బ్యాంకాక్: ఆద్యంతం తన ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించిన భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మక ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. స్రె పోవ్ నావో (కంబోడియా)తో ఆదివారం జరిగిన మహిళల 51 కేజీల విభాగం తొలి రౌండ్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ సంధించిన పంచ్‌ల ధాటికి రిఫరీ ఈ బౌట్‌ను రెండో రౌండ్‌లోనే ముగించాడు. ఈ గెలుపుతో నిఖత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు అమిత్ (52 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), శివ థాపా (60 కేజీలు), మహిళల విభాగంలో సరితా దేవి (60 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అమిత్ 5–0తో తు పో వె (చైనీస్ తైపీ)పై, ఆశిష్ 4–1తో అబ్దుర్‌ఖమనోవ్ (కిర్గిస్తాన్)పై, శివ థాపా 4–1తో సెత్‌బెక్ యులు (కిర్గిస్తాన్)పై గెలుపొందారు. గ్వాన్ సుజిన్ (కొరియా)తో జరిగిన బౌట్‌లో సరితా దేవి దూకుడుకు రిఫరీ మూడో రౌండ్‌లో బౌట్‌ను ముగించి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. పురుషుల 81 కేజీల విభాగం బౌట్‌లో మాత్రం భారత బాక్సర్ బ్రిజేష్ యాదవ్ 0–4తో రుజ్‌మెతోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment