
World Boxing Championship.. ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సంజీత్ (92 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. బెల్‌గ్రేడ్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో సంజీత్ 0–5తో అజీజ్ మొహియుద్దీన్ (ఇటలీ) చేతిలో... నిశాంత్ 1–4తో వాదిమ్ ముసయెవ్ (రష్యా) చేతిలో ఓడారు. 54 కేజీల విభాగంలో నేడు జరిగే సెమీఫైనల్లో భారత బాక్సర్ ఆకాశ్ కుమార్ కజకిస్తాన్‌కు చెందిన మక్మూద్ సమీర్‌ఖాన్‌తో తలపడనున్నాడు.