Sumit sangvan
-
ప్రిక్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టిన సుమిత్
బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో శనివారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సుమిత్ (75 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... సచిన్ (80 కేజీలు) రెండో రౌండ్లో, గోవింద్ సహని (48 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. సుమిత్ 5–0తో అబ్దుమలిక్ బొల్తయెవ్ (తజికిస్తాన్)పై, నిశాంత్ దేవ్ 4–1తో మెర్వన్ క్లెయిర్ (మారిషస్)పై గెలుపొందారు. సచిన్ 1–4తో రాబీ గొంజాలెస్ (అమెరికా) చేతిలో, గోవింద్ 0–4తో సాఖిల్ అలఖెవర్‌దోవి (జార్జియా) చేతిలో పరాజయం పాలయ్యారు. చదవండి: నేడు న్యూజిలాండ్‌తో భారత్ కీలక పోరు.... ఓడితే ఇక అంతే! -
బాక్సర్ సుమీత్‌పై ఏడాది నిషేదం
న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ మాజీ రజత పతక విజేత, భారత బాక్సర్ సుమీత్ సాంగ్వాన్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) గురువారం ఏడాది నిషేధాన్ని విధించింది. గత అక్టోబర్ నెలలో అతని నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా... అందులో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో ఉన్న ‘ఎసిటజొలమైడ్’ ఉన్నట్లు తేలింది. దీంతో అతనిపై నిషేధం విధిస్తున్నట్లు ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ప్రకటించారు. దీంతో 91 కేజీల విభాగంలో ఒలింపిక్స్ అర్హత పోటీలకు నిర్వహించే ట్రయల్స్‌కు సుమీత్ దూరమయ్యాడు. -
ప్రిక్వార్టర్స్‌లో సుమిత్
బాకు (అజర్ బైజాన్): ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు) ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన రెండో రౌండ్లో సుమిత్ 2-1 తేడాతో ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన జున్ కార్లోస్ కారిలో (కొలంబియా)పై సంచలన విజయం సాధించాడు. మరోవైపు ఆసియా క్రీడల కాంస్య పతక విజేత సతీశ్ కుమార్ (+91 కేజీలు), డీన్ గార్డినర్ (ఐర్లాండ్)తో జరిగిన బౌట్లో పరాజయం చవిచూశాడు. బౌట్ మధ్యలో సతీశ్ కంటికి గాయం కావడంతో బౌట్‌ను నిలిపివేసి గార్డినర్‌ను విజేతగా ప్రకటించారు. మరో భారత బాక్సర్ అమృత్‌ప్రీత్ సింగ్ (91 కేజీలు) తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు.