![Hyderabad: Cm Kcr Praises Nikhat Zareen For Winning Gold - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/27/Untitled-1.jpg.webp?itok=isLP50UC)
సాక్షి, హైదరాబాద్: న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో 50 కిలోల విభాగంలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని కొనియాడారు.
క్రీడాభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అంతర్జాతీయస్థాయి ఖ్యాతిగడించే ప్రదర్శన చేస్తున్న బాక్సర్ నిఖత్ జరీన్ స్వశక్తికి నిదర్శనమని రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జరీన్‌ను ఢిల్లీలో మంత్రి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment