లండన్: కరోనా కాలంలో ఎన్నో సంఘటనలు చేసుకున్నాయి. మహమ్మారి మనుషుల మధ్య దూరాన్ని పెంచినప్పటికీ... మనుషుల్లో మానవత్వాన్ని బయటకు తీసింది. కోవిడ్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి తమ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకునేందుకు శత్రు దేశాలు సైతం మిత్రులుగా మారుతున్నాయి. ఈ తరుణంలో నువ్వా నేనా అంటూ సొంత దేశంలో పోటీపడే ఫుడ్ చైన్ వ్యాపారాలు కూడా ఈ సంక్షోభంలో మద్దతుగా నిలుస్తున్నాయిని చెప్పడానికి ఈ తాజా సంఘటనే రుజువు. లాక్‌డౌన్‌లో ప్రముఖ వ్యాపార సంస్థలు ఆర్థిక సంక్షభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో పలు సంస్థలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. దీనివల్ల వేలల్లో ఉద్యోగుల జీవితాలు రోడ్డునే పడే అవకాశం ఉంది. అలాంటి వారిని ఆదుకోవాలంటూ యుకేలోని ప్రముఖ ఫుడ్ చైన్ వ్యాపార సంస్థ బర్గర్‌కింగ్ చేసిన ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల హృదయాలను ఆకట్టుకుంటోంది. అమెరికన్ బెస్డ్ ఫాస్ట్‌ఫుడ్ సంస్థ అయిన బర్గర్ కింగ్ యుకేలోని మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పాపా జాన్స్, టాకో బెల్స్‌ల ఫుడ్‌ను ఆర్డర్ చేసుకుని ఆ సంస్థ ఉద్యోగులను ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చింది. (చదవండి: షూ జతలో ఏకంగా 119 అరుదైన సాలీళ్లు)
We know, we never thought we’d be saying this either. pic.twitter.com/cVRMSLSDq6
— Burger King (@BurgerKingUK) November 2, 2020
‘మేము ఇలాంటి ట్వీట్ చేస్తామని కలలో కూడా ఊహించలేదు. కానీ రెస్టారెంట్స్, ఫుడ్స్ వ్యాపార సంస్థలలో పని చేసే వేలమంది ఉద్యోగులకు ఇప్పుడు మీ మద్దతు చాలా అవసరం. ఇందుకోసం మీరు కేఎఫ్‌సీ, మెక్‌డోనాల్డ్స్ ఆహారం కొనుగోలు చేయండి. వేల మంది ఉద్యోగుల జీవితాలను ఆదుకోండి. అయితే ఈ మహమ్మారి కాలంలో జాగ్రత్త ఉండటం మంచి విషయమే.. కానీ మంచిపని కోసం బయటి ఆహారం ఆర్డర్ చేయడం అంత చెడ్డ విషయం కాదు’ అంటూ బర్గర్ కింగ్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వ్యాపారంలో పోటీ దారులైన మెక్‌డోనాల్డ్స్ ఉద్యోగుల కోసం ఈ ట్వీట్ చేసిన బర్గ్‌కింగ్ తీరుకు ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘బర్గర్ కింగ్ చోరవ ఎంతో మందికి స్పూర్తినిస్తుంది. మనం ఎప్పటికీ మన పోటీదారులతో అసమానంగా పోరాడచ్చు. అలాగే అవసరమైన సమయాల్లో వారికి మద్దతుగా కూడా నిలబడవచ్చని బర్గర్ కింగ్ రుజువు చేసింది’ , ‘గొప్ప చర్య బర్గర్ కింగ్, మెక్‌డోనాల్డ్స్ అభిమానుల నుంచి భారీ మద్దతు, గౌరవం’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్ పెడుతున్నారు. (చదవండి: కాకరకాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లితో రసగుల్లా..)
Comments
Please login to add a commentAdd a comment