
బాక్సింగ్ చాంప్ సాయి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా అండర్-19 బాక్సింగ్ టోర్నీలో జాతీయ బాక్సర్ ఎస్.సాయి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్‌లో సోమవారం జరిగిన 60 కేజీ విభాగం ఫైనల్లో ఎస్.సాయి.. జి.అనంత్ కుమార్(విశాఖపట్నం)పై విజయం సాధించి టైటిల్‌ను గెలిచాడు. విజేతలకు జాతీయ మాజీ బాక్సర్ పి.వెంకటేష్ యాదవ్ పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రా ష్ట్ర పీఈటీల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.సోమేశ్వర్‌రావు, శ్రీనివాస్‌యాదవ్‌లు పాల్గొన్నారు.
ఫైనల్స్ ఫలితాలు
48 కేజీ: 1.కె.క్రాంతి (విశాఖపట్నం), 2.ఎస్.సతీష్, 3.ఎ.తేజ(నల్గొండ), 3.కె.నాగతేజ(రంగారెడ్డి). 51 కేజీ: 1.మహేందర్ (హైదరాబాద్), 2.జి.హరికృష్ణ (విశాఖపట్నం, 3.సి.హెచ్.రాహుల్ (విజయనగరం), 3.ఎస్.శేఖర్ (వరంగల్). 54 కేజీ: 1.ఎం.డి.జునైద్ (నిజామాబాద్), 2.ఎన్.హరికృష్ణ (విశాఖపట్నం), 3.రవిచంద్రా రెడ్డి (కరీంనగర్), 3.ఎస్.నవీన్ కుమార్ (రంగారెడ్డి). 57 కేజీ: 1.ఎన్.తరుణ్ (నల్గొండ ), 2.ఎ.శ్రీకాంత్ (ఆదిలాబాద్), 3.కృష్ణారావు (విజయనగరం), 3.ఎ.శివప్రసాద్ (కరీంనగర్). 64 కేజీ: 1.పి.ప్రభు (హైదరాబాద్), 2.బి.ప్రసాద్ (విజయనగరం), 3.బి.శుభం (రంగారెడ్డి), 3.ఇ.కిరణ్ (విశాఖపట్నం). 69 కేజీ: 1.వి.ప్రసాద్(విశాఖపట్నం), 2.జె.రాజ్ కుమార్ (రంగారెడ్డి), 3.మణిరత్నం (గుంటూరు), 3.ఎస్.కె.షబ్బీర్ (విజయనగరం). 75 కేజీ: 1.శ్రవణ్ థామస్ (రంగారెడ్డి), 2.సయ్యద్ బషీరుద్దీన్ (హైదరాబాద్), 3.మనీష్ (అనంతపురం), 3.వి.అవినాష్ (పశ్చిమ గోదావరి). 81 కేజీ: 1.కె.స్వామి (హైదరాబాద్), 2.కార్తీక్ (గుంటూరు), 3.శివ కుమార్ (నల్గొండ), 3.రవితేజ (కరీంనగర్). 91 కేజీ: 1. మహ్మద్ మోసిన్ (హైదరాబాద్), 2. కె.జగదీష్ (విశాఖపట్నం), 3.పి.శ్రీహరి (విజయనగరం), 3.వి.మన్‌దీప్ (రంగారెడ్డి). 91+ కేజీలు: 1.పునీత్ కుమార్ (విశాఖపట్నం), 2.ఉమామహేశ్వర్ (హైదరాబాద్).