indians arrested
-
డాలర్ డ్రీమ్స్ వేటలో.. కటకటాల పాలు!
అమెరికా కలను సాకారం చేసుకునేందుకు భారతీయులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అమెరికాలోకి భారతీయుల అక్రమ వలసలు విపరీతంగా పెరిగినట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (యూఎస్ సీబీపీ) తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు వాళ్లు ప్రధానంగా కెనడా సరిహద్దులను ఎంచుకుంటున్నారు. కెనడా గుండా అమెరికాలో ప్రవేశిస్తూ అరెస్టవుతున్న వారిలో భారతీయులే 22 శాతం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది! యూఎస్ సీబీపీ గణాంకాల ప్రకారం 2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కెనడా సరిహద్దు గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2022లో కెనడా గుండా అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన 1,09,535 మందిలో భారతీయులు 16 శాతం కాగా 2023లో వారి సంఖ్య ఇంకా పెరిగింది. ఆ ఏడాది 1,89,402 మందిలో 30,010 మంది భారతీయులున్నారు. 2024లో 1,98,929 మంది సరిహద్దు దాటేందుకు అక్రమంగా ప్రయత్నించగా వారిలో 43,764 మంది భారతీయులే. లాటిన్ అమెరికా, కరేబియన్ వలసదారులతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. అయినా గత నాలుగేళ్లలో కెనడా గుండా అక్రమంగా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిలో అతిపెద్ద సమూహం భారతీయులేనని వాషింగ్టన్కు చెందిన ఇమిగ్రేషన్ విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా దళాలకు చిక్కకుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల సంఖ్య తెలియదు. కెనడా సరిహద్దే ఎందుకు? అమెరికాలోకి అక్రమ చొరబాట్లకు భారతీయులు కెనడా సరిహద్దునే ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. కెనడా వీసా ప్రక్రియ సులువుగా ఉండటం వాటిలో ముఖ్యమైనది. కెనడా విజిటింగ్ వీసా ప్రాసెసింగ్ కేవలం 76 రోజుల్లో పూర్తవుతుంది. అదే అమెరికా వీసా ప్రాసెసింగ్ కోసమైతే కనీసం ఏడాది వేచి ఉండాల్సిందే. అమెరికాతో కెనడా సరిహద్దు చాలా పొడవైనది. దాంతో అక్కడ రక్షణ తక్కువ. దాంతో అంత సురక్షితమైన మార్గం కానప్పటికీ దీన్నే ఎంచుకుంటున్నారు. పంజాబ్ నుంచే ఎక్కువ ఇలా కెనడా గుండా అమెరికాలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల్లో ఎక్కువ భాగం పంజాబ్, హరియాణాల వాళ్లే ఉంటున్నారు. తర్వాతి స్థానం గుజరాత్‌ది. విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాల కోసం పంజాబీ గ్రామీణ యువత బాగా ఆసక్తి చూపుతోంది. కానీ సరైన విద్యార్హతలు, ఆంగ్ల ప్రావీణ్యం లేని కారణంగా అమెరికా పర్యాటక, విద్యార్థి వీసాలు పొందడం వీరికి గగనంగా మారుతోంది. ప్రత్యామ్నాయంగా అక్రమంగా సరిహద్దులు దాటించే ముఠాలను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చాలామంది లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు సరిహద్దులు దాటేందుకు అతి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాలో వ్యభిచారం.. ఏడుగురు భారతీయుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో వ్యభిచారం చేస్తూ ఏడుగురు భారతీయులు పట్టుబడ్డారు. వీరిలో ఐదుగురు తెలుగు యువకులు ఉన్నట్టుగా స్థానిక అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డెంటన్ కౌంటీ షెరీఫ్ అధికారులు వ్యభిచారాన్ని అరికట్టడానికి హాయ్‌ల్యాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మంగళవారం టెక్సాస్‌లోని డెంట¯న్లో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో మొత్తం 18 మంది నిందితులు పట్టుబడ్డారు. వీరిలో ఏడుగురు భారతీయులు ఉండగా.. అందులో ఐదుగురు తెలుగువారని అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకల, కార్తీక్ రాయపాటి ఉన్నారు. వీరిలో పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై బండి నిఖిల్, కుమ్మరి నిఖిల్‌ను అరెస్ట్ చేశామని, వ్యభిచారం చేయాలని కోరిన ఆరోపణలపై గల్లా మోనిష్, అమిత్‌కుమార్, పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడంతోపాటు 18 ఏళ్లలోపు మైనర్‌ను వ్యభిచారం చేయాలని కోరిన ఆరోపణలపై మేకల జైకిరణ్ రెడ్డిని, వ్యభిచారం చేయాలని అభ్యర్థించిన ఆరోపణలపై రాయపాటి కార్తీక్, నబిన్ శ్రేష్ఠలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పట్టుబడిన మొత్తం 18 మందిలో ఇద్దరి వద్ద అక్రమ ఆయుధాలు సైతం ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ వ్యభిచార ముఠాతో సంబంధాలున్న ఇతర వ్యక్తుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, పట్టుబడిన తెలుగు యువకులు రాయపాటి కార్తీక్ చౌదరి, గల్లా మోనిష్చౌదరి టెక్సాస్ ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ కో–ఆర్డినేటర్లు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
పాక్ చెరలో 19మంది భారతీయులు
లాహోర్: అక్రమంగా సరిహద్దును దాటారన్న ఆరోపణలపై రెండు నెలల క్రితం 19మంది భారతీయులను, ఇద్దరు బంగ్లాదేశీయులను అరెస్టు చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. నవంబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టేదాకా వీరు జైల్లోనే ఉంటారని తెలిపారు. అక్రమ ప్రవేశం, గూఢచర్యం నేరాలపై 19మంది భారతీయులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసి వివిధ జైళ్లలో ఉంచామని చెప్పారు. ఇటీవలే వీరిని ఫెడరల్ రివ్యూబోర్డు ముందు ప్రవేశపెట్టామని, నవంబర్ 9వరకు వీరిని రిమాండ్‌లో ఉంచాలని బోర్డులోని న్యాయమూర్తులు ఆదేశించారని వివరించారు. ఈలోపు జరిపే విచారణ ఆధారంగా నవంబర్ 9న బోర్డు వీరిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. వీరితో పాటు ఒక శ్రీలంక దేశస్తుడిని కూడా అరెస్టు చేశారు. సరైన ఆధారాల్లేవంటూ బోర్డు ఆదేశాల మేరకు విడుదల చేశారు. -
కువైట్‌లో 25 మంది భారతీయుల అరెస్టు
ఇద్దరు ఈజిప్షియన్ల హత్య కేసులో 25 మంది భారతీయులను కువైట్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అరెస్టయిన భారతీయులను రక్షించాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్రమోడీ, పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్‌లకు అక్కడి భారతీయులు, వాళ్ల సహోద్యోగులు సందేశాలు పంపారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ సంఘటన తర్వాత 15 మంది భారతీయులను ఆస్పత్రిలో చేర్చడంతో భారత రాయబార కార్యాలయ అధికారులు వాళ్లను పరామర్శించారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. కువైట్‌లో దాదాపు ఏడున్నర లక్షల మంది భారతీయులున్నారని, వాళ్లంటే తమకు చాలా గౌరవం ఉందని అన్నారు. అయితే.. భారతీయులు ఎక్కడున్నా అక్కడి స్థానిక చట్టాలకు కూడా కట్టుబడి ఉండాలని తెలిపారు.