
ఏంజిలీనా వయసుతోపాటే..
- 40వ పడిలో మరో మూడు పచ్చబొట్లు పొడిపించుకున్న హాలీవుడ్ నటి
ప్నోమ్ పెన్: వయసుతోపాటే తనవుపై టాటూల సంఖ్యనూ పెంచుకుంటూపోతోంది హాలీవుడ్ నటశిరోమణి ఏంజిలీనా జోలీ. ప్రస్తుతం 40వ పడిలో ఉన్న ఆమె తన మేనుపై తాజాగా మరో మూడు పచ్చబొట్లను పొడిపించుకుంది. 'ఫస్ట్ దె కిల్డ్ మై ఫాదర్' సినిమా షూటింగ్ నిమిత్తం కాంబోడియాలో ఉన్న ఏంజిలీనా ఆదివారం స్పాట్ లో తన కొత్త టాటూలను ప్రదర్శించింది.
కొత్త టాటూల్లో రెండు ప్రాచీన థాయి బౌద్ధ సూచికలుకాగా, మరోటి మంచిపనులకు సంకేతంగా భావించే పెట్టె ఆకారం. తన 18వ ఏట నుంచే టాటూలు వేసుకోవడం ప్రారంభించిన ఏంజిలీనా ఇప్పటికీ ఆ అభిరుచిని కొనసాగిస్తుండటం, భర్త బ్రాడ్ పిట్ కూడా అందుకు సహకరిస్తుండటం గమనార్హం.