ఎన్నో రోజుల నిరీక్షణకు తెరపడింది. అనుకున్నట్లుగానే ఒక రోజు ముందుగానే పుష్ప-2 థియేటర్లలో సందడి చేశాడు. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. దీంతో ఎన్నో రోజులుగా వెయిట్ చేసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా థియేటర్లకు ఉప్పెనలా తరలివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 విడుదల కావడంతో బన్నీ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు.
అయితే పుష్ప-2 రిలీజ్‌కు ముందు ప్రతి ఒక్కరూ టీమ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సైతం పుష్ప-2 సక్సెస్ సాధించాలని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ తనయుడు అయాన్ కూడా తన నాన్నపై ప్రశంసలు కురిపించాడు. సినిమా పట్ల మీ నిబద్ధత, హార్ట్ వర్క్‌ను చూసి గర్వపడుతున్నా అంటూ లేఖ రాశాడు.
ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప నటుడి మూవీ రిలీజ్ కానుంది. ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం.. పుష్ప-2 కేవలం సినిమా మాత్రమే కాదు.. సినిమా పట్ల నీకున్న ప్రేమను తెలిజేస్తుందని లేఖలో రాశాడు. నా జీవితంలో నువ్వే ఎప్పటికీ హీరో.. నీకున్న కోట్లాది అభిమానుల్లో నేను ఒకడిని అంటూ తన చిట్టి చేతులతో రాసిన లేఖ నెట్టింట వైరలవుతోంది. దీనికి బన్నీ రిప్లై కూడా ఇచ్చాడు. ఈ లెటర్ నా గుండెలను తాకిందంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు.
Touched by my son ayaan’s letter 🖤 pic.twitter.com/dLDKOvb6jn
— Allu Arjun (@alluarjun) December 4, 2024
Comments
Please login to add a commentAdd a comment