న్యూఢిల్లీ: ఆగ్రాలో రోడ్డు పక్కన వడ స్టాల్ నడుపుతున్న ఓ వృద్దుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఒకరు శుక్రవారం షేర్ చేశారు. ఢిల్లీకి చెందిన కాంత ప్రసాద్ ఆయన భార్య బాదామి దేవిలు 40 ఏళ్లుగా ఆగ్రా సమీపంలో కాంజీ వడ స్టాల్‌ను నడుపుతూ జీవిస్తున్నారని తన పోస్టులో పేర్కొన్నారు. లాక్‌డౌన్ కారణంగా వారి ఉపాధికి గండిపడిందని, వారికి చేయూతను ఇవ్వాలని కోరారు. ఇలాంటి వారు ఎక్కడ కనిపించిన వారికి ఆర్థిక సాయం అందించాలని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. తన పోస్టుకు ‘కాంజీ వడ వాల మామ. అతను 40 ఏళ్లుగా ఇక్కడే కాంజీ వడా అమ్ముతున్నాడు. ఆయన 90 సంవత్సరాలు. ఈ మహమ్మారి కాలంలో ఆయన సంపాదన తగ్గిపోయింది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ‘ఆ స్టాల్ ఢిల్లీలోని ప్రోఫెసర్ కాలనీలోని కమలా నగర్ ఆగ్రాలో ఉందని, ప్రతి రోజు ఆయన సాయంత్రం 5:30 గంటలకు ఇక్కడ ఉంటారు’ అని రాసుకొచ్చారు. (చదవండి: బెడిసికొట్టిన రసగుల్లా బిర్యానీ; నెటిజన్ల ఫైర్)
ఆయన దగ్గర ఈ కాంజీ వడా తినాలని, లేదంటే తోచినంత సాయం చేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఈ వారి గురించి తెలియజేసినందుకు ఆమెపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘వారికి తప్పకుండా చేతనైన సాయం చేస్తాం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆగ్రాలో ఇంకా ఇలాంటి వారు ఎక్కడ కనిపించిన తను తెలపాలని కోరారు. వారందరిని కలిసి సాయం చేయడానికి ప్రయత్నిస్తానని, అలాగే వారి గురించి అందరికి తెలిసేలా చేస్తానన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మహమ్మారి కాలంలో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇలాంటి వారికి సాయం చేయాలని విజ‍్క్షప్తి చేశారు. ‘అది మీ చూట్టుపక్కల ప్రాంతం నుంచే ప్రారంభించాలని, ఆ తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూడండంటూ’ నెటిజన్లకు ఆమె పిలుపు నిచ్చారు.
(చదవండి: సోషల్ మీడియా పోస్టింగ్స్ : వాడీవేడి వాదనలు)
Comments
Please login to add a commentAdd a comment