ఇద్దరు ఈజిప్షియన్ల హత్య కేసులో 25 మంది భారతీయులను కువైట్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అరెస్టయిన భారతీయులను రక్షించాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్రమోడీ, పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్లకు అక్కడి భారతీయులు, వాళ్ల సహోద్యోగులు సందేశాలు పంపారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
ఈ సంఘటన తర్వాత 15 మంది భారతీయులను ఆస్పత్రిలో చేర్చడంతో భారత రాయబార కార్యాలయ అధికారులు వాళ్లను పరామర్శించారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. కువైట్లో దాదాపు ఏడున్నర లక్షల మంది భారతీయులున్నారని, వాళ్లంటే తమకు చాలా గౌరవం ఉందని అన్నారు. అయితే.. భారతీయులు ఎక్కడున్నా అక్కడి స్థానిక చట్టాలకు కూడా కట్టుబడి ఉండాలని తెలిపారు.
కువైట్లో 25 మంది భారతీయుల అరెస్టు
Published Fri, Aug 29 2014 5:44 PM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM
Advertisement