కశ్మీర్‌లో అదుపులోకి..
ఓ సైన్యాధికారిది కీలకపాత్ర
న్యూఢిల్లీ: సైనికాధికారుల నుంచి రహస్యాలను సేకరిస్తున్న ‘గూఢచర్య’ రాకెట్‌కు సంబంధించి జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీకి చెందిన సబర్ అనే ప్రభుత్వ టీచర్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐకి చెందినవాడిగా అనుమానిస్తున్న కఫైతుల్లాఖాన్ నేతృత్వంలో ఈ రాకెట్ నడుస్తున్నట్లుగా పోలీసులు గుర్తించడం తెలిసిందే. కఫైతుల్లాఖాన్‌తో పాటు బీఎస్‌ఎఫ్ అధికారి అబ్దుల్ రషీద్, మాజీ సైనికుడు మునవ్వార్ అహ్మద్ మీర్‌లను అరెస్టు చేయగా.. తాజాగా సబర్‌ను అరెస్టు చేసి, అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశామని ఢిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్ రవీంద్ర యాదవ్ వెల్లడించారు. అయితే సబర్‌ను అరెస్టు చేయడానికి ఢిల్లీ పోలీసులు వెళ్లినప్పుడు హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు వచ్చే విషయం అతనికి ముందుగానే తెలిసింది.
దాంతో ఇంటికి బయటి నుంచి తాళం వేసుకుని లోపల ఉండిపోయారు. పోలీసులు ఇంటి చుట్టూ పరిశీలిస్తుండగానే... సబర్ లోపలి నుంచి పైకప్పు ఎక్కి, ఇంటి వెనుకవైపు దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు.స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులను అడ్డుకోవడంతో.. ఢిల్లీ , కశ్మీర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారంతా కలసి చివరికి సబర్‌ను అరెస్టు చేశారు. సబర్ ఇంట్లో కఫైతుల్లాఖాన్‌తో సబర్ ఫోన్ సంభాషణల సీడీ, అతని నుంచి డబ్బు అందిన ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ సైనికాధికారి నుంచి సబర్ పలు రహస్యాలను సేకరించి.. కఫైతుల్లాఖాన్‌ను అందజేశాడన్నారు.
‘గూఢచర్యం’లో టీచర్ అరెస్ట్
Published Sun, Dec 6 2015 1:40 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement