అల్లు అర్జున్ సినిమాకు పుష్ప-2 మూవీకి భద్రతా కల్పించాలని తాము కోరినట్లు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ యాజమాన్యం తెలిపింది. తమకు 4, 5 తేదీల్లో సెక్యూరిటీ ఇవ్వాలని రెండో తేదీనే లేఖ రాసినట్లు వెల్లడించింది. పుష్ప-2 ప్రత్యేక షోల దృష్ట్యా థియేటర్ వద్ద భద్రత కల్పించాలని చిక్కడపల్లి ఏసీపీకి రాసిన లేఖలో కోరినట్లు యాజమాన్యం పేర్కొంది.
అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి
అయితే డిసెంబర్ 4న వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప-2 బెనిఫిట్ షో ప్రదర్శించారు. ఈ షోకు అల్లు అర్జున్‌తో పాటు ఆయన సతీమణి కూడా హాజరయ్యారు. అయితే బన్నీని చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృత్యువాతపడగా.. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment