
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ అమెచ్యూర్ చెస్–బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ సోదర త్రయం బిలాల్ మొహమ్మద్, ముస్తఫా మొహమ్మద్, హుస్సేన్ మొహమ్మద్ మెరిసింది. కోల్‌కతాలో ఇటీవల ముగిసిన ఈ టోర్నీలో భారత్ తరఫున బరిలోకి దిగిన బిలాల్ స్వర్ణం సాధించగా... ముస్తఫా కాంస్యం, హుస్సేన్ కాంస్యం దక్కించుకున్నారు. బిలాల్ అండర్–14 విభాగంలో 46 కేజీల కేటగిరీలో విజేతగా నిలిచాడు. ముస్తఫా 66 కేజీల విభాగంలో... హుస్సేన్ 62 కేజీల విభాగంలో మూడో స్థానాన్ని సంపాదించారు. ఈ ముగ్గురు సోదరులు హైదరాబాద్‌లోని హబీబ్ ముస్తఫా బాక్సింగ్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment