న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఫిలిప్పీన్స్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో భారత్‌కు చెందిన అంకిత్ నర్వాల్ (57 కేజీలు), అక్షయ్ సివాచ్ (60 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు.
శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో అంకిత్ 3–2తో దిమిత్రీ బార్మిన్ (కజకిస్తాన్)పై గెలుపొందగా... లిన్ యు (చైనీస్ తైపీ)ను అక్షయ్ ఓడించాడు. ఇతర బౌట్‌లలో డేలా కెన్నత్ (ఫిలిప్పీన్స్) చేతిలో సెలే సోయ్ (46 కేజీలు)... యురా కెన్‌షిన్ (జపాన్) చేతిలో అమన్ గంగాస్ (54 కేజీలు)... దస్తాన్ ఒనల్‌బెకోవ్ (కిర్గిస్తాన్) చేతిలో ఆకాశ్ సాయ్ (66 కేజీలు) ఓడిపోయారు.