చెట్టు లెక్కగలవా ఓ టీచరు! పాఠం చెప్పగలవా.. | West Bengal Teacher Sit On The Tree For Taking His Online Classes | Sakshi
Sakshi News home page

చెట్టు లెక్కగలవా ఓ టీచరు! పాఠం చెప్పగలవా..

Published Thu, Apr 23 2020 3:52 PM | Last Updated on Thu, Apr 23 2020 4:00 PM

West Bengal Teacher Sit On The Tree For Taking His Online Classes - Sakshi

చెట్టుమీద ఆన్‌లైన్‌ పాఠాలు చెబుతున్న సుభ్రతో

కోల్‌కతా : విద్యార్థులకు పాఠాలు చెప్పటానికి ఓ ఉపాధ్యాయుడు చెట్టు మీదకు చేరాడు. ప్రతిరోజూ కొన్ని గంటలపాటు ఆ చెట్టుమీద ఉండి విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు చెబుతున్నాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంకుర జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన సుభ్రతో పతి అనే ఉపాధ్యాయుడు ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులకు క్లాసులు చెబుతుండేవాడు. అయితే ఊర్లో నెట్‌వర్క్‌ సరిగా లేకపోవటంతో తరచుగా క్లాసులకు అంతరాయం కలిగేది. దీంతో సిగ్నల్స్‌ బాగా అందే ఓ చెట్టు మీదకు మకాం మార్చాడు. ప్రస్తుతం చెట్టుమీద సిగ్నల్స్‌‌ బాగుండటంతో అంతరాయం లేకుండా క్లాసులు కొనసాగిస్తున్నాడు. ( లాక్‌డౌన్‌లో గృహహింస.. ఫిర్యాదులకు వాట్సప్ )

చెట్టుమీద ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్న సుభ్రతో

దీనిపై సుభ్రతో పతి మాట్లాడుతూ.. ‘‘ మా ఊర్లో అన్ని చోట్లా‌ సిగ్నల్స్‌ అందవు. సెల్‌ఫోన్‌లో ఆన్‌ లైన్‌ ద్వారా నేను ప్రతి రోజు ఉదయం 9:30నుంచి సాయంత్రం 6 వరకు వివిధ క్లాసులు చెబుతాను. క్లాసులకు అంతరాయం కలగకూడదనే చెట్టుమీదకు చేరాను. ఇప్పడు సిగ్నల్‌ సమస్యలేకుండా క్లాసులు చెబుతున్నాన’’ని తెలిపాడు. ( లాక్‌డౌన్‌: కుక్కకు ప‌ట్టిన గ‌తే ప‌ట్టింది )

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement