ► ధర సుమారు 75 వేల డాలర్లు. గార్డ్‌బోట్ ► రక్షణ మిషన్లలో పాలుపంచుకుంటూనే పరిస్థితులను వీడియో తీసి లైవ్ స్ట్రీమింగ్ చేయగలగడం దీని ప్రత్యేకత. ► గుండ్రంగా బంతిలాగా ఉండే ఈ రోబో ఉభయచర రోబో. ► నేలపై, నీళ్లలో ప్రయాణించగలదు. ► బురద, మంచును లెక్క చేయకుండా దొర్లుకుంటూ పోగలదు. ► నిఘా కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. ► ధర సుమారు లక్ష డాలర్లు. పీడీ100 బ్లాక్ హార్నెట్ ► ఫ్లిర్ సిస్టమ్స్ తయారీ. ఎక్కువగా గూఢచర్యంలో ఉపయోగపడతుంది. ► వాడుకలో ఉన్న అతిచిన్న డ్రోన్ రోబో. కీటకం సైజులో కనిపిస్తుంది. ► భారత్ సహా పలు దేశాల మిలటరీలు చాలా రోజులుగా వాడుతున్నాయి. ► దీన్ని అపరేట్ చేసే విధానాన్ని కేవలం 20 నిమిషాల్లో నేర్చుకోవచ్చు. ► అరగంట చార్జింగ్‌తో అరగంట పాటు గాల్లో తిరగగలదు. ► గరిష్ఠ వేగం గంటకు 21 కిలోమీటర్లు. ధర దాదాపు 1.95లక్షల డాలర్లు. ఎల్ఎస్3 ► లెగ్గడ్ స్క్వాడ్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. ► నాలుగు కాళ్లుండే ఈ రోబో సైనికులకు సామాన్లు మోసే గుర్రంలాగా ఉపయోగపడుతుంది. ► ఎలాంటి ఆర్డర్లు లేకుండానే నాయకుడిని ఫాలో కావడం దీని ప్రత్యేకత. ► చిన్న పాటి వాయిస్ కమాండ్స్‌ను ఆర్థం చేసుకుంటుంది. ► 400 పౌండ్ల బరువును మోయగలదు. ► బిగ్‌డాగ్ రోబోతో పోటీ పడుతుంది. ► ధర దాదాపు లక్ష డాలర్లు. ఎంతవరకు కరెక్ట్? మిలటరీలో రోబోలను ప్రవేశపెట్టడం వల్ల ఉపయోగాలున్నాయనేవారికి సమానంగా వీటి వాడకాన్ని వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. సైనిక రోబోలతో మానవ సైనికుల ప్రాణాలను రక్షించవచ్చు. మనిషిలాగా వీటికి అలసట రాదు. కనురెప్ప వాల్చకుండా కాపలా కాస్తాయి. వానకు, ఎండకు బెదరవు. మానవ సంబంధ బలహీనతలకు లొంగవు. ముఖ్యంగా యుద్ధమంటే ఏ దశలో కూడా భయం చెందవు. వీటి గురి తప్పదు. వీటితో సమయం ఆదా అవుతుంది. మనిషి చేయలేని పనులను కూడా చేయగలవు. అందుకే వీటిని వాడడం మంచిదేనంటారు సమర్ధకులు. అయితే ఈ వాదనను మానవ హక్కుల కార్యకర్తలు, ఎన్జీఓలు వ్యతిరేకిస్తుంటాయి. కిల్లర్ రోబోల వాడకం నైతిక విలువలకు దూరమని వీరి వాదన. ఎదుటి పక్షం సైనికులు కూడా మనుషులేనని ఇవి గుర్తించవు. వారిని దయాదాక్షిణ్యం లేకుండా ఈ రోబోలు క్రూరంగా మట్టుబెడతాయి. వీటి ఖరీదు చాలా అధికం. అందువల్ల ధనిక దేశాలు మాత్రమే భరించగలవు. ఇది ఆయా దేశాలకు మిగిలిన బలహీన దేశాలపై పైచేయినిస్తుంది. యుద్ధం మధ్యలో సాంకేతిక లోపాలు తలెత్తితే ఒక్కమారుగా పరిస్థితి తలకిందులవుతుంది. అన్నిటికి మించి మితిమీరిన సాంకేతికతతో ఈ రోబోలు స్వతంత్రంగా మారితే జరిగే పరిణామాలు భయానకంగా ఉంటాయని కిల్లర్ రోబోల వ్యతిరేకులు హెచ్చరిస్తున్నారు. ఎవరివాదన ఎలాఉన్నా ప్రస్తుతానికి ప్రభుత్వాలు మాత్రం వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి. -
‘పాకిస్తాన్ వెళ్లి పెద్ద తప్పు చేశాను’
లక్నో: 28 ఏళ్ల క్రితం పాకిస్తాన్ వెళ్లి.. గూఢచర్యం ఆరోపణల కింద దాదాపు 8 ఏళ్ల పాటు కరాచీ జైల్లో గడిపి భారత్‌కు తిరిగి వచ్చిన వ్యక్తికి స్థానికులు, పోలీసులు పూల మాలలతో స్వాగతం పలికారు. స్వదేశంలో తనకు లభించిన ఆత్మీయత, ఆదరణ చూసి ఆ వ్యక్తి ఏకధాటిగా కన్నీరు కార్చాడు. అనవసరంగా పాకిస్తాన్ వెళ్లాను. వారు మనల్ని శత్రువులుగా చూస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాలు.. కాన్పూర్‌కు చెందిన షంసుద్దీన్(70) 1992లో 90 రోజుల వీసా మీద పాకిస్తాన్ వెళ్లాడు. ఆ తర్వాత 1994లో పాక్ పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడ్డాడు. కొన్నేళ్లు బాగానే గడిచింది. ఆ తర్వాత 2012లో గూఢచర్యం ఆరోపణలపై పాక్ అధికారులు అతడిని అరెస్ట్ చేసి కరాచీ జైలులో ఉంచారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది అక్టోబర్ 26న విడుదల అయ్యాడు. అత్తారీ-వాగా సరిహద్దు ద్వారా భారతదేశానికి చేరుకున్నాడు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో అమృత్‌సర్‌లో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్నాడు. అనంతరం నగరంలోని బజారియా పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఆఫీసర్ తిర్పురారీ పాండే, షంసుద్దీన్‌కు పూల మాలతో స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు అతన్ని కంఘి-మోహల్‌లోని తన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన రాక కోసం ప్రజలు అక్కడ గుమిగూడారు. జనం అతనిని చుట్టుముట్టి పూల మాలలు వేసి కౌగిలించుకున్నారు. దశాబ్దాల తరువాత స్వదేశానికి తిరిగి వచ్చినందుకు ఆయనను అభినందించారు. దాదాపు 28 ఏళ్ల పాటు సొంత దేశానికి, పుట్టిన వారికి, ఇంటికి దూరంగా ఉన్న షంసుద్దీన్ స్వస్థలం చేరుకోగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆత్మీయులను చూసి ఆనందంతో ఏడ్చేశాడు. (చదవండి: మాజీ సైంటిస్ట్‌కు 1.3 కోట్ల పరిహారం) అనంతరం షంసుద్దీన్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్లో భారతీయులను చాలా నీచంగా చూస్తారు’ అని మీడియాతో తెలిపాడు. "వారు మనల్ని శత్రువుల్లా చూస్తారు. పాకిస్తాన్లో లంచం, అవినీతి భారీ ఎత్తున ఉంది" అన్నారు. అంతేకాక పాక్ వెళ్లి చాలా పెద్ద తప్పు చేశాను. అక్కడే చనిపోతానేమో అనుకున్నాను. కానీ అదృష్టం బాగుండి బతికుండగానే నా వారి దగ్గరకు వచ్చాను అని కన్నీటి పర్యంతమయ్యాడు. -
విశాఖ గూఢచర్యం కేసు.. మరొకరి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: 2019 లో విశాఖపట్నం 'హానీట్రాప్' గూఢచర్యం కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది. గిటేలి ఇమ్రాన్ అనే వ్యక్తిని ఎన్ఐఏ గుజరాత్లో అదుపులోకి తీసుకుంది. ఈ వ్యక్తి పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. విశాఖలోని నేవీ రహస్యాలను సేకరించేందుకు కుట్ర పన్నినట్లు తెలిపింది. ఈ క్రమంలో నేవీ సిబ్బందికి భారీగా ముడుపులు అందజేసినట్టు విచారణలో వెల్లడయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఎన్ఐఏ 11 మంది నేవీ సిబ్బంది సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంఖ్య 15కు చేరింది. హవాలా మార్గాల్లో నేవీ సిబ్బందికి నిధులు సమకూర్చినట్టు సదరు వ్యక్తి దర్యాప్తులో వెల్లడించినట్లు ఎన్ఐఏ తెలిపింది. (చదవండి: విశాఖలో ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ ) పాకిస్తాన్‌కు చెందిన కొందరు గూఢచారులు.. భారత నౌకలు, జలాంతర్గాముల లొకేషన్, ఇతర సమాచారాన్ని సేకరించేందుకు జూనియర్ స్థాయి నేవీ అధికారులను ట్రాప్ చేయడానికి ప్రయత్నించారు. ఇందుకు గాను సోషల్ మీడియా ద్వారా అందమైన యువతులను వారు ఎర వేసి.. వివరాలను కనుగొనేందుకు ప్రయత్నించారు. -
పాక్ చెరలో 19మంది భారతీయులు
లాహోర్: అక్రమంగా సరిహద్దును దాటారన్న ఆరోపణలపై రెండు నెలల క్రితం 19మంది భారతీయులను, ఇద్దరు బంగ్లాదేశీయులను అరెస్టు చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. నవంబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టేదాకా వీరు జైల్లోనే ఉంటారని తెలిపారు. అక్రమ ప్రవేశం, గూఢచర్యం నేరాలపై 19మంది భారతీయులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసి వివిధ జైళ్లలో ఉంచామని చెప్పారు. ఇటీవలే వీరిని ఫెడరల్ రివ్యూబోర్డు ముందు ప్రవేశపెట్టామని, నవంబర్ 9వరకు వీరిని రిమాండ్‌లో ఉంచాలని బోర్డులోని న్యాయమూర్తులు ఆదేశించారని వివరించారు. ఈలోపు జరిపే విచారణ ఆధారంగా నవంబర్ 9న బోర్డు వీరిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. వీరితో పాటు ఒక శ్రీలంక దేశస్తుడిని కూడా అరెస్టు చేశారు. సరైన ఆధారాల్లేవంటూ బోర్డు ఆదేశాల మేరకు విడుదల చేశారు. -
అడుగడుగునా అడ్డుకున్నారు
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను కలుసుకునేందుకు తమ దౌత్యాధికారులకు స్వేచ్ఛాయుత, బేషరతు అనుమతి ఇవ్వలేదని భారత్ గురువారం ఆరోపించింది. జాధవ్‌ను కలుసుకునేందుకు వెళ్లిన అధికారులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని విమర్శించింది. జాధవ్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించిందని తెలిపింది. దాంతో, పాక్ ఇచ్చిన దౌత్య అనుమతి అర్థరహితంగా మారిందని పేర్కొంటూ ఆ అధికారులు తమ నిరసనను అక్కడే వ్యక్తం చేశారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘జాధవ్‌ను భారత దౌత్యాధికారులు కలుసుకున్న సమయంలో.. నిబంధనలకు విరుద్ధంగా పాక్ అధికారులు ఆ ప్రదేశానికి అత్యంత సమీపంలో ఉన్నారు. బెదిరించే ధోరణిలో వారు ప్రవర్తించారు. భారతీయ అధికారులు నిరసన తెలిపినా వారు పట్టించుకోలేదు. దాంతో జాధవ్‌తో స్వేచ్ఛగా సంభాషించే వీలు లభించలేదు. అదీకాకుండా, జాధవ్‌తో భారత అధికారుల సంభాషణను రికార్డు చేశారు. అందుకు అక్కడే ఉన్న కెమెరానే సాక్ష్యం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వివరించారు. పాకిస్థాన్ సైనిక కోర్టు జాదవ్‌కు విధించిన మరణ శిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి ఈ నెల 20 వరకు మాత్రమే గడువున్న తరుణంలో గురువారం సాయంత్రం జాదవ్‌ను కలుసుకోవడానికి భారత అధికారులకు పాక్ అనుమతించింది. పాకిస్తాన్ మిలటరీ కస్టడీలో ఉన్న జాదవ్‌ను కలుసుకున్న అధికారులు రెండు గంటల సేపు చర్చించారు. రివ్యూ పిటిషన్‌కు సంబంధించి ఆయన నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకుందామని భావిస్తే అక్కడి అధికారులు అడ్డుపడ్డారని శ్రీవాస్తవ తెలిపారు. -
విశాఖలో ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’
సాక్షి, వైజాగ్: విశాఖ కేంద్రంగా తీరప్రాంతానికి సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్న ఏడుగురు నేవీ అధికారులను సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. కేంద్ర నిఘా వర్గాలు, ఏపీ ఇంటెలిజెన్స్ అధికారుల ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ నిర్వహించారు. ఓ హవాలా బ్రోకర్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వీరందరినీ వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి విజయవాడ ఎన్ఐఏ కోర్టులో హాజరు పరిచారు. వీరికి న్యాయస్థానం జనవరి 3వ తేదీవరకూ రిమాండ్ విధించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘బ్రహ్మోస్’ గూఢచారికి రిమాండ్
నాగ్‌పూర్: గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంజినీర్ నిశాంత్ అగ్రవాల్‌కు కోర్టు 3 రోజుల రిమాండ్ విధించింది. బ్రహ్మోస్ క్షిపణికి చెందిన రహస్యాలను పాకిస్తాన్‌కు అందజేస్తున్నాడని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీసీ) సోమవారం నిశాంత్‌ను అదుపులోకి తీసుకుంది. అతడిని మంగళవారం ఫస్ట్‌క్లాస్ జూనియర్ మెజిస్ట్రేట్ జోషి ఎదుట హాజరు పరిచింది. ఇస్లామాబాద్‌కు చెందిన నేహా శర్మ, పూజా రంజన్ అనే పేర్లతో ఉన్న ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా నితీశ్ పాక్ నిఘా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కోర్టుకు తెలిపింది. లక్నోకు తరలించి విచారణ చేపట్టేందుకు అనుమతివ్వాలని కోరింది. దీంతో మెజిస్ట్రేట్ మూడు రోజుల రిమాండ్‌కు అనుమతించారు. -
పాక్ ఉచ్చులో ఐఏఎఫ్ అధికారి
న్యూఢిల్లీ: భారత వాయుసేన(ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ అరుణ్ మర్వాహా(51)ను గూఢచర్యం ఆరోపణల కింద ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్బుక్లో అందమైన అమ్మాయిల ముసుగు(హనీట్రాప్)లో పరిచయమైన ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లకు అరుణ్ రహస్య సమాచారాన్ని చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిపై అధికారిక రహస్యాల చట్టంలోని సెక్షన్ 3, 5 కింద కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఐఏఎఫ్ ప్రధాన కార్యాలయంలో పారా జంపింగ్‌తో పాటు గరుడ కమెండోలకు అరుణ్ శిక్షకుడిగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లు మోడల్స్‌గా అరుణ్‌కు ఫేస్బుక్లో పరిచయమైనట్లు పేర్కొన్నారు. వీరిద్దరూ అరుణ్‌తో వాట్సాప్‌లో తరచుగా సంభాషించేవారనీ, రొమాంటిక్ సందేశాలను పంపేవారని తెలిపారు. కొద్దిరోజుల తర్వాత నిందితుడికి ఐఎస్ఐ ఏజెంట్లు అమ్మాయిల అశ్లీల చిత్రాలు పంపేవారనీ, ఇందుకు ప్రతిగా ఐఏఎఫ్‌కు చెందిన రహస్య సమాచారాన్ని అందజేయాల్సిందిగా కోరేవారని వెల్లడించారు. వీరి వలలో చిక్కుకున్న అరుణ్ సైబర్ విభాగం, అంతరిక్ష రంగంతో పాటు ‘గగన్ శక్తి’ వంటి ఐఏఎఫ్ ప్రత్యేక ఆపరేషన్లకు సంబంధించిన రహస్య పత్రాలను వాట్సాప్ ద్వారా ఐఎస్ఐకి చేరవేశాడని పేర్కొన్నారు. అరుణ్ ప్రవర్తనపై అనుమానమొచ్చిన ఓ ఐఏఎఫ్ ఉన్నతాధికారి అంతర్గత విచారణకు ఆదేశించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. దీంతో జనవరి 31న అరుణ్‌ను ఐఏఎఫ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ అదుపులోకి తీసుకుందని తెలిపారు. దాదాపు 10 రోజుల విచారణ అనంతరం అరుణ్‌ను ఇక్కడి పటియాలా కోర్టుకు బుధవారం తరలించగా.. న్యాయస్థానం ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించిందని వెల్లడించారు. అరుణ్ ఫోన్‌ను ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామనీ, ఈ కుట్రలో నిందితుడితో పాటు మరెవరైనా ఉన్నారా? అన్న విషయమై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో దోషిగా తేలితే అరుణ్‌కు 14 ఏళ్ల వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉంది. -
నమ్మించి ఐదేళ్లుగా దోచుకుంటున్న చైనా
అడ్డిస్ అబాబా, ఇథియోపియా : చైనా అంటే స్నేహం కాదు.. ఓ నమ్మకం అనే భావనను ప్రపంచదేశాల్లో తీసుకురావడానికి ఆ దేశం పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా చైనాపై ఆఫ్రికన్ యూనియన్(ఏయూ) ఫైర్ అయింది. స్నేహం పేరుతో గిఫ్ట్‌గా ఇచ్చిన భవనం ద్వారా చైనా గూఢచర్యానికి పాల్పడుతోందని ఆఫ్రియన్ ఏయూ ఆరోపించాయి. అడ్డిస్ అబాబాలోని ఏయూ కేంద్ర కార్యాలయ కంప్యూటర్ల నుంచి ప్రతి రోజు రాత్రి సమాచారం తస్కరణకు గురవుతున్నట్లు ఫ్రెంచ్ వార్తపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో షాక్‌కు గురైన ఏయూ సర్వర్ల ద్వారా నిజంగానే డేటా తస్కరణకు గురవుతున్నట్లు గుర్తించింది. మిగిలిన సమాచారం చోరికి తరలిపోకుండా అడ్డుకుంది. ఆఫ్రికా ఖండంలోని 55 దేశాలు కలసి 2001లో ఆఫ్రికన్ యూనియన్‌గా ఏర్పడ్డాయి. 2002లో ఇథియోపియా రాజధానిలోని అడ్డిస్ అబాబాలో ఏయూ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రపంచ శక్తిగా ఎదగాలని తపన పడుతున్న చైనా.. ఈ అతిపెద్ద కూటమిపైన కన్నేసింది. పేదరికంలో మగ్గుతున్న ఆ దేశాలకు వ్యాపార ఆశ జూపి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)లో పెట్టుబడులు పెట్టాలని కోరింది. బీఆర్ఐలాంటి బృహత్తరమైన ప్రాజెక్టు ఆఫ్రికా గుండా వెళ్తే దేశాలు అభివృద్ధి చెందుతాయని నమ్మబలికింది. చైనా మాటకు సరేనన్న ఆఫ్రికన్ దేశాలు ఆ దేశం నుంచి అప్పులు తీసుకుని బీఆర్ఐలో పెట్టుబడులు పెట్టాయి. బీఆర్ఐలో పెట్టిన పెట్టుబడుల మొత్తానికి ఏటా భారీగా వడ్డీలు చెల్లించాల్సి వస్తుండటంతో ఆఫ్రికన్ దేశాలు చైనాకు వ్యతిరేకంగా గొంతెత్తాయి. ఈలోగా బహుమతి కింద ఆఫ్రికన్ యూనియన్‌కు చైనా నిర్మించి ఇచ్చిన కార్యాలయం నుంచి సమాచారం తస్కరణకు గురవుతోందన్న వార్త ఆఫ్రికన్ దేశాలను ఆత్మరక్షణలో పడేసింది. 200 మిలియన్ల డాలర్లతో అడ్డిస్ అబాబా కార్యాలయాన్ని నిర్మించిన చైనా 2012లో ఏయూకి దాన్ని అప్పగించింది. ఆనాటి నుంచి నేటి వరకూ అంటే గత ఐదేళ్లుగా ప్రతి రాత్రి ఏయూకి చెందిన రహస్యాలు షాంఘైలోని ఓ బేస్‌కు చేరుతున్నాయి. ఫ్రెంచ్ పత్రికలో వార్తకథనాల తర్వాత జాగ్రత్తపడ్డ ఏయూ చైనా సర్వర్లను పక్కనపడేసింది. వాటికి ప్రత్యామ్నాయంగా కొత్త సర్వర్లను అందుబాటులోకి తెచ్చుకుంది. వాటి నిర్వహిస్తామని చైనా చేసిన ఆఫర్‌ను తిరస్కరించింది. అల్జీరియా నుంచి అబాబాకు వచ్చిన భద్రతా బృందం వెతుకులాటలో డెస్క్‌ల కింద పెద్దమొత్తంలో మైక్రోఫోన్లు కూడా లభ్యమయ్యాయి. బీఆర్ఐలో భాగంగా పెట్టుబడుల పేరుతో వర్ధమాన దేశాలకు ఎదురుఅప్పులు ఇస్తున్న చైనా.. వడ్డీల రూపేణ వాటి రక్తాన్ని జలగలా పట్టిపీల్చుతోంది. ఆసియా దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్లకు బీఆర్ఐలో భాగంగా చైనా భారీగా నిధులు అప్పుగా ఇచ్చింది. కాగా, ఏయూ చేసిన గూఢచర్య ఆరోపణలను చైనా ఖండించింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఆఫ్రికా-చైనా సంబంధాలు దెబ్బతినే ప్రభావం ఉందని హెచ్చరించింది. -
‘గూఢచర్యం’లో టీచర్ అరెస్ట్
కశ్మీర్లో అదుపులోకి.. ఓ సైన్యాధికారిది కీలకపాత్ర న్యూఢిల్లీ: సైనికాధికారుల నుంచి రహస్యాలను సేకరిస్తున్న ‘గూఢచర్య’ రాకెట్‌కు సంబంధించి జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీకి చెందిన సబర్ అనే ప్రభుత్వ టీచర్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి చెందినవాడిగా అనుమానిస్తున్న కఫైతుల్లాఖాన్ నేతృత్వంలో ఈ రాకెట్ నడుస్తున్నట్లుగా పోలీసులు గుర్తించడం తెలిసిందే. కఫైతుల్లాఖాన్తో పాటు బీఎస్ఎఫ్ అధికారి అబ్దుల్ రషీద్, మాజీ సైనికుడు మునవ్వార్ అహ్మద్ మీర్‌లను అరెస్టు చేయగా.. తాజాగా సబర్‌ను అరెస్టు చేసి, అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశామని ఢిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్ రవీంద్ర యాదవ్ వెల్లడించారు. అయితే సబర్‌ను అరెస్టు చేయడానికి ఢిల్లీ పోలీసులు వెళ్లినప్పుడు హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు వచ్చే విషయం అతనికి ముందుగానే తెలిసింది. దాంతో ఇంటికి బయటి నుంచి తాళం వేసుకుని లోపల ఉండిపోయారు. పోలీసులు ఇంటి చుట్టూ పరిశీలిస్తుండగానే... సబర్ లోపలి నుంచి పైకప్పు ఎక్కి, ఇంటి వెనుకవైపు దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు.స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులను అడ్డుకోవడంతో.. ఢిల్లీ , కశ్మీర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారంతా కలసి చివరికి సబర్‌ను అరెస్టు చేశారు. సబర్ ఇంట్లో కఫైతుల్లాఖాన్తో సబర్ ఫోన్ సంభాషణల సీడీ, అతని నుంచి డబ్బు అందిన ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ సైనికాధికారి నుంచి సబర్ పలు రహస్యాలను సేకరించి.. కఫైతుల్లాఖాన్ను అందజేశాడన్నారు.