భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి కంబోడియాలో పర్యటిస్తున్నారు.
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి కంబోడియాలో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా అన్సారి చైనా పర్యటనను ముగించుకుని కంబోడియా వెళ్లారు.
ఫోమ్ పెన్ విమానాశ్రయంలో అన్సారికి కంబోడియా సమాచార శాఖ మంత్రి కీయూ కన్హారిత, కంబోడియాలో భారత రాయబారి నవీన్ శ్రీవాత్సవ స్వాగతం పలికారు. భారత్, కంబోడియాల మధ్య వాణిజ్య ఒప్పందం, దృఢమైన మైత్రి భాగస్వామ్యంపై చర్చలు జరపనున్నారు. కంబోడియా ప్రధాని హున్, జాతీయ అసెంబ్లీ ప్రెసిడెంట్ హెంగ్ సమ్రిన్లతో సమావేశమయ్యారు. ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.