నీతూ, స్వీటీ ‘పసిడి’ పంచ్‌ పోరు  | Women-World Boxing Championship: Nikhat-Lovlin-Neetu-Sweety Eye-Gold | Sakshi
Sakshi News home page

World Boxing Championship: నీతూ, స్వీటీ ‘పసిడి’ పంచ్‌ పోరు 

Published Sat, Mar 25 2023 8:03 AM | Last Updated on Sat, Mar 25 2023 8:07 AM

Women-World Boxing Championship: Nikhat-Lovlin-Neetu-Sweety Eye-Gold - Sakshi

ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నేడు ఇద్దరు భారత బాక్సర్లు నీతూ (48 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు) పసిడి పతకాల కోసం పోటీపడనున్నారు. నేటి ఫైనల్స్‌లో లుత్సయ్‌ఖాన్‌ (మంగోలియా)తో నీతూ... లీనా వాంగ్‌ (చైనా)తో స్వీటీ తలపడతారు. హరియాణాకు చెందిన 22 ఏళ్ల నీతూ 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకం నెగ్గింది. 2017, 2018 ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలను సొంతం చేసుకుంది. 

సీనియర్‌ ప్రపంచ చాంపియన్‌లో నీతూ తొలిసారి ఫైనల్‌కు చేరింది. హరియాణాకే చెందిన 30 ఏళ్ల స్వీటీ రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2014లో రజత పతకం నెగ్గిన స్వీటీ ఈసారైనా తన పసిడి కలను సాకారం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో నిఖత్‌ జరీన్‌ (50 కేజీలు), లవ్లీనా (75 కేజీలు) పోటీపడతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement