
సాక్షి, వైజాగ్: విశాఖ కేంద్రంగా తీరప్రాంతానికి సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్న ఏడుగురు నేవీ అధికారులను సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. కేంద్ర నిఘా వర్గాలు, ఏపీ ఇంటెలిజెన్స్ అధికారుల ఆధ‍్వర్యంలో ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ నిర్వహించారు. ఓ హవాలా బ్రోకర్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వీరందరినీ వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో హాజరు పరిచారు. వీరికి న్యాయస్థానం జనవరి 3వ తేదీవరకూ రిమాండ్ విధించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment