
బెల్‌గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో శనివారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సుమిత్ (75 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... సచిన్ (80 కేజీలు) రెండో రౌండ్‌లో, గోవింద్ సహని (48 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు.
సుమిత్ 5–0తో అబ్దుమలిక్ బొల్తయెవ్ (తజికిస్తాన్)పై, నిశాంత్ దేవ్ 4–1తో మెర్వన్ క్లెయిర్ (మారిషస్)పై గెలుపొందారు. సచిన్ 1–4తో రాబీ గొంజాలెస్ (అమెరికా) చేతిలో, గోవింద్ 0–4తో సాఖిల్ అలఖెవర్‌దోవి (జార్జియా) చేతిలో పరాజయం పాలయ్యారు.
చదవండి: నేడు న్యూజిలాండ్‌తో భారత్ కీలక పోరు.... ఓడితే ఇక అంతే!
Comments
Please login to add a commentAdd a comment