Hamid Ansari
-
నేనెవర్నీ ఆహ్వానించ లేదు.. కలుసుకోను లేదు! : హమీద్ అన్సారీ
న్యూఢిల్లీ: ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేసినట్లు పేర్కొన్న పాకిస్తానీ జర్నలిస్టును యూపీఏ హయాంలో హమీద్ అన్సారీ తనను భారత్‌కు ఆహ్వానించారంటూ ఆరోపణలు వెలువెత్తాయి. ఐతే ఆ ఆరోపణలన్నింటిని హమీద్ అన్సారీ తోసి పుచ్చారు. ఈ మేరకు యూపీఏ హయాంలో తాను ఐదుసార్లు భారత్‌కు వచ్చానని, పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు పాకిస్తానీ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా హమీద్ అన్సారీని ప్రశ్నించడంతో ఆయన ఇలా వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ..."నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి తరుపున విదేశీ అతిథులకు ఆహ్వానాలు ప్రభుత్వ సలహా మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా పంపబడుతుంది. నేనెవర్నీ రీసివ్ చేసుకోలేదు, ఆహ్వానించ లేదు. తాను రాయబారిగా ఉన్న సమయాల్లో ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాను. ఇరాన్ రాయబారిగా నేను చేసిన పని గురించి అప్పటి ప్రభుత్వానికి తెలుసు. నేను జాతీయ భద్రతకు కట్టుబడి ఉన్నాను. ఈ విషయమై భారత ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉంది." అని అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్ అన్సారీ ఇరాన్లో భారత రాయబారిగా ఉన్నప్పుడూ జాతీయ ప్రయోజనాలకు రాజీ పడ్డారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను ఖండించారు. తాను టెహ్రాన్‌లో పనిచేసిన తర్వాత యూఎన్ఎస్సీకి భారత శాశ్వత ప్రతినిధిగా సేవలందించానని, తనకు భారత్‌లోనూ, విదేశాల్లోనూ గుర్తింపు ఉందని నొక్కి చెప్పారు. (చదవండి: నేను గెలవలేదు!... నా డబ్బులు వెనక్కిచ్చేయండి!...ప్రజలకు బెదిరింపులు) -
మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ వ్యాఖ్యలపై ఆగ్రహం
న్యూఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. శత్రుత్వం నిండిన సంస్థ మద్దతుగల అంతర్జాతీయ వేదికపై భారత దేశ పరువు, ప్రతిష్ఠలను మంటగలిపేందుకు అన్సారీ ప్రయత్నించారని మండిపడ్డారు. రాజ్యాం గ పదవిని నిర్వహించిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం ఆందోళనకరమన్నారు. కొన్ని పాకిస్తాన్ ప్రాయోజిత సంస్థల భారత వ్యతిరేక కుట్రలో భాగమవుతున్నాయన్నారు. ఈ సంస్థలు భారతదేశ సంస్కృతి, సమగ్రతపై గందరగోళం సృష్టించడానికి కుట్ర చేస్తున్నాయని నఖ్వీ ఆరోపించారు. అన్సారీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. భారతదేశం బలమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యమని, అందుకు ఇతరుల నుండి సర్టిఫికేట్ అవసరం లేదని పేర్కొన్నది. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ బుధవారం నిర్వహించిన చర్చలో అన్సారీ మాట్లాడుతూ హిందూ జాతీయవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వాసాల ప్రాతిపదికన ప్రజలను వేరు చేసే సాంస్కృతిక జాతీయ వాదం పెరుగుతోందన్నారు. -
మోదీపై అన్సారీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ‘మీ మీద చాలా పెద్ద బాధ్యతలతో కూడిన అంచనాలున్నాయి. కానీ మీరు నాకు సహకరించడంలేదు. ఈ మధ్య బిల్లులెందుకు ఆమోదం కావట్లేదు’అని ప్రధాని మోదీ ముందస్తు సమాచారం లేకుండా తన గదిలోకి వచ్చి ప్రశ్నించారని మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారిక పూర్వకంగా, అసాధారణంగా ఆయన మాట్లాడినట్లు హమీద్ వెల్లడించారు. మోదీకి అతిథి మర్యాదలు చేసిన అనంతరం తన పనేమిటో రాజ్యసభకు, ప్రజానీకానికి తెలుసని సమాధానమిచ్చినట్లు తాను రాసిన పుస్తకం ‘బై మెనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్’లో హమీద్ అన్సారీ పేర్కొన్నారు. ఎన్డీఏ తనకు వచ్చిన మెజారిటీని చూసి రాజ్యసభ ప్రక్రియలను, విధివిధానాలపై కూడా నైతిక హక్కును ఇచ్చినట్లు భావించిందని వ్యాఖ్యానించారు. అంతేగాక రాజ్యసభ టీవీ ప్రభుత్వానికి అనుకూలంగా రావడంలేదని అడిగినట్లు చెప్పారు. తాను రాజ్యసభ చానెల్ ఏర్పాటులో భాగంగా ఉన్నప్పటికీ, ఎడిటోరియల్‌పై తనకు నియంత్రణ లేదని, రాజ్యసభ కమిటీ ఆయా వ్యవహారాలను చూసుకుంటోందని, అందులో వస్తున్న కార్యక్రమాలపై ప్రజలను హర్షిస్తున్నాయని సమాధానమిచ్చినట్లు వెల్లడించారు. -
ఢిల్లీలో రాహుల్ ఇఫ్తార్ విందు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/ముంబై: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతలకు బుధవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన ఈ విందుకు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. వీరితోపాటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే నేత కనిమొళి, జేడీఎస్ నేత డానిష్ అలీ, జేడీయూ తిరుగుబాటు నేత శరద్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేశ్ త్రివేది, బీఎస్పీ నేత సతీశ్‌చంద్ర మిశ్రా, ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా, ఎన్సీపీ నేత డీపీ త్రిపాఠి, జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరెన్ హాజరయ్యారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణకు వేదికగా మారనుందని భావిస్తున్న ఈ విందుకు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీలు చివరి నిమిషంలో గైర్హాజరయ్యారు. ప్రధాని వీడియో నవ్వించేలా ఉంది ప్రధాని మోదీ ట్వీటర్లో పోస్ట్ చేసిన ఫిట్నెస్ వీడియోపై రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. అది వింతగా, నవ్వించేలా ఉందన్నారు. బుధవారం ఇఫ్తార్ వేడుకలో మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌తో టేబుల్ పంచుకున్న రాహుల్..సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వైపు తిరిగి ‘మోదీకి దీటుగా మీరూ ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేయొచ్చుగా!’ అని అన్నారు. అక్కడే ఉన్న కనిమొళి, దినేశ్ త్రివేది, బీఎస్పీ నాయకుడు సతీశ్ చంద్ర మిశ్రాలు ప్రధాని వీడియో గురించి విని నవ్వుకున్నారు. మహా కూటమి.. ప్రజల ఆకాంక్ష మోదీ,బీజేపీ, ఆర్ఎస్ఎస్ను ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలతో ఏర్పాటయ్యే మహా కూటమి ప్రజల ఆకాంక్ష అని రాహుల్ గాంధీ ముంబైలో విలేకరులతో అన్నారు. ‘మహా కూటమి ఏర్పాటు బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీల కోసం మాత్రమే కాదు. అది ప్రజల ఆకాంక్ష. మహాకూటమితోనే ప్రధాని, బీజేపీ, ఆరెస్సెస్ లను ఎదుర్కోగలం’ అని పేర్కొన్నారు. -
కర్ణాటక ఎన్నికల కోసమే ఆ దాడి చేశారా?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ గత రెండు రోజులుగా ఆందోళనలతో అట్టుడికి పోతోంది. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీకి యూనివర్శిటీ విద్యార్థుల సంఘం శాశ్వత సభ్యత్వం బహూకరించేందుకు బుధవారం సన్నాహాలు జరుగుతుండగా హఠాత్తుగా హిందూ యువ వాహిణికి చెందిన కార్యకర్తలు కర్రలు, పిస్టళ్లు పట్టుకొని యూనివర్శిటీలోకి వచ్చి నానా బీభత్సం సష్టించారు. వారు ఆ సమయంలో మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ బస చేసిన యూనివర్శిటీ భవనంలోని గేటును ధ్వంసం చేశారు. లోపలకి జొరబడేందుకు ప్రయత్నించారు. వారిలో హిందూ యువ వాహిణికి చెందిన ఆరుగురు కార్యకర్తలు యూనివర్శిటీ భద్రతా సిబ్బంది పట్టుకొని అక్కడ ఉన్న పోలీసులకు అప్పగించారు. యూనివర్శిటీపై దాడి చేసిన ఆరుగురు గూండాలను యూనివర్శిటీ భద్రతా సిబ్బంది పోలీసులకు అప్పగిస్తే మరుసటి రోజుకల్లా వారిని పోలీసులు ఎలాంటి కేసును కూడా నమోదు చేయకుండా విడిచిపెట్టారని యూనివర్శిటీ అధికార ప్రతినిధి ఎం. షఫే కిద్వాయ్ గురువారం నాడు మీడియాకు తెలియజేశారు. పిస్టళ్లలాంటి మారణాయుధాలను కూడా వారు పట్టుకొచ్చారని చెప్పారు. అన్సారీ కార్యక్రమానికి బందోబస్తుగా యూనివర్శిటీలోకి పోలీసులు వచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2002లో ఏర్పాటు చేసిన హిందు యువ వాహిణికి చెందిన వారు నిందితులు కనుక పోలీసులు వారిని వదిలేశారని, కేసు పెట్టే ధైర్యం పోలీసులు చేయలేకపోయారని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయమై ఫిర్యాదు చేయడానికి యూనివర్శిటీ విద్యార్థులు ఊరేగింపుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లగా వారిపై పోలీసులు తీవ్రంగా లాఠీచార్జి చేసి పంపించారని కిద్వాయ్ ఆరోపించారు. ఆలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో ఆరెస్సెస్ శాఖను ఏర్పాటు చేయాలని కొంతకాలంగా ఆరెస్సెస్ డిమాండ్ చేస్తుండగా, యూనివర్శిటీ విద్యార్థి సంఘం కార్యాలయంలో ఉన్న మొహమ్మద్ అలీ జిన్నా ఫొటోను ఎత్తివేయాలని స్థానిక బీజేపీ ఎంపీ పిలుపుతో సంఘ్ పరివార్ డిమాండ్ చేస్తోంది. ఆ ఫొటోను తొలగించడం కోసమే బుధవారం నాడు యూనివర్శిటీ క్యాంపస్‌లోకి జొరబడినట్లు హిందూ యువ వాహిణి కార్యకర్తలు తెలిపారు. విద్యార్థి సంఘం కార్యాలయంలో జిన్నా ఫొటోతోపాటు జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్‌ల ఫొటోలు ఉన్నాయి. వారంతా బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులే. అవిభక్త భారత చరిత్రలో జిన్నాకు కూడా ఎంతో పాత్ర ఉంది. ఆ పాత్రను ఎవరూ కాదనలేరు. గతంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ, హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీలపై దాడి చేసిన మతతత్వ హిందూ శక్తులు ఇప్పుడు అలీగఢ్ యూనివర్శిటీపై దాడి చేశాయి. ఏఎంయూలోని మొహమ్మద్ అలీ జిన్నా ఫొటోపై 80 ఏళ్లుగా ఎలాంటి గొడవ చేయని సంఘ్ పరివారం ఇప్పుడే ఎందుకు గొడవ చేయాల్సి వచ్చిందన్నది కోటి రూకల ప్రశ్నే. అయితే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో సులభంగానే సమాధానం దొరకుతుంది. -
మన్మోహన్‌కు మోదీ సర్కార్ పరోక్ష క్షమాపణ!
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశభక్తిని, అంకిత భావాన్ని తాము ప్రశ్నించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం స్పష్టం చేశారు. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ నిబద్ధతను ప్రధాని మోదీ ప్రశ్నించలేదని చెప్పారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలపై మోదీ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. తద్వారా మన్మోహన్పై మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన పరోక్షంగా క్షమాపణ చెప్పినట్టు అయిందని భావిస్తున్నారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలను ఎక్కడా ప్రశ్నించలేదు. అదేవిధంగా వారికి దేశంపట్ల ఉన్న నిబద్ధతపై అనుమానాలు లేవు. మన్మోహన్, అన్సారీలకున్న దేశభక్తి పట్ల మాకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయని’ అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. గుజరాత్ శాససభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార సభల్లో మన్మోహన్, హమీద్ అన్సారీలపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ప్రధానంగా.. గుజరాత్ ఎన్నికలపై ప్రభావం చూపేలా పాకిస్తాన్ దౌత్యాధికారులను మన్మోహన్ కలిసినట్లు మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాక ఆదేశ మాజీ మంత్రితో మన్మోహన్ రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపణలు గుప్పించారు. మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ నిరాధార ఆరోపణలు చేశారని.. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. అంతేకాక ఈ ఆరోపణలపై మోదీ క్షమాపణలు చెప్పాంటూ శీతాకాల సమావేశాలు మొదలైనప్పటినుంచీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇదిలావుండగా.. అరుణ్‌జైట్లీ ప్రకటనపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. దీనిపై మన్మోహన్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చేసినవని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అరుణ్ జైట్లీ చెప్పిన క్షమాపణలు తన గౌరవాన్ని తిరిగి పెంచుతాయని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
'అన్సారీ ఎందుకిలా చేస్తున్నారో తెలిసింది'
న్యూఢిల్లీ : మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై విశ్వ హిందూ పరిషత్ నిప్పులు చెరిగింది. ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఎలా వెళ్లారని ప్రశ్నించింది. ఆయన కావాలనే ఇలా చేస్తున్నారని, ముస్లింలలో అసంతృప్తి ఉన్నదనే విషయాన్ని ఆయన చర్యల ద్వారా చూపించాలనుకుంటున్నారని మండిపడింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ మహిళా విభాగం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే, ఈ సంస్ధకు ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనికే అన్సారీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ మాట్లాడుతూ 'ఈ కార్యక్రమానికి వెళ్లడం ద్వారా ఆయన మరోసారి తన వైఖరిని వెల్లడించారు. ముస్లింలలో అసంతృప్తి ఉందనే విషయాన్ని ఆయన వ్యాపింపజేస్తున్నారు' అని ఆరోపించారు. పీఎఫ్ఐ అంటే మరేమిటో కాదని, సిమీనే పీఎఫ్ఐగా రూపాన్ని మార్చుకుందంటూ ఆరోపించారు. కేరళలలోని పలువురు దేశ భక్తుల మరణాల వెనుక పీఎఫ్ఐ హస్తం ఉందని కూడా ఆరోపించారు. -
అన్సారీపై ఆర్ఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశంలోని ముస్లింలు అభద్రతలో ఉన్నారని ఉపరాష్ట్రపతిగా వైదొలుగతూ హమిద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత అన్సారీపై విరుచుకుపడ్డారు. ఆయన తనకు ఎక్కడ పూర్తి స్వేచ్ఛ, భద్రత ఉందని భావిస్తారో ఆ దేశానికి వెళ్లవచ్చని ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ అన్నారు. అన్సారీ సహా ముస్లింలు భారత్‌లో అభద్రతా భావంతో ఉన్నారని భావిస్తున్నవారంతా ముస్లింలు సురక్షితంగా ఉన్న దేశం పేరు వెల్లడించి, నిరభ్యంతరంగా అక్కడికి వెళ్లవచ్చని కుమార్ పేర్కొన్నారు. నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను దేశంలో ఎవరూ విశ్వసించడం లేదని, ముస్లింలు సైతం ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకించారని చెప్పారు. పదేళ్లుగా లౌకిక వాదిగా ఉన్న హమీద్ అన్సారీ పదవీ విరమణ చేయగానే కుహనా లౌకికవాదిగా మారారని విస్మయం వ్యక్తం చేశారు. -
మైనారిటీలు లెక్కలోకే రారా?
జాతిహితం ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత మైనారిటీ ఓటు బ్యాంకులు లెక్కలోకి వచ్చేవి కాకుండా పోయాయి. అయినా, మన ప్రభుత్వం వారి రక్షణకు హామీని కల్పిస్తుంది, వారి సామాజిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది. అంతేగానీ, దయచేసి అధికారంలో వాటాను మాత్రం అడగకండి. కాకపోతే ఎప్పటికో ఒకప్పటికి మన సొంత సంకేతాత్మకతా ఏర్పడవచ్చు. అప్పుడు మన సొంత దర్శన్ లాల్ తయారవుతాడు. అదే జరిగితే, పాక్‌లాగే మనమూ మైనారిటీలు లెక్కలోకి రానే రారు అనే సమాధానాన్నే ఎంచుకున్నట్టు అవుతుంది. కోర్టుల్లోని మన న్యాయమూర్తుల పద్ధతిని అరువు తెచ్చుకుని నా వాదనను ముందుగా ఉత్త వాస్తవాలను ఏకరువు పెట్టడంతో మొదలెడదాం. ఆ తర్వాత వాదనతో అది మంచి విషయమా లేక చెడ్డ విషయమా అని నిర్ధారిద్దాం. భారత ఉపరాష్ట్రతి పదవి నుంచి మొహమ్మద్ హమీద్ అన్సారీ నిష్క్రమణ, భారత రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని తెరచింది. గత యాభై ఏళ్లలో మన మైనారిటీలలో ఒక మతం వారు ఒక్కరైనా రాష్ట్రపతి, ఉప రాష్ట్ర పతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, అగ్రశ్రేణి మంత్రులు (హోం, రక్షణ, విదేశాంగ శాఖలు)గా పనిచేసినవారు లేరు. నేను చెప్పింది తప్పని గూగు ల్లో శోధించి నిరూపించాలని మీరు ఉబలాటపడవచ్చేమో. కానీ, నేను పలు స్వల్పకాలిక ప్రభుత్వాలతో సహా నేను ఆ చరిత్రనంతటినీ తిరగేయడమే కాదు, లోతుగా జల్లెడ పట్టేసి మరీ చూసేశాను. మైనారిటీలంటే ముస్లింలే కాదు, క్రైస్తవులు, సిక్కులు కూడానని మరచిపోకండి. గూగుల్ శోధనకు బదులు నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఉన్న వారి పేర్లను పరిశీలించండి. స్వాతంత్య్రానంతర కాలచరిత్రలోనే విశిష్టమైన రీతిలో నేడు మైనారిటీకి చెందిన క్యాబినెట్ మంత్రి ఒక్కరే ఉన్నారు. ఆమె, ఎన్డీఏ భాగస్వామి అకాలీదళ్‌కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్. ఆమెకు, అతి ముఖ్యమైన ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను (లేదా అందుకు అసంతృప్తితో ఉన్న ఆమె విధేయులు పిలిచేట్టుగా పచ్చళ్లు, ఊరగాయలు, జామ్‌లు, జ్యూస్‌ల శాఖ) అప్పగించారు. ఇంకా దిగువ స్థాయికి పోయి జూనియర్ మంత్రులను పరిశీలిస్తే, మరి కొన్ని పేర్లు కనిపిస్తాయి. సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ కనిపిస్తారు. సహాయ మంత్రులలోకెల్లా ఆయనే అత్యంత సీనియర్. ఆయనది మైనారిటీ వ్యవహారాల శాఖని గమనించండి. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్న ఎంజే అక్బర్ పేరు కూడా కనిపిస్తుంది. పేర్లు, ప్రత్యేకించి క్రైస్తవుల పేర్లు ఒక్కోసారి తప్పుదారి పట్టించొచ్చు గానీ, నాకు మరే ఇతర పేర్లూ కనిపించలేదు. కాబట్టి క్రైస్తవులు ఎవరూ లేకపోవడం కూడా ఈ మంత్రివర్గపు విశిష్టత కాదా? అది కూడా, ప్రధానంగా క్రైస్తవులే ప్రధానంగా ఉండే ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్న ప్పటి పరిస్థితి ఇది. పైగా, దాదాపు పూర్తి క్రైస్తవ రాష్ట్రాలైన మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌లూ, పంజాబ్, జమ్మూకశ్మీర్లూ తప్ప దేశంలోని 24 ఇతర రాష్ట్రాలలో ఎక్కడా మైనారిటీ ముఖ్యమంత్రి లేరు. దీన్ని మరింతగా పొడి గించి చూద్దాం. ఇందిరాగాంధీ ప్రాభవం వెలిగిన కాలం తర్వాత, అత్యంత బలమైన జాతీయ పార్టీగా ఉన్నది మోదీ–అమిత్‌షాల బీజేపీయే. ఆ పార్టీ పదవులలో ప్రముఖంగా కనిపించే మైనారిటీవారు ఎవరు? షానవాజ్ హుస్సేన్, ఎస్ఎస్ ఆహ్లూవాలియా, బహుశా ఆ తర్వాత తేజిందర్‌పాల్ బగ్గా. లౌకికవాద పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, వామపక్షాలు, హిందీ మాట్లాడే ప్రాంతంలోని పార్టీల తీరు కూడా ఈ విషయంలో ఇంతేనంటూ మీరు దీనికి బదులు చెప్పొచ్చు. అయితే అది, భారత మైనారిటీలు అధికార చట్రానికి ఇంత దూరంగా ఎన్నడూ లేవనే నా మొదటి నిర్ధారణను బలో పేతం చేసేదే. దీనికి సంబంధించి మైనారిటీలలో అభద్రతాభావం ఉండటం సమంజసమే. మెజారిటీలో ఆత్మన్యూనత వాస్తవాలలో వేళ్లూనుకుని, కాల్పనికతలతో అల్లుకున్న అద్భుతమైన పలు వైచిత్రులను మన రాజకీయాలు ఆవిష్కరిస్తుంటాయి. ఎల్కే అద్వానీ, అటల్ బిహారి వాజ్‌పేయి (ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్న వరుస క్రమం) తమ పార్టీని 1984 నాటి శిథిలాల నుంచి తమ పార్టీని పునరుజ్జీవితం చేశారు. మైనారిటీల పట్ల హిందూ మెజారిటీలో ఉన్న ఆత్మన్యూనతా భావం అనే అంశాన్ని కేంద్రంగా చేసుకుని వారు ఆ పనిని చేపట్టారు. అది కాల్పనిక మైనదిగానీ లేదా విజయవంతంగా సాగించిన ప్రచారంతో రేకెత్తించిన తమపై తాము జాలిపడే «సామూహిక ధోరణిగానీ కాదు. దశాబ్దాల తరబడి సాగిన కాంగ్రెస్ పాలనలో నెహ్రూ, దృఢమైనదే అయినా సాపేక్షికంగా సులువైనదిగా ఉండే మైనారిటీవాదాన్ని అనుసరిం చారు. అది ఇందిరాగాంధీ, దూకుడుతనపు మైనారిటీవాదంగా పరిణమిం చింది. ఆ తర్వాత అది, షా బానో కేసులో రాజీవ్ గాంధీ చరిత్రాత్మకమైన లొంగుబాటుగా పరిణమించింది. అది, వారి సొంత పార్టీలోని ఉదారవాద ముస్లింలు సైతం భ్రమలను కోల్పోయేటంత నాటకీయంగా జరిగింది. అప్పట్లో ముస్లింల ప్రముఖ నేతగా ఎదుగుతున్న ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అందుకు నిరసనగా పార్టీని వీడారు కూడా. అలీఘర్ విశ్వవిద్యాలయం విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగిన ఆయన సహాయ మంత్రిగా ఉండేవారు. మితవాద హిందువులు (వారు బీజేపీ ఓటర్లే కానవసరం లేదు) దీన్ని, అదే సంస్కరణోత్సాహంతో హిందూ కోడ్ బిల్లులను తేవడంతో పోల్చి చూశారు. అదే పార్టీ, ముస్లిం మత పెద్దలను ఇలా ఎలా బుజ్జగిస్తుంది? అది అద్వానీకి అవకాశాన్ని తెరిచింది. మైనారిటీ అంటే మెజారిటీలో ఉన్న ఈ ఆత్మన్యూనతా భావం భారత రాజకీయాలను మౌలికమైన రీతిలో మార్చేసింది. ఫలితమే నేటి మైనారిటీ–ముక్త్ భారత్ సర్కార్. అన్సారీ అక్షింతలు అవసరం కాదా? 1993–94 నాటి ‘‘ఇండియా రీడిఫైన్స్ ఇట్స్ రోల్’’ అనే నా రచనలో, బీజేపీ ఇలా భారత రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఆవిర్భవించడం గురించి ఊహించి, చర్చించాను. ప్రధానిగా తన మొదటి అవిశ్వాస తీర్మానానికి జవాబు చెబుతూ వాజ్‌పేయి దాని నుంచి ఉల్లేఖిస్తూ, తీవ్ర విచారం ధ్వనించే స్వరంతో ఇలా అన్నారు: కొంత అసాధారణమైనదే జరిగింది. మైనారిటీ లంటే హిందూ మెజారిటీ ఆత్మన్యూనతా భావాన్ని ఏర్పరచుకుంది. నిరుత్సా హంతో ఆయన ఆ అంశాన్ని గుర్తించి, దాని గురించి తాను ఏమైనా చేస్తానని వాగ్దానం చేశారు. 1988లో మెజారిటీలోని ఈ ఆందోళన గురించి ఆయన నొక్కి చెప్పినప్పుడు ప్రశంసలు లభించాయి. రెండు దశాబ్దాల తర్వాత హమీద్ అన్సారీ మైనారిటీలలో ఉన్న అదే ఆందోళన గురించి మాట్లాడినం దుకు ఆయనపై దాడి చేస్తున్నారు. మనం వాజ్‌పేయి మాటలు విన్నంత శ్రద్ధగా ఆయన మాటలూ వినాలి. వాజ్‌పేయి చెప్పినదే సరైనదైతే, మనం ఆ తర్వాతి కాలంలో మన రాజకీయాలను అతిగా సరిదిద్దామా? అలా జరిగి ఉంటే, అన్సారీ అక్షింతలు వేయడం న్యాయమైన ఆందోళనతోనే కాదా? దిద్దుబాటు అవసరం లేదా? చివరిగా, అసలు మైనారిటీలు లెక్కలోకే రారా? విలక్షణమైన మూడు ఆసియా ప్రజాస్వామ్య దేశాలు ఈ సమస్యతో తంటాలు పడ్డాయి. బంగాళాఖాతం నుంచి మధ్యధరా సముద్రం వరకు ఉన్న సువిశాల ప్రాంతంలో ముస్లిం మైనారిటీలుసహా పౌరులందరికీ ఓటింగ్ హక్కును అనుమతించే దేశాలు ఇజ్రాయెల్, భారత్ మాత్రమేనని ఇజ్రాయెల్ నేత షైమన్ పెరెస్ 1992లో నాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. కాబట్టి ఆయన దేశం కూడా మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తుంది గానీ, వారికి యూదు పౌరులకుండే పూర్తి ప్రజాస్వామిక హక్కులను, ఎంపిక అవకాశా లను ఇవ్వదు. జాన్ లై కారె, తన ‘‘ద లిటిల్ డ్రమ్మర్ గర్ల్’’ అనే గూఢచార నవలలో ఖలీల్ అనే పాత్రతో.. ఇజ్రాయెల్ తన యూదు రాజ్య భావజాలాన్ని, ఆధు నిక ఉదారవాద ప్రజాస్వామ్యంతో సమం చేయడంలో ఎదుర్కొంటున్న సందిగ్ధాన్ని తెలిపారు. వెస్ట్‌బ్యాంక్ ప్రాంతాలను ఇజ్రాయెల్ తనవిగా ఉంచు కోవాలంటే, అరబ్బులందరికీ ఓటింగ్ హక్కు ఇవ్వాలి, ఇస్తే అది యూదు రాజ్యమే కాకుండా పోతుంది. అందువల్లనే ఇజ్రాయెల్, అందరికీ ఓటున్నా సమానత్వం లేని విచిత్ర ప్రజాస్వామ్యం అయింది. అరబ్బు పౌరులు ఉన్నత స్థానాలను అందుకోలేకపోతే ప్రశ్నించే వారు లేరు. పాకిస్తాన్ మనకు ఆదర్శమా? ఆ తర్వాత, పాకిస్తాన్ కూడా పెరెస్ రెండు ప్రజాస్వామ్యాల (ఆ ప్రజా స్వామ్యం వచ్చి పోతుండేదే అయినా) దేశంగా మారింది. ఇజ్రాయెల్‌లాగే అది కూడా ఒక భావజాల రాజ్యం, అదీ అదే ప్రశ్నను ఎదుర్కొంటోంది. మైనారిటీలకు సమాన రాజకీయ హక్కులు ఉండేట్టయితే, అది ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ఉండగలదా? ఆ దేశ వ్యవస్థాపకులు ఆకుపచ్చ జెండాపై మైనారిటీ లకు ప్రాతినిధ్యం వహించేలా తెల్ల పట్టీని ఉంచారు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి వలసవాద శైలిలో మైనారిటీలకు రిజర్వుడ్ నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు. అది ఆసక్తికరమైన సంకేతాత్మకతలకు దారితీసింది. కొత్తగా ఏర్పరచిన, రాష్ట్రాల మధ్య సమన్యయ మంత్రిత్వ శాఖ మంత్రిగా దర్శన్ లాల్ నియామకం లేదా పాక్ సైన్యంలోని మొదటి సిక్కు అధికారి హర్చరణ్ సింగ్ సంస్మరణను పాటిస్తూ తమ క్షణిక లౌకికవాదానికి గర్వంతో ఉప్పొం గడం లేదా తాజాగా హిందూ అమరవీరుడు లాన్స్ నాయక్ లాల్ చాంద్ రబారీని కీర్తించడం అలాంటి సంకేతాత్మకతలే. అదే సమయంలో, హిందూ మైనారిటీ బాలికలను కిడ్నాప్ చేసి, బలవంతపు మత మార్పిడులు చేయిం చిన ఒక రాజకీయవేత్తను సత్కరించడమూ చేశారు. హిందువులను పార దోలి వారి జనాభాను క్షీణింపజేయడం కోసం విస్తృతంగా వారిపై వేధింపు లకు పాల్పడుతూనే ఉన్నారు. హిందువులే గాక, సిక్కులు, క్రైస్తవులు, అహ్మదీ యులను కూడా నాస్తిక మతభ్రష్టులని దూషిస్తూ, వేధింపులకు పాల్పడు తున్నారు. మునుపటి కాంగ్రెస్–లౌకికవాద ప్రభుత్వాలు మైనారిటీ ఓటు బ్యాంకుల రాజకీయ క్రీడ సాగించాయని భారత మితవాదం అనడంలో వాస్తవముంది. మైనారిటీలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేస్తూ కాంగ్రెస్‌ను, దాని మిత్రులను అధికారంలోకి తెచ్చిన మాటా నిజమే. కానీ ఇప్పుడు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత వారి ఓటు బ్యాంకులు ఇక లెక్కలోకి వచ్చేవి కాకుండా పోయాయి. అయినా, మన ప్రభుత్వం వారి రక్షణకు హామీని కల్పిస్తుంది, వారి సామాజిక పరిస్థితులను మెరుగుపరచడం చేస్తుందను కోండి. అంతేగానీ, దయచేసి అధికారంలో వాటాను మాత్రం అడగకండి. కాకపోతే ఏదో ఒక సమయానికి మనం కూడా సంకేతాత్మకతను సృష్టించ వచ్చు. అప్పుడు మన సొంత దర్శన్ లాల్ తయారవుతాడు. అలాంటప్పుడు, ఈ సమస్యకు పాక్ చెప్పుకున్న.. మైనారిటీలు లెక్కలోకి రానే రారు అనే సమా ధానాన్నే మనమూ ఎంచుకున్నట్టు అవుతుంది. ఈ ప్రశ్నతో దీన్ని ముగిద్దాం: మనం మన జాతీయవాదాన్ని పునర్నిర్వచించుకునే సమయంలో మనకు స్ఫూర్తి, చివరకు పాకిస్తాన్ అవుతుందా? వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ శేఖర్ గుప్తా -
అభద్రతలో ముస్లింలు: అన్సారీ
-
అన్సారీకి రాజ్యసభ వీడ్కోలు
-
అన్సారీకి రాజ్యసభ వీడ్కోలు
చైర్మన్‌గా తన వంతు న్యాయం చేశారు: ప్రధాని ► సభా నియమాల్ని పాటించడంలో ఆయనకు ఆయనే సాటి: సభ్యులు ► అన్సారీ నుంచి ఎన్నో సలహాలు, సూచనలు తీసుకున్నా: మన్మోహన్ ► ప్రభుత్వ విధానాలపై విమర్శల్ని అనుమతించకపోతే నిరంకుశత్వమే: అన్సారీ న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్‌గా చివరి రోజైన గురువారం హమీద్ అన్సారీకి పార్టీల కతీతంగా ఘనంగా వీడ్కోలు పలికారు. రాజ్యాంగ ధర్మాన్ని పరిరక్షించడంలో అన్సారీ తన వంతు న్యాయం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. రాజ్యసభను సజావుగా నడపడంలో అన్సారీ పాత్రను సభ్యులు గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో ఎక్కువ సమయం సభా నియమాల్ని పాటించేందుకు కృషిచేశారని, ఆయన హయాంలో గందర గోళం మధ్య ఏ బిల్లు ఆమోదం పొందలేదని ప్రశంసించారు. రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన అన్సారీ.. పదేళ్ల పాటు రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించారు. తదుపరి చైర్మన్‌గా శుక్రవారం ఎం.వెంకయ్య నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..‘ ప్రజలు, పార్లమెంట్ ఉభయ సభల తరఫున దేశ ఉపాధ్యక్షుడిగా మీరు అందించిన సేవలకు కృతజ్ఞతలు చెబుతున్నాను. దౌత్య ప్రతినిధిగా పశ్చిమాసియాలో ఎంతో చురుగ్గా పనిచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా.. మైనార్టీ కమిషన్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీతో కలిసి ఎక్కువ సమయం పనిచేశారు. ఇన్నేళ్లలో మీలో మీరు ఎంతో సంఘర్షణ అనుభవించి ఉంటారు. ఇక నుంచి ఆ సందిగ్ధత ఉండదు. స్వేచ్ఛగా ఉండేందుకు, మీ మనోభీష్టం మేరకు పనిచేసేందుకు, మాట్లాడేందుకు అవకాశం దొరుకుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. శారీరకంగా కూడా అన్సారీ ఎంతో ఆరోగ్యవంతుడని మోదీ ప్రశంసించారు. సభా నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లా డుతూ ‘అన్సారీకి, సభ్యులకు ఇది ఎంతో ఉద్వేగభరిత సమయం. చైర్మన్‌గా మీ విధి నిర్వహణ ఎంతో సవాలుతో కూడింది. రాజ్య సభ 1950, 60ల్లో ఉన్నట్లు లేదు, ప్రస్తుతం పార్టీల బలాబలాల్ని సభ ప్రతిఫలిస్తుంది. పరస్పర దూషణలతో చర్చ మొదలై గందర గోళం, ఆందోళనల మధ్య సాగుతోంది. అయి తే అన్సారీ హయాంలో ఎన్నోసార్లు సభకు అంతరాయం కలిగినా.. చాలా సందర్భాల్లో మంచి చర్చ జరిగింది’ అని జైట్లీ పేర్కొన్నారు. నడక, యోగా అన్సారీ ఆరోగ్య రహస్యం రాజ్యసభ చైర్మన్‌గా అన్సారీ పాత్రను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొనియాడారు. దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నా.. అన్సారీ వంటి వ్యక్తుల వల్లే పురోగమిస్తోందన్నారు. ఎన్నో సార్లు ఆయన నుంచి సలహాలు సహకారం పొందానని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. చైర్మన్‌గా సభ నడిపిన తీరును ప్రతిపక్ష నేత ఆజాద్ కొనియాడారు. మంచి ఆరోగ్యం కోసం అన్సారీ క్రమం తప్పకుండా నడకతో పాటు యోగా చేస్తారని తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ వెల్లడించారు. బాధ్యతగా వ్యవహరించాలి: అన్సారీ ప్రభుత్వ విధానాలపై స్వేచ్ఛగా, నిజాయతీతో కూడిన విమర్శల్ని అనుమతించకపోతే.. ప్రజాస్వామ్యం నిరంకుశత్వానికి దారి తీస్తుందని హమీద్ అన్సారీ అన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా చివరి ప్రసంగం చేస్తూ.. ‘సభ్యులకు విమర్శించే హక్కుంది. అయితే కావాలని సభను అడ్డుకునేలా వ్యవహరించకూడదు. అందరికీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి’ అని పేర్కొన్నారు. రాజ్యాంగం ఏర్పాటుచేసిన రాజ్యసభ దేశంలోని భిన్నత్వాన్ని ప్రతిఫలిస్తుందని అన్సారీ అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో అధ్యక్ష స్థానం.. క్రికెట్లో అంపైర్, హాకీలో రిఫరీ వంటిదని ఆటను, ఆటగాళ్లను పర్యవేక్షిస్తూ.. రూల్స్ పుస్తకం ఆధారంగా వ్యవహరించాలని చెప్పారు. ‘నా కుమారుడు హిందూనా? ముస్లిమా?’ న్యూఢిల్లీ: రాజ్యసభలో శుక్రవారంతో పదవీకాలం ముగియనున్న ముగ్గురు సభ్యులకు వీడ్కోలు పలికేందుకు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన బంద్యోపాధ్యాయ్, బీజేపీ ఎంపీ దిలీప్ పాండ్యల పదవీకాలం ముగియనుంది. ఈ కార్యక్రమంలో సీతారాం ఏచూరి మాట్లాడుతూ దేశంలో బహుళత్వాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఏకత్వంలోని భిన్నత్వ భావనలను బలపరిచినప్పుడే దేశం బలపడుతుందని ఆయన అన్నారు. ఏచూరి మాట్లాడుతూ ‘మన భిన్నత్వంపై మీరు మత, భాషా, సాంస్కృతిక తదితర ఏ ఏకత్వాన్నైనా బలవంతంగా రుద్దాలని చూస్తే దేశం ఒకటిగా ముందుకు సాగలేదు. బహుళత్వమే భారత బలం. అది లేనినాడు దేశం కుప్పకూలుతుంది’ అని హెచ్చరించారు. ‘నేను మద్రాసులో ఓ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. నా పాఠశాల విద్యాభ్యాసమంతా ఇస్లాం సంస్కృతి ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లో సాగింది. ఓ సూఫీ ముస్లిం కూతురిని నేను పెళ్లి చేసుకున్నాను. మా మామయ్య తల్లి రాజ్‌పుత్ వంశానికి చెందిన వారు. అయితే నా కుమారుడు ఏమవుతాడు? అతడు బ్రాహ్మణుడా, హిందూనా, ముస్లిమా?.. అవేమీ కాదు, నా కుమారుడు భారతీయుడు’ అని ఏచూరి అన్నారు. -
అన్సారీపై వెంకయ్య ఎటాక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ముస్లింలలో అభద్రతా భావం నెలకొందని, అసంతృప్తి పోగైందంటూ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అనడాన్ని ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. అన్సారీ వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అసత్య ప్రచారం అని మండిపడ్డారు. మరోపక్క, బీజేపీ కూడా అన్సారీ వ్యాఖ్యలు తప్పుపట్టింది. అత్యున్నత హోదాలో ఉన్న ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంది. ఆయన రాజకీయ ఆశ్రయం కోరేందుకు ఇలా మాట్లాడినట్లుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ విమర్శించారు. పదవీ విరమణ సమయంలో ఉపరాష్ట్రపతి హోదాలో ఉండగానే ఇలాంటి మాటలు సరికాదన్నారు. తాము ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించబోమని స్పష్టం చేశారు. రాజ్యసభలో అన్సారీ ఉభయపక్షం వహిస్తున్నారని భావిస్తున్నారా అని ప్రశ్నించగా 'ఆయన తప్పు చేశారు.. అది ఉద్దేశపూర్వకంగా చేశారా? కాదా అనేది నేను చెప్పలేను' తెలిపారు. గురువారంతో పదవీ విరమణ చేయనున్న హమీద్ అన్సారీ ఓ ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేశారు. గోరక్షకుల పేరిట కొందరు వ్యక్తులు గోవధకు పాల్పడిన వారిపై దాడులకు పాల్పడటం, హత్యలు చేయటంపై పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ‘ముస్లింలలో అభద్రత, అసౌకర్య భావనలు వ్యాపిస్తున్నాయి. దేశపౌరుల భారతీయతను ప్రశ్నించడమనేది ఇబ్బందికరమైన విషయం. జాతీయవాదాన్ని ప్రతిరోజూ ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు.. నేను భారతీయుడిని.. అంతే’ అని హమీద్ అన్సారీ అన్నారు. ఇదిలా ఉండగా, అన్సారీ దిగిపోతున్న వేళ 'మీ నుంచి మేం చాలా నేర్చుకున్నాం' అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. -
ఆర్డినెన్సుల సంప్రదాయం సరికాదు!
అత్యవసర పరిస్థితుల్లోనే దీన్ని వాడాలి ► పార్లమెంటు స్తంభనతో విపక్షాలకే నష్టం ► పార్లమెంటేరియన్‌గా జ్ఞాపకాలు మరువలేనివి ► ఎంపీల వీడ్కోలు సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్ ► మోదీ, ఇందిరపై ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు న్యూఢిల్లీ: ప్రభుత్వం తరచూ ఆర్డినెన్సులు తీసుకొచ్చే సంప్రదాయాన్ని మానుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఆర్డినెన్సు మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఎంపీలంతా కలిసి ఆదివారం ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు సమావేశం ఏర్పాటుచేశారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్‌లు ప్రణబ్ ముఖర్జీకి సెంట్రల్ హాల్లోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ.. ‘తప్పనిసరి, అత్యవసర పరిస్థితుల్లోనే ఆర్డినెన్సును వినియోగించాలని నేను బలంగా విశ్వసిస్తాను. సాధారణ, ఆర్థికపరమైన అంశాల్లో ఆర్డినెన్సుపై ఆలోచించకూడదు’ అని సూచించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అంశాలు లేదా హౌజ్ కమిటీ ముందు పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఆర్డినెన్సు తీసుకురావటం సరైంది కాదన్నారు.శత్రు ఆస్తుల చట్టం–1968కు సవరణలు తీసుకొచ్చేందుకు విఫలమైన ప్రభుత్వం దీనిపై ఐదుసార్లు ఆర్డినెన్సులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ బిల్లు మార్చినెలలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. మోదీ సహకారం మరువలేనిది ప్రతి అడుగులోనూ ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన సూచనలు, సహకారం మరువలేనివని ప్రణబ్ గుర్తుచేసుకున్నారు. ‘దేశంలో గుణాత్మక పరివర్తన తీసుకొచ్చేందుకు మోదీ బలమైన కాంక్ష, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో ఏర్పడిన బంధం మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తనకు మార్గదర్శకత్వం చేశారని గుర్తుచేసుకున్న ప్రణబ్.. దృఢచిత్తం, స్పష్టమైన ఆలోచనలు, నిర్ణయాత్మకమైన కార్యాచరణే ఆమెను ఉన్నతమైన వ్యక్తిగా నిలిపాయన్నారు. తప్పును తప్పు అని చెప్పటంలో సంశయించేవారు కాదన్నారు. ఎమర్జెన్సీ తర్వాత లండన్‌లో ఇందిర మాట్లాడుతూ‘ఈ 21 నెలల్లో అన్ని వర్గాల భారతీయులను పరాధీనులుగా మార్చాం’ అని తప్పును ఒప్పుకున్నట్లు ప్రణబ్ తెలిపారు. రచ్చకాదు.. చర్చ జరగాలి 1969లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయినపుడు అధికార, విపక్షాల్లోని గొప్ప పార్లమెంటేరియన్ల ప్రసంగాలు విని ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. సభలో చర్చలు, వాదోపవాదాలు, భిన్నాభిప్రాయాల విలువ తనకు బాగా తెలుసని రాష్ట్రపతి చెప్పారు. తరచూ పార్లమెంటును స్తంభింప చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు విపక్షానికే చేటుచేస్తాయని కూడా ప్రణబ్ సుతిమెత్తగా హెచ్చరించారు. ‘స్వాతంత్య్రానంతరం దేశ సోదరభావం, గౌరవం, ఐకమత్యాన్ని ప్రోత్సహించేందుకు మనం నిర్ణయించుకున్నాం. ఈ విధానాలే మన దేశానికి ధ్రువతారగా మారాయి’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ‘నేను ఎంపీగా ఉన్న రోజుల్లో పార్లమెంటులో చర్చలు, వాదోపవాదాలు జరిగేవి. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. పార్లమెంటులో తరచూ ఆందోళనలు జరగటం వాయిదా పడటం వల్ల విపక్షానికే నష్టం జరుగుతుందని అర్థం చేసుకున్నా’ అని ప్రణబ్ వెల్లడించారు.‘సప్తవర్ణ శోభితమైన జ్ఞాపకాలు, దేశ ప్రజలకు వినయపూర్వకమైన సేవకుడిగా పనిచేసినందుకు సంతోషకరమైన, సఫలీకృతమైన భావనతో ఈ భవనాన్ని (పార్లమెంటును) వీడుతున్నాను’ అని ప్రణబ్ ఉద్వేగంగా తన ప్రసంగాన్ని ముగించారు. ప్రణబ్ గురుసమానులు: సుమిత్ర రాజ్యాంగం, పార్లమెంటరీ నియమ, నిబంధనలపై పట్టు ఉన్న ప్రణబ్ ముఖర్జీ అంటే ఎంపీలకు ఎనలేని గౌరవమని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. చాలా మంది పార్లమెంటేరియన్లకు ప్రణబ్ గురువులాంటివారన్నారు. ప్రజలంతా దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పునరంకితం అవ్వాలని ఆయన తరచూ కోరేవారని హమీద్ అన్సారీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ప్రణబ్ ముఖర్జీ పాత్రను ఎంపీలు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రణబ్‌కు ఎంపీల తరపున ‘కాఫీ టేబుల్’ పుస్తకాన్ని స్పీకర్ బహూకరించారు. న్యూఢిల్లీ: కొత్త రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని రెండు బంగ్లాలు చారిత్రక ప్రాధాన్యం సంతరించు కున్నాయి. మంగళవారం పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఢిల్లీ రాజాజీ మార్గ్‌లోని 10వ నంబర్ భవనం స్వాగతం పలకడానికి ముస్తాబవు తోంది. మాజీ రాష్ట్రపతి కలామ్ 2015లో మరణిం చేవరకు ఈ బంగ్లాలోనే నివసించారు. తర్వాత దీన్ని కేంద్ర మంత్రి మహేశ్ శర్మకు కేటా యించారు. భవనాన్ని ప్రణబ్‌కు కేటాయించడంతో శర్మ అక్బర్ రోడ్డులోని 10వ నంబర్ ఇంటికి మారారు. యాదృచ్ఛికంగా ఇదే భవనంలో కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్ తాత్కా లికంగా నివసిస్తుండటం విశేషం. రాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఆయన ఈ బంగ్లాలోనే నివసిస్తున్నారు. 10, అక్బర్ రోడ్డు నుంచే కోవింద్ రాష్ట్రపతి భవన్‌లోకి అడుగుపెట్టనున్నారు. ప్రణబ్‌తో మరువలేని జ్ఞాపకాలు! న్యూఢిల్లీ: భారత 13వ రాష్ట్రపతిగా తన పదవికి మంగళవారం రాజీనామా చేయనున్న ప్రణబ్ ముఖర్జీ వ్యక్తిత్వం, తమతో ఆయన అనుబంధాన్ని పాత మిత్రులు గుర్తుచేసుకుంటున్నారు. రాజకీయ చాణక్యుడిగా, ఆర్థిక, విదేశాంగ విధానాల నిపుణుడిగానే కాదు.. క్లిష్ట సమయాల్లో పార్టీని ఆదుకోవటంలో ప్రణబ్ గొప్పదనం మరిచిపోలేనిదంటున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ఆమె కేబినెట్ మంత్రిగా ప్రణబ్ మధ్య చాలా కీలకాంశాలపై వ్యక్తిగతంగా చర్చ జరిగేదని.. అంతలా ప్రణబ్‌ను ఇందిర విశ్వసించేవారన్నారు. ‘ఇందిర, ఎమర్జెన్సీకి సంబంధించిన విషయాలపై ఎంత ప్రయత్నించినా ప్రణబ్ నోటినుంచి ఒక్క మాట కూడా రాబట్టలేరు’ అని ప్రణబ్ ముఖర్జీకి సన్నిహితుడైన జర్నలిస్టు జయంత ఘోష్ తెలిపారు. ‘ఆరోగ్య సమస్యలు తలెత్తాక పొగతాగటం మానేశారు. అలవాటు మానుకోలేని కారణంగా నికోటిన్ లేకున్నా ఉట్టి పైప్‌లనే నోట్లో పెట్టుకునేవారు’ అని ఘోష్ గుర్తుచేసుకున్నారు. ముఖ్యనేతలు, దేశాధినేతలు, విదేశీ ప్రముఖులు బహుమతులుగా ఇచ్చిన 500కు పైగా పైప్‌ల కలెక్షన్‌ను రాష్ట్రపతి భవన్ మ్యూజియంకు ప్రణబ్ కానుకగా ఇచ్చారు. ‘ప్రణబ్‌కు రాజకీయాలతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి చాలాబాగా తెలుసు. ప్రభుత్వానికి సమస్యలు రానీయకుండా రాజ్యాంగాన్ని కాపాడటం కూడా ఆయనకు తెలుసు. భారత అత్యుత్తమ రాష్ట్రపతుల్లో ఆయన ఒకరు’ అని కేంద్ర కేబినెట్లో మాజీ సహచరుడు శివ్‌రాజ్ పాటిల్ తెలిపారు. రక్షణ, ఆర్థిక, విదేశాంగ, హోం వంటి వివిధ శాఖల బాధ్యతలు నిర్వహించినా ప్రభుత్వంలో ఆయనే ఎప్పుడూ నెంబర్ 2గా ఉండేవారన్నారని మరికొందరు పేర్కొన్నారు. -
మాయావతి రాజీనామా ఆమోదం
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామా ను చైర్పర్సన్ హమీద్ అన్సారీ ఆమోదించినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో దళితులపై జరుగుతున్న దాడులు, హింస గురించి సభలో మాట్లాడే అవకాశం తనకు ఇవ్వడంలేదని అధికార బీజేపీ, చైర్‌పర్సన్‌పై ఆరోపణలు చేస్తూ ఆమె బుధవారం 3 పేజీల రాజీనామా లేఖ రాశారు. అయితే, దానిని చైర్పర్సన్ తిరస్కరించారు. దీంతో నిర్దేశిత ఫార్మాట్లో తన సొంత దస్తూరితో రాసిన ఏక వాక్య రాజీనామా లేఖను తిరిగి అందించగా చైర్పర్సన్ ఆమోదించారు. మాయావతి రాజీనామాను డ్రామా అని బీజేపీ కొట్టిపారేసింది. -
సగం మందికే 'ప్రమోషన్'!
ఉపరాష్ట్రపతి పదవి అలంకరించిన 12 మందిలో ఆరుగురు మాత్రమే రాష్ట్రపతులయ్యారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి మహ్మద్ హమీద్ అన్సారీ సహా మిగిలిన ఆరుగురికి అత్యున్నత రాజ్యాంగ పదవి చేపట్టే అవకాశం రాలేదు. మొదటి ముగ్గురుసర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్, వీవీ గిరి రాష్ట్రపతులయ్యాక, ఆ తర్వాత ముగ్గురికి (గోపాల్ స్వరూప్ పాఠక్, బసప్ప దానప్ప జట్టి, మహ్మద్ హిదాయతుల్లా) ఆ అదృష్టం దక్కలేదు. తర్వాత వరుసగా ఉపరాష్ట్రపతులైన ముగ్గురూ (ఆర్.వెంకట్రామన్, శంకర్‌దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్) రాష్ట్రపతి పదవిని అధిష్టించారు. కాని, ఇప్పటికి చివరి ముగ్గురుకె.కృష్ణకాంత్, భైరోసింగ్ షెఖావత్, మహ్మద్ హమీద్ అన్పారీ రాష్ట్రపతి భవన్లో ఐదేళ్ల చొప్పున నివాసముండే అవకాశం దక్కించుకోలేకపోయారు. ‘ప్రమోషన్’ పొందిన ‘మొదటి’ ముగ్గురు! మొదటి ఉపరాష్ట్రపతిగా పదేళ్లు చేపిన సర్వేపల్లి రాధాకృష్టన్ పదవీకాలం ముగిసిన వెంటనే 1962లో రాష్ట్రపతి అయ్యారు. తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న జాకిర్ హుస్సేన్ కూడా 1967లో కాంగ్రెస్ మద్దతుతో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన తెలుగువాడైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు నుంచి హుస్సేన్ గట్టి పోటీ ఎదుర్కున్నారు. హుస్సేన్ పదవి చేపట్టిన రెండేళ్లకే మరణించడంతో ఉపరాష్ట్రపతి వీవీ గిరీని అదృష్టం వరించింది. 1969 రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ ‘అధికార’ అభ్యర్థి, ఆంధ్రపదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిని ఓడించడానికి ప్రధాని ఇందిరాగాంధీ నడుం బిగించారు. ‘ఉప’ పదవికి గిరితో రాజీనామా చేయించాక రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయించి ‘అంతరాత్మ ప్రబోధం’ పేరుతో గెలిపించారు. ‘రెండో’ ముగ్గురికి దక్కని చాన్స్! తర్వాత ముగ్గురికి రాష్ట్రపతి అయ్యే భాగ్యం దక్కలేదు. నాలుగో ఉపరాష్ట్రపతి అయిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జీఎస్ పాఠక్, తర్వాత ఈ పదవి అధిష్టించిన బీడీ జట్టి, ఐదో వైస్‌ప్రెసిడెంట్ మహ్మద్ హిదాయతుల్లా(సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్)ను రాష్ట్రపతిని చేయాలనే ఆలోచన రాజకీయపార్టీలకు రాలేదు. పాఠక్, హిదయతుల్లా ‘ప్రమోషన్’కు ప్రయత్నించలేదు. మైసూరు మాజీ సీఎం అయిన జట్టికి 1977లో కాంగ్రెస్ ఓటమి ఆ అవకాశం ఇవ్వలేదు. ‘మూడో’ ముగ్గురూ ‘ప్రథమ పౌరులయ్యారు’! ఆ తర్వాత ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన ముగ్గురూ కేంద్ర మంత్రులుగా పనిచేసినవారే. 1982లో ఇందిర ప్రధానిగా ఉండగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి ఆర్. వెంకట్రామన్ మూడేళ్లకే 1987లో ప్రధాని రాజీవ్‌గాంధీ నిర్ణయంతో రాష్ట్రపతి అయ్యారు. ఆయన తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న మాజీ గవర్నర్ ఎస్డీ శర్మ పదవీ కాలం ముగిసే సమయానికి 1992లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీచేసి గెలిచారు. తర్వాతి ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కూడా 1997లో దాదాపు అన్ని పారీ్టల మద్దతుతో తొలి ‘దళిత’ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ‘నాలుగో’ ముగ్గురికీ అందని అదృష్టం! యునైటెడ్ ఫ్రంట్ ప్రధాని ఐకే గుజ్రాల్ హయాంలో(1997లో) ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కృష్ణకాంత్ ఉపరాష్ట్రపతి అయ్యారు. 2002లో అప్పటి ఏపీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు మద్దతుతో రాష్ట్రపతి పదవికి అభ్యర్థి అయ్యే అవకాశం మొదట కనిపించింది. తర్వాత కొన్ని పరిణామాల వల్ల పదవి ఆయనకు అందినట్టే అంది జారిపోయింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ పీసీ అలెగ్జాండర్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యతిరేకించడంతో ఏపీజే అబ్దుల్ కలాం పేరు చివరకు ఖాయమైంది. కృష్ణకాంత్ తర్వాత పదవిలోకి వచ్చిన షెఖావత్ 2007 రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా పాటిల్‌పై పోటీచేసి ఓడిపోయారు. తర్వాత యూపీఏ, వామపక్షాల మద్దతుతో ఉపరాష్ట్రపతి అయిన మాజీ గవర్నర్ ఎంహెచ్ అన్పారీని 2012లో సోనియా రాష్ట్రపతిగా చేయాలని భావించినా చివరికి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీకి అవకాశమిచ్చారు. అన్సారీ నొచ్చుకోకుండా రెండోసారి ఆయనను ఉపరాష్ట్రపతిని చేశారని అంటారు. పైన చెప్పిన 12 మంది ఉపరాష్ట్రపతుల్లో ముగ్గురు ముగ్గురు చొప్పున ఆరుగురు రెండు విడతలుగా రాష్ట్రపతులయ్యారు. మరి ఈ ‘ఆనవాయితీ’ కొనసాగితే ఆగస్ట్ ఐదున జరిగే ఎన్నికలో గెలుపు ఖాయమనుకుంటున్న ఎం. వెంకయ్యనాయుడికి ప్రమోషన్ లభిస్తుందా? అన్నది భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
13న ఉప రాష్ట్రపతి పర్యటన
సాక్షి, హైదరాబాద్: భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ నెల 13న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉర్దూ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మొదటి మహమ్మద్ కులీకుతుబ్‌షా స్మారక ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఖరారైన షెడ్యూలు ప్రకారం ఆ రోజు మధ్యాహ్నం ఉప రాష్ట్రపతి బేగంపేట చేరుకుంటారు. అక్కణ్నుంచి నేరుగా వర్సిటీకి చేరుకుంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి న్యూఢిల్లీకి బయల్దేరి వెళతారు. ఈ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. అవసరమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాట్లు, వైద్య, ఆరోగ్య, సమాచార, పౌర సంబంధాలు, బీఎస్ ఎన్ఎల్, తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసులు తదితర శాఖల ద్వారా నిర్వహించే పనులను చేపట్టాలని సూచించారు. ఈ సమా వేశంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, మున్సిపల్ కార్య దర్శి నవీన్ మిట్టల్, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, సైబరా బాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. -
ఉగ్ర పోరుకు సహకారం
జకార్తా: ఉగ్రవాదం, పైరసీ తదితర సరిహద్దు సమస్యలపై పరస్పరం సహకరించుకోవాలని ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్ఏ) తీర్మానించింది. భారత్, 20 హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాలతో ఏర్పడిన ఈ అసోసియేషన్ జకార్తాలో భేటీ అయింది. దీనికి భారత ఉపరాష్ట్రపతి అన్సారీతోపాటు హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలకు చెందిన పలువురు దేశాధినేతలు హాజరయ్యారు. ఐఓఆర్‌ఏలో భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇరాన్ , కెన్యా, మలేసియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ తదితర 21 దేశాలకు సభ్యత్వం ఉంది. సముద్ర ప్రాంత రక్షణ, భద్రత, వ్యాపారం, పెట్టుబడులు, విపత్తు నిర్వహణ, టూరిజం, సంస్కృతి తదితర అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని ఈ సమావేశం తీర్మానించింది. ఉగ్రవాదంపై పోరుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈ సమావేశం ప్రత్యేకంగా మరో తీర్మానం చేసింది. భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ అభివృద్ధికి ఉగ్రవాదం అడ్డంకిగా నిలుస్తోందని అన్నారు. -
ఆన్ లైన్ ప్రేమ.. పాకిస్తాన్ వెళ్లి..
ప్రేమ కోసం పాకిస్తాన్ వెళ్లిన ఓ భారత యువకుడు అక్కడ జైల్లో బంధి అయ్యాడు. దీంతో అతని తల్లిదండ్రులు కొడుకును ఎలాగైనా తమకు అప్పగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని వేడుకుంటున్నారు. మోదీ చొరవ తీసుకుని పుత్రభిక్ష పెట్టి తమను పున్నామ నరకం నుంచి కాపాడాలని ముంబైకు చెందిన ఫౌజియా అన్సారీ, నెహాల్ అన్సారీలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. 2012లో ఆఫ్గానిస్తాన్ వెళ్లిన హమీద్ అన్సారీ(31) అక్కడి నుంచి అక్రమంగా పాకిస్తాన్ లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత సైన్యానికి చిక్కడంతో పాకిస్తాన్ సైనిక కోర్టు అతనికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. 2012 నవంబరు 10వ తేదీన తమ కుమారుడు చివరగా మాట్లాడినట్లు తల్లిదండ్రులు చెప్పారు. ఓ పాకిస్తాన్ అమ్మాయిని ఆన్ లైన్ లో ప్రేమించానని చెప్పినట్లు తెలిపారు. మూడేళ్ల శిక్షకాలం పూర్తయిన తర్వాత ఈ ఏడాది నవంబరు 12న ముంబై వస్తున్నానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా హమీద్ ఇంటికి రాకపోవడంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు లేఖ రాసిన స్పందన లేదని చెప్పారు. ఇక ప్రధానమంత్రి మోదీయే తమ కుమారుడిని తిరిగి రప్పించగలరని అందుకే ఆయనకు వినతి పత్రం అందజేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
చర్చ లేకుండానే ముగింపు
తుడిచిపెట్టుకుపోయిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ► నోట్ల రద్దుపై చివరి రోజు వరకూ అధికార, ప్రతిపక్షాల మధ్య రచ్చ ► 21 రోజుల్లో 19గంటలు సాగిన లోక్‌సభ, 22గంటలు సాగిన రాజ్యసభ న్యూఢిల్లీ: తాము చెప్పినట్లు వినాలంటూ విపక్షాలు, తమకు నచ్చినట్లే జరగాలంటూ అధికార పక్షం పట్టుదలతో నెలరోజుల పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే తుడిచిపెట్టుకుపోయాయి. పెద్ద నోట్ల రద్దుపై తలెత్తిన ఇక్కట్లపై చర్చించాల్సిన అధికార, విపక్షాలు ఉభయసభల్లో తమ పంతం నెగ్గించుకునేందుకు సభా సమయాన్ని పణంగా పెట్టాయి. దీంతో చివరకు శుక్రవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉభయసభల్ని నిరవధికంగా వాయిదావేశారు. నవంబర్ 16న సమావేశాలు మొదలుకాగా తొలి రోజు నుంచి సభల్లో వాయిదాలు కొనసాగాయి. నోట్ల రద్దుపై ఓటింగ్‌తో కూడిన చర్చ జరగాలంటూ లోక్‌సభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం, అధికార పక్షం అంగీకరించకపోవడంతో గందరగోళం కొనసాగింది. అంతరాయం వల్ల లోక్‌సభలో 92 గంటల సభా సమయం వృథా అయ్యింది. మొత్తం 21 రోజుల పాటు లోక్‌సభ సమావేశం కాగా... కేవలం 19 గంటలే నడిచింది. రాజ్యసభలో 86 గంటల సమయం వృథా కాగా., సభ 22 గంటలే పనిచేసింది. వాయిదాల వల్ల రాజ్యసభ జాబితాలోని 330 ప్రశ్నలకు గాను కేవలం రెండింటికి, లోక్‌సభలో మొత్తం 440 ప్రశ్నలకు గాను 50 ప్రశ్నలకు మౌఖిక సమాధానాలిచ్చారు. లోక్‌సభలో నోట్ల రద్దుపై 193 నిబంధన కింద టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి చర్చను మొదలుపెట్టినా... విపక్షాల ఆందోళనలతో అది కొనసాగలేదు. సభా కార్యకలాపాలన్ని రద్దు చేసి నోట్ల రద్దుపై తామిచ్చిన వాయిదా తీర్మానాలు చేపట్టాలంటూ మొదటి రోజు నుంచి ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్‌సభ స్పీకర్ వాయిదా తీర్మానాల్ని తిరస్కరించారు. అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. రాజ్యసభలో సమావేశాల మొదటి రోజే నోట్ల రద్దుపై చర్చను ప్రారంభించారు. ప్రధాని సభలోనే ఉండాలన్న విపక్ష డిమాండ్‌తో సభ పదేపదే వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన కాసేపటికే నిరవధికంగా వాయిదా పడింది. లోక్‌సభ సమావేశం కాగానే గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం సమావేశం కాగానే కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే లేచి తాము నోట్ల రద్దు చర్చకు సిద్ధమని గురువారమే చెప్పామని, అయితే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తమపై అనవసర ఆరోపణలు చేశారని చెప్పారు. దివ్యాంగుల హక్కుల బిల్లుకు ఆమోదం తాజా సమావేశాల్లో సభలు ఒక్క బిల్లునే ఆమోదించాయి. దివ్యాంగులపై వివక్షకు కఠిన శిక్షలకు ఉద్దేశించిన హక్కుల బిల్లును సభలు ఆమోదం తెలిపాయి. బుధవారం రాజ్యసభ ఆమోదించిన దీనికి లోక్‌సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఆమోద సమయంలో ప్రధాని సభలో ఉన్నారు. ఖర్చు రూ.267 కోట్లు షెడ్యూల్ ప్రకారం ఉభయ సభలు 21 రోజుల పాటు సమావేశం కావాలి. కానీ, ఇందులో లోక్‌సభలో కేవలం 19 గంటలపాటు, రాజ్యసభలో 22.25 గంటలే సభాకార్యక్రమాలు జరిగాయి. సాధారణంగా పార్లమెంటు నడిచేందుకు ఒక్కోసభలో నిమిషానికి రూ.2.5 లక్షలు ఖర్చవుతుంది (చాలాకాలంగా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు). ఈ లెక్కన ఉభయ సభలు తుడిచిపెట్టుకుపోవటంతో ఖజానాకు రూ. 267 కోట్లు నష్టం వాటిల్లింది. -
నైజీరియాలో హమీద్ అన్సారీ పర్యటన
-
‘ఉగ్ర’ నియంత్రణతోనే శాంతి, భద్రత
నామ్ డిక్లరేషన్‌లో వెల్లడి పోర్లమార్(వెనిజులా): ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని అంతమొందించాలని ప్రపంచ దేశాలకు నామ్(అలీన కూటమి) సభ్యదేశాలు పిలుపునిచ్చాయి. అంతర్జాతీయ సమాజంలో శాంతి, భద్రతకు ఇది పెను ముప్పుగా మారిందని, ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చడం, అక్రమంగా ఆయుధాలు సరఫరా చేయడాన్ని నిరోధించాలని కోరాయి. 17వ నామ్ సదస్సు చివరి రోజైన సోమవారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ సమావేశాలకు హాజరయ్యారు. మతం,నమ్మకాల ఆధారంగా కొన్ని ఉగ్ర సంస్థలు సాంస్కృతిక, వారసత్వ కట్టడాల విధ్వంసానికి పాల్పడడం, మానవ జాతిపై నేరాలకు ఒడిగట్టడాన్ని కూటమి ఖండించింది. ఉగ్ర సంస్థలు తాలిబన్, ఆల్‌ఖైదా, ఐసిస్ దాని అనుబంధ సంస్థలు జబాత్ అల్ నుర్సా, బోకో హారం, అల్ షబాబా , ఐక్యరాజ్య సమితి గుర్తించిన కొన్ని సంస్థల కార్యకలాపాలు, ఉగ్ర వ్యాప్తికి అవి కల్పిస్తున్న వాతావరణాన్ని గర్హించింది. ఐరాస చార్టర్, ఇతర అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అన్ని దేశాలు మరింత సమర్థంగా, సమన్వయంతో ఈ ముప్పును ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతమున్న ఐరాస ఉగ్ర వ్యతిరేక వ్యూహ అమలు తదితరాలకు అదనంగా భవిష్యత్తులో మరో సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చునే దిశగా కూటమి ఆలోచన మొదలెట్టింది. తీవ్రవాదాన్ని ఏదో ఒక మతం, వర్గం, జాతితో ముడిపెట్టకూడదని, వీటిని తీవ్రవాద కార్యకలాపాలను సమర్థించుకోవడానికి ఉపయోగించుకోకూడదని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. ఉగ్ర వ్యతిరేక చర్యల కింద అనుమానితుల వివరాలు బయటపెట్టడానికి, వ్యక్తుల గోప్యతపై దాడికి వాడుకోవద్దని తెలిపారు. ఉగ్ర ముప్పును ఎదుర్కోవాలంటే నిర్దిష్ట చర్యలు అవసరమని, ప్రభావవంత సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని 120 దేశాల బృందాన్ని భారత్ ఆదివారం కోరింది. ఉద్యమానికి సంఘటితమవుదాం అలీన ఉద్యమ పునరుత్తేజం, పటిష్టానికి సభ్య దేశాలు మద్దతును పునరుద్ఘాటించాయి. ఐరాస చార్టర్, అంతర్జాతీయ ఒప్పందాల మేరకు వివాదాలను పరిష్కరించుకోవాలని తీర్మానించాయి. చట్టబద్ధ ప్రభుత్వాలను కూలదోసే అక్రమ విధానాలను తిరస్కరించాయి. ఏదైనా దేశం సమగ్రత, ఐక్యతకు భంగం కలిగించే యత్నాల పట్ల వ్యతిరేకత కొనసాగుతుందని పునరుద్ఘాటించాయి. ఇతర దేశాల సారభౌమత్వాన్ని గౌరవించాలని, వారి అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోరాదని, బల ప్రయోగం, బెదిరింపులకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం పనిచేయాలని తీర్మానించాయి. అణు నిరాయుధీకరణ కోసం తక్షణం చర్చలు ప్రారంభం కావాలని పిలుపునిచ్చాయి. శాంతియుత ప్రయోజనాల కోసం అణు విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే దేశాల సారభౌమత్వాన్ని పునరుద్ఘాటించాయి. -
సభా సమయం తగ్గిపోతోంది: హమీద్ అన్సారీ
న్యూఢిల్లీ : భావోద్వేగాల నియంత్రణ, సభను సజావుగా జరిపించడం రాజ్యసభ సభ్యులకు అత్యవసరమని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అన్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల సమయం తగ్గిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వారికి శనివారం ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కొన్ని గ్రూపుల, కొందరు వ్యక్తుల ప్రయోజనాలకోసం ఎంపీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ విలువైన సభాసమయాన్ని పాడుచేస్తున్నారని, దీన్ని నివారించేందుకు సభ్యులు సభా మర్యాదలు పాటించాలని సూచించారు. గతంలో 100 నుంచి 110 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలుండేవని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు తగినంత సమయం ఉండేదని ఇప్పుడది 70 రోజులకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి సభకు అంతరాయం కలిగిస్తూ..విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని ఇలా ప్రవర్తించడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. -
నేడు స్వదేశానికి రానున్న ఉపరాష్ట్ర్రపతి
న్యూఢిల్లీ: మంగోలియా రాజధాని ఉలన్‌బాటర్‌లో జరుగుతున్న 11వ ఆసియా-యూరోప్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న ఉపరాష్ట్ర్రపతి హమిద్ అన్సారీ ఈరోజు ఇండియాకు తిరిగిరానున్నారు. బ్రిగ్జిట్ తర్వాత విశ్వవ్యాప్తంగా ఏర్పడ్డ ఆర్థిక మందగమనంపై వివిధ దేశాధినేతలు ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న బంగ్లాదేశ్, స్విట్జర్లాండ్,ఎస్టోనియా దేశాధినేతలతో అన్సారీ ప్రత్యేకంగా సమామేశమై భారత ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. -
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
- ఆసియా-యూరప్ సమావేశ సదస్సులో హమీద్ అన్సారీ - ఫ్రాన్స్ ఉగ్రదాడి మృతులకు సదస్సు నివాళి ఉలాన్బాటర్: ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం ఉక్కుపాదం మోపాలని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పిలుపునిచ్చారు. మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో 11వ ఆసియా-యూరప్ సమావేశ సదస్సు (ఏఎస్‌ఈఎం)లో ప్రసంగిస్తూ.. ‘ఉగ్రవాదానికి ఆర్థికంగా సాయం చేసేవారు, బాధ్యత వహించేవారు, దాడులకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. మన సమాజానికి ఉగ్రవాద పెనుభూతం హెచ్చరికలు చేస్తోంది. దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ఏకమై పోరాడాలి. ఉగ్రవాదం కోరలను పీకేయాలి’ అని పేర్కొన్నారు. శుక్రవారం మొదలైన ఈ సదస్సులో భారత్ సహా 49 దేశాలు పాల్గొంటున్నాయి. ఫ్రాన్స్‌లోని నీస్‌లో జరిగిన ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించి సదస్సును ప్రారంభించారు. ఆసియా, యూరప్ దేశాల మధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏఎస్‌ఈఎం ఏర్పడి 20 ఏళ్లు కావస్తుండటంతోపాటు.. మంగోలియన్ రాజ్యం ఏర్పడి 810 ఏళ్లు పూర్తయిన వేడుకలు కూడా ఈ సందర్భంగా జరగనున్నాయి. వివిధ దేశాల ప్రతినిధులతోపాటు ఈయూ, ఆసియాన్ల ప్రతినిధులూ ఇందులో పాల్గొన్నారు.