ఢిల్లీ: ఇరాన్ ఫిషింగ్ నౌకను కాపాడిన తర్వాత భారత నౌకాదళం మరో ఆపరేషన్ చేపట్టింది. సోమాలియ దుండగుల దాడి నుంచి పాకిస్థాన్ నౌకను ఐఎన్‌ఎస్ యుద్ధనౌక సుమిత్రా రక్షించింది. అందులో ప్రయాణిస్తున్న 19 మంది పాకిస్థానీయులను కాపాడింది.
అల్ నయీమి అనే పాకిస్థాన్‌కు చెందిన పిషింగ్ నౌకపై సామాలియాకు చెందిన 11 మంది దుండగులు దాడి చేశారు. అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన సుమారు 800 నాటికల్ మైల్స్ దూరంలో పాకిస్థాన్‌కు చెందిన ఫిషింగ్ నౌకపై సోమాలియా సముద్రపు దొంగలు దాడి చేశారు. సమాచారం అందుకున్న ఇండియన్ నేవి వెంటనే అప్రమత్తమై.. ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ యుద్ధనౌక సిబ్బందిని రంగంలోకి దింపింది. పాకిస్థాన్ ఫిషింగ్ నౌకను సోమాలియా హైజాకర్ల నుంచి ‘ఐఎన్‌ఎస్ సుమిత్రా’ సిబ్బంది రక్షించినట్లు ఇండియన్ నేవీ పేర్కొంది.
ఇరాన్‌కు చెందిన ఓ ఫిషింగ్ నౌకను ఇండియన్ నేవి సిబ్బంది సోమవారం రక్షించారు. ఇరాన్ దేశానికి చెందిన ఫిషింగ్ నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. రంగంలోకి దిగిన ఐఎన్‌ఎస్ సుమిత్రా.. 17 మంది ఇరాన్ దేశస్థులను రక్షించారు.
ఇదీ చదవండి: ఇరాన్ నౌక హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్‌ఎస్ సుమిత్రా’
Comments
Please login to add a commentAdd a comment