
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అక్షరధామ్ ఆలయంపై 2002లో జరిగిన ఉగ్రదాడి ఘటనలో ప్రధాన కుట్రదారు అబ్దుల్ రషీద్ అజ్మిరీని ఆ రాష్ట్ర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సౌదీలోని రియాద్ నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయానికి వచ్చిన అతడిని ఎయిర్‌పోర్ట్‌లోనే అదుపులోకి తీసుకున్నారు. తన తల్లి, సోదరుడిని కలుసుకునేందుకు వస్తున్నాడన్న నిఘా వర్గాల సమాచారంతో రషీద్‌ను అరెస్ట్ చేశారు. అక్షరధామ్ ఆలయంపై దాడికి ప్రణాళిక రచించడంతో పాటు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు రషీద్ సాయమందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అహ్మదాబాద్‌లో నివాసముండే రషీద్ అక్షరధామ్ దాడికి ముందు సౌదీకి పారిపోయాడు.