ఢిల్లీ: చైనీయులతో చేతులు కలిపి దేశంలో నిరుద్యోగులను మోసం చేస్తూ వారిని కంబోడియాకు పంపిస్తున్న సైబర్ నేరస్థుడు ఎట్టకేలకు పోలీసులు చిక్కాడు. సిరిసిల్లకు చెందిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో అబ్ధుల్‌ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన అబ్ధుల్ ఆలం.. చైనీయులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. నిరుద్యోగులను మోసం చేస్తూ వారిని కంబోడియాకు పంపించాడు. కాగా, సిరిసిల్లకు చెందిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబ్దుల్‌ను ఢిల్లీలో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, అబ్దుల్ ప్రస్తుతం దుబాయ్‌లో నివాసం ఉంటున్నట్టు సమాచారం.
మరోవైపు.. అబ్ధుల్ ఇప్పటి వరకు దేశం నుంచి దాదాపు వేయి మందికిపైగా నిరుద్యోగులను కంబోడియాకు పంపినట్టు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన యువకులను కంబోడియాకు పంపి అక్కడ వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయినట్టు పోలీసులు గుర్తించారు. అబ్ధుల్ ముఠా చైనీయులతో కలిసి ఇలా నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ మోసాల్లో సింగపూర్, థాయ్‌ల్యాండ్, బ్యాంకాక్‌కు చెందిన ముఠా హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారి గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. గత కొద్దిరోజుల క్రితం సైబర్ నేరాల్లో భాగమైన భారతీయులను కేంద్రం స్వదేశానికి తరలించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ కంబోడియాలో భాగంగా వారిని భారత్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment