అల్లు అర్జున్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనపై నమోదైన కేసులో ఇవాళ అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.
ఈనెల 4వ తేదీన పుష్ప-2 బెనిఫిట్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ మూవీని వీక్షించారు. అదే సమయంలో తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పెద్దఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడికి గాయాలు కావడంతో నిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు.
అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment