
నిఖత్ జరీన్ శుభారంభం (PC: BFI)
నిఖత్ శుభారంభం.. ముందుడుగు వేసిన సిమ్రన్‌జీత్ కౌర్
National Boxing Championships 2022: భోపాల్‌లో జరుగుతున్న జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు) శుభారంభం చేసింది. తమిళనాడు బాక్సర్ అభినయతో జరిగిన తొలి రౌండ్ బౌట్‌లో నిఖత్ పంచ్‌ల ధాటికి అభినయ తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను తొలి రౌండ్‌లోనే నిలిపి వేశారు.
ఈ క్రమంలో ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించిన నిఖత్.. గురువారం నాటి బౌట్‌లో మేఘాలయకు చెందిన ఇవా మార్బనియంగ్‌తో తలపడనుంది. మరోవైపు.. పంజాబ్ బాక్సర్, వరల్డ్ చాంపియన్‌షిప్స్ కాంస్య పతక విజేత సిమ్రన్‌జీత్ కౌర్ సైతం ముందడుగు వేసింది. రౌండ్ ఆఫ్ 32లో లఢక్ బాక్సర్ నిల్జయా ఆంగ్మోతో జరిగిన హోరాహోరీ పోరులో ప్రత్యర్థిని ఓడించింది. ఇక సిమ్రన్ ప్రిక్వార్టర్స్‌లో జార్ఖండ్‌కు చెందిన పూజా బెహ్రాతో పోటీ పడనుంది.
ఇది కూడా చదవండి: టాటా ఓపెన్ బరిలో సాకేత్
భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ టాటా ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీతో కలిసి బరిలోకి దిగనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 7 వరకు పుణేలో ఈ టోర్నీ జరుగుతుంది.
ఈ ఏడాది సాకేత్–యూకీ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఆరు డబుల్స్ టైటిల్స్ సాధించారు. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం సాకేత్ 84వ స్థానంలో ఉన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ జోడీ బోపన్న, రామ్‌కుమార్ ఈసారి వేర్వేరు భాగస్వాములతో కలసి ఆడనున్నారు.
చదవండి: వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు
India Players- Ranji Trophy: ఇంట్లో కూర్చోవద్దు.. బీసీసీఐ ఆదేశాలు! మొన్న సంజూ, ఇషాన్.. ఇప్పుడు సూర్య, చహల్