Cambodia
-
కాంబోడియా సైబర్ కేసులో కీలక అరెస్టు
సాక్షి, హైదరాబాద్: కాంబోడియాలో అత్యధిక వేతనాలతో కొలువులు ఆశగాచూపి.. అక్కడకు వచి్చన యువకులను సైబర్ నేర ముఠాలకు అప్పగిస్తున్న ఓ కీలక వ్యక్తిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ముంబైలోని చెంబూర్ ప్రాంతానికి చెందిన నిందితురాలు ప్రియాంక శివకుమార్ సిద్దును అరెస్టు చేసినట్టు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు.. అత్యధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని హైదరాబాద్‌కు చెందిన వంశీకృష్ణ, సాయి ప్రసాద్‌ల నుంచి ముంబైకి చెందిన ప్రియాంక ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల చొప్పున కమీషన్ తీసుకుని కాంబోడియా పంపింది. అక్కడ చైనా సైబర్ ముఠాలు తమతో బలవంతంగా సైబర్ నేరాలు చేయించారని, మానసికంగా, శారీరకంగానూ హింసించినట్టు భారత్‌కు తిరిగి వచి్చన ఇద్దరు బాధితులు టీజీసీఎస్బీకి ఫిర్యాదు చేశారు. దీనిపై టీజీసీఎస్బీ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాంబోడియాకు అమాయకులను తరలించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న 30 ఏళ్ల ప్రియాంకను అరెస్టు చేశారు. సైబర్ ముఠాల నుంచి కమీషన్.. ప్రియాంక తొలుత మాక్స్వెల్ అనే ఓవర్సీస్ జాబ్ ప్రాసెసింగ్ ఏజెన్సీలో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. తర్వాత ఆ ఏజెన్సీ మూతపడడంతో ఎలాంటి అనుమతులు లేకుండా తానే స్వయంగా ఓ ఏజెన్సీని ప్రారంభించింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు తెరతీసింది. ముంబైలో ఇదే విధంగా ఏజెన్సీ నడుపుతున్న నారాయణ అనే వ్యక్తి ఇచి్చన సమాచారంతో ప్రియాంక కాంబోడియాకు వెళ్లి అక్కడ చైనా కంపెనీ ఝాన్జీ ఎండీ జితేందర్‌సింగ్‌ను కలిసింది. సైబర్ నేరాలు చేసేందుకు మనుషులను తనకు అప్పగిస్తే ఒక్కొక్కరికి 500 యూఎస్ డాలర్లు కమీషన్ ఇచ్చేలా వారితో ఒప్పందం చేసుకుంది. తొలుత ఇద్దరినికాంబోడియాకు పంపింది. అది విజయవంతం కావడంతో సోషల్ మీడియా, న్యూస్ పేపర్లలో కాంబోడియాలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని పెద్దఎత్తున ప్రకటనలు ఇచి్చంది. అవి నమ్మిన అమాయకులను కాంబోడియా చైనా సైబర్ క్రైం ముఠాల వద్దకు ప్రియాంక పంపినట్టు టీజీసీఎస్బీ అధికారులు గుర్తించారు. ఇలా కాంబోడియాకు వెళ్లిన అమాయకులను అక్కడి చైనా సైబర్ క్రైం ముఠాలకు అప్పగిస్తున్నారు. సైబర్ నేరాలు చేసేలా బాధితులను సదరు ముఠాలు మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నాయి. ఈ ముఠా నుంచి అతికష్టం మీద తప్పించుకుని తిరిగి వచి్చన ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో టీజీసీఎస్బీ దర్యాప్తు ముమ్మరం చేసింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఇచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ సూచించారు. -
ఏ దేశమేగినా... బొజ్జ గణపయ్యే!
నేడు వినాయక చవితి. విఘ్నాలను తొలగించి, సర్వ కార్యాల్లో విజయం సిద్ధించాలని కోరుకుంటూ గణనాథుడికి పూజలు చేస్తాం. ఆసేతుహిమాచలం మాత్రమే కాదు భారతదేశానికి ఆవల సైతం పూజలందుకుంటున్న అతికొద్ది మంది దేవుళ్లలో వినాయకుడు సైతం ఉన్నాడు. థాయిలాండ్ మొదలు కాంబోడియా, జపాన్, చైనా ఇలా ఎన్నో దేశాల్లో బొజ్జ గణపయ్య ఘనంగా పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏటా గణేష్ చతురి్థని జరుపుకుంటూ మహదానందం పొందుతున్నాడు ఆయా దేశాల ప్రజలు. వాణిజ్య, ధారి్మక సంబంధాల కారణంగా ఆగ్నేయాసియాలో అనేక హిందూదేవతలను పూజించడం పరిపాటి. భారత్‌లో మాదిరే వరసిద్ధి వినాయకుడు విదేశాల్లోనూ చక్కని పూజలందుకుంటున్నాడు. అయితే గణపతిని ఆయా దేశాలు వివిధ రూపాల్లో కొలుస్తుండటం విశేషం. విఘ్ననాయకుడిని విశేష రూపాల్లో ఏ దేశం? ఎలా ఆరాధిస్తుందో ఓసారి పరికిద్దాం.. థాయిలాండ్‌లో.. థాయిలాండ్ బౌద్ధులకు వినాయకుడూ ఆరాధ్య దైవమే. క్రీ.శ 550–600 ప్రాంతంలో థాయిలాండ్‌లో లంబోదరుని విగ్రహాలు వెలిశాయి. థాయిలాండ్‌లో మన మోదకప్రియుడిని ఫిరా ఫికానెట్గా కొలుస్తారు. విజయానికి చిహ్నంగా, అడ్డంకులను తొలగించే శక్తిగా భావిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు, వివాహం సందర్భంగా మహాగణపతిని పూజిస్తారు. గజాననుడి ప్రభావం థాయ్ కళ, వాస్తుశిల్పంలోనూ స్పష్టంగా గోచరిస్తుంది. గణపతి ఆలయాలు దేశవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. కాంబోడియాలో ఆగ్నేయాసియా అంతటా మన విఘ్నరాజును పూజిస్తారు. ఈ సంప్రదాయ ఈ ప్రాంతానికి ఎలా వచి్చందనేది మాత్రం తెలియడం లేదు. ఐదు, ఆరో శతాబ్దాలకు చెందిన గణాధ్యక్షుడి శాసనాలు, చిత్రాలు ఆగ్నేయాసియాలో ఉన్నాయి. కంబోడియాలో గణా«దీశుడు ప్రధాన దైవం. ఏడో శతాబ్దం నుంచి ఆయనను దేవాలయాలలో పూజించారు. భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఈ దేవుడికి ఉందని ఇక్కడ నమ్ముతారు. టిబెట్‌లో టిబెట్‌లోనూ మన మంగళప్రదాయుడిని బౌద్ధ దేవుడిగా పూజిస్తారు. ఇక్కడ మహారక్త గణపతిగా, వజ్ర వినాయకుడిగా విభిన్న రూపాల్లో ఆరాధిస్తారు. భారతీయ బౌద్ధ మత నాయకులు అతిసా దీపంకర శ్రీజ్ఞ, గాయధర వంటివారు క్రీస్తుశకం 11వ శతాబ్దంలో టిబెట్ బౌద్ధమతానికి వినాయకుడిని పరిచయం చేసినట్లు చరిత్ర చెబుతోంది. గణేశుడిని టిబెట్, మంగోలియాలో ఉద్భవించిన బౌద్ధమత రూపమైన లామాయిజం పుట్టుకతో ఈ దేశ పురాణాలు ముడిపడి ఉన్నాయి. ధర్మ రక్షకుడిగా, చెడును నాశనం చేసే శక్తిగా, అడ్డంకులను తొలగించే మూర్తిగా వినాయకుడిని బౌద్ధం బోధిస్తోంది. అందుకే ఇక్కడి గణపతి విగ్రహం దృఢంగా, బలమైన కండరాలు, కవచం, దంతాలు, ఆయుధాలతో అలరారుతుంటాయి. ఇతర టిబెటన్ దేవతల మాదిరిగా కోపం కొట్టొచి్చనట్లు ఎరుపు, నలుపు, గోధుమ వర్ణాల్లో విగ్రహాలు కనిపిస్తాయి. ఇండోనేసియాలో.. ఇండోనేసియాలోని జావా ద్వీపంలో కృతనాగర మహారాజు మాంత్రిక కర్మలలో అడ్డంకులను తొలగించే తాంత్రిక దేవతగా వినాయకుడిని పూజించారు. ఇది క్రీ.శ 14–15 వ శతాబ్దాల నాటికి ఇక్కడ అభివృద్ధి చెందిన తాంత్రిక బౌద్ధం, శైవ మతాల కలయికగా గణపతిని ఇక్కడ ఆరాధిస్తారు. పుర్రెలు ధరించి పుర్రెల సింహాసనంపై కూర్చున్న రూపంలో వినాయకుడు పూజలందుకుంటున్నారు. భారత్‌లో సాధారణంగా కనిపించే విగ్రహరూపాల్లోనూ గణపతిని ఇక్కడ పూజిస్తారు. తూర్పు జావా ప్రాంతంలోని తెన్గెర్ సెమెరూ జాతీయ వనంలోని బ్రోమో పర్వతం ముఖ ద్వారం వద్ద 700 సంవత్సరాలనాటి గణనాథుని విగ్రహం ఉంది. బ్రహ్మదేవుని పేరు మీద ఈ పర్వతానికి బ్రోమో పేరు వచి్చంది. అగి్నపర్వతాల విస్ఫోటం నుంచి ఈ విగ్రహం తమను రక్షిస్తుందని స్థానికులు నమ్ముతారు.చైనా, అఫ్గానిస్తాన్‌లలో.. చైనాలో లంబోదరుడిని ‘హువాంగ్ సీ టియాన్’అని పిలుస్తారు. ఆయనను ఒక విఘ్నంగా భావిస్తారు. అఫ్గానిస్తాన్ రాజధా ని కాబూల్ సమీపంలోని గార్డెజ్‌లో క్రీ.శ 6 లేదా 7వ శతాబ్దంలో చెక్కిన ప్రసిద్ధ వినాయ క విగ్రహం బయలి్పంది. గార్డెజ్ గణేశుడుగా పిలువబడే ఆయనను జ్ఞానం, శ్రేయస్సునందించే దేవుడిగా స్థానికులు ఆరాధిస్తారు. జపాన్‌లో.. గణాలకు అధిపతి అయిన వినాయకుడిని జపాన్‌లో కంగిటెన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇక్కడి వాణిజ్యవేత్తలు, వ్యాపారులు, జూదగాళ్ళు, నటులు, ‘గీషా’లుగా పిలవబడే కళాకారి ణులు ఎక్కువగా గణేషుడిని కొలుస్తారు. అయితే ఇక్కడ కొందరు ప్రత్యేకమైన రూపంలో ఉన్న వినాయకుడిని ఆరాధిస్తారు. ఈ వినాయక విగ్ర హంలో స్త్రీ, పురుష రూపాలు ఆలింగనం చేసుకు ని ఉంటాయి. జపనీస్ వినాయక రూపాల్లో ఒక రూపం నాలుగు చేతులతో, ముల్లంగి, మిఠాయి పట్టుకొని ఉండటం విచిత్రం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంబోడియాలోని అతిపెద్ద దేవాలయంలో నటి హిమజ (ఫొటోలు)
-
కంబోడియాలో భారతీయులతో సైబర్ క్రైమ్స్.. అబ్దుల్ ముఠా అరెస్ట్
ఢిల్లీ: చైనీయులతో చేతులు కలిపి దేశంలో నిరుద్యోగులను మోసం చేస్తూ వారిని కంబోడియాకు పంపిస్తున్న సైబర్ నేరస్థుడు ఎట్టకేలకు పోలీసులు చిక్కాడు. సిరిసిల్లకు చెందిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో అబ్ధుల్‌ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన అబ్ధుల్ ఆలం.. చైనీయులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. నిరుద్యోగులను మోసం చేస్తూ వారిని కంబోడియాకు పంపించాడు. కాగా, సిరిసిల్లకు చెందిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబ్దుల్‌ను ఢిల్లీలో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, అబ్దుల్ ప్రస్తుతం దుబాయ్‌లో నివాసం ఉంటున్నట్టు సమాచారం.మరోవైపు.. అబ్ధుల్ ఇప్పటి వరకు దేశం నుంచి దాదాపు వేయి మందికిపైగా నిరుద్యోగులను కంబోడియాకు పంపినట్టు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన యువకులను కంబోడియాకు పంపి అక్కడ వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయినట్టు పోలీసులు గుర్తించారు. అబ్ధుల్ ముఠా చైనీయులతో కలిసి ఇలా నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ మోసాల్లో సింగపూర్, థాయ్‌ల్యాండ్, బ్యాంకాక్‌కు చెందిన ముఠా హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారి గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. గత కొద్దిరోజుల క్రితం సైబర్ నేరాల్లో భాగమైన భారతీయులను కేంద్రం స్వదేశానికి తరలించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ కంబోడియాలో భాగంగా వారిని భారత్‌కు తరలించారు. -
భారతీయులను నిర్భంధించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న చైనీస్ గ్యాంగ్
-
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు: వైజాగ్ చేరుకున్న బాధితులు
విశాఖపట్నం: కంబోడియా కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని విశాఖపట్నం పోలీసు కమిషనర్ రవి శంకర్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో ఈ కేసు సంబంధించిన విషయాలు తెలిపారు. ‘‘మొత్తం 68 మంది బాధితులను రక్షించాము. ఇంకా 90 మంది కంబోడియాలో ఉన్నారు. 68 మందిలో 25 మంది వైజాగ్ వాళ్ళూ. దేశ వ్యాప్తంగా 25 మంది ఏజెంట్లు ఉన్నారు. 12 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశాం. ఆరుగురు ఏజెంట్లుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాము. ఈ మొత్తం స్కాంలో సిమ్ సప్లయార్స్ ముగ్గురుని గుర్తించాం. ... ఒక సిమ్ కార్డు భారత్ నుంచి తీసుకొని వెళ్లి ఇస్తే 10 నుంచి 15 వేలు కమిషన్ ఇస్తారు. నకిలీ బ్యాంక్ అకౌంట్స్.. తయారు చేస్తున్న ముఠాపై కూడా నిఘా పెట్టము. ఎమర్జెన్సీ పాస్ పోర్టు కూడా ఇండియా ఎంబసీ అధికారులు జారీ చేస్తున్నారు’’ అని తెలిపారు.కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు.అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. -
కంబోడియా గ్యాంగ్ చేతిలో తెలంగాణ యువకుడి నరకం
-
‘కాంబోడియా’ కేసులో మరో ఇద్దరు ఏజెంట్ల అరెస్టు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటింగ్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువకులను విదేశాలకు తరలిస్తున్న మరో ఇద్దరు ఏజెంట్లను విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ కాంబోడియా పేరిట సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న సుమారు 25 మంది యువకులను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ చొరవతో క్షేమంగా విశాఖకు తీసుకువచి్చన విషయం తెలిసిందే. ఇంకా కాంబోడియాలో చిక్కుకొని ఉండిపోయిన బాధితులను తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు.ఈ కేసుకు సంబంధించి ఆయన విడుదలచేసిన ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి. సైబర్ నేరాలను అరికట్టడానికి, వాటి మూలాలు ఛేదించడానికి విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ డాక్టర్ కె.ఫకీరప్ప పర్యవేక్షణలో విశాఖ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. కాంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ వంటి దేశాలకు యువకులను పంపిస్తున్న గాజువాక, భానుజీనగర్ ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకోగా విస్తుపోయే వాస్తవాలు బయటికి వచ్చాయి. కన్సల్టెన్సీ ఏజెంట్ కొలుకుల వీరేంద్రనాథ్(37) ఇంజనీరింగ్ చదివి 2023 నుంచి కాంబోడియా దేశానికి ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువకులను పంపిస్తున్నాడు.అనకాపల్లికి చెందిన రామకృష్ణను పరిచయం చేసుకొని, తాను కాంబోడియా దేశం నుంచి వచ్చానని, అక్కడికి కంప్యూటర్ సిస్టమ్ ఆపరేటర్‌గా పంపిస్తే మంచి కమీషన్ వస్తుందని చెప్పాడు. కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న 17 మంది నుంచి రూ.లక్షా 20 వేల చొప్పున తీసుకుని పంపించారు. వారికి ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు కమీషన్ లభించింది. అధిక మొత్తంలో లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వీరేంద్రనాథ్, అతని భార్య శ్రీప్రియ కాంబోడియా ఏజెంట్‌కు అనేక మంది సిస్టమ్ ఆపరేటర్స్‌ను పలు దఫాలుగా పంపించారు. వీరిలో కొంతమందిని విజిటింగ్ వీసాపైన బ్యాంకాక్ పంపించి అక్కడ నుంచి కాంబోడియా దేశం బోర్డర్ వద్ద ఆ దేశ వీసా తీసుకుని అక్కడి చైనా కంపెనీలకు ఈ నైపుణ్యం గల వ్యక్తులను 2500 నుంచి 4,000 అమెరికన్ డాలర్లకు విక్రయించారు. చీకటి రూమ్‌లో బంధించి.. అక్కడికి వెళ్లిన యువకులను చైనా కంపెనీలు అదుపులోకి తీసుకుని ఓ చీకటి గదిలో బంధించేవారు. వివిధ రకాల సైబర్ నేరాలు ఏ విధంగా చేయాలనే అంశంపై బలవంతంగా స్క్రిప్ట్ ఇస్తూ ట్రైనింగ్ ఇవ్వడమే గాక సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని చిత్రహింసలకు గురిచేస్తారు. ఆహారం, నీరు ఇవ్వకుండా కట్టిపడేస్తుంటారు. వారి వలలో చిక్కుకున్న తర్వాత బయటపడడం అసాధ్యం. చేసిన నేరాల ద్వారా సంపాదించిన డబ్బులో 1 శాతం కమీషన్ ఇస్తూ 99 శాతం కంపెనీలే తీసుకుంటాయి. వీరంతా ఉత్సాహంగా పనిచేసేందుకు పలు రకాల ఎంటర్టైన్మెంట్స్ అలవాటుచేస్తారు.పబ్స్, కేసినో గేమ్స్, మద్యపానం, జూదం, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యక్రమాలకు సంపాదించిన డబ్బును ఖర్చుపెట్టేలా తయారు చేస్తున్నారు. చైనా కంపెనీ చెర నుంచి తప్పించుకుని నగరానికి చేరుకున్న బాధితుడు పెమ్మడి చిరంజీవి, కల్యాణ్, శేఖర్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిటీ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాద్ విచారణ చేపట్టగా స్కామ్ బయటపడింది. ఈ రాకెట్లో ప్రధాన నిందితుడు చుక్క రాజే‹Ù, అతని వద్ద పనిచేస్తున్న సబ్ ఏజెంట్లు గాజువాకకు చెందిన సబ్బవరపు కొండలరావు, మన్నేన జ్ఞానేశ్వరరావును ఇంతకుముందే అరెస్టు చేశారు. తాజాగా కొలుకుల వీరేంద్రనా«థ్, కొమ్ము ప్రవీణ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ప్రత్యేక బృందం దీని వెనుక ప్రధాన ముఠాను కనిపెట్టడానికి లోతైన దర్యాప్తు చేపడుతున్నట్టు సీపీ తెలిపారు. అందుకు స్పెషల్ పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఏజెంట్ల చేతిలో మోసపోయినట్లయితే సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాదరావు (సెల్ నంబర్ 9490617917)కు, కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 0891–2565454కు, లేదా సీపీ వాట్సప్ నంబరు 9493336633కు ఫిర్యాదు చేయవచ్చు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు 1930కి నంబర్‌కు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. -
Cambodia: బాధిత భారతీయులకు విముక్తి
-
మానవ అక్రమ రవాణా కేసును చేధించిన విశాఖ పోలీసులు
-
ఆపరేషన్ కంబోడియా సక్సెస్.. శభాష్ వైజాగ్ పోలీస్!
సాక్షి, విశాఖ: ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. కంబోడియాలో మరో 60 మంది భారతీయులను ఇండియన్ ఎంబసీ అధికారులు కాపాడారు. దీంతో, కంబోడియా నుంచి సురక్షితంగా బయటపడిన వారి సంఖ్య 420కి చేరుకుంది.కాగా, భారత ఎంబసీ అధికారులు ఆపరేషన్ కంబోడియాను విజయవంతం చేశారు. సైబర్ నేరాల బారినపడి కంబోడియాలో చిక్కుకున్న భారతీయులను ఎంబసీ అధికారులు రక్షించారు. తాజాగా మరో 60 మంది భారతీయులను కాపాడారు. దీంతో, 420 మంది భారతీయులు ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారు. కాగా, నిన్న(బుధవారం) 360 మందిని అధికారులు పోలీసుల చర నుంచి విడిపించారు. ఇక, 420 మందిలో ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారని సమాచారం.ఈ సందర్భంగా భారత రాయబారి దేవయాని ఖోబ్రగడే కంబోడియాలో ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవయాని మాట్లాడుతూ.. మన భారతీయులను మనమే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయులకు మద్దతు ఇవ్వడం.. వారి భద్రత, శ్రేయస్సు కోసం రాయబార కార్యాలయం అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలోనే కంబోడియా అధికారులకి ధన్యవాదాలు తెలిపారు.అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు.అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది. -
ఆపరేషన్ కాంబోడియా సక్సెస్ 420 మందిని కాపాడిన పోలీసులు
-
విశాఖ పోలీసుల వేట ఆపరేషన్ కంబోడియా
-
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తాజాగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది. మరోవైపు.. ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. 360 మంది భారతీయులను ఎంబసీ అఫ్ ఇండియా కాపాడింది. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్: + 855 10642777 సంప్రదించాలని అధికారులు కోరారు. అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు. అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు.అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని సీపీ రవిశంకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప సారథ్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాద్, సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
మానవ అక్రమ రవాణా గుట్టు రట్టు
-
Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
విశాఖ సిటీ: ఉద్యోగాల పేరుతో విదేశాలకు జరుగుతున్న మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. విదేశాల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగులను చైనా గ్యాంగ్‌కు అమ్మేస్తున్న ముగ్గురు ఏజెంట్లను శనివారం అరెస్టు చేశారు. దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ శనివారం సాయంత్రం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు.అక్కడ పని చేసి చైనా ముఠా చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ సైబర్ హెల్ప్‌లైన్ 1930 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవాని ప్రసాద్ బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ప్రధాన ఏజెంట్ చుక్క రాజేష్‌తో పాటు అదే ప్రాంతానికి చెందిన సబ్ ఏజెంట్లు సబ్బవరపు కొండలరావు (37), మన్నేన జ్ఞానేశ్వరరావు (29)లను అదుపులోకి తీసుకుని విచారించగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీపీ రవిశంకర్ మానవ వనరుల అక్రమ రవాణా గురించి వెల్లడించిన వివరాలివి...నిరుద్యోగులకు వల...గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ చుక్కా రాజేష్ (32) 2013 నుంచి 2019 వరకు గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్‌గా పనిచేశాడు. ఆ తరువాత విశాఖలోనే ఉంటూ గల్ఫ్‌దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మానవవనరులను సరఫరా చేసేవాడు. 2023 మార్చిలో కాంబోడియా నుంచి సంతోష్ అనే వ్యక్తి ఫోన్ చేసి, కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడానికి 30 మందిని పంపాలని రాజేష్‌ను కోరాడు. ఆసక్తి చూపే వారి నుంచి ఫ్లైట్ టికెట్లు, వీసా, ఇతర ఖర్చుల కోసం రూ.1.5 లక్షల వంతున తీసుకోవాలని, అందులో కొంత కమిషన్‌గా ఇస్తామని ఆశ చూపాడు. రాజేష్ అందుకు అంగీకరించి సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. నిజమని నమ్మిన 27 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షల వంతున కట్టారు. రాజేష్ వారిని కాంబోడియా ఏజెంట్ సంతోష్‌కు అప్పగించాడు. ఇలా మూడు దఫాలుగా నిరుద్యోగులకు కాంబోడియాకు పంపించాడు. కొద్ది రోజులకు ఆర్య అనే పేరుతో ఒక మహిళ రాజేష్‌కు ఫోన్ చేసింది. సంతోష్ కంటే ఎక్కువ కమిషన్ ఇస్తానని తమకూ మానవవనరులను సరఫరా చేయాలని కోరింది. ఇలా రాజేష్.. సంతోష్, ఆర్య, ఉమా మహేష్, హబీబ్ అనే ఏజెంట్ల ద్వారా 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు పంపించాడు.చీకటి గదిలో బంధించి..ఒప్పందం అనంతరం వారిని కాంబోడియాలోనే ఈ ముఠా ఒక చీకటి గదిలో బంధించింది. ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ట్రేడింగ్‌తో పాటు అనేక ఆన్లైన్ స్కాములు చేయాలని నిరుద్యోగులను బలవంతం చేసింది. ఈ స్కామ్స్ ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. అక్రమాలకు పాల్పడబోమని మొండికేసిన వారికి తిండి పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేసింది. సైబర్ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమిషన్‌గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్ దోచుకునేది. అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్‌లో పలు రకాల పబ్, క్యాసినో గేమ్స్, మద్యం, జూదంతో పాటు వ్యభిచారం వంటి సదుపాయాలను ఈ ముఠా కల్పించింది. అక్కడ సంపాదించిన డబ్బు అక్కడే ఖర్చు చేసేలా చేసేది. చైనా ముఠా చెరలో 5వేల మంది..చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, అనంతపురాలతో పాటు తెలంగాణ, కోల్‌కత్తాకు చెందిన వారూ ఉన్నట్లు సీపీ రవిశంకర్ తెలిపారు. ఈ నెట్వర్క్ వెనుక ప్రధాన ముఠాను కనిపెట్టేందుకు లోతైన దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. కాంబోడియాలో భారత ఎంబసీకీ దీనిపై సమాచారం అందిస్తామన్నారు. విశాఖ నుంచి ఎవరైనా కాంబోడియాకు వెళ్లి ఇబ్బందులు పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని సీపీ సూచించారు. భారతదేశం నుంచి కాంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ వంటి దేశాలకు రెండేళ్లుగా మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోందని సీపీ తెలిపారు. ఇలా వెళ్లిన భారతీయుల ద్వారా సైబర్ నేరాల రూపంలో మన దేశీయుల నుంచే సుమారు రూ.100 కోట్ల వరకు దోచుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందని ఆయన వివరించారు.అది కుటుంబాల మధ్య తగాదాలో దాడి...కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కుటుంబాల మధ్య తగాదా కారణంగా మహిళపై దాడి జరిగిందని సీపీ రవిశంకర్ స్పష్టం చేశారు. దీనికి రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. దాడి ఘటన వీడియోలు ఉన్నాయని, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చైనా ముఠాకు భారత యువత విక్రయం...నిరుద్యోగులను ముందు బ్యాంకాక్ పంపించి, అక్కడ రెండో ఏజెంట్‌కు అప్పగించారు. వీరు నిరుద్యోగులను కాంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకువెళ్లి ఒక నెలకు టూరిస్ట్ వీసా తీసుకున్నారు. అలా తీసుకువెళ్లిన నిరుద్యోగులను ఏజెంట్లు వారికున్న నైపుణ్యం ఆధారంగా వారికి రూ.2500 నుంచి రూ.4 వేల అమెరికన్ డాలర్ల రేటు కట్టి చైనా కంపెనీలకు అమ్మేశారు. తమ వద్ద ఏడాది పాటు పనిచేసేలా చైనా ముఠా అగ్రిమెంట్ రాయించుకుంది. సెక్యూరిటీ కింద 400 డాలర్ల పూచీకత్తును కట్టించుకుంది. ఒకవేళ కంపెనీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే ఆ మొత్తం చెల్లించాలని ఒప్పందంలో ఈ ముఠా షరతులు విధించింది. -
40 ఏళ్లుగా ప్రధాని.. మళ్ళీ ఆయనే..
నమ్ పెన్: కంబోడియా దేశంలో గత 40 ఏళ్లుగా ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న హున్ సెన్ మరోసారి ఎన్నికలకు సిద్ధమయ్యారు. సరైన ప్రతిపక్షమే లేని దేశంలో కంబోడియన్ పీపుల్స్ పార్టీ అధినేత హున్ సెన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటున్నాయి అక్కడి మీడియా వర్గాలు. ఈ ఆదివారం జులై 23న కంబోడియాలో మరోసారి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. నామమాత్రంగా జరిగే ఈ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని హున్ సెన్ మళ్ళీ ఆ పీఠాన్ని అధిష్టించి అత్యధిక కాలంపాటు ఆ పదవిలో కొనసాగిన ప్రధానిగా రికార్డు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఆయన పట్టుదల సంగతి అటుంచితే అక్కడ సరైన ప్రతిపక్షమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ నియంత పాలన కొనసాగుతుందని స్థానికుల్లో ఒకరు తెలిపారు. 2018లో జరిగిన గత ఎన్నికల్లో హున్ సెన్ మొత్తం 125 పార్లమెంటు సీట్లకు గాను 125 సీట్లను గెలుచుకున్నారు. అయితే అప్పుడు ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని బలహీనమైన ప్రతిపక్షాలపై దౌర్జన్యం చేసి గెలిచారని చెబుతుంటారు. మరికొంత మంది ఆయన రిగ్గింగ్ కు పాల్పడి గెలిచారని చెబుతుంటారు. ఏదైతేనేం చట్టసభల్లో ప్రతిపక్షం లేకుండా ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్నారు హున్ సెన్. నియంత ఖైమర్ రూజ్ తర్వాత కంబోడియా ప్రధానిగా 1985లో బాధ్యతలు చేపట్టిన హున్ సెన్ అప్పటి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. 2013లో ప్రతిపక్షాల నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనా 2018లో మాత్రం పూర్తిగా వారి ప్రభావం కనుమరుగైంది. దగ్గరగా నలభై ఏళ్ల హున్ సెన్ పాలనలో కంబోడియా అత్యంత వెనుకబడిన ప్రపంచ దేశాల్లో ఒకటిగా మిగిలింది.1990లో ప్రజాస్వామ్య హోదా దక్కించుకున్న కంబోడియాలో ఈ సారైనా ప్రతిపక్షంలో ఎవరో ఒకరు కూర్చుంటారని ఆశిస్తున్నారు స్థానికులు. ప్రతిపక్షంలో ఎవరు కూర్చున్నా ప్రధానిగా మాత్రం హున్ సెనే పీఠమెక్కనున్నారనేది సుస్పష్టం అంటున్నాయి అక్కడి మీడియా వర్గాలు. ఇది కూడా చదవండి: పబ్లిక్ లో రచ్చ చేసింది జైలు పాలయ్యింది -
రోజు కూలీ.. విమానం లాంటి ఇంటిని కట్టుకున్నాడు
విమానంలో ప్రయాణించాలనే ముచ్చట చాలామందికే ఉంటుంది. కానీ, అతడికి విమానంలో నివాసం ఉండాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. ఎగిరే విమానంలో నివాసం ఏర్పరచుకోవడం ఎలాగూ కుదిరే పని కాదు కనుక విమానంలాంటి ఇంటిని నిర్మించుకున్నాడు. తన కలల నివాసాన్ని నిర్మించుకోవడానికి కంబోడియాకు చెందిన ఆండ్ క్రాచ్ పోవ్ దాదాపు ముప్పయ్యేళ్లు కష్టపడ్డాడు. మొత్తానికి ఇన్నాళ్లకు నేలకు ఇరవై అడుగుల ఎత్తున ఎగురుతున్న విమానంలాంటి భవంతిని నిర్మించుకున్నాడు. దీని నిర్మాణం కోసం తన పదమూడో ఏట నుంచి డబ్బు కూడబెట్టడం ప్రారంభించాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఖర్చుల కోసం ఇచ్చిన చిల్లర డబ్బు మొదలుకొని పెద్దయ్యాక భవన నిర్మాణాలు సహా రకరకాల పనులు చేసి 7.84 కోట్ల రియెల్స్ (రూ.15.63 లక్షలు) పోగు చేశాడు. ఆ డబ్బుతోనే ఈ ఇంటిని నిర్మించుకుని, తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. భవన నిర్మాణంలో అనుభవం ఉన్న పోవ్ ఈ ఇంటిని నిర్మిస్తున్నప్పుడు చుట్టుపక్కల జనాలు ఇతడిని ఒక పిచ్చోడిలా చూశారు. నిర్మాణం పూర్తవుతున్న దశలో ఈ ఉదంతం పోవ్ నివాసం ఉండే సీమ్ రీప్ ప్రావిన్స్‌లో సంచలన వార్తగా మారింది. తన ఇంటికి దగ్గర్లోనే ఒక కాఫీ షాపును ఏర్పాటు చేయాలనుకుంటున్నానని, త్వరలోనే అసలు విమానంలో ఎగరాలనే తన కలను కూడా నిజం చేసుకుంటానని పోవ్ మీడియాకు చెబుతున్నాడు. -
72 ఏళ్ల వృద్ధుడిపై ఒకేసారి 40 మొసళ్లు దాడి!
ఓ వృద్ధుడిపై ఒకేసారి 40 మొసళ్లు మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చాయి. ఈ షాకింగ్ ఘటన కంబోడియాలో చోటు చేసుకుంది. ఆ వృద్ధుడు తన పోలంలోని ఆవరణలో ఓ ఎన్‌క్లోజర్‌లో ఈ మొసళ్లును పెంచుతున్నాడు. అందులోని ఓ మొసలి గుడ్లు పెట్టింది. ఆ గుడ్ల కోసం ఎన్‌క్లోజర్ నుంచి మొసలి తరలించాలనుకున్నాడు 72 ఏళ్ల వృద్ధుడు. అందుకోసం అతను ఓ కర్రతో బెదిరిస్తూ పక్కకు తొలగిపోయేలా చేద్దామనుకుంటే అది రివర్స్‌లో అతడి కర్రను బలంగా పట్టుకుని ఎన్‌క్లోజర్‌లోకి లాగింది. ఈ హఠాత్పరిణామానికి ఆ వృద్ధుడు ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడు. అంతే ఒక్కసారిగా అక్కడే ఉన్న 40 మొసళ్లు అతనిపై మూకుమ్మడి దాడి చేసి తినేశాయి. ఆ ప్రాంతంలో అతడి ఆవశేషాలు మాత్రమే కనిపించాయి. ఈ విషయాన్ని బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. కంబోడియాలోని సియెమ్ రీప్ చుట్టూ అనేక మొసళ్లు సంరక్షణ ఎన్క్లోజర్లు ఉన్నాయి. అక్కడివారు ఈ మొసళ్లను వ్యాపారం కోసం పెంచుతుంటారు. అక్కడి వారు వాటితో గుడ్లు, మాంసం, చర్మం తదితరాల వ్యాపారం చేస్తుంటారు. (చదవండి: చైనాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం..ఏకంగా 6.5 కోట్ల మందికిపైగా..) -
జోరు వర్షంలోనూ ఆగని పరుగు.. గెలిచినోళ్ల కంటే ఎక్కువ పేరు
ఆటపై ఇష్టం.. గెలవాలన్న పట్టుదల ఉంటేనే ఛాంపియన్స్‌గా నిలుస్తారని అంటారు. అంతిమంగా ఆటలో ఒకరే ఛాంపియన్ కావొచ్చు..ఒకవేళ లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైనా చివరి వరకు పోటీలో ఉండాలని కోరుకుంటారు కొందరు. ఆ కొందరి నుంచి పుట్టిందే కంబోడియాకు చెందిన అథ్లెట్ బౌ సామ్నాంగ్. ఓటమి ఖరారైనా జోరు వర్షంలోనూ సామ్నాంగ్ తన పరుగును ఆపలేదు. 5000 మీటర్ల రేసును వర్షంలోనే పూర్తి చేసి ఆటపై తనకున్న మక్కువను చూపించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యం దిశగా సాగి గెలవాలన్న తన పట్టుదలను పరిచయం చేసింది. తోటి అథ్లెట్లు పక్కకు తప్పుకున్నా తాను మాత్రం లక్ష్యాన్ని వీడలేదు. అందుకే రేసులో గెలిచిన అథ్లెట్ కంటే బౌ సామ్నాంగ్కు ఎక్కువ పేరొచ్చింది. 22 నిమిషాల 52 సెకన్లలో రేసు పూర్తి చేసిన అనంతరం సామ్నాంగ్ ఎమోషనల్ అయింది. దేశ జాతీయ జెండాతో అక్కడున్న వారికి అభివాదం చేసింది. జోరు వర్షంలోనూ తన పరుగుకు మద్దతిచ్చిన అభిమానులకు కృతజ్క్షతలు తెలిపింది. రేసులో బౌ సామ్నాంగ్ ఓడినా అభిమానుల మనసులను మాత్రం గెలుచుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బౌ సామ్నాంగ్ పేరు ట్రెండింగ్‌లో ఉంది. కంబోడియా రాజధాని నమ్ పెన్ నగరంలో జరిగిన సౌత్ఈస్ట్ ఏషియన్ గేమ్స్‌లో ఈ అద్బుతం చోటుచేసుకుంది. సోమవారం జరిగిన 5000 మీటర్ల రేసులో వియత్నాంకు చెందిన గుయన్ తి వోనా విజేతగా నిలిచింది. ఇక రేసు అనంతరం కంబోడియా ప్రధాని హున్ సన్.. బౌ సామ్నాంగ్ అంకితభావానికి ముచ్చటపడి 10వేల డాలర్లను రివార్డుగా ఇవ్వడం విశేషం. బౌ సామ్నాంగ్ను ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోసీ) ఆకాశానికెత్తింది. రేసు ఓడిపోయి ఉండొచ్చు.. తన అంకితభావంతో విజేతను మించిపోయింది అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం బౌ సామ్నాంగ్ రేసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Even if you're in last place. 🏃 Even if the weather is terrible. 🌧️ Even if it feels like you can't do it. 🚫 𝙉𝙚𝙫𝙚𝙧 𝙜𝙞𝙫𝙚 𝙪𝙥 💪 Nothing was going to stop Cambodia's Bou Samnang 🇰🇭 from finishing the women's 5,000 metre race at the #SEAGames. pic.twitter.com/iVMxwqVrFQ — The Olympic Games (@Olympics) May 9, 2023 View this post on Instagram A post shared by The Guardian (@guardian) -
కంబోడియా క్యాసినోలో భారీ అగ్ని ప్రమాదం
-
క్యాసినో హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 19 మంది సజీవ దహనం..
దక్షిణ ఆసియా దేశం కంబోడియాలోని ఓ క్యాసినో హోటల్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ విషాద ఘటనలో 19 మంది సజీవదహనమయ్యారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. పయోపెట్లోని గ్రాండ్ డైమెండ్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. అగ్నీ కీలక భారీగా ఎగిసిపడ్డాయి. వందల మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నప్పటికీ మంటలు ఆర్పేందుకు రెండు గంటలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద సమయంలో మొత్తం 400 మంది క్యాసినోలో ఉన్నారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే వారంతా భయంతో పరుగులు తీశారు. కొందరైతే అగ్నిమాపక సిబ్బంది కాపాడేందుకు వెళ్తున్నా ప్రాణభయంతో ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. ప్రమాద సమయంలో విదేశీయులు కూడా లోపల ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 360 మంది అత్యవసర సిబ్బంది, 11 ఫైరింజన్లు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే న్యూఇయర్ సందర్భంగా భారీ విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చదవండి: Viral: జారిపోతున్న కార్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్.. -
జీ20 పాలన పగ్గాలు చేపట్టనున్న భారత్...బ్లింకన్‌తో జై శంకర్ భేటీ
డిసెంబర్1 న జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుంది. భారత్ ప్రెసిడెన్సీకి యూఎస్ మద్దుతిస్తోంది కూడా. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారం ప్రారంభంలో జీ20 లోగో, థీమ్‌ని ఆవిష్కరించారు. ఈ ఏషియన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ కాంబోడియాలో సమావేశమై కీలకాంశాలు చర్చించారు. అంతేగాదు ఈ సదస్సులో చర్చించాల్సిన విషయాలను కూడా పంచుకున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధం, యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌తో సమావేశం, ఉక్రెయిన్-ఇండో పసిఫిక్, ఇంధనం, జీ20 ద్వైపాక్షిక సంబంధాలు తదితరాలపై చర్చించనున్నారని జైశంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ కూడా ట్విట్టర్లో...భారత జీ20 ప్రెసిడెన్సీకి అమెరికా మద్దతిస్తోంది. జీ20 లోగో సార్వత్రిక సోదరభావాన్ని ప్రతిబింబిస్తోంది. జీ20 లోగో కమలం కష్ట సమయాల్లో ఆశకు చిహ్నం. G20 ప్రెసిడెన్సీ భారతదేశానికి కేవలం దౌత్యపరమైన సమావేశం కాదు, ఇది ఒక కొత్త బాధ్యత తోపాటు భారతదేశంపై ప్రపంచ విశ్వాసానికి కొలమానం అని బ్లింకెన్ అన్నారు. (చదవండి: పుతిన్ ఓడిపోతాడు...చైనా బలపడుతుంది: బ్రిటన్ ప్రధాని షాకింగ్ వ్యాఖ్యలు) -
అప్పుడే సర్దార్ సీక్వెల్ ప్రకటించిన మేకర్స్, స్పెషల్ వీడియో రిలీజ్
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్దార్’. రాశీ ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో చంద్రబోస్ అలియాస్ ‘సర్దార్’, ఆయన తనయుడు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశ్ పాత్రల్లో మెప్పించారు కార్తీ. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. పోలీసాఫీసర్‌గా రాజీనామా చేసి, ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా చేరాలన్న ఆఫర్‌కు విజయ్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, విజయ్ కొత్త మిషన్ కంబోడియాలో ఆరంభం కానున్నట్లుగా టీజర్లో చూపించడం జరిగింది. హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్, నిర్మాత లక్ష్మణ్ కాంబినేషన్లోనే ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. #Sardar 💥 Once a spy, always a spy! Mission starts soon!!#Sardar2 💥💥@Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @RaashiiKhanna @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben @dhilipaction @kirubakaran_AKR @DuraiKv pic.twitter.com/rVu5IxGRZp — Prince Pictures (@Prince_Pictures) October 25, 2022 -
సాక్షి ఎడిటర్‌కు ‘కాంబోడియా’ బాధితుల కృతజ్ఞతలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తాము స్వదేశానికి రావడంలో ‘సాక్షి’చూపిన చొరవ మరువలేని దని ‘కాంబోడియా’బాధితులు అన్నారు. గురువారం కరీంనగర్‌కు చెందిన యువకులు సలీం, షారుఖ్, షాభాజ్, హాజీ హైదరాబాద్ లోని ‘సాక్షి’ప్రధాన కార్యాలయంలో ఎడిటర్ వర్ధెల్లి మురళిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి కోసం కాంబోడియా వెళ్లి అక్కడ సైబర్ నేరస్తుల ముఠా చేతిలో చిక్కిన తాము తిరిగి ఇండియాకు వస్తామనుకోలేదని.. అయితే సాక్షి దినపత్రిక వరుస కథనాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించేలా చేసిందని అన్నారు. ఈ సందర్భంగా కాంబోడియాలో సైబర్ నేరస్తుల ముఠా తమను ఎలా హింసించిందన్న విషయాలను వారు ఎడిటర్‌కు వివరించారు. సెప్టెంబర్ 19న ‘కొలువని చెప్పి.. స్కాం కేఫ్‌లో ఖైదు చేసి’అన్న శీర్షికన కరీంనగర్ యువకులు కాంబోడియాలో చిక్కుకున్న విషయాన్ని ‘సాక్షి‘బయట పెట్టిన విషయం తెలిసిందే. తర్వాత కూడా సాక్షి ప్రచురించిన వరుస కథనాలతో స్పందించిన కరీంనగర్ పోలీసులు, స్థానిక ఎంపీ సంజయ్ చొరవ తీసుకుని ఆ యువకులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు. (క్లిక్: ఇది మాకు పునర్జన్మ.. తిరిగి ఇండియాను చూడమనుకున్నాం) -
ఆ సొమ్మంతా ఎవరికి వెళ్లింది?
సాక్షి, హైదరాబాద్: కాంబోడియా కేంద్రంగా చైనీయులు సాగించిన ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్’కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మొత్తం పది మంది నిందితులు ఉండగా.. ఒకరికి ఢిల్లీలోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చైనా, తైవాన్ జాతీయులు సహా మిగతా తొమ్మిది మందిని గురువారం కోర్టులో హాజరుపర్చి, జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో కీలక నిందితులుగా ఉన్న సన్నీ, సాహిల్‌లు హవాలా మార్గంలో దుబాయ్‌కు రూ.903 కోట్లు పంపినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో సన్నీ ద్వారా వెళ్లిన డబ్బు వరుణ్ అరోరా, భూపేష్ అరోరాలకు చేరినట్టు తేల్చారు. సన్నీని ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. ఇక సాహిల్ హవాలా మార్గంలో పంపిన రూ.400 కోట్లు దుబాయ్‌లో ఎవరికి చేరాయన్నది ఆరా తీస్తున్నారు. కాగా.. ఈ కేసు విషయంగా హైదరాబాద్ ఈడీ అధికారులు గురువారం సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఎఫ్ఐఆర్, ఇతర వివరాలను తీసుకున్నారు. ఐబీ అధికారులు కూడా ఫోన్ చేసి పలు వివరాలను తెలుసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కమీషన్ల కోసం నిబంధనలను పాతర వేసి.. భారతీయ కరెన్సీని తీసుకుని విదేశీ కరెన్సీని ఇచ్చే ‘ఆథరైజ్డ్ మనీ చేంజింగ్ (ఏఎంసీ)’సంస్థలకు రిజర్వు బ్యాంకు లైసెన్సులు ఇస్తుంది. ఈ మనీ చేంజింగ్ కోసం కొన్ని నిబంధనలు పెట్టింది. విదేశాలకు వెళ్లే వారికి వీసా, పాస్‌పోర్ట్ వంటివి పరిశీలించి నగదును విదేశీ కరెన్సీలోకి మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీలో రంజన్ మనీ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్, కేడీఎస్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థలను ఏర్పాటు చేసిన నవ్‌నీత్ కౌశిక్ ఈ నిబంధనలను పక్కనపెట్టేశాడు. కేవలం ఇద్దరు క్లయింట్లతో ఒప్పందం కుదుర్చుకుని రూ.903 కోట్లను డాలర్లుగా మార్చి ఇచ్చాడు. ఇందుకోసం రూ.1.8 కోట్లు కమీషన్‌గా తీసుకున్నాడు. అయితే ఇంత భారీగా మనీ చేంజింగ్ జరుగుతున్నా.. రిజర్వు బ్యాంకు, ఈడీ వంటివి పసిగట్టలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
ఇది మాకు పునర్జన్మ.. తిరిగి ఇండియాను చూడమనుకున్నాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంబోడియాకు ఉద్యోగం కోసం వెళ్లిన తాము నరక కూపం నుంచి బయటపడ్డామని.. తిరిగి ఇండియాకు వస్తామనుకోలేదని.. ఇది తమకు పునర్జన్మ అని.. ఐదుగురు యువకులు వెల్లడించారు. గురువారం ఉదయం కరీంనగర్‌కు చేరుకున్నాక యువకులు ఉద్వేగానికి లోనయ్యారు. ‘సాక్షి’తో ప్రత్యేకంగా తమ ఆవేదనను పంచుకున్నారు. ఎన్నో ఆశలతో కాంబోడియాలో అడుగుపెట్టిన తమకు వెళ్లగానే ఆశలు ఆవిరయ్యాయన్నారు. అక్కడ కంపెనీ నిర్వాహకులు తమ పాస్‌పోర్టులు లాక్కుని, సైబర్ నేరాలు చేయాలని తొలిరోజే ఒత్తిడి తెచ్చారన్నారు. చేతిలో పాస్‌పోర్టులు లేక, ఎవరిని సంప్రదించాలో తెలియక, ఆకలితో నకనకలాడుతూ తాము ఎంతో మానసికవేదన అనుభవించామన్నారు. బయటికి వెళదామని ప్రయత్నించినా.. తమను చుట్టూ ఎత్తైన గోడలు, వాటికి కరెంటు కంచెలు, భారీ భద్రత నడుమ తమను బంధీ చేశారన్న విషయం తెలుసుకుని మరింత కుంగిపోయామని వాపోయారు. కానీ..‘సాక్షి’ చొరవతో ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేసి తిరిగి తమను మాతృభూమిని చేరేలా చేశాయన్నారు. ‘సాక్షి’కి తాము ఎంతో రుణపడి ఉంటామని వివరించారు. ఈ సందర్భంగా ఐదుగురు యువకులు కాంబోడియాలో చైనా సైబర్ స్కాం ముఠా చేతిలో అనుభవించిన బాధలను పంచుకున్నారు. భారతీయులు చాలామంది ఉన్నారు మాలాగే ఉపాధి ఆశతో అక్కడ సైబర్ నేరస్తుల ముఠా చేతిలో పడిన వారు చాలామంది ఉన్నారు. ఇండియాతోపాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చెందిన అనేకమంది అమాయకులు వారి వద్ద బందీలుగా ఉన్నారు. అందరితో ఇవే పనులు చేయిస్తున్నారు. ఎదురుతిరిగితే ఇక అంతే సంగతులు. బంధీలకు ఆత్మహత్య తప్ప మరే గత్యంతరమే లేదు. –షారూఖ్‌ఖాన్ ఏజెంట్లు గోల్మాల్ చేశారు మా విషయంలో ఇద్దరు ఏజెంట్లు గోల్మాల్ చేశారు. మమ్మల్ని కాంబోడియా చేర్చగానే విషయం అర్థమైంది. మమ్మల్ని అబ్దుల్ నుంచి అమెరికన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశామని చైనీయులు చెప్పారు. వచ్చీరాని ఇంగ్లిష్‌లో తాము చెల్లించిన డబ్బులు కట్టే వరకు విడిచి పెట్టమంటూ ఒక గదిలో బంధించారు. – నవీద్ సెల్‌ఫోన్ తాకట్టుపెట్టాను మేం వెళ్లిన తొలిరోజు నుంచే చైనీయులు మమ్మల్ని నేరాలు చేయాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. మేము ససే మీరా అంటే వారు వినిపించుకోలేదు. చివరికి మమ్మల్ని ఆ చెర నుంచి విడిపించిన రోజు మా చేతుల్లో చిల్విగవ్వలేదు. దీంతో నేను నా సెల్‌ఫోన్‌ను తాకట్టుపెట్టాను. ఆకలి ఇబ్బంది పెడుతున్నా మేం కడుపునింపుకోలేదు. ఆ డబ్బులతో మా చిన్నచిన్న ఖర్చులు భరించుకున్నాం. – షాబాజ్‌ఖాన్ మమ్మల్ని అమ్మేశారని అర్థమైంది మేం వెళ్లగానే మా పాస్‌పోర్టులు లాగేసుకున్నారు. చెప్పినట్లు చేయాలని బెది రింపులకు దిగారు. ఉద్యోగానికి బదులు బెదిరింపులు రాగానే.. మమ్మల్ని అమ్మేశారని అర్థమైంది. ఇక అక్కడ నుంచి బయటపడటం గగనమే అనుకున్నాం. సైబర్ నేరాలు చేయలేక, అక్కడ నుంచి బయటపడే మార్గం లేక నరక యాతన అనుభవించాం. – సలీమ్ హోటల్ వైఫైతో వీడియో పంపాం చైనీయుల ఆఫీసులో బంధీ కాగానే తొలుత ఆందోళన చెందాం. డబ్బులు కడితేగానీ పంపేదిలేదని చైనీయులు తెగేసి చెప్పడంతో భయపడ్డాం. తిరిగి ఇల్లు చూస్తామనుకోలేదు. హోటల్ వైఫై పాస్ వర్డ్ తెలుసుకుని వెంటనే మా దయనీయ స్థితి ని వివరిస్తూ వీడియో చేసి ‘సాక్షి’కి పంపించాం. అదే మమ్మల్ని కాపాడింది. – హాజీబాబా -
కాంబోడియా వస్తున్నారా.. జర జాగ్రత్త!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉపాధి, పర్యాటకం నిమిత్తం కాంబోడియాను సందర్శించాలనుకునేవారు కన్సల్టెన్సీ లేదా సంస్థ లేదా కంపెనీ నేపథ్యాన్ని సరిచూసుకోవాలని కాంబోడియాలోని భారత దౌత్యకార్యాలయం సూచించింది. కరీంనగర్‌కు చెందిన ఆరుగురు యువకులు ఉపాధి కోసం కాంబోడియాకు వెళ్లి అక్కడ సైబర్ స్కాంలకు పాల్పడే చైనా వారి చేతిలో బందీలుగా మారిన విషయం తెలిసిందే. వారిని కాపాడాలంటూ ఎంపీ బండి సంజయ్ విదేశాంగ శాఖకు లేఖ రాశారు. ఆయన ఫిర్యాదుకు ఈ నెల 19న ‘కొలువని చెప్పి.. స్కాం కేఫ్‌లో ఖైదు చేసి’అన్న శీర్షికన ప్రచురితమైన ‘సాక్షి’కథనాన్ని జోడించారు. కాంబోడియా రాజధాని పెనామ్ పెన్లోని భారత రాయబార కార్యాలయం దీనిపై స్పందించి గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాంబోడియాకు వస్తున్న భారతీయులు మానవ అక్రమ రవాణా, ఇతర అసాంఘిక ముఠాల చేతుల్లో ఇబ్బందులు పడుతున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించింది. భారత్ నుంచి వచ్చే నిరుద్యోగులు టూరిస్టు వీసాలపై ఉపాధి కోసం పంపించే ప్రయత్నాలను ప్రోత్సహించవద్దని స్పష్టం చేసింది. -
చైనా కంపెనీకి అమ్మేశారు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉపాధి కోసం వెళ్లి కాంబోడియాలో చిక్కుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువకుల విషయంలో కొత్త కోణం వెలుగుచూసింది. మంచి ఉద్యోగం, వీసా, దండిగా టిప్పులు వస్తాయని ఆశచూపిన ఏజెంట్లు.. మరో ఏజెంట్‌కు అప్పగించారు.. ఆ ఏజెంట్ యువకులను కాంబోడియాలో చైనాకు చెందిన కేసినో నిర్వాహకులకు అమ్మేశాడు. దీనిపై బాధితుల కుటుంబ సభ్యులు సోమవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగింది? షాబాజ్‌ఖాన్ (మానకొండూరు), షారూఖ్ ఖాన్ (హుస్సేనీపుర, కరీంనగర్), హజీబాబా సయ్యద్ (శాత్రాజ్పల్లి, సిరిసిల్ల), నవీద్ అబ్దుల్ (సిరిసిల్ల), సలీం మహమ్మద్ (శాంతినగర్, చింతకుంట) అనే యువకులు కరీంనగర్ గాంధీనగర్‌లో ఉన్న ఇండో అరబ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని వేర్వేరుగా సంప్రదించారు. విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం ఆరా తీశారు. కన్సల్టెన్సీ ఏజెంట్లు మేనాజ్ అలీ, అబ్దుల్ రహీం వారికి కాంబోడియా వీసాలు ఉన్నాయని, తలా రూ.రెండు లక్షలు చెల్లిస్తే పంపుతామని చెప్పారు. కేసినోలో కంప్యూటర్ ఉద్యోగమని, రోజూ టిప్పులు కూడా వస్తాయని ఆశ చూపారు. ఆ యువకులు దొరికినకాడల్లా అప్పు చేసి మేనాజ్, అబ్దుల్ రహీంలకు డబ్బులు ఇచ్చారు. ఏజెంట్లు ఈ ఐదుగురు యువకులను ఆగస్టు చివరివారంలో ఢిల్లీకి తీసుకెళ్లి అబ్దుల్లా అనే మరో ఏజెంటుకు అప్పగించారు. అబ్దుల్లా వారిని విమానంలో బ్యాంకాక్‌కు, అక్కడి నుంచి బస్సులో కాంబోడియాకు చేర్చాడు. అక్కడ కేసినో నిర్వహిస్తున్న చైనీయులకు అప్పగించాడు. ప్రతిఫలంగా ఒక్కో యువకుడికి 2,700 డాలర్ల చొప్పున తీసుకుని వెళ్లిపోయాడు. కేసినో నిర్వాహకులు మూడు రోజుల పాటు యువకులకు శిక్షణ ఇచ్చి.. క్రిప్టో కరెన్సీ, క్రెడిట్ కార్డు, హనీ ట్రాప్ వంటి పనులు చేయాలన్నారు. ఆ పని చేయమనడంతో బంధించారు. తిండి పెట్టడం మానేశారు. తాము ఇచ్చిన మేర సొమ్ము చెల్లిస్తేనే వదిలిపెడతామన్నారు. తమను రక్షించకుంటే ఆకలితో చచ్చిపోయేలా ఉన్నామంటూ ఆ యువకులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం బాధిత కుటుంబ సభ్యులు కరీంనగర్ సీపీ సత్యనారాయణను కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులతో విచారణ చేపడుతున్నట్టు సీపీ తెలిపారు. మరోవైపు ఈ పరిణామాలపై ఇంటెలిజెన్స్ పోలీసులు సీఎంవో కార్యాలయానికి నివేదిక పంపినట్టు తెలిసింది. మా వాళ్లను కాపాడండి ఏజెంట్లు విదేశాలకు వెళితే మంచి జీతం వస్తుందని చెప్పి తమ వారిని అమ్మేశారని షాబాజ్ సోదరుడు అఫ్జల్, నవీద్ సోదరుడు అబ్దుల్ ముహీద్ వాపోయారు. 3 వేల డాలర్లు చెల్లిస్తే వదిలేస్తామంటున్నారని పేర్కొన్నారు. ఏజెంట్లను అడిగితే తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు. విదేశాంగ శాఖకు బండి సంజయ్ లేఖ కాంబోడియాలో యువకులు చిక్కుకున్న అంశంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఆ యువకులను దేశానికి రప్పించడానికి తగిన చర్యలు చేపట్టాలని విదేశాంగ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు. -
కొలువని చెప్పి.. స్కాం కేఫ్‌లో ఖైదు చేసి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురు యువకులు ఉపాధి పేరుతో వెళ్లి కంబోడియా సైబర్ స్కాం గ్యాంగ్ చేతిలో చిక్కుకున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామన్న దళారుల మాటలు నమ్మి వెళ్లి.. క్రిప్టోకరెన్సీ, క్రెడిట్‌కార్డ్, హనీట్రాప్ పనులు చేయిస్తుండటంతో ఆందోళనలో పడ్డారు. ఆ పనులు చేయలేక, చేయబోమంటే వారు పెడుతున్న చిత్ర హింసలు భరించలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? కరీంనగర్‌లోని గాంధీరోడ్ చౌరస్తా సమీపంలో ఓ కన్సల్టెన్సీ ఉంది. కంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయని, మంచి జీతం వస్తుందని కన్సల్టెన్సీ నిర్వాహకుడు స్థానిక ముస్లిం యువకులకు చెప్పాడు. దీనితో కొందరు యువకులు రూ.2 లక్షల చొప్పున అతడికి చెల్లించారు. కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఈ ఏడాది ఆగస్టు చివర్లో, సెప్టెంబరు మొదటివారంలో ఆరుగురు యువకులను కంబోడియాకు పంపాడు. అక్కడికెళ్లాక ఓ కంపెనీ వాళ్లు ఆ యువకులను చుట్టూ ఎత్తయిన గోడలు, విద్యుత్ కంచె లు, సాయుధ పహారాతో ఉన్న ఓ టౌన్‌షిప్‌కు తీసుకెళ్లారు. అమెరికా, యూరప్ వాసుల నంబర్లు ఇచ్చి.. వారిని వాట్సా ప్ ద్వారా సంప్రదించి క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే బాగా డబ్బులు వస్తాయంటూ ఒప్పించాలని చెప్పారు. ఆ పని చేయలేమంటే.. పాస్‌పోర్టులు ఇవ్వబోమని, జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారని యువకులు వాపోతున్నారు. నేరాలు ఇలా చేయిస్తూ.. కరీంనగర్‌కు చెందిన బాధిత యువకుడు షాబాజ్‌ఖాన్ చెప్పిన వివరాల మేరకు.. ఈ యువకులు అమెరికా, యూరోపియన్ కస్టమర్లను వాట్సాప్‌లో, ఫోన్లలో సంప్రదించాలి. సాఫ్ట్వేర్ సాయంతో మహిళల్లా గొంతు మార్చి మాట కలపాలి. బాగా డబ్బులు వస్తాయని మెల్లగా వారిని ఒప్పించి ఓ క్రిప్టోకరెన్సీ యాప్‌లో కనీసం 100 డాలర్లు పెట్టుబడి పెట్టించాలి. రెండు, మూడు రోజుల్లో.. లాభం వచ్చి ఆ సొమ్ము 1000 డాలర్లకు పెరిగినట్టు చూపిస్తుంది. ఇది చెప్పి.. వారిని మరింత ఆశపెట్టి భారీగా డబ్బు పెట్టుబడి పెట్టించాలి. తర్వాత ఫోన్ స్విచాఫ్. ఆ సొమ్మంతా ఈ సైబర్ నేర గ్యాంగ్ కాజేస్తుంది. తర్వాత మరొకరికి గాలం వేయాలి. తమకు రోజూ ఇదే పని అని షాబాజ్‌ఖాన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విలపిస్తూ చెప్పాడు. తనను వదిలేయాలంటే 3,000 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.2.4 లక్షలు) చెల్లించాలని, లేదా తనకు బదులు మరో యువకుడిని అక్కడికి పిలిపించాలని ముఠా సభ్యులు తేల్చిచెబుతున్నారని వివరించాడు. తనతోపాటు సిరిసిల్ల, చింతకుంట, వేములవాడ, మానకొండూరుకు చెందిన యువకులు కూడా బందీగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం తమను కాపాడాలని వేడుకున్నాడు. అయితే వారిని ఫోన్లో సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. అక్కడి ప్రజాప్రతినిధుల అండదండలతోనే.. కాంబోడియాలో సైబర్ మాఫియా ముఠాలు విచ్చలవిడిగా వ్యవహరిస్తాయని.. మాఫియా నిర్వాహకుల్లో కొందరు అక్కడ ప్రజాప్రతినిధులు కూడా అని ప్రచారం ఉంది. ఆ ముఠాలు క్యాసినోలు, సైబర్ స్కాం కేఫ్‌లు నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటుంటాయి. స్థానికులు తిరగబడే అవకాశం ఉంటుందని.. మలేసియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత్ తదితర దేశాల నుంచి యువతీ యువకులను ఉద్యోగాల పేరిట వల వేసి రప్పించుకుంటాయి. సైబర్ నేరాల్లో శిక్షణ ఇచ్చి పని చేయించుకుంటాయి. ఇచ్చిన టార్గెట్ చేరకపోతే కొట్టడం, కరెంటు షాక్‌లు ఇవ్వడం వంటివి చేస్తుంటాయి. చిత్ర హింసలు భరించలేని విదేశీయులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలు, అక్కడి అకృత్యాలపై ఇంటర్నెట్లోనూ వార్తలు ఉన్నాయి. బాధితులు ముందుకురావాలి కంబోడియాలో చిక్కుకున్న యువకుల గురించి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నిస్తాం. – సత్యనారాయణ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ -
ప్రపంచంలోనే అత్యంత భారీ చేప గుర్తింపు!
ప్రపంచంలోనే అతిపె..ద్ద మంచి నీటి చేపను గుర్తించారు పరిశోధకులు. ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన పెద్ద చేపలతో పోల్చుకుని.. దీనిని నిర్ధారించారు. సుమారు 13 అడుగుల పొడవు, దాదాపు 300 కేజీల బరువు ఉంది అది. కంబోడియా మెకాంగ్ నదిలో ఈ భారీ చేపను గుర్తించారు. పదలు సంఖ్యలో జాలర్లు దీనిని ఒడ్డుకు లాక్కొరు. ఖేమర్ భాషలో క్రిస్టెన్డ్ బోరామీ(పూర్తి చంద్రుడు) అని పిలవబడే ఈ చేపకు.. దాని ఆకారం వల్లే ఆ పేరు వచ్చింది. అయితే దొరికిన ఈ భారీ చేపను పరిశీలించిన పరిశోధకులు.. జాలర్లను ఒప్పించి ఎలక్ట్రానిక్ ట్యాగ్‌తో తిరిగి నీళ్లలోకి వదిలేశారు. ఇక నుంచి దాని కదలికలను పరిశీలించనున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్లో ‘మాంస్టర్ ఫిష్’ షో నిర్వాహకుడు జెబ్ హోగన్.. దీనిని అధికారికంగా ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి చేపగా గుర్తించారు. ఇంతకుముందు 2005లో థాయ్‌లాండ్‌లో 293 కేజీల బరువున్న ఓ క్యాష్ పిష్‌ను పరిశోధకులు గుర్తించారు. మెకాంగ్ నది ప్రపంచంలోనే చేపల ఆవాసం ఎక్కువగా ఉండే మూడో నది. మితిమీరి చేపలు పట్టడం, కాలుష్యం, ఉప్పునీటి చొరబాటు, అవక్షేపాల క్షీణత కారణంగా చేపల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. -
RIP Magawa: ‘చిట్టి హీరో’ అస్తమయం
మగావా.. డ్యూటీలో చాలా సిన్సియర్. రోజూ ఫీల్డ్‌లోకి దిగి ల్యాండ్మైన్లను పసిగట్టడం. వందల మంది ప్రాణాలు రక్షించడం. ఇదంతా ఇన్ ది స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్. ఇట్ ఈజ్ నాట్ ట్రాక్ రికార్డ్.. ఇట్ ఈజ్ ఆల్ టైం రికార్డ్!!. సూపర్ హీరోకి అర్హతలేంటని అడిగితే.. ఏవేవో చెప్తుంటారు కొందరు. కానీ, ఆ అర్హతలేవీ లేకుంటే?.. ఆ సూపర్ హీరో అసలు మనిషి కాకుంటే!! యస్.. మాగావా మనిషి కాదు. ఓ ఎలుక. సాధారణమైంది మాత్రం కాదు. ల్యాండ్ మైన్లను గుర్తించడంలో కఠోర శిక్షణ తీసుకుంది. తన విధి నిర్వహణలో నిబ్ధదత ప్రదర్శించిన ఈ ఎలుక.. ఈమధ్యే కన్నుమూసింది. అందుకే సోషల్ మీడియాలో అంత ఎమోషనల్ అవుతున్నారు. టాంజానియా బ్రీడ్‌కు చెందిన మగావాను కంబోడియా తీసుకొచ్చి.. ల్యాండ్మైన్లను గుర్తించడంలో శిక్షణ ఇచ్చారు. ఐదేళ్ల కాలంలో వందకి పైగా ల్యాండ్ మైన్లను గుర్తించింది. తద్వారా ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు ఈ చిట్టి హీరో. 2020లో మాగ్వా యూకేకి చెందిన ఓ ఆర్గనైజేషన్ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకుంది మగావా. కిందటి ఏడాది జూన్‌లో విధుల నుంచి రిటైర్ అయిన ఈ ఎలుక.. చివరికి ఎనిమిదేళ్ల వయసులో ఈమధ్యే కన్నుమూసింది. ఈ విషయాన్ని దానికి శిక్షణ ఇచ్చిన APOPO అనే బెల్జియం ఎన్జీవో ప్రకటించింది. అంతర్యుద్ధంతో దశాబ్దాలపాటు నలిగిపోయిన కంబోడియా.. ల్యాండ్మైన్ల గనిగా ఒక పేరు దక్కించుకుంది. వీటి ధాటికి వందల మంది ఏటా ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అందుకే రిస్క్ లేకుండా ఎలుకలకు ల్యాండ్మైన్లను గుర్తించే శిక్షణ ఇప్పిస్తున్నారు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో ల్యాండ్మైన్లతో పాటు టీబీ రోగి శాంపిల్స్ గుర్తించేందుకు ఎలుకలను ఉపయోగిస్తున్నారు. విశేషం ఏంటంటే.. చాలా సందర్భాల్లో ఇవి విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తి చేస్తున్నాయి కూడా. అందుకే ఆ ర్యాట్హీరోలకు ఓ సలాం కొడుతూ.. RIP Magawa. -
ముంచేసిన ‘ముడిసరుకు’.. ఒత్తిడితో కొంత వెనక్కు పంపి..
నగరంలో సోలార్ ప్యానల్స్ తయారు చేసే ఓ సంస్థ కాంబోడియాకు చెందిన కంపెనీ చేతిలో మోసపోయింది. అక్కడి భారత రాయబార కార్యాలయం ఆరా తీయడంతో కొంత ఉపశమనం లభించింది. మిగిలిన సొమ్ము పంపకపోవడంతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో సంస్థ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరికి చెందిన నోవీస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ ప్యానల్స్ తయారు చేయడానికి చైనా నుంచి ముడిసరుకు దిగుమతి చేసుకుంటుంది. అక్కడి సోలార్ పీవీ ప్యానల్స్ లిమిటెడ్ సంస్థ నుంచి కొన్నేళ్లుగా ముడిసరుకు ఖరీదు చేస్తోంది. సదరు కంపెనీ ప్రతినిధిగా చెప్పుకున్న ఓ మహిళ కొన్నాళ్ల క్రితం నోవీస్ సంస్థ నిర్వాహకులకు ఆన్లైన్లో పరిచయమైంది. తమకు కాంబోడియాలోనూ ఓ బ్రాంచ్ ఉందని, అక్కడ నుంచి ముడిసరుకు ఖరీదు చేస్తే చైనా కంటే తక్కువ ధరకు అందిస్తామని నమ్మబలికింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఈ మెయిల్ చేసింది. నోవీస్ సంస్థ రెండు.. మూడు దఫాలు అక్కడ నుంచే సరుకు తీసుకుంది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ముడిసరుకు కోసం నగర సంస్థ కాంబోడియాలోని సోలార్ పీవీ ప్యానల్స్ లిమిటెడ్‌కు 1.46 లక్షల డాలర్లు (రూ. 1,06,66,424) చెల్లించింది. ఈ మొత్తం అందుకుని నెలలు గడుస్తున్నా సరుకు రాకపోవడంతో పాటు ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదు.ఈ విషయాన్ని నోవీస్ సంస్థ కాంబోడియాలోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లి ఆధారాలు సమర్పించింది. దీనిపై రాయబార కార్యాలయ అధికారులు ఆరా తీశారు. భయపడిన సదరు సంస్థ నోవీస్ సంస్థకు 50 వేల డాలర్లు (రూ. 36,52,885) తిరిగి చెల్లించింది. మిగిలిన మొత్తంపై ఎన్నిసార్లు ప్రశ్నించినా వారి నుంచి స్పందన లేదు. నోవీస్ సంస్థ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. చదవండి: ద్విచక్ర వాహనంపై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు ఒక్క పెగ్గే కదా అంటూ తాగేస్తున్నారా... అది కూడా ప్రాణాంతకమే! -
‘బిడ్డకు పాలిచ్చిన తల్లి’..క్షమాపణ చెప్పాల్సిందే!
‘ఆఫీసులో బిడ్డకు పాలిస్తూ తీసుకున్న ఫొటో తీసుకోవడమే కాక, సోషల్ మీడియాలో పోస్టు చేసి దేశ మహిళల పరువును తక్కువ చేస్తావా? వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పు. ఇకపై ఇలాంటి తప్పు చేయనని హామీపత్రం రాసివ్వు’ అంటూ గదమాయించారు ఉన్నతాధికారులు ఆ మహిళా ఉద్యోగిని. ఆమె ఏమీ మాట్లాడలేదు.. మాట్లాడే అవకాశమూ లేదు. మౌనంగా వాళ్లు అడిగిన హామీపత్రం రాసి ఇచ్చి బయటకు వచ్చేసింది. అప్పుడు ఆమె మనసులో చెలరేగిన ప్రశ్న ‘దేశ మహిళల పరువు పోయేది ఆఫీసులో బిడ్డకు పాలివ్వడం వల్లనా? లేక ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం వల్లనా?!’ ఇది జరిగింది కంబోడియాలో.. జరిగి సుమారు మూడు వారాలకు పై మాటే. ఆ తల్లి పేరు సిథాంగ్ సొఖా. స్టంగ్ ట్రెంగ్ రాష్ట్రంలోని సియామ్ పాంగ్ జిల్లాలో డిప్యూటీ పోలీస్ చీఫ్‌గా పనిచేస్తోంది. సొఖాకు ఏడాది బాబు ఉన్నాడు. మార్చి 2న పిల్లాడిని తీసుకొని డ్యూటీకి హాజరయ్యింది. కాసేపటికి పిల్లాడు ఏడవడంతో ఆఫీసు బయట చెట్టు కింద కూర్చొని పాలు పట్టింది. అక్కడే ఉన్న ఆమె సహోద్యోగి ఫొటో తీసింది. ఆ ఫొటోను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన సొఖా ‘పిల్లలపై తల్లి ప్రేమను సిగ్గు ప్రభావితం చేయలేదు’ అంటూ క్యాప్షన్ రాసింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అటు ఇటు తిరిగి సొఖా ఉన్నతాధికారుల కంట పడింది. మార్చి 9న.. అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగిన మరుసటి రోజు సొఖాను ఆఫీస్‌కు రప్పించారు. ఆ సందర్భంగా ఆమెతో వాళ్లన్న మాటలే పైన చెప్పినవి. గళమెత్తిన మహిళా సంఘాలు.. సొఖా హామీపత్రం రాసింది కానీ బహిరంగ క్షమాపణ మాత్రం చెప్పలేదు. కానీ, సొఖా విషయంలో పోలీసు అధికారుల ప్రవర్తన తెలిసి దేశవ్యాప్తంగా మహిళా హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. ‘ఇది పనిచేసే చోట మహిళలపై చూపుతున్న వివక్షకు నిదర్శనం. విధుల్లో ఉన్న తల్లులను పిల్లల సంరక్షణ లేదా డ్యూటీలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలని చెప్పడం దారుణం. దీన్ని బట్టి మహిళల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది’ అంటూ వేలాది మంది గళమెత్తారు. సొఖాకు మద్దతుగా సోషల్ మీడియాలోనూ పోస్టులు వెల్లువెత్తాయి. వివరణలూ వివాదాస్పదమే.. సొఖా విషయంలో అలజడి చెలరేగడంతో ఆమె ఉన్నతాధికారులు దిద్దుబాటుకు దిగారు. ‘డ్యూటీలో ఉండగా పిల్లాడికి పాలివ్వడాన్ని తప్పు పట్టలేదు. కాకపోతే ఆమె ఆ ఫొటోను ‘పర్మిషన్’ తీసుకోకుండా పోస్ట్ చేసినందుకు మాత్రమే మందలించామ’ని వివరణ ఇచ్చారు. ఇది మరింత ఆజ్యానికి కారణమైంది. ఈ వివరణ మహిళల మాట్లాడే స్వేచ్ఛను కాలరాసేలా ఉందని హక్కుల కార్యకర్తలు మండిపడ్డారు. ఆ వివరణ ఇచ్చిన పోలీసాఫీరు మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఈసారి ఏకంగా మహిళా మంత్రిత్వ శాఖే జోక్యం చేసుకుంది. సొఖా విషయంలో పోలీసు అధికారుల తీరును తప్పుపడుతూనే పనిచేసే చోట, పబ్లిక్ ప్రదేశాల్లో మహిళలు పిల్లలకు పాలిచ్చేటప్పుడు చాటుగా లేదా, ఏదైనా వస్త్రాన్ని అడ్డుగా ఉంచుకోవాలని సూచించింది. దీనిపైనా హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. ‘పనిప్రదేశాల్లో ఓ మహిళ తన బిడ్డకు పబ్లిక్‌గా పాలివ్వడం ఆ ఆఫీసుకు, దేశ మహిళల పరువుకు ఏ విధంగా భంగమో తెలియడం లేదు. నిజానికి టీవీల్లో వచ్చే ప్రకటనల్లో చాలా భాగం అశ్లీలతతో కూడుకొన్నవే. మరి వాటి వల్ల దేశ మహిళల పరువుకు భంగం కలగదా?’ అని ప్రశ్నిస్తున్నారు కంబోడియా మానవ హక్కుల కేంద్రం అధిపతి చాక్ సొఫియా. ప్రధాని సతీమణి మద్దతు.. సొఖాకు మద్దతుగా గళమెత్తే వాళ్ల సంఖ్య పెరగడంతో విషయం ఆ దేశ ప్రధాని సతీమణి బున్ రనీ హున్ సెన్కు చేరింది. వెంటనే ఆమె సొఖాకు ఓ లేఖతోపాటు 2,500 డాలర్లను బహుమతిగా పంపారు. అలాగే స్టంగ్ ట్రెంగ్ రాష్ట్ర గవర్నర్‌తోపాటు సొఖాను తప్పుపట్టిన ఉన్నతాధికారులు సైతం బహుమతులు అందించారు. ఇలా దేశం నలుమూలల నుంచి సొఖాకు మద్దతు బహమతులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. మరోవైపు, ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా పుల్‌స్టాప్ పడాలని సొఖా కోరుకుంటోంది. ‘నేను పనిచేసే చోట ఉండే సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టడం నా పోస్ట్ ఉద్దేశ్యం కాదు. పిల్లాడిపై ఓ మాతృమూర్తి ప్రేమను చెప్పాలనుకున్నాను అంతే’ అంటోంది. నిజానికి ఈ వివాదం కొన్ని వారాలు గడిచినా ఇప్పటికీ చల్లారడం లేదు. విషయం ఏకంగా ఐక్యరాజ్యసమితికి చేరడంతో కంబోడియా ఆందోళనకు గురవుతోంది. అసలే ఆ దేశంలో మహిళలపై హింస ఎక్కువనే అపవాదు ఇప్పటికే ఉండడమే దీనికి కారణం. -
ఎలుకకు అత్యంత అరుదైన గౌరవం
కంబోడియా : ఓ ఎలుకకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. బ్రిటీష్ ఛారిటీ అందజేస్తున్న ‘‘పీడీఎస్ఏ’’ అనిమల్ బ్రేవరీ(జంతువులకు సంబంధించిన అవార్డుల్లో గొప్పది) అవార్డును సొంతం చేసుకుంది. కంబోడియాలోని భూముల్లో దుండగులు పాతిపెట్టిన లాండ్‌మైన్స్‌ను కనిపెట్టడంలో ప్రతిభ కనపరిచినందుకు గానూ మగావా అనే ఆఫ్రికన్ ఎలుకకు ఈ గౌరవ పురష్కారం లభించింది. దాదాపు ఏడేళ్ల కాలంలో 39 లాండ్మైన్లను, 28 ఇతర పేలుడు పదార్థాలను మగావా కనుగొంది. ( ఊహించని ట్విస్ట్‌తో మైండ్‌బ్లాక్ ఖాయం ) పీడీఎస్ఏ గోల్డ్ మెడల్‌తో మగావా ‘‘ప్రాణాలను రక్షించటంలో తెగువ’’ చూపినందుకు గానూ బంగారు పతకంతో సత్కరించారు. ఎలుక జాతిలో పీడీఎస్ఏ గోల్డ్ మెడల్ అందుకున్న మొదటిది మగావా కావటం విశేషం. మగావా ఓ బెల్జియం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో లాండ్మైన్లను కనుగొనటంలో శిక్షణ తీసుకుంది. అంతేకాకుండా విజయవంతమైన ఎలుకగా కీర్తి పొందింది. (వావ్.. ఎంత క్యూట్‌గా ఉందో..! ) -
స్విమ్మింగ్: మూత్రాశయంలోకి వెళ్లిన జలగ
ఫెనోమ్ పెన్: జలగ.. దీని పేరు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఒక్కసారి అది శరీరాన్ని పట్టుకుందంటే రక్తం తాగుతూనే ఉంటుంది. ఇంతటి ప్రమాదకరమైన ప్రాణిగా అనిపించే ఈ జలగ ఓ యువకుడి పురుషాంగం ద్వారా అతని శరీరంలోకి ప్రవేశించింది. ఈ ఘటన కాంబోడియాలో చోటు చేసుకుంది. ఫోమ్ పెన్కు చెందిన ఓ యువకుడు సరదాగా చెరువులో ఈతకెళ్లాడు. ఈ క్రమంలో ఓ జలగ అతని పురుషాంగం ద్వారా శరీరం లోపలికి ప్రవేశించింది. ఇదేమీ గమనించని అతడు ఈత కొట్టడం ముగియగానే ఇంటికెళ్లిపోయాడు. తర్వాతి రోజు అతను టాయిలెట్‌కు వెళ్లగా నొప్పి మొదలైంది. తర్వాత ఆ నొప్పి మరింత తీవ్రం కావడంతో విలవిల్లాడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి పరుగెత్తాడు. (జిరాఫీని రెచ్చగొడితే ఇలానే ఉంటుంది!) అతడి సమస్య ఏంటో తెలుసుకునేందుకు వైద్యులు అతడి మూత్రాశయంలోకి సూక్ష్మమైన కెమెరా పంపగా జలగ ఉన్నట్లు తెలిసింది. పురుషాంగం ద్వారా అది మూత్రాశయానికి చేరుకుని స్థిరపడిపోయినట్లు గుర్తించారు. రక్తం తాగుతున్న కొద్దీ దాని పరిమాణం పెరగడంతో యువకుడి అంతర్గత అవయవాలు సైతం దెబ్బ తిన్నాయి. అవయవాన్ని అంటిపెట్టుకుని ఉన్నప్పుడు బయటకు తీయడం ప్రమాదకరం కాబట్టి వైద్యులు బైపోలార్ రెసెక్టోస్కోప్ సాయంతో జలగను శరీరంలోనే చంపేసి, అనంతరం దాన్ని బయటకు తీశారు. ఇక ఆ జలగ 500 మిల్లీలీటర్ల రక్తం తాగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొన్నారు. (గొంతులోంచి రెండు జలగలు బయటకు తీశారు..) -
లాక్డౌన్ : ఇళ్ల వద్దకే క్లాస్‌రూం పాఠాలు
కంబోడియా : లాక్డౌన్ కారణంగా విద్యా సంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు 64 ఏళ్ల సేన్ వన్నా అనే ఉపాధ్యాయుడు దాదాపు 20 కిలోమీటర్ల మేర ప్రయాణించి పాఠాలు బోధిస్తున్న తీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించాలని విద్యాశాఖ సూచించింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, కంప్యూటర్ వసతి లేకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. (ఢిల్లీ నుంచి వచ్చే వాహనాలను అనుమతించం..) కంబోడియాలోని తబౌంగ్ ఖుమ్ ప్రావిన్స్‌లోని గ్రామీణ ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. కనీసం సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా లేని గిరిజన ప్రాంతం అది. ఈ నేపథ్యంలో అధికారుల అనుమతితో దీంతో సేన్ వన్నా అనే ఉపాధ్యాయుడు 20 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థుల వద్దకే వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు. ఈయనను ఆదర్శంగా తీసుకున్న మరికొంత మంది ఉపాధ్యాయులు కూడా నేరుగా విద్యార్థుల ఇళ్ల వద్దకే వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు. నాలుగు నుంచి ఐదుగురు విద్యార్థులను ఒకచోట చేర్చి ప్రతిరోజు దాదాపు 20కి పైగా విద్యార్థులకు సేన్ వన్నా బోధిస్తారు. అంతేకాకుండా వేర్వేరు గ్రామాల్లో ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి చాలా దూరం ప్రయాణిస్తున్నారు కదా మీకు అలసటగా అనిపించదా అంటే అది ఒక ఉపాధ్యాయుడిగా ఇది నా బాధ్యత అంటూ తన కర్తవ్యంపై ఉన్న మమకారాన్ని చూపిస్తున్నారు. "ప్రతి సెషన్లో ఐదుగురు విద్యార్థులను ఒక గ్రూప్‌గా చేర్చి నేర్పిస్తాను. అలా ఉదయం మొత్తం నాలుగు గ్రూపులకు పాఠాలు చెప్తాను. విద్యార్థులు అందరూ ఫేస్ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటాను" అని సేన్ వన్నా తెలిపారు. (చిరు వ్యాపారులకు యూపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ ) -
రామ మందిరం ఎలా వుండాలంటే...
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ద్వారక పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు తనకు చాలా సంతోషాన్ని కలిగించిందనీ, రాముడు ఉత్తరప్రదేశ్‌లోని నగరంలోనే జన్మించాడనేది నిరూపితమైందని వ్యాఖ్యానించారు. శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. రామమందిరాన్ని నిర్మించడానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీం ఆదేశంపై స్వరూపానంద స్పందిస్తూ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇప్పటికే ఉందని వ్యాఖ్యానించారు. అయితే, అయోధ్యలో అనేక దేవాలయాలున్నాయని సున్నీ వక్ఫ్ బోర్డుకు అయిదు ఎకరాల భూమిని కేటాయించాలన్న సుప్రీం ఆదేశాలపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రతిపాదిత రామమందిరం డిజైన్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా వెలుగొందుతున్న కంబోడియాలోని "అంగ్కోర్ వాట్ దేవాలయం" అంత ఘనంగా, అంత విశాలంగా ఉండాలని స్వరూపానంద సరస్వతి అభిలషించారు. -
నెత్తుటి వారథి
-
నెత్తుటి వారధి
-
నిఖత్ శుభారంభం
బ్యాంకాక్: ఆద్యంతం తన ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించిన భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మక ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. స్రె పోవ్ నావో (కంబోడియా)తో ఆదివారం జరిగిన మహిళల 51 కేజీల విభాగం తొలి రౌండ్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ సంధించిన పంచ్‌ల ధాటికి రిఫరీ ఈ బౌట్‌ను రెండో రౌండ్లోనే ముగించాడు. ఈ గెలుపుతో నిఖత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు అమిత్ (52 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), శివ థాపా (60 కేజీలు), మహిళల విభాగంలో సరితా దేవి (60 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అమిత్ 5–0తో తు పో వె (చైనీస్ తైపీ)పై, ఆశిష్ 4–1తో అబ్దుర్‌ఖమనోవ్ (కిర్గిస్తాన్)పై, శివ థాపా 4–1తో సెత్‌బెక్ యులు (కిర్గిస్తాన్)పై గెలుపొందారు. గ్వాన్ సుజిన్ (కొరియా)తో జరిగిన బౌట్లో సరితా దేవి దూకుడుకు రిఫరీ మూడో రౌండ్లో బౌట్‌ను ముగించి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. పురుషుల 81 కేజీల విభాగం బౌట్లో మాత్రం భారత బాక్సర్ బ్రిజేష్ యాదవ్ 0–4తో రుజ్‌మెతోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. -
ఖ్మేర్ రోజ్ నేతలకు జీవితఖైదు
ఫనోమ్ పెన్హ్: కాంబోడియాలో 1975–79 కాలంలో పోల్‌పాట్ నేతృత్వంలో జరిగిన ఖ్మేర్ రోజ్ సామూహిక హత్యాకాండకు సంబంధించి నాడు అధికారంలో ఉన్న ఇద్దరు కీలక నేతలకు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. నాటి ప్రధాని పోల్‌పాట్ నేతృత్వంలోని ఖ్మేర్ రోజ్ పార్టీ అనేక దారుణాలకు ఒడిగట్టింది. నాటి దేశ జనాభాలో దాదాపు పాతిక శాతం (20 లక్షలు) మందిని చంపేసింది. కార్మికుల చేత విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల కొందరు, ఆకలికి తాళలేక మరికొందరు మరణించగా ప్రభుత్వం ఉరిశిక్షలు విధించి మరికొంత మందిని పొట్టనబెట్టుకుంది. నాడు ప్రభుత్వ దారుణాలకు సూత్రధారులుగా, కీలక పదవుల్లో ఉన్న ఖీయూ సంఫన్ (87)కు, నువోన్ చియా (92)కు ప్రస్తుతం కోర్టు శిక్షలు విధించింది. -
పాములతో సావాసం..బల్లులతో భోజనం!
పాములు, కొండచిలువలు, బల్లులు, తేళ్లు.. వీటిని చూడగానే ఏమనిపిస్తుంది.. ఫస్ట్ భయం వేస్తుంది. కొందరికైతే వాటిని పుస్తకాల్లో బొమ్మలు చూడాలన్నా భయం, అసహ్యం అనిపిస్తుంది. మరి వాటితో కలసి భోజనం చేయాలంటే.. యాక్.. వామ్మో వాటిని చూస్తేనే సగం చస్తాం. అలాంటిది భోజనం ఏంటి.. అసలు అన్నం తినకుండానైనా ఉంటాం కానీ.. అలాంటి తిక్క పనులు చేయమంటారా..? మీలాంటి వారి కోసం కాకుండా అవంటే ఇష్టం.. ప్రేమ ఉండే వారికోసం కంబోడియాలో ఓ రెస్టారెంట్ ఉంది. భోజనం చేయాలంటే అక్కడ ఉన్న కొండచిలువలు, పాములు, తేళ్లు వంటి సరీసృపాలతో కలసి కూర్చునే ధైర్యం కూడా కావాలి. ఎంచక్కా కొండచిలువను మెడలో వేసుకుని, టేబుల్‌పై పెట్టుకుని మన ఆర్డర్ ఆరగించొచ్చు. ప్రాణహాని ఉంటుందన్న భయం లేకుండా హోటల్ యజమానులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఆ రెస్టారెంట్ లోపల గాజు అద్దాల డబ్బాల్లో వీటిని పెట్టారు. అవంటే భయం ఉన్నవారు దూరం నుంచే వాటిని చూసుకుంటూ తినేయొచ్చు. మరీ ఇలాంటి రెస్టారెంట్లు అవసరమా అని ప్రశ్నిస్తే.. ఈ ప్రాణులను జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు... అవి కూడా మంచివే.. ఊరికే ఎవరికీ హాని తలపెట్టవని చెప్పేందుకే ఇలాంటి ఏర్పాట్లు చేశామని అంటున్నారు హోటల్ యజమానులు. -
ఆ నటికి నిజంగానే దెయ్యం పట్టిందా?
నోమ్ పెన్ : సోషల్ మీడియాలో ఓ వీడియో వణుకు పుట్టిస్తోంది. కంబోడియన్ నటి ఒకరికి సెట్లోనే దెయ్యం పట్టినట్లు ప్రచారం జరుగుతూ ఆ వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్లితే... ఓ హర్రర్ చిత్రంలో సదరు నటి దెయ్యం పాత్ర పోషిస్తోంది. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ ఆమె వింతగా ప్రవర్తించటం మొదలుపెట్టింది. తోటి నటితోపాటు వ్యక్తిగత సిబ్బందిపైనా దాడి చేసింది. గదిలో గోడకు దెయ్యం పట్టినట్లు కదలకుండా కూర్చోవటంతో అంతా వణికిపోయారు. ఆమెను చూసి వణికిపోయిన చిత్ర యూనిట్ ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకున్నారు. అప్పటికే కొందరిపై దాడి చేయటంతో దగ్గరికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. మరికొందరు ఆమెకు నిజంగానే దెయ్యం పట్టిందంటూ బయటకు పరుగులు తీసి ప్రచారం చేశారు. సహ నటి మాత్రం ఏడుస్తూ బయట కూర్చుండి పోయింది. అయితే ఇది నిజంగానే జరిగిందా? లేక సరదా కోసం(ఫ్రాంక్ వీడియో) చేసిందా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటన ఎప్పుడు జరిగిందన్నది స్పష్టత లేకపోయినప్పటికీ.. గత నాలుగు రోజులుగా ఫేస్ బుక్ ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. దాదాపు 16 మిలియన్ వ్యూవ్స్ దీనికి రాగా.. 7 వేలకు పైగా షేర్లు వచ్చాయి. -
అశ్లీల డ్యాన్స్‌లు.. అడ్డంగా బుక్కు
నాంపెన్ : చుట్టూ నలుగురు చూస్తున్నారనే సభ్యత మరిచి శృంగార భంగిమలతో కూడిన నగ్న డ్యాన్స్‌లు (పోర్నోగ్రఫిక్ డ్యాన్స్‌లు) చేస్తున్న పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. వారిని ఆదివారం కోర్టు ముందుకు తీసుకెళ్లారు. వాదోపవాదాలు పూర్తయితే వారికి ఏడాదిపాటు జైలు శిక్ష పడనుంది. ఈ ఘటన కాంబోడియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు బ్రిటన్ పౌరులు, ఇద్దరు కెనడియన్లు, ఒకరు న్యూజిలాండ్ పౌరుడు కాగా మరో ఇద్దరు కాంబోడియా వాళ్లు. వీళ్లు గత ఏడు నెలలుగా టూరిజం పేరిట కాంబోడియాకు వచ్చి పలు పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతూ అసభ్యతకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా శృంగారత్వంతో నిండిన పాటలు పాడుతూ, శృంగార భంగిమల్లో డ్యాన్స్‌లు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. దీంతో వీరిపై కొద్ది రోజులుగా కన్నేసిన పోలీసు అధికారులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. తమ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా వారి చేష్టలు ఉన్నాయని, అందుకే వారిని అరెస్టు చేశామని తెలిపారు. వారిలో ఒకరిద్దరు జువెనైల్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. -
లేగ దూడే నా భర్త..!
కంబోడియాకు చెందిన 74 ఏళ్ల కిమ్ హాంగ్ ఇటీవల వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఎందుకంటే ఆమె ఒక ఆవు దూడను ఇంట్లో మనిషిలా చూసుకోవడమే! ఆ మాత్రం దానికేనా అంటే మాత్రం అక్కడే ఉంది అసలు విషయం.. ఈగ సినిమాలో నాని చనిపోయి ఎలాగైతే ఈగగా మళ్లీ పుడుతాడో అచ్చం అలాగే చనిపోయిన తన భర్త కూడా దూడ రూపంలో జన్మించాడని కిమ్ ప్రగాఢంగా నమ్ముతోంది. గతేడాది ఆమె భర్త మరణించాడు. అయితే కిమ్ మాత్రం తన భర్త తిరిగి వస్తాడని చనిపోయినప్పటి నుంచి బలంగా విశ్వసిస్తోంది. ఆ విశ్వాసంతోటే ఇటీవల మార్చిలో జన్మించిన లేగ దూడ తన భర్తేనంటూ వాదిస్తోంది. దానికి పలు కారణాలు కూడా చెబుతోంది. తన భర్త బతికున్నప్పుడు ఎలా ఉండేవాడో అచ్చం ఆ దూడ కూడా అలాగే చేస్తోందని అంటోంది. తన బంధువులను గుర్తించి ప్రేమగా చేతులు నాకడం, ఇంట్లోనే ఎక్కు వ సమయం గడపడం, ఆఖరికి రాత్రి సమయంలో తనతో, తన పిల్లలతో అదే బెడ్‌పై నిద్రించడం లాం టివి చేస్తోందని చెబు తోంది. తానొక సారి దూడ వద్ద కు వెళ్లినప్పుడు తన భర్త ఆత్మ వచ్చి మాట్లాడిం దని చెబుతోంది. దూడ కూడా మనుషుల్లాగే ప్రవర్తిస్తోందట. కిమ్ భర్తకు ఎంతో ఇష్టమైన దిండు, బెడ్‌పైనే అది నిద్రపోతుందట. ఈ దూడ కోసం కిమ్ ఓ గదిని సిద్ధం చేసి, పూలతో అలంకరించింది. అయితే తాను బతికున్నంత వరకు తన భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగినా సాధారణ మనుషుల్లాగే ఘనంగా అంతిమ సంస్కారాలు జరిపించి తన భర్తను సాగనంపుతానని కిమ్ అంటోంది. ఏంటో ఎవరి నమ్మకాలు వారివి! -
కంబోడియాలో తల్లిపాల ఎగుమతిపై నిషేధం
పెనోంపెన్: కంబోడియా తల్లులనుంచి సేకరించిన పాలను ఎగుమతి చేస్తున్న ఓ కంపెనీ కార్యకలాపాలను ఆ దేశం తాత్కాలికంగా స్తంభింపజేసింది. కొంతమంది నిరుపేద మహిళలు తమ బిడ్డలకు ఇవ్వాల్సిన పాలను అమ్ముకుని జీవనానికి అవసరమైన డబ్బును సమకూర్చుకుంటున్నారని కొన్ని నివేదికలు పేర్కొనడంతో అక్కడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు చెందిన ఆంబ్రోసియా ల్యాబ్స్ అనే కంపెనీ కాంబోడియాలో మహిళల నుంచి పాలను సేకరించి.. ఘనీభవింపజేసి, అమెరికాకు తరలించి విక్రయిస్తోంది. 147 మిల్లీ లీటర్ల పాల ప్యాకెట్‌ను 20 డాలర్లకు (రూ.1,300) విక్రయిస్తోంది. తమ బిడ్డలకు తల్లి పాలు ఇవ్వలేని అమెరికా మహిళలు వీటిని కొంటున్నారు. ఈ కంపెనీ కాంబోడియా తల్లులకు రోజుకు దాదాపు రూ.500 చెల్లించేది. ఆసియాలోనే అతి పేద దేశాల్లో కాంబోడియా ఒకటి. -
ఫేక్ పోస్టింగ్.. ప్రతిపక్ష నేతకు ఐదేళ్ల జైలు!
ఫెనాం పెన్హ్ : సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ చేసిన కేసుకు సంబంధించి కంబోడియా ప్రతిపక్ష నేత శామ్ రెయిన్సీకి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. సరిహద్దు దేశమైన వియత్నాంతో కొన్ని ఒప్పందాలు, సరిహద్దు విషయమై సంప్రదింపులకు అంగీకరించినట్లు ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు ఫెనాం పెన్హ్ మున్సిపల్ కోర్టు నేడు విచారణ జరిపి శిక్ష ఖరారుచేసింది. గత కొన్ని నెలలుగా అధికార పార్టీ కంబోడియన్ పీపుల్స్ పార్టీ నేత, ప్రధాని హన్ సేన్, ప్రతిపక్ష పార్టీ కంబోడియా నేషనల్ రెస్క్యూ పార్టీల మధ్య ఈ విషయంపై వివాదం కొనసాగుతోంది. వియత్నాం, కంబోడియా దేశాల నేతలలో శామ్ రెయిన్సీ టీం చేసిన ఫేక్ పోస్ట్ కలవరం పుట్టించింది. ఇరుదేశాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావించారు. 2013 లో జరిగిన ఎన్నికల్లో శామ్ రెయిన్సీ నేతృత్వం వహించిన కంబోడియా నేషనల్ రెస్క్యూ పార్టీ 55 సీట్లు కైవసం చేసుకోగా, అధికార పార్టీ కంబోడియన్ పీపుల్స్ 68 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలసిందే. 1979లో జరిగిన బోర్డర్ ఒప్పందాలపై శామ్ రెయిన్సీతో పాటు అంగ్ చంగ్ లియాంగ్, సత్యా సంబాత్ దుష్ప్రచారం చేశారని నిర్ధారించారు. శామ్ రెయిన్సీకి ఐదేళ్లు శిక్షపడగా, అంగ్ చంగ్ లియాంగ్, సత్యా సంబాత్ లకు మూడేళ్ల జైలుశిక్ష విధించారు. కాగా, పరువునష్టం దావాకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శామ్ రెయిన్సీ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని 2015లో ఫ్రాన్స్ వెళ్లిపోయి అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురు నేతలను అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని మున్సిపల్ కోర్టు తీర్పిచ్చింది. -
కంబోడియాలో ఘోర రోడ్డు ప్రమాదం
కంబోడియాలో సోమవారం అర్దరాత్రి తర్వాత సమయంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా, మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. కంబోడియాలోని బట్టాంబాంగ్ ప్రాంతంలో మాంగ్ రస్సె జిల్లాలో వేగంగా వెళ్తున్న ట్రక్, మినీ బస్ ఢీకొన్నట్లు ఓ అధికారి తెలిపారు. ట్రక్ డ్రైవర్ ముందుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. రెండు వాహనాల డ్రైవర్లు సహా మరో ఏడుగురు మృతిచెందగా, దాదాపు పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వివరించారు. -
భళా...కాంభోజ!
అదిగో అల్లదిగో... కంబోడియా ఆగ్నేయ ఆసియాలోని ఇండోనేషియా ద్వీపకల్పానికి దక్షిణంగా ఉన్న దేశం కంబోడియా. ఇప్పటికీ రాచరిక విధానం అమలులో ఉన్న దేశం ఇది. ఖైమర్ సామ్రాజ్యకాలంలో విస్తారమైన సంపదలతో దక్షిణాసియా దేశాలలో ఆధిపత్యం సాధించింది. పద్దెనిమిదవ శతాబ్దంలో పొరుగు దేశాలైన థాయిలాండ్, వియత్నాంల ఆధిపత్యానికి గురైంది. థాయిలాండ్ కంబోడియాను ఆక్రమించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది. పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో కంబోడియాపై వియత్నాం దాడి చేసింది. దీంతో రక్షణ కోసం కంబోడియా థాయిలాండ్‌ను ఆశ్రయించింది. ఫలితంగా వాయవ్య కంబోడియా థాయిలాండ్ వశమైంది. థాయిలాండ్, వియత్నాంల నుంచి తమ దేశాన్ని రక్షించవలసిందిగా కంబోడియా రాజు వేడుకోవడంతో, 1863లో కంబోడియా ఫ్రెంచ్ రక్షణలోకి వెళ్లిపోయింది. ఫ్రెంచ్ పాలనలో కంబోడియాలో చెప్పుకోదగ్గ ఆర్థికాభివృద్ధి చోటుచేసుకుంది. రోడ్లు, రైల్వే లైన్ల నిర్మాణం జరిగింది. 1920లో రబ్బర్ పరిశ్రమ అభివృద్ధి చెందింది. అయినప్పటికీ కంబోడియన్లు పెద్ద ఎత్తున పన్నులు చెల్లించాల్సి రావడంతో దేశంలో జాతీయవాదం తలెత్తింది. 1941లో కంబోడియా జపాన్ ఆక్రమణకు గురైంది. 1945లో జరిగిన యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో కంబోడియా మరోసారి ఫ్రెంచ్ పాలనలోకి వెళ్లింది. రాజకీయ పార్టీలు స్థాపించుకోవడానికి, రాజ్యాంగం నిర్మించుకోవడానికి ఈసారి కంబోడియన్లకు అవకాశం ఇచ్చింది. 1949లో జరిగిన ఒక ఒడంబడికతో కంబోడియా పాక్షికంగా స్వాతంత్య్రదేశమైంది. 1953లో ఫ్రెంచ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కంబోడియాకు స్వాతంత్య్రం ఇచ్చింది. కంబోడియా చరిత్రలో 1975 ఒక చీకటి కాలం. దీనికి కారణం నియంత పాల్ పాట్ పాలన. ఆయన పరిపాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయి. కంబోడియాను పూర్తిస్థాయిలో వ్యవసాయ దేశంగా మార్చడానికి పట్టణాల్లో ఉన్నవారిని పల్లెల్లోకి తరలించాడు. వ్యవసాయ ఉత్పాదన నాలుగు సంవత్సరాల్లో రెట్టింపు కావాలని నిర్ణయించి ప్రజలను కష్టపెట్టాడు. ఎంతో మంది ప్రజలు అనారోగ్య సమస్యలతో చనిపోయారు. విదేశీ భాషలు మాట్లాడటం కూడా నేరమైపోయింది. అనేక విషయాల్లో నియంతృత్వం వెర్రితలలు వేసింది. 1978లో వియత్నాంతో జరిగిన యుద్ధంతో పీడకలలాంటి వాస్తవానికి తెరపడింది. కొద్దికాలం తరువాత వియత్నాంకు వ్యతిరేకంగా గెరిల్లా పోరు మొదలైంది. 1998లో పాల్ పాట్ చనిపోయిన తరువాతగానీ దేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడలేదు. పేద దేశంగానే ఉండిపోయిన కంబోడియాలో 21 శతాబ్దం తొలినాళ్లలో ఆర్థికవృద్ధి వేగవంతం అయింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పుడు కంబోడియా ముందు వరుసలో ఉంది. టాప్ 10 1. కంబోడియా పురాతన నామం... కాంభోజ. 2. కంబోడియా జలభాగంలో 2001లో చమురు నిల్వలు, సహజవాయు నిక్షేపాలను కనుగొన్నారు. 3. చిత్రమైన విషయమేమిటంటే కంబోడియాలో ఎవరూ పుట్టిన రోజు జరుపుకోరు. 4. దేశజాతీయ పతాకంపై కట్టడం (ఆంగ్కోర్ వాట్ దేవాలయం) ఉన్న ఏకైక దేశం కంబోడియా. 5. కంబోడియాకు ఉత్తరంలో థాయిలాండ్, ఈశాన్యంలో లావోస్, వియత్నాంలు ఉన్నాయి. 6. కంబోడియాలో 536 పక్షి జాతులు, 850 మంచి నీటి చేప జాతులు, 435 సముద్రజాతి చేపలు ఉన్నాయి. 7. అడవుల క్షీణత ఎక్కువగా ఉన్న దేశాలలో కంబోడియా ఒకటి. 8. వస్త్రపరిశ్రమ తరువాత కంబోడియాలో చెప్పుకోదగ్గది పర్యాటకరంగం. 9. కంబోడియా పర్యాటకానికి ప్రధాన ఆకర్షణ ఆంగ్కోర్ వాట్ దేవాలయం. ప్రపంచంలోని మత సంబంధిత పెద్ద కట్టడాల్లో ఇదొకటి. ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా పేరుగాంచింది. 10. దేశంలో 95 శాతం కంటే ఎక్కువ మంది బౌద్ధమతాన్ని అనుసరిస్తున్నారు. -
ఒక్క రోజు కోసం రాణిగారికి రూ.26లక్షల టాయిలెట్
కాంబోడియా: ఆమె కూడా అందరిలాంటి మనిషే. కాకపోతే రాణి హోదాలో ఉంది. ఆమె తమ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు మర్యాదలు చేయడమనేది చాలా మంచి సంప్రదాయమే అవుతుంది. అలాగని సౌకర్యాల పేరిట లక్షల రూపాయలు చిన్నచిన్న విషయాలకు కూడా విసిరిపారేస్తే సామాన్యులకు కూడా ఆగ్రహం తెప్పిస్తుంది. ఇక ఆకలితో అలమటించే ప్రాంతంలో ఇలాంటి పనిచేస్తే ప్రభుత్వంపై ప్రజానీకం భగ్గుమంటుంది. ప్రస్తుతం కాంబోడియాలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. తమ ప్రభుత్వం చేసిన నిర్వాకం తెలిసి అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. థాయిలాండ్ రాణి మహా చక్రి సిరింధోర్న్ కాంబోడియాలోని అత్యంత పేద ప్రాంతమైన రతన క్కిరి ప్రావిన్స్ పర్యటనకు వస్తున్నారు. ఆమె మూడు రోజులపాటు ఆ ప్రాంతంలో గడపనున్నారు. అయితే, ఆమె పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం ఆడంబరాలకు పోయి సాధరణంగా ఖర్చు చేసే మొత్తం కన్నా 130 రెట్ల సొమ్ముతో ఓ విలాసవంతమైన మరుగు దొడ్డి నిర్మాణం చేపట్టింది. అది కూడా ఆ ప్రాంత ప్రజలు ఎంతో పవిత్రంగా భావించి ఇయాక్ లామ్ సరస్సు ఒడ్డున. సుమారుగా రూ.27లక్షలకు పైగా(40 వేల డాలర్లు) ఖర్చు చేసి మరి సర్వాంగ సుందరంగా టాయిలెట్ ను తీర్చిదిద్దారు. వాస్తవానికి ఆమె ఆ ప్రాంతంలో మూడు రోజులపాటు పర్యటించినా ఆ టాయిలెట్ నిర్మించిన ప్రాంతంలో ఉండేది ఒకటే రోజు. అంటే ఒకటే రోజు దానిని ఉపయోగించుకుంటారన్నమాట. ఆ తర్వాత తిరిగి దానిని కూల్చివేస్తారంట. అందులోని ప్రధాన వస్తువులు తిరిగి థాయిలాండ్ పంపిస్తారట. రాణిగారి పర్యటన నేపథ్యంలో బ్యాంకాక్ నుంచి ప్రత్యేకంగా ఈ సామాగ్రిని కాంబోడియా ప్రభుత్వం తెప్పించి నిర్మించింది. అయితే, మరికొంతమంది మాత్రం రాణి వెళ్లిపోయిన తర్వాత దానిని ఆఫీసుగా మారుస్తారని చెప్తున్నారు. ఏదేమైనా రాణిగారి కోసం నిర్మించిన ఈ టాయిలెట్ మరోసారి సామాన్యుడికి తాను ఎప్పటికీ సామాన్యుడే అనే విషయం మాత్రం గుర్తు చేసింది. -
ఏంజిలీనా వయసుతోపాటే..
- 40వ పడిలో మరో మూడు పచ్చబొట్లు పొడిపించుకున్న హాలీవుడ్ నటి ప్నోమ్ పెన్: వయసుతోపాటే తనవుపై టాటూల సంఖ్యనూ పెంచుకుంటూపోతోంది హాలీవుడ్ నటశిరోమణి ఏంజిలీనా జోలీ. ప్రస్తుతం 40వ పడిలో ఉన్న ఆమె తన మేనుపై తాజాగా మరో మూడు పచ్చబొట్లను పొడిపించుకుంది. 'ఫస్ట్ దె కిల్డ్ మై ఫాదర్' సినిమా షూటింగ్ నిమిత్తం కాంబోడియాలో ఉన్న ఏంజిలీనా ఆదివారం స్పాట్ లో తన కొత్త టాటూలను ప్రదర్శించింది. కొత్త టాటూల్లో రెండు ప్రాచీన థాయి బౌద్ధ సూచికలుకాగా, మరోటి మంచిపనులకు సంకేతంగా భావించే పెట్టె ఆకారం. తన 18వ ఏట నుంచే టాటూలు వేసుకోవడం ప్రారంభించిన ఏంజిలీనా ఇప్పటికీ ఆ అభిరుచిని కొనసాగిస్తుండటం, భర్త బ్రాడ్ పిట్ కూడా అందుకు సహకరిస్తుండటం గమనార్హం. -
బస్సు - ట్రక్కు ఢీ: ఐదుగురు మృతి
నాంపెన్: కంబోడియా పుర్సత్ ప్రావిన్స్‌లో మంగళవారం ఆర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు - ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారి బుధవారం వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మాత్రం అక్కడికక్కడే మరణించగా... మరో నలుగురు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు అయితే గాయపడిన క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అలాగే ఈ ప్రమాదంలో బస్సు, ట్రక్కు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. -
200మందికి ఎయిడ్స్ ఎక్కించిన దొంగ వైద్యుడు
పినోమ్ పెన్: వైద్యో నారయణో హరి అని అంటుంటారు.. అంటే వైద్యుడు ప్రత్యక్ష దైవం అని చెప్తారు. సృష్టిలో ఈ వృత్తిలో ఉన్నవారిని మాత్రమే ప్రత్యక్ష దైవసమానంగా చూడటం పరిపాటి. ఇంతటి గొప్ప వృత్తిలో ఉన్న ఓ నకిలీ వైద్యుడు చేయకూడని తప్పిదానికి పాల్పడ్డాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200మందికి పైగా ఎయిడ్స్ వ్యాపించేందుకు కారణమయ్యారు. ఈ వృత్తిని చేపట్టిన ఆ వైద్యుడికి లైసెన్సు కూడా లేదు. ఈ తప్పిదానికి పాల్పడినందుకు గురువారం కాంబోడియా కోర్టు అతడికి 25 ఏళ్ల కారాగార శిక్షను విధించింది. యెమ్ చరిన్ (57) అనే వ్యక్తి లైసెన్సు లేకుండానే వైద్య వృత్తి చేపట్టాడు. బట్టామాబాంగ్ ప్రావిన్స్ లోని రోఖా అనే గ్రామీణ తెగకు తనకు వచ్చి రాని వైద్యంతో డబ్బుసంపాధించడం మరిగాడు. ఈ క్రమంలో అతడు దాదాపు 200మందికి పైగా ఎయిడ్స్ రావడానికి కారణమయ్యాడు. వారిలో పదిమందికి పైగా ఇప్పటికే చనిపోయారు కూడా. ఈ క్రమంలో అతడిని గత ఏడాది 2014లో అరెస్టు చేశారు. ఇతడు ఒకరికి ఉపయోగించిన నీడిల్ ను మరొకరికి ఉపయోగించిన కారణంగా 200మందికి పైగా ఎయిడ్స్ సోకింది. వీరంతా కూడా 15 నుంచి 49ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే. ఇతడికి 25 ఏళ్ల జైలు శిక్షను విధించడంతోపాటు భారీ మొత్తంలో ఫైన్ కూడా వేశారు. -
కంబోడియా ప్రధానితో అన్సారి భేటీ
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి కంబోడియాలో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా అన్సారి చైనా పర్యటనను ముగించుకుని కంబోడియా వెళ్లారు. ఫోమ్ పెన్ విమానాశ్రయంలో అన్సారికి కంబోడియా సమాచార శాఖ మంత్రి కీయూ కన్హారిత, కంబోడియాలో భారత రాయబారి నవీన్ శ్రీవాత్సవ స్వాగతం పలికారు. భారత్, కంబోడియాల మధ్య వాణిజ్య ఒప్పందం, దృఢమైన మైత్రి భాగస్వామ్యంపై చర్చలు జరపనున్నారు. కంబోడియా ప్రధాని హున్, జాతీయ అసెంబ్లీ ప్రెసిడెంట్ హెంగ్ సమ్రిన్లతో సమావేశమయ్యారు. ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. -
ర్యాట్ స్క్వాడ్!
డాగ్‌స్క్వాడ్ మాదిరిగా వాసన చూసి మందుపాతరలను కనిపెట్టే మూషికమిది. గురువారం కంబోడియాలోని సీమ్ ప్రావిన్స్‌లో మందుపాతరలు క్రియారహితంగా ఉన్న ఓ ప్రాంతంలో మూషికంతో కంబోడియన్ మైన్ యాక్షన్ సెంటర్ సిబ్బంది అన్వేషిస్తున్న దృశ్యమిది. బెల్జియంకు చెందిన ఓ సంస్థ ఈ గాంబియన్ ఎలుకల్ని కంబోడియా నుంచి టాంజానియా వర కూ అనేక చోట్ల మందుపాతరలు కనిపెట్టేందుకు రంగంలోకి దించింది. -
బస్సు - ట్రక్ ఢీ : 21 మంది మృతి
నాంపెన్ : కంబోడియా స్వే రింగ్ ప్రావెన్స్లో మంగళవారం బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులంతా గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులని పోలీసులు వెల్లడించారు. బస్సు డ్రైవర్ అతి వేగంగాతోపాటు నిర్లక్ష్యంగా నడపడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. -
నా పేరు ABCDEFGH... XYZ
ఇదేంటి.. పేరు చెప్పమంటే ఏబీసీడీలు చెబుతోందనుకుంటున్నారా? ఈమె పేరు అదే. ఆంగ్ల వర్ణమాలలోని 26 అక్షరాలనూ వరుసగా తన పేరుగా పెట్టేసుకుంది. కంబోడియాకు చెందిన ఈ మహిళ ఒకప్పటి పేరు లేడీ జుంగా సైబోర్గ్. పేరు విషయంలో ఈ అమ్మడికి కాస్త పట్టింపు ఎక్కువ. తన పేరు ఎవరికీ ఉండకూడదన్నది ఈమె సిద్ధాంతం. అందుకే గతంలో కూడా పలుమార్లు పేరు మార్చుకుంది. కానీ ఆ పేరు ఎక్కడో మరొకరికి ఉందని తెలిసేసరికి మళ్లీ మార్చుకునేది. ఇక లాభం లేదనుకుని 2012లో ‘'ABCDEFG HIJKLMN OPQRST UVWXYZ'’ అని తనకు నామకరణం చేసుకుంది. ఈ మేరకు గుర్తింపు కార్డు జారీచేయాలని కంబోడియా అధికారులకు దరఖాస్తు కూడా చేసింది. కానీ ఇలాంటి పేరుతో కార్డు ఇవ్వలేమని వారు తేల్చిచెప్పడంతో ప్రభుత్వంపై పోరాటానికి దిగింది. ఏడాదిపాటు వారిని ముప్పుతిప్పలు పెట్టడంతో.. ఎందుకొచ్చిన తలనొప్పి అని భావించిన అధికార యంత్రాంగం 2013లో గుర్తింపు కార్డు జారీ చేసింది. -
క్లబ్బులో మంటలు.. ఐదుగురు మృతి
పెన్: క్లబ్బులో మంటలు వ్యాపించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కాంబోడియాలో సోమవారం చోటుచేసుకుంది. ఇక్కడ ఉన్న స్టార్ నైట్ క్లబ్బులోని కారావోకె అనే గదిలో విద్యుదాఘాతం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులో ఉన్నవారిని చుట్టేశాయని పోలీసులు తెలిపారు. వాటిని తప్పించుకునే క్రమంలో గందరగోళం ఏర్పడిందని, ప్రాణనష్టం చోటుచేసుకుందని తెలిపారు. చనిపోయిన ఐదుగురిలో ఒక మహిళ కూడా ఉంది. -
ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రయాణికుడి అరెస్ట్
టీనగర్: చెన్నై విమానాశ్రయంలో తుపాకీ, బుల్లెట్‌తో వచ్చిన ప్రయాణికుని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాంబోడియాకు వెళ్లేందుకు గురువారం రాత్రి బయలుదేరేందుకు ఒక విమానం సిద్ధంగా ఉంది. అందులో ప్రయాణించేందుకు వచ్చిన వారి సామగ్రిని అధికారులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఒక ప్రయాణికుని వద్ద పేలని తపాకీ బుల్లెట్ ఉన్నట్టు గుర్తించారు. విచారణలో అతడు కాంబోడియాకు చెందిన ఇన్సెల్కం (45) అని, కొన్ని రోజుల క్రితం చెన్నై, ఆళ్వారుపేటలోగల బధిరుల పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి తన బృందం సహా వచ్చినట్లు తెలిసింది. దీని గురించి ఇన్సెల్కం ఈ బుల్లెట్ కాంబోడియాలో తనకు లభించిందని, అనేక ఏళ్లుగా ఇది తన బ్యాగులో ఉందని తెలిపాడు. దీంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అధికారులు అతన్ని విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. వారు ఇన్సెల్కంను అరెస్టు చేశారు. -
బౌద్ధభిక్షువుల వద్ద డ్రగ్స్, కండోమ్స్!!
కాంబోడియాలో ఇద్దరు బౌద్ధభిక్షువుల వద్ద డ్రగ్స్, కండోమ్స్ దొరకడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారు నివసిస్తున్న పగోడాలో పోలీసులు సోదాలు చేయగా అక్కడ క్రిస్టల్ మెతాంఫెటమైన్ పైపు, ఇతర వస్తువులు దొరికాయి. పుర్ లాంగా పగోడాకు చెందిన ఈ బౌద్ధ భిక్షువులను సియెమె రీప్ నగరంలో అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు భిక్షువుల్లో ఒకరు సీనియర్. పిచ్ డేవిడ్ (36) అనే ఇతగాడు తనను తాను గురువుగా చెప్పుకొంటూ.. బౌద్ధ నియమాలను కూడా పాటించరని ఓ పోలీసు అధికారి తెలిపారు. తాము అక్కడకు వెళ్లేసరికి అక్కడ మద్యం, కొన్ని కండోమ్‌లు ఉన్నాయని, అలాగే 'ఐస్' అనే తరహా డ్రగ్ సేవించడానికి కావల్సిన పైప్ కూడా ఉందని అన్నారు. వీరిద్దరిమీద కోర్టులో కేసు నమోదైంది. దాంతో ఈ ఇద్దరినీ ఆశ్రమం నుంచి తరిమేశారు. వారి బౌద్ధ భిక్షువు హోదాను కూడా తప్పించారు. పిచ్ డేవిడ్‌కు ఇలా జరగడం ఇది రెండోసారి. తొలిసారి దుష్ప్ర్రవర్తన కారణంగా అతడిని 2012లో బహిష్కరించినా, మళ్లీ తాను నియమాలకు కట్టుబడి ఉంటానని వేడుకోవడంతో 2013లో చేర్చుకున్నారు. ఇంతకుముందు కండల్ రాష్ట్రంలో పోలీసులతో కలిసి మద్యం సేవించినందుకు పగోడాలో ప్రధాన బౌద్ధభిక్షువు ఒకరిని ఆశ్రమం నుంచి తప్పించారు. బౌద్ధ నియమాల ప్రకారం భిక్షువులు తప్పనిసరిగా మద్యం, డ్రగ్స్, సెక్స్ లాంటివాటికి దూరంగా ఉండాలి. -
కింగ్.. కాంగ్..
చూడగానే.. జబ్బుపడి లేచినట్లు కనిపిస్తున్నాడు కదూ ఈ పిల్లాడు. మనకిలా కనిపిస్తున్నాడు కానీ.. వీడు దైవాంశ సంభూతుడట.. వీడు జబ్బు పడటం ఏంటి.. వేరే వాళ్ల జబ్బుల్ని సైతం ఇట్టే మాయం చేయగలడని లోకలోళ్లు చెబుతున్నారు. కంబోడియాలోని నార్ అనే గ్రామంలో ఉండే కాంగ్ కెంగ్(2) అద్భుత బాలుడిగా పేరొందాడు. వీడి దర్శనం కోసం లావోస్, వియత్నాం నుంచి కూడా జనం వేల సంఖ్యలో వస్తారు. కొన్ని నెలల క్రితం ప్రమాదం వల్ల పక్షవాతం వచ్చిన తమ సమీప బంధువు ఒకరికి వీడు నయం చేశాడట. అది ఆ నోటా ఈ నోటా పాకి.. ఇలా సెలబ్రిటీ అయిపోయాడు. కాంగ్ పడుకున్నప్పుడు మైక్‌లో.. ‘అద్భుత బాలుడు పడుకున్నాడు. ఎవరూ సౌండ్ చేయకండి.. లేదంటే ఆయనకు ఆగ్రహమొస్తుంది’ వంటి అనౌన్స్మెంట్లు ఇక్కడ కామన్. వీడు ప్రత్యేకమైన మూలికలతో చూర్ణం చేసి.. అమృతాంజనం బాటిళ్ల వంటివాటిలో నింపుతాడు. తర్వాత దానిపై వీడు చేయి పెడితే.. ఆ చూర్ణానికి అద్భుత శక్తులు వచ్చేసి.. దాన్ని తీసుకున్నవారి జబ్బులను నయం చేసేస్తాయట. గత నెల్లో ఓ 20 వేల మంది కాంగ్ దర్శనానికి వస్తే.. వారిలో దాదాపు వేయి మందికి స్వస్థత చేకూరిందట. తాము అందరికీ ఉచితంగా మందులిస్తున్నామని.. తమకేమీ అక్కర్లేదని, వచ్చినోళ్లు స్థానిక బౌద్ధాలయాలకు రూ.50 చొప్పున విరాళమివ్వాలని కాంగ్ తండ్రి చెబుతున్నారు. మందులైతే ఉచితమేగానీ.. కాంగ్‌ను వ్యక్తిగతంగా కలవాలంటే మాత్రం రూ.100-150 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. -
సైనిక హెలికాప్టర్ కూలి ఐదుగురి మృతి
కాంబోడియా రాజధాని నగరం నామ్ ఫెన్ శివార్లలో ఓ సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో ఐదుగురు మరణించారు, మరొకరు గాయపడ్డారు. డాంగ్కోర్ జిల్లాలో ఈ ప్రమాదం సంభవించినట్లు సైనికాధికారులు తెలిపారని సిన్హువా వార్తాసంస్థ పేర్కొంది. ప్రమాదం జరిగే సమయానికి హెలికాప్టర్లో కాంబోడియా వైమానిక దళానికి చెందిన ఐదుగురు ట్రైనీలున్నారు. ప్రమాదానికి కారణం ఏంటో, ఎలా సంభవించిందోనన్న విషయాన్ని ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. కూలిపోయిన హెలికాప్టర్ చైనాకు చెందిన జడ్-9 యుటిలిటీ తరహాదని అధికారులు తెలిపారు. -
కింగ్డమ్ ఆఫ్ కాంబోడియా
ప్రపంచ వీక్షణం చరిత్ర పుటలలో... కాంబోడియాను కింగ్డమ్ ఆఫ్ కాంబోడియా అని పిలుస్తారు. పూర్వం దీనిని కాంపూచియా లేదా కాంభోజ దేశం అని పిలిచేవారు. క్రీస్తుపూర్వం 6000 సంవత్సరాల క్రితం నుండే దీని ఉనికి చరిత్రలో ఉంది. క్రీస్తుశకం 700 నుండి ఖ్మేర్ రాజులు కాంబోడియాను పరిపాలించారు. ఈ రాజవంశమే దాదాపు 13వ శతాబ్దం వరకు అధికారం చలాయించింది. 14వ శతాబ్దం నుండి కాంబోడియా పతన దిశలో నడిచింది. 18వ శతాబ్దంలో ఫ్రెంచి రాజులు కాంబోడియాను ఆక్రమించుకున్నారు. అనేక పోరాటాల తర్వాత 1953లో ఫ్రాన్స్ నుండి కాంబోడియాకు విముక్తి లభించి స్వతంత్రదేశంగా అవతరించింది. అంకోర్వాట్: ఇక్కడ ఆర్కియాలజీ పార్కు చూడదగ్గది. ఇక్కడ బ్రహ్మాండమైన బౌద్ధ దేవాలయం ఉంది. బౌద్ధ భిక్షువుల సమూహాలు ఇక్కడ ఎక్కువగా దర్శనమిస్తాయి. దీనిని తప్పనిసరిగా చూడవలసిందే. ఇది సీమ్‌రీప్ నగరంలో ఉంది. ఇక్కడే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఆహారం కాంబోడియాలో వరిధాన్యం ఎక్కువగా పండుతుంది. అన్నంలో సూపులు, నూడుల్స్, చేపలకూర, చేపల పులుసు, చేపల సూపు, పాలు, చింతపండు, అల్లం మొదలైన వాటితో ఆహార పదార్థాలు తయారుచేస్తారు. ఖ్మేర్ ప్రాంతంలో తినే వంటకాలను ‘ప్రహోక్’ అంటారు. ఇందులో చేపలతో చేసిన పేస్టు ప్రత్యేకంగా ఉంటుంది. వీరికి ఇష్టమైన పానీయం ‘అమోక్’. వీరు కొబ్బరిపాలను మనం కాఫీ తాగినట్లుగా తాగుతూ ఉంటారు. పంటలు-పరిశ్రమలు దేశంలో వరి, మొక్కజొన్న, అరటి, రబ్బరు, పొగాకు, జనుము, కలప ఎక్కువగా పండుతాయి. సముద్ర తీరంలో చేపలు, అడవులలో కలప బాగా లభిస్తాయి. దేశంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు బాగా ఉన్నాయి. చేపలను విదేశాలకు ఎగుమతి చేయడం, కలప వ్యాపారం వీరి ముఖ్యమైన వ్యాపారాలు. ఇవేకాదు, వివిధ రకాల కూరగాయలను, ముడి రబ్బరును కూడా విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. విహారస్థలాలు ప్రేక్ ఆంపిల్: ఇది కాంపోట్ జిల్లాలో కోటోచ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడి తెల్లటి ఇసుక సముద్రతీరంలో కనిపిస్తుంది. వేలాదిగా మాంగ్రూవ్ చెట్లు తీరమంతా నిండి ఉంటాయి. నగరాలు - పట్టణాలు కాంబోడియా దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 25 ప్రాంతాలుగా విభజించారు. అలాగే దేశంలో 159 జిల్లాలు, 26 పురపాలక నగరాలు ఉన్నాయి. ముఖ్యమైన నగరాలలో సిసోప్రాన్, బట్టమ్బాంగ్, కాంపాంగ్బామ్, కాంపాంగ్ స్పే, కాంపాంగ్ ధామ్, కాంపోట్, టాఖ్మో, క్రాంగ్ ఖెప్, క్రాచే, సెన్మనోరమ్, సమ్రోంగ్, నామ్‌ఫెన్, సిహనౌక్ బెంగ్ మీంచే, పుర్సట్, ప్రేవెంగ్, బాన్లుంగ్, సీమ్‌రీప్, స్టంట్ట్రెంగ్, స్వేరీంగ్, టేకియో, సువాంగ్ ఉన్నాయి. బోటమ్ సకోర్ జాతీయ పార్కు ప్రసత్బేయన్లో బోధిసత్వుడు, అవలోకిటేశ్వరుల భారీ విగ్రహాలను దర్శించవచ్చు. అలాగే బోటమ్ సకోర్ జాతీయ పార్కు, ఇలా ఎన్నో ప్రాంతాలు చూడదగ్గవి ఉన్నాయి. అత్యంత పురాతనదేవాలయాలు వేలాది సంవత్సరాల పూర్వం అప్పటి రాజులు నిర్మించిన దేవాలయాలను ఇప్పటికీ మనం చూడవచ్చు. అలాంటి వాటిలో నామ్‌ఫెన్ నగరంలో ఉన్న దేవాలయాలు, టా ఫ్రోమ్, ఇంద్రదేవాలయం... ఇలా మరెన్నో ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. చా ఓంగ్ జలపాతం ఇది బాన్లాంగ్ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నీళ్ళు పైనుండి మూడు అంతస్థులుగా క్రిందికి జాలువారడం ఒక ప్రత్యేకత. ఈ జలపాతం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ‘ఏసేపక్టామక్’ అనే పర్వతం నుండి ఈ జలపాతంలోకి నీళ్ళు వస్తూ ఉంటాయి. సంస్కృతి - సంప్రదాయాలు కాంబోడియాలో బౌద్ధమత ప్రాచుర్యం అధికంగా ఉండడం వల్ల ఎక్కడ చూసినా బౌద్ధ సన్యాసులు దర్శనమిస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారు క్రామా అనే దుస్తులను ధరిస్తారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో ‘సామ్పోట్’ అనే ఒకరకమైన దుస్తులను కూడా వీరు అధికంగా ధరిస్తారు. ఎందుకంటే కాంబోడియాలో ఒకప్పుడు హిందూమతం గొప్ప ప్రాచుర్యంలో ఉండేది. -
వివాహ రిసెప్షన్పై గ్రైనెడ్తో దాడి.. 9 మంది మృతి
ఫ్నోమ్ పెన్: వివాహ రిసెప్షన్పై ఓ దుండగుడు గ్రైనెడ్ విసిరి విధ్వంసం సృష్టించాడు. ఈ దుర్ఘటనలో తొమ్మిదిమంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. కంబోడియాలోని కంపాంగ్ దోమ్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో బంధువులు, మిత్రులు నృత్యాలు చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడని కంపాంగ్ దోమ్ మిలిటరీ పోలీస్ చీఫ్ తెలిపారు. ఈ దాడికి ముక్కోణపు ప్రేమకథ కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఉగ్రవాద చర్య కాదని, ముక్కోణపు ప్రేమకథే దాడికి ప్రేరేపించి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో భావిస్తున్నారు. -
కంబోడియాలో వరదలు:168 మంది మృతి
దేశంలోని మెకంగ్ నదీ వరద పోటెత్తింది. దాంతో 168 మంది మరణించారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కమిటీ అధికార ప్రతినిధి కియో వై మంగళవారం కంబోడియా రాజధాని నామ్ ఫెన్ లో వెల్లడించారు. ఆ వరదల వల్ల 1.7 మిలియన్ల మంది నిరాశ్రయులయారని తెలిపారు. రూ.500 మిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు. దాదాపు 500 హెక్టార్ల వరి పంట వరదల వల్ల నీట మునిగిందన్నారు. అలాగే దేశంలోని 240 కిలోమీటర్ల జాతీయ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దేశంలోని చాలా ప్రావెన్స్లు వరద నీటిలో మునిగి ఉన్నాయన్నారు. -
‘కోలా రాజ్’ ఏక పార్టీ పాలన
ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర కొనుగోలుదార్లయిన ‘పెప్సీ కోలా’, ‘కోకో కోలా’ కంపెనీల చక్కెర దాహాన్ని తీర్చడానికి కంబోడియా రైతుల భూములను కబ్జా చేస్తున్నారు. ప్రధాని హున్ సెన్, ప్రతిపక్ష నేత శామ్ రైన్సీల మధ్య చర్చల వల్ల రాజకీయ ప్రతిష్టంభన తొలగినా, తొలగకపోయినా కంబోడియాలో కొలారాజ్‌కు ఢోకా లేదు. కపాలాల గుట్టల ఫొటోలతో ఒకప్పుడు మొదటి పేజీ వార్తగా ‘కళకళలాడిన’ కంబోడియా ఇప్పుడు ఎవరికీ పట్టని దేశం. అయినా ఈ మధ్య దానికి ప్రపంచ వార్తల్లో కాస్త చోటు దక్కింది. ఆగ్నేయ ఆసియాలోని ఆ నిరుపేద దేశంలో జూలై చివర్లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని హున్ సెన్ మరోమారు ఎన్నిక కావడంలో విశేషమేమీ లేదు. క మ్యూనిస్టు ఖ్మేర్ రూజ్ రక్తసిక్త పాలనస్థానే వియత్నాం సైన్యం నిలిపిన (1985) ‘సోషలిస్టు’ ప్రభుత్వానికి ఆయన ప్రధాని. నాటి నుంచి ఆయనే ఆ దేశానికి తిరుగులేని రాజు. లాంఛనప్రాయపు దేశాధినేత రాజు నరోదమ్ సిహమొని సెప్టెంబర్ 23న హున్ చేత మరోమారు ప్రమాణ స్వీకారం చేయించేసరికి... కంబోడియా హఠాత్తుగా ఏకపార్టీ ప్రజాస్వామ్యంగా మారిపోయింది. పార్లమెంటులో ఉన్నవారంతా హున్ నేతృత్వంలోని కంబోడియన్ పీపుల్స్ పార్టీ (సీపీపీ) సభ్యులే! 1993లో మొదటిసారి జరిగిన ఎన్నికల నుంచి ప్రధాన ప్రతిపక్షమైన కంబోడియన్ నేషనల్ రెస్క్యూ పార్టీ (సీఎన్‌ఆర్‌పీ) అస్తిత్వం పార్లమెంటులో నామమాత్రమే. ఈసారి ఎన్నికల్లో అది అందరి అంచనాలను మించి, 123 సీట్ల పార్లమెంటులో 55 స్థానాలను గెలుచుకొని హున్‌ను ఖంగు తినిపించింది. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మీడియా ఎలుగెత్తింది. ఇరాన్‌లాంటి దేశాల్లో సంతృప్తికరంగా జరిగిన ఎన్నికలను సైతం అక్రమమని నానా అల్లరి చేసే పాశ్చాత్య దేశాల కళ్లకు కంబోడియా ఎన్నికలు ‘స్వేచ్ఛగా, సక్రమంగా’ జరిగినట్టే కనిపించాయి. ఎన్నికల అక్రమాలు అక్కడ అలవాటే. కాకపోతే ఈసారి అవి శృతిమించాయి. దీంతో సీఎన్ఆర్పీయే గాక, రాజు సిహమొని సైతం నిరసనకు దిగాల్సివచ్చింది. హున్ తమ గెలువును దౌర్జన్యంగా తస్కరించాడని నమ్ముతున్న సీఎన్‌ఆర్‌పీ ససేమిరా పార్లమెంటుకు హాజరుకానని భీష్మించుకు కూచుంది. దీంతో హున్ సొంత పార్టీ సభ్యులతోనే పార్లమెంటు సమావేశాలను నిర్వహించారు. ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే గుడ్డిలో మెల్ల అన్నట్టున్న కంబోడియా ప్రజాస్వామ్యం పూర్తి గుడ్డిది అయ్యే ప్రమాదం ఉంది. మరో ఐదేళ్ల వరకు తమకు ఎదురులేకున్నా 2018 ఎన్నికల్లో ఓటమి తప్పదని హున్‌కు బెంగ. చేతికి అంది నోటికి కాకుండా పోయిన గెలుపు ఇక ఎన్నటికీ తమ మొఖం చూడదని సీఎన్ఆర్పీకి బెంగ. రెండు పార్టీల బెంగలకు కారణం ఒక్కటే... చెరకు! ఒకటిన్నర కోట్ల కంబోడియన్లలో అత్యధికులకు జీవనోపాధి వ్యవసాయమే. అత్యంత సారవంతమైన వరి పండించే భూములను, నీటి వనరులను గత కొన్నేళ్లుగా ‘చెరకు’ కబళించేస్తోంది. తరతరాలుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న రైతులకు వారు సాగు చేస్తున్న భూములు వారివి కావని ప్లాంటేషన్ కంపెనీలు ‘కనువిప్పు’ కలిగిస్తున్నాయి. ఒకప్పుడు ఖ్మేర్ రూజ్ కమ్యూనిస్టులు పాత భూముల రికార్డులను తగులబెట్టేశారు. రైతులకు యాజమాన్య ధృవీకరణ పత్రాలు లేవు. దీంతో చెరకు ప్లాంటేషన్ల ఆక్రమణ నిరాఘాటంగా సాగుతోంది. అంతర్జాతీయ విపణిలో గత కొన్నేళ్లుగా చక్కెర ధరలు బాగా పెరిగాయి. 2020 నాటికి చెరకు డిమాండు 25 శాతానికి పైగానే పెరుగుతుందని అంచనా. బయో ఇంధనం మిథేన్‌గా కూడా చెరకు ప్రాధాన్యం పెరగుతోంది. దీంతో పాశ్చాత్య గుత్త సంస్థలు ఆగ్నేయ ఆసియాపై కన్నేశాయి. కంబోడియా, వియత్నాం, మైన్మార్, థాయ్‌లాండ్‌లలో గుత్తసంస్థల చెరకు ప్లాంటేషన్లు విస్తరిస్తున్నాయి. కంబోడియాలోలాగే అన్ని చోట్లా తరతమ స్థాయిల్లో రైతుల భూములను ప్లాంటేషన్లు మింగేస్తున్నాయి. కంబోడియా రైతుల నోళ్లల్లో మన్నుకొట్టి పండిస్తున్న చెరకు థాయ్‌ల్యాండ్‌లో చక్కెరగా మారి, యూరప్‌కు చేరుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర కొనుగోలుదార్లయిన ‘పెప్సీ కోలా’, ‘కోకో కోలా’ కంపెనీల చక్కెర దాహాన్ని తీర్చడానికి రైతుల భూములను కబ్జా చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారమే 2010 నాటికి కంబోడియాలోని 61 పెద్ద ప్లాంటేషన్లకు లక్ష హెక్టార్ల భూములను ప్రభుత్వం కేటాయించింది. ఫలితంగా దాదాపు 7 లక్షల కుటుంబాలు భూములు, ఇళ్లు కోల్పోయాయి. నేతల, అధికారుల అండదండలతో విస్తరిస్తున్న చిన్న ప్లాంటేషన్లకు లెక్క లేదు. ప్రసుత్తం మధ్య కంబోడియాలోని కోమ్పాంగ్ స్ప్యూ రాష్ట్రంలోని పది గ్రామాల్లో చెరకు ప్లాంటేషన్ల వల్ల వీధినపడ్డ వెయ్యి కుటుంబాలు తమ భూముల కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఈ రైతాంగ అసంతృప్తే ఎన్నికల్లో ప్రతిఫలించింది. అందుకే భవిష్యత్తుపట్ల రెండు ప్రధాన పార్టీలకు బెంగ. రైతుల వద్ద భూ యాజమాన్యాన్ని రుజువుచే సే పత్రాలు లేవని, కంపెనీలు చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్ప ఎలాంటి చర్యలు తేసుకోలేమని ప్రభుత్వం సెలవిస్తోంది. ప్లాంటేషన్లకు భూములపై 99 ఏళ్ల హక్కులను దఖలు పరుస్తున్న ప్రభుత్వం ఏక పంటగా చెరకును దశాబ్దాలపాటు సాగుచేయడానికి అంగీకరిస్తోంది. భూసారం నశించిపోవడంతోపాటూ ఇది పర్యావరణానికి తీవ్ర హానిని చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2005 నుంచి విదేశాల్లో ప్రవాసంలో ఉండి దేశానికి తిరిగి వచ్చిన సీఎన్‌ఆర్‌పీ నేత శామ్ రైన్సీ సైతం ఈ ‘అభివృద్ధి’కి అనుకూలురే. కాబట్టి సీఎన్‌ఆర్‌పీ, సీపీపీల మధ్య అధికార పంపకం చర్చలు ఫలించినా ఫలించకున్నా కంబోడియాలో కొలారాజ్‌కు ఢోకా లేదు. - పిళ్లా వెంకటేశ్వరరావు