బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్ (మహిళల 51 కేజీలు), హుసాముద్దీన్ (పురుషుల 56 కేజీలు)లతోపాటు మంజు రాణి (49 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), బ్రిజేశ్ యాదవ్ (81 కేజీలు), దీపక్ సింగ్ (49 కేజీలు) కూడా సెమీస్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో నిఖత్ 5–0తో సిటోరా షాగ్‌దరోవా (ఉజ్బెకిస్తాన్)పై, హుసాముద్దీన్ 5–0తో లీ యెచాన్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment