Akshardham Temple
-
సంస్కర్త స్మారకం: అక్షర్ధామ్
అక్షర్ధామ్.... ఆధ్యాత్మికతకు అర్థం చెప్పిన స్వామి నారాయణుడి ఆలయం. సమాజాన్ని ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, తాత్వికత వైపు నడిపించిన సంఘసంస్కర్త స్మారక మందిరమే అక్షర్ధామ్. స్వామి నారాయణుడు 18–19 శతాబ్దాల్లో సమాజంలో కరడుగట్టి ఉన్న సామాజిక దురాచారాలను పరిహరించడం కోసం పని చేశాడు. మనదేశం అప్పుడు స్థానికంగా హిందూ, ముస్లిం పాలకుల పాలనలో ఉంది. ఈ రాజ్యాలన్నీ బ్రిటిష్ పాలన కింద మనుగడ సాగించాయి. ఈ సమ్మేళన సంస్కృతి ప్రభావం సమాజం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. అనేక మూఢ నమ్మకాలు, సామాజిక దురాచారాలు పెచ్చరిల్లిన నేపథ్యంలో మహిళలు ఆంక్షల వలయంలో చిక్కుకుపోయారు. భద్రత, మత విశ్వాసాల నిబంధనల కింద పేదవాళ్లు మహిళలు మగ్గిపోతున్న సమయంలో సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నతుడు స్వామి నారాయణుడు. ఆడపిల్లలను పురిట్లోనే ప్రాణాలు తీస్తున్న రోజుల్లో స్వామి నారాయణుడు సతి దురాచారాన్ని నియంత్రించడంతో΄ాటు మహిళలకు చదువు అవసరాన్ని చెప్పాడు. వివక్ష రహిత, హింస రహిత సమాజాన్ని స్థాపించడం కోసం సమాజాన్ని సన్మార్గంలో నడిపించాడు. ఒక సంఘ సంస్కర్త గౌరవార్థం నిర్మించిన క్షేత్రం కావడంతో ఇక్కడ వైదిక క్రతువులు ఉండవు. ఏకకాలంలో ఈ ఆవరణంలో వేలాదిమంది ఉన్నప్పటికీ రణగొణధ్వనులుండవు. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. అక్షర్‌థామ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఆర్ట్, సైన్స్, కల్చర్, స్పిరిచువాలిటీల సమ్మేళనం. ఇది ఎక్కడుంది! గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఉంది అక్షర్ధామ్. అహ్మదాబాద్ నుంచి 40 కి.మీ.లు ఉంటుంది. రాజస్థాన్ నుంచి తెప్పించిన ఈ పింక్ సాండ్స్టోన్ నిర్మాణం... అందమైన శిల్పసౌందర్యానికి నిలయం. చక్కటి గార్డెన్లు, స్వామి నారాయణ్ జీవిత చరిత్ర, ఆయన తీసుకువచ్చిన సంస్కరణల ఇతివృత్తంలో సాగే చిత్ర ప్రదర్శన, పెయింటింగ్స్, శిల్పాలను చూసి తీరాల్సిందే. ఈ ఆలయంలో ప్రతి అంగుళం అత్యాధునికమైన సాంకేతికతను, ఆధ్యాత్మిక భావనను, క్రమశిక్షణను ప్రతిబింబిస్తుంది. అక్షర్‌ధామ్‌ను ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయాణ సమయం కాకుండా కనీసం మూడు గంటల సమయాన్ని కేటాయించుకోవాలి. అక్షర్ధామ్కి ఎంట్రీ ఫీజ్ లేదు కానీ ఎగ్జిబిషన్లు, వాటర్ షోలకు టికెట్ ఉంటుంది. వాటర్ షో ‘సత్ చిత్ ఆనంద్’ కథనం కఠోపనిషత్తు ఆధారంగా హిందీలో సాగుతుంది నెరేషన్. నచికేతుడికి యముడు వరాలివ్వడం వంటి ఉపనిషత్ సారాంశాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ మల్టీ కలర్ లేజర్స్, ఫైర్‌బాల్స్, అండర్ వాటర్ ఫ్లేమ్స్‌లో టెక్నాలజీని ఎంజాయ్ చేయవచ్చు. ఫొటో పాయింట్ అక్షర్ధామ్ లోపలికి మన కెమెరాలను అనుమతించరు, కానీ ఈ ఆవరణలో ఫొటో పాయింట్ దగ్గర కెమెరాతో ఒక ఫొటోగ్రాఫర్ ఉంటాడు. పర్యటనకు గుర్తుగా అక్షర్ధామ్ గోపురం కనిపించేటట్లు ఫొటో తీయించుకోవచ్చు. సావనీర్ షాప్‌లో పుస్తకాలు, ఫొటోలు, వీడియో సీడీలతోపాటు అక్షర్ధామ్ టీ షర్టులుంటాయి. ఫొటోలతో ఇంటిని నింపడం కంటే టీ షర్టు కొనుక్కోవడం మంచి ఆప్షన్. అక్షర్ధామ్ ఆవరణ మొత్తం తిరిగి చూసిన తర్వాత ఆశ్యర్యంగా అనిపించేదేమిటంటే... స్వామి నారాయణుడి జీవనశైలి అత్యంత నిరాడంబరంగా సాగింది. ఆయన స్మారక మందిరం మాత్రం సంపన్నతకు ప్రతిరూపంగా ఉంది. అభిషేకం చేయవచ్చు! అక్షర్‌ధామ్‌లో పర్యాటకులు అందరూ స్వామి నారాయణ్‌కి అభిషేకం చేయవచ్చు. అభిషేక మండపంలో పూలు, ఆకులతో నీటి చెంబులను వరుసగా పేర్చి ఉంటారు. టికెట్ తీసుకుని మౌనంగా క్యూలో వెళ్లి అభిషేకం చేయాలి. ఇక్కడ నియమాలు చాలా కచ్చితంగా ఉంటాయి. కానీ హ్యూమన్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. డ్రెస్ కోడ్ విషయంలో ఇండియన్, వెస్ట్రన్ అనే నియమాలేవీ ఉండవు. కానీ భుజాలు, ఛాతీ, నాభి, భుజాల నుంచి మోచేతుల వరకు, మోకాళ్ల కింది వరకు కవర్ అయ్యే డ్రెస్‌లను మాత్రమే అనుమతిస్తారు. మనం ధరించిన డ్రస్ వాళ్ల నియమాలకు లోబడి లేకపోతే మూడు వందల రూపాయలు డిపాజిట్ చేయించుకుని సరోంగ్ అనే డ్రస్‌ను ఇస్తారు. మన దుస్తుల మీద దానిని ధరించాలి. డ్రస్ వెనక్కి ఇచ్చినప్పుడు మన డబ్బు ఇచ్చేస్తారు. ఫోన్లు, కెమెరాలు, పెన్‌డ్రైవ్‌లు, మ్యూజిక్ డివైజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, ఆయుధాలు, ఆటబొమ్మలు, లగేజ్, పెట్లు, ఆహార పానీయాలు, పొగాకు ఆల్కహాల్ ఇతర నిషేధిత డ్రగ్స్‌కు అనుమతి ఉండదు. చంటి పిల్లలతో వెళ్లే వాళ్లకు పాలు, ఆహారం, నీళ్ల సీసాలను అనుమతిస్తారు. వికలాంగులకు, వృద్ధులకు వీల్ చైర్ ఫ్రీగా ఇస్తారు. -
మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి
అక్షరధామ్ నుండి ప్రవాసాంద్రులకు పిలుపు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ స్పర్శ్ హస్పైస్ హైదరాబాద్‌లో చేపడుతున్న కార్యక్రమాలకు అమెరికాలోని స్పర్శ్ విభాగం మద్ధతుగా నిలిచింది. అమెరికా న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలో ఇటీవల నిర్మించిన అక్షర్ ధామ్ మందిరం వేదికగా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి అంటూ ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చింది. స్పర్శ్ హస్పైస్ కార్యక్రమాలేంటీ? స్పర్శ్ హస్పైస్ ఒక స్వచ్ఛంధ సంస్థ. హైదరాబాద్ కేంద్రంగా రోగులకు ఉచిత సేవలందిస్తోంది. ముఖ్యంగా చాలా కాలం పాటు వైద్య సేవలు అవసరమయ్యే అభాగ్యులకు (Long term care) స్పర్శ్ అండగా నిలుస్తోంది. మంచానికే పరిమితమైపోయి, దీర్ఘకాలం మెడికల్ కేర్ కోరుకునే వారికి ఇది అండగా నిలుస్తోంది. దీంతో పాటు కొందరు వృద్ధులు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడమో, లేక కుటుంబం, దగ్గరి వారి నుంచి మద్ధతు లేకపోవడమో, లేక చికిత్స లేదనుకున్న సమయంలో తీవ్ర ఆందోళనకు గురైపోతున్నారు. క్యాన్సర్, న్యూరో, గుండె పోటు లేక ఇతర తీవ్రమైన వ్యాధుల బారిన పడిన వారు ఇందులో ఉంటున్నారు. ఇలాంటి వారందరికి స్పర్శ్ అండగా నిలుస్తోంది. స్పర్శ్ హస్పైస్‌లో ఎలాంటి సౌకర్యాలున్నాయి? స్పర్శ్‌లో ఆరు హోం కేర్ వ్యాన్లు ఉన్నాయి. వీటిలో అన్ని రకాల సౌకర్యాలున్నాయి. అలాగే ఔట్ పేషేంట్ సర్వీసులతో పాటు ఇన్ పేషేంట్ సౌకర్యాలున్నాయి. దీర్ఘకాలం చికిత్స అందించే సౌకర్యాలు, నొప్పి నివారణ మార్గాలు, ఔషద చికిత్సతో పాటు మేమున్నామంటూ అండగా నిలిచే సామాజిక మద్ధతు స్పర్శ్‌లో ఉంది. దీని వల్ల రోగులకు పూర్తి భరోసా కలగడంతో పాటు త్వరగా స్వస్థత లభిస్తోంది. అమెరికా అక్షర్ధామ్ కార్యక్రమమేంటీ? న్యూజెర్సీ రాబిన్స్‌విల్లె 112 మెయిన్ స్ట్రీట్‌లో ఏర్పాటయిన BAPS స్వామి నారాయణ్ మందిర్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఇటీవల నిర్మించిన అక్షర్ధామ్ మందిరం అత్యంత ఆకర్షణీయంగా ఉండడంతో పాటు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్పర్శ్ చేస్తోన్న సామాజిక కార్యక్రమాలకు అక్షర్ధామ్ తన వంతు మద్ధతు ప్రకటించింది. అక్షర్ధామ్ ట్రస్టీలయిన డాక్టర్ సుబ్రహ్మణ్యం, లక్స్ గోపిశెట్టి ఈ సందర్భంగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి అంటూ పిలుపునిచ్చారు. విజిట్ అక్షర్ధామ్ అక్షర్ధామ్ ఆలయంలో అక్టోబర్ 22, ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇక్కడికి వచ్చే వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి అక్షర్ధామ్ ఆలయ మందిరమంతా చూపిస్తారు. అనంతరం స్వామి వారి ప్రసాదాన్ని, మధ్యాహ్న భోజనాన్ని అతిథ్యంలో భాగంగా అందజేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను స్పర్శ్ హస్పైస్‌కు అందిస్తారు. -
అక్షరధామ్ ఆలయంలో రిషి సునాక్ ప్రార్ధనలు
ఢిల్లీ:బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తితో కలిసి ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. దాదాపు గంటపాటు దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హిందువుగా గర్విస్తున్నానని అన్నారు. 'నేను హిందువునని గర్విస్తున్నాను. అదే వాతావరణంలో పెరిగాను. ఇప్పటికీ అలానే ఉన్నాను. ఢిల్లీలో ఉండే ఈ రెండు రోజుల్లో ఒక మందిరాన్ని దర్శించాలని అనుకున్నాను.' అని రిషి సునాక్ అన్నారు. రిషి సునాక్ రాకతో దేవాలయంతో సహా పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. జీ20 సమావేశాలకు హాజరుకావడానికి శుక్రవారం ఢిల్లీకి వచ్చారు రిషి సునాక్ దంపతులు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే 'జై శ్రీరాం' అని పలకరిస్తూ కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే వారికి స్వాగతం పలికారు. రుద్రాక్ష, భగవద్గీత, హనుమాన్ చాలీసాను రిషి సునాక్ దంపతులకు అందించారు. శనివారం జీ20 సదస్సు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక చర్చలు జరిపారు రిషి సునాక్. వాణిజ్య, పెట్టుబడుల అంశంలో మరిన్ని ఒప్పందాలు చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు. ఇదీ చదవండి: G20 Summit: రిషి సునాక్, అక్షతా మూర్తి పిక్ వైరల్.. -
రేణువులలో నారాయణుడు
అక్షరధామ్ రూపురేఖలు, హవా మహల్ వర్ణమిశ్రాల మేళవింపుతో అబూధాబిలో మన దేశం నిర్మిస్తున్న స్వామి నారాయణ్ ఆలయం పూర్తయేందుకు కొంత సమయం పట్టవచ్చు. అయితే సమయంతో నిమిత్తం లేకుండా ఇప్పటికే ఆ నిర్మాణ ప్రయత్నాల్లోంచి మత సామరస్యం గుడి గంటల ధ్వనిలా ప్రపంచమంతటా వినిపిస్తోంది! ఇస్లాం దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబు ధాబి నగరంలో 26 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఓ హిందూ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం 2015లోనే యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ 16 ఎకరాల స్థలాన్ని ఉచితంగా కేటాయించగా, ఇటీవల యూఏఈ ప్రభుత్వం నిర్వహించిన సర్వమత సమ్మేళనం సందర్భంగా ఆలయంలో పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం మరో పది ఎకరాలు స్థలాన్ని విరాళంగా ప్రకటించారు. అబు ధాబి–దుబాయ్ ప్రధాన రోడ్డు పక్కన నిర్మించనున్న స్వామి నారాయణ్ ఆలయ నిర్మాణానికి ఇటీవలే మహంత్ స్వామి మహరాజ్ భూమి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు కూడా. బ్రహ్మవిహారి స్వామి ఆలయ నిర్మాణ బాధ్యతలు చూస్తారు. అతిపెద్ద షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ మసీదుకు సమీపంలోనే ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2019 సంవత్సరాన్ని టాలరెన్స్ (సహనం) సంవత్సరంగా ప్రకటించడమే కాకుండా టాలరెన్స్ పేరిట ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మత సామరస్యం కోసం ఓ నిధిని కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ‘సహన శాఖ’ను ఏర్పాటు చేసిన ఏకైక దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చరిత్రలోకి ఎక్కింది. ఈ శాఖ సమన్వయంతో ఇస్లాం మత పెద్దల మండలి ఫిబ్రవరి నెల మూడు, నాలుగు తేదీల్లో క్రై స్తవ, ఇస్లాం సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించింది. దీనికి క్రై స్తవుల తరఫున పోప్ ఫ్రాన్సిస్ హాజరుకాగా, ఇస్లాం మతస్థుల తరఫున అల్ అజర్ ఇమామ్ అహ్మద్ అల్ తయ్యబ్ ముఖ్య అతిథిగా హాజరై ఓ సంయుక్త ప్రకటన చేశారు. ‘తూర్పు–పశ్చిమ ప్రాంతాలకు చెందిన క్యాథలిక్కులు, క్యాథలిక్ చర్చి, తూర్పు–పశ్చిమ ప్రాంతాలకు చెందిన ముస్లింలు, అల్ అజర్ అల్ షరీఫ్‌లు సంయుక్తంగా చేస్తున్న ప్రకటన ఏమిటంటే పరస్పర సహకారం, పరస్పర అవగాహనే ప్రవర్తన నియామావళిగా చర్చలే సరైన మార్గంగా కలసి ముందుకు సాగుతాం’ అని. ఆ డిక్లరేషన్‌ను పోప్, ఇమామ్‌లు సంయుక్తంగా విడుదల చేశారు. పాశ్చాత్య దేశాల్లో క్రై స్తవులు, అరబ్ ప్రపంచంలోని ఇస్లాం మతస్థుల మధ్యన సత్సంబంధాలు నెలకొల్పాలనే లక్ష్యంతోనే ఈ సమ్మేళనాన్ని నిర్వహించినప్పటికీ ప్రపంచంలోని పలు మతాలకు చెందిన ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. భారత ప్రతినిధిగా హాజరైన బ్రహ్మ విహారి స్వామి సమ్మేళనంలో మాట్లాడారు. ‘నేడు ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని సంస్కృతులు, అన్ని మతస్థుల ముందున్న ముఖ్యమైన అంశం ఒక్కటే. ఐక్యంగా కలిసి ముందుకు వెళితే కలిసి పురోభివృద్ధి సాధిస్తాం. విడిపోయి ముందుకు పోవాలనుకుంటే కుంటుపడిపోతాం’ అని! మారుతున్న దేశం గతంలో యూఏఈ కరడుగట్టిన ఇస్లాం దేశం. భారతదేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడిన దావూద్ ఇబ్రహీం తొలుత యూఏఈలోనే ఆశ్రయం పొందారు. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని 1996లో గుర్తించిన మూడవ దేశం యూఏఈ. పాకిస్థాన్, సౌదీ అరేబియా తర్వాత ఈ దేశం అక్కిడి ప్రభుత్వాన్ని గుర్తిస్తూ ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అప్ఘానిస్తాన్’ అని నామకరణం కూడా చేసింది. అలాంటి దేశంలో యువరాజు పట్టాభిషక్తుడైన నాటి నుంచి వివిధ మతాల మధ్య సామరస్యం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు.తమ దేశంలో నివసిస్తున్న వివిధ మతాల వారికి ఉదారంగా స్థలాలు కేటాయించారు. అందులో భాగంగానే ఈ హిందూ దేవాలయం కోసం 26 ఎకరాలు ఇచ్చారు. యూఏఈలో 26 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరికోసం దుబాయిలో ఇప్పటికే ఓ శివాలయం, కృష్ణుడి ఆలయం ఉన్నాయి. – వి.నరేందర్ రెడ్డి సాక్షి వెబ్ డెస్క్ -
‘అక్షరధామ్’ ప్రధాన కుట్రదారు అరెస్ట్
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అక్షరధామ్ ఆలయంపై 2002లో జరిగిన ఉగ్రదాడి ఘటనలో ప్రధాన కుట్రదారు అబ్దుల్ రషీద్ అజ్మిరీని ఆ రాష్ట్ర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సౌదీలోని రియాద్ నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయానికి వచ్చిన అతడిని ఎయిర్‌పోర్ట్‌లోనే అదుపులోకి తీసుకున్నారు. తన తల్లి, సోదరుడిని కలుసుకునేందుకు వస్తున్నాడన్న నిఘా వర్గాల సమాచారంతో రషీద్‌ను అరెస్ట్ చేశారు. అక్షరధామ్ ఆలయంపై దాడికి ప్రణాళిక రచించడంతో పాటు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు రషీద్ సాయమందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అహ్మదాబాద్‌లో నివాసముండే రషీద్ అక్షరధామ్ దాడికి ముందు సౌదీకి పారిపోయాడు. -
‘అక్షర్ధామ్’లో షౌకతుల్లాకు విముక్తి
{పాసిక్యూషన్ అభియోగాలు తోసిపుచ్చిన ప్రత్యేక పోటా కోర్టు నిందితుడు హైదరాబాద్ వాసి అహ్మదాబాద్ హైదరాబాద్: గుజరాత్‌లోని అక్షర్ధామ్ దేవాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వాసి షౌకతుల్లా ఘోరీకి జైలు జీవితాన్నుంచి విముక్తి లభించింది. ఇతడితో పాటు మాజిద్ పటేల్ అలియాస్ ఉమర్జీ అనే మరో నిందితుడినీ కేసు నుంచి విముక్తి కల్పిస్తూ అహ్మదాబాద్‌లోని ప్రత్యేక పోటా (ప్రివెన్షన్ ఆఫ్ టైస్ట్ యాక్టివిటీస్ యాక్ట్) కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా వీరి పాత్రపై ప్రాసిక్యూషన్ అభియోగాలను కోర్టు తోసిపుచ్చింది. మూడు వారాలక్రితం సుప్రీం కోర్టు ఆరుగురు నిందితులకు స్వేచ్ఛ కల్పించిన విషయం తెలిసిందే. ఇపుడు మిగిలిన ఇద్దరు నిందితులకు పోటా కోర్టు విముక్తి కల్గించింది. కాగా, షౌకతుల్లాను రాష్ట్ర నిఘా వర్గాల సాయంతో గుజరాత్ పోలీసులు 2009 జూలై 18న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అప్పటి నుంచీ అతను సబర్మతి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అక్షర్ధామ్ దేవాలయం (స్వామి నారాయణ్ టెంపుల్)పై 2002 సెప్టెంబర్ 24న పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు చెందిన ఇద్దరు సాయుధులు విచక్షణారహితంగా బాంబులు, ఏకే-47లతో దాడి చేసి 30 మందికి పైగా పౌరుల్ని పొట్టనపెట్టుకున్నారు. 50 మంది భక్తులను బందీలుగా చేసుకున్నారు. వారిని విడిపించడానికి ఎన్ఎస్జీ కమాండోలు ‘ఆపరేషన్ వజ్ర శక్తి’ నిర్వహించారు. కేసు దర్యాప్తు చేసిన గుజరాత్ పోలీసులు ఈ కుట్ర మొత్తం సౌదీలోని రియాద్‌లో జరిగినట్లు గుర్తించి, దాడిలో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన జైషేమహ్మద్, లష్కరేతోయిబా ప్రమేయం ఉన్నట్లు కనుగొన్నారు. రియాద్, ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, హైదరాబాద్, అహ్మదాబాద్‌ల్లో ఉన్న ఉగ్రవాద మాడ్యూల్స్ ఇందుకు సహకరించాయని నిర్ధారించారు. ఈ దాడిలో హైదరాబాద్‌కు చెందిన ‘ఉగ్ర’ సోదరులు ఫర్హాతుల్లా ఘోరీ, సైదాబాద్‌లోని కూర్మగూడ వాసి షౌకతుల్లా ఘోరీల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నిందితులిద్దరూ తమ మకాంను సౌదీ అరేబియాలోని జెడ్డాకు మార్చారు. రాష్ట్ర నిఘా అధికారులకు షౌకతుల్లా దుబాయ్ నుంచి వస్తున్నట్లు సమాచారం అందడంతో 2009లో అతడిని అరెస్టు చేశారు. ఇతడి సోదరుడు ఫర్హాతుల్లాతో పాటు మేనల్లుడు గిడ్డా అజీజ్ సైతం హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. -
అక్షరధామ్‌పై దాడి నిందితుల విడుదల
స్వాగతించిన ముంబై న్యాయవాదులు ముంబై: గాంధీనగర్‌లోని అక్షరధామ్ దేవాలయంపై ఉగ్రవాదుల దాడికేసులో ఆరుగురు నిందితులను సుప్రీం కోర్టు విడుదల చేయడాన్ని ముంబై న్యాయవాదులు స్వాగతించారు. ప్రభుత్వ న్యాయవాది నిందితులపై నేరం రుజువు కాకపోవడంతో ఆరుగురు నిందితులను విడుదల చేశారని జమాయత్ ఉలేమా ఇ మహారాష్ట్ర (జేయూఈఎమ్)న్యాయవాది గుల్జార్ అజ్మీ తెలిపారు. ఆ సంస్థ నిందితుల తరపున ఉచితంగా వాదించింది. పోటా చట్టం కింద తప్పుడు కేసులు బనాయిస్తూ, ఆ తరువాత గుజరాత్ కోర్టు శిక్షకు గురవుతున్న అమాయక ముస్లిం యువత కేసులు వాదించడం కోసం జేయూఈఎమ్ పనిచేస్తోంది. ఇందులో పలువురు ప్రముఖ క్రిమినల్ న్యాయవాదులతోపాటు మాజీ సొలిసిటర్ జనరల్ అమ్రిందర్ శరణ్ కూడా ఉన్నారు. ప్రధానిగా నరేంద్రమోడీ ఎన్నికవ్వడం గుజరాత్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని అన్నారు. శిక్షకు వ్యతిరేకంగా నిందితుల అభ్యర్థనను స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సహేతుక సందే హం కింద... వారిమీద ఎలాంటి నేరారోపణ చేయలేకపోవడంతో ఆరుగురిని విడుదల చేసింది. ఆరుగురు నిందితుల్లో ఇద్దరికి ఉరిశిక్ష, మరో ఇద్దరికి పదేళ్ల కారాగార శిక్ష పడిన సంగతి విదితమే.