
కంబోడియాలో ఘోర రోడ్డు ప్రమాదం
కంబోడియాలో సోమవారం అర్దరాత్రి తర్వాత సమయంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా, మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. కంబోడియాలోని బట్టాంబాంగ్ ప్రాంతంలో మాంగ్ రస్సె జిల్లాలో వేగంగా వెళ్తున్న ట్రక్, మినీ బస్ ఢీకొన్నట్లు ఓ అధికారి తెలిపారు.
ట్రక్ డ్రైవర్ ముందుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. రెండు వాహనాల డ్రైవర్లు సహా మరో ఏడుగురు మృతిచెందగా, దాదాపు పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వివరించారు.