లాహోర్: అక్రమంగా సరిహద్దును దాటారన్న ఆరోపణలపై రెండు నెలల క్రితం 19మంది భారతీయులను, ఇద్దరు బంగ్లాదేశీయులను అరెస్టు చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. నవంబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టేదాకా వీరు జైల్లోనే ఉంటారని తెలిపారు. అక్రమ ప్రవేశం, గూఢచర్యం నేరాలపై 19మంది భారతీయులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసి వివిధ జైళ్లలో ఉంచామని చెప్పారు. ఇటీవలే వీరిని ఫెడరల్ రివ్యూబోర్డు ముందు ప్రవేశపెట్టామని, నవంబర్ 9వరకు వీరిని రిమాండ్‌లో ఉంచాలని బోర్డులోని న్యాయమూర్తులు ఆదేశించారని వివరించారు. ఈలోపు జరిపే విచారణ ఆధారంగా నవంబర్ 9న బోర్డు వీరిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. వీరితో పాటు ఒక శ్రీలంక దేశస్తుడిని కూడా అరెస్టు చేశారు. సరైన ఆధారాల్లేవంటూ బోర్డు ఆదేశాల మేరకు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment