World Boxing Championships 2023: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నేడు ముగ్గురు భారత బాక్సర్లు కీలకపోరుకు సిద్ధమయ్యారు. తెలంగాణకు చెందిన హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణాకు చెందిన దీపక్ భోరియా (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) సెమీఫైనల్ బౌట్‌లలో పోటీపడనున్నారు.
2022 యూరోపియన్ చాంపియన్ బిలాలా బెనామా (ఫ్రాన్స్)తో దీపక్; సైడెల్ హోర్టా (క్యూబా)తో హుసాముద్దీన్; 2022 ఆసియా చాంపియన్ అస్లాన్‌బెక్ షింబెర్జనోవ్ (కజకిస్తాన్)తో నిశాంత్ దేవ్ తలపడతారు. సెమీఫైనల్లో గెలిస్తే ఫైనల్ చేరి స్వర్ణ–రజత పతకాల బరిలో ఉంటారు. ఓడితే కాంస్య పతకాన్ని గెల్చుకుంటారు.
భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం గం. 5:30కు దీపక్ బౌట్ ఉంది. ఆ తర్వాత హుసాముద్దీన్, నిశాంత్ దేవ్ బౌట్‌లు జరుగుతాయి. ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ఈ బౌట్‌లను ప్రత్యక్షంగా తిలకించవచ్చు. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ నుంచి ఒక్కరే ఫైనల్‌కు అర్హత సాధించారు. 2019లో అమిత్ పంఘాల్ (52 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకం గెల్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment