కంబోడియా : లాక్‌డౌన్ కారణంగా విద్యా సంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు 64 ఏళ్ల సేన్ వన్నా అనే ఉపాధ్యాయుడు దాదాపు 20 కిలోమీటర్ల మేర ప్రయాణించి పాఠాలు బోధిస్తున్న తీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించాలని విద్యాశాఖ సూచించింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, కంప్యూటర్ వసతి లేకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. (ఢిల్లీ నుంచి వచ్చే వాహనాలను అనుమతించం..)
కంబోడియాలోని తబౌంగ్ ఖుమ్ ప్రావిన్స్‌లోని గ్రామీణ ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. కనీసం సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా లేని గిరిజన ప్రాంతం అది. ఈ నేపథ్యంలో అధికారుల అనుమతితో దీంతో సేన్ వన్నా అనే ఉపాధ్యాయుడు 20 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థుల వద్దకే వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు. ఈయనను ఆదర్శంగా తీసుకున్న మరికొంత మంది ఉపాధ్యాయులు కూడా నేరుగా విద్యార్థుల ఇళ్ల వద్దకే వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు.
నాలుగు నుంచి ఐదుగురు విద్యార్థులను ఒకచోట చేర్చి ప్రతిరోజు దాదాపు 20కి పైగా విద్యార్థులకు సేన్ వన్నా బోధిస్తారు. అంతేకాకుండా వేర్వేరు గ్రామాల్లో ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి చాలా దూరం ప్రయాణిస్తున్నారు కదా మీకు అలసటగా అనిపించదా అంటే అది ఒక ఉపాధ్యాయుడిగా ఇది నా బాధ్యత అంటూ తన కర్తవ్యంపై ఉన్న మమకారాన్ని చూపిస్తున్నారు. "ప్రతి సెషన్‌లో ఐదుగురు విద్యార్థులను ఒక గ్రూప్‌గా చేర్చి నేర్పిస్తాను. అలా ఉదయం మొత్తం నాలుగు గ్రూపులకు పాఠాలు చెప్తాను. విద్యార్థులు అందరూ ఫేస్ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటాను" అని సేన్ వన్నా తెలిపారు. (చిరు వ్యాపారులకు యూపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ )
Comments
Please login to add a commentAdd a comment